Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#98
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 17

"బావా! వాళ్ళు రేపు వస్తున్నారు. నేనేం చేయాలి!" ఆందోళనగా ఫోన్ చేసింది దీప్తి.



"వస్తున్నారా!" ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.



"అవును" నొక్కి చెప్పింది.



"అంటే నేను చెప్పింది వాడికి అర్థంకాలేదన్న మాట."



"మీరెప్పుడు వస్తున్నారు బావా!"



"ఎల్లుండి"



" రాత్రికి బయలుదేరలేవా!"



"రాలేను దీపూ! అర్జంటు కేసు వుంది. కేస్ నోట్ ప్రిపేర్ చేయాలి. ఎల్లుండే విచారణ."



"వాడి ముందు కూర్చోవడం నాకు ఇష్టం లేదు" ఆవేశంగా చెప్పింది దీప్తి.



"అయితే నేను చెప్పినట్లు చేయగలవా!"



"ఏం చేయాలో చెప్పండి!"



"హైదరాబాదుకు వచ్చేయి!"



"ఎప్పుడు?"



" రాత్రికే చార్మినార్ ఎక్స్ ప్రెస్లో బయలుదేరు. నేను ఉదయాన్నే నిన్ను సికింద్రాబాద్ స్టేషన్లో కలిసికొంటాను."



"నాన్న ఇంట్లోనే వున్నారు. అసాధ్యం" దీనంగా చెప్పింది.



"ఫోన్ కట్ చేస్తున్నాను. పది నిముషాల్లో నేను నీకు ఫోన్ చేస్తాను" అని సెల్ కట్ చేశాడు.



తల్లి లావణ్యకు ఫోన్ చేశాడు. విషయాన్ని చెప్పాడు. చివరగా....
"అమ్మా!... దీప్తికి అతని కంటబడటం ఇష్టం లేదు. నీవే ఏదైనా చేయాలమ్మా."



"దీపూ నాకు అంతా చెప్పింది. నేను చూచుకొంటాను. నీవు త్వరగా నీ పనిని ముగించుకొని రా!" అనునయంగా చెప్పింది లావణ్య.



"సరే అమ్మా!.... దీపూ జాగ్రత్త!"



"అది నా కోడలురా!.... దానికి అవమానం జరిగితే అది నాకూ జరిగినట్లే.... జరగనియ్యను. నీవు నిర్భయంగా వుండు."



"మంచిదమ్మా!" ఈశ్వర్ సెల్ కట్ చేశాడు.



దీప్తికి ఫోన్ చేశాడు.



"బావా! వస్తున్నావా!" ఆత్రంగా అడిగింది దీప్తి.



"లేదు... అమ్మతో మాట్లాడాను. నీ అవమానం తనకూ అవమానమట. అంతా తనే చూచుకొంటుందట."



"అబ్బా!... చాలా టెన్షన్గా వుంది బావా!" సెల్లో వేరే కాల్ వస్తున్న సవ్వడి. "బావా! వేరే కాల్ వస్తుంది. బహూశా అత్తయ్యదేమో కట్ చేస్తున్నాను" సెల్ కట్ చేసి వచ్చిన కాల్ నెంబరును చూచింది దీప్తి. అది లావణ్య కాల్. సెల్ మ్రోగింది.
"అత్తయ్యా!" ఆత్రంగా అంది దీప్తి.



"అవును నేనే... సెల్ మీ అమ్మకు ఇవ్వు."



"అలాగే..." ప్రక్కనే వున్న ప్రణవికి సెల్ అందించింది దీప్తి.
"చెప్పండి వదినా!" అడిగింది ప్రణవి.



లావణ్య తాను చెప్పదలచుకొంది పదిసెకండ్లలో చెప్పేసింది. చివరగా "వదినా! ఏం చేయాలో అర్థం అయింది కదూ!"



"అర్థం అయింది వదినా!"
"సరే!... జాగ్రత్త" సెల్ కట్ చేసింది లావణ్య.



ప్రణవి దీప్తి చేతిని తన చేతిలోనికి తీసుకొంది. తన గదిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ఏదో చెప్పింది. గదినుంచి బయటికి వచ్చింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:48 AM



Users browsing this thread: 1 Guest(s)