19-03-2025, 01:40 PM
(15-03-2025, 08:57 PM)JustRandom Wrote: Episode -14
ఇంటికి చేరిన కిట్టు సమీరకి స్పందనకి విడివిడిగా మెసేజ్ పెట్టాడు. రాత్రి ఒంటిగంట అయింది. స్పందన చక్కగా స్నానం చేసి లోపల బ్రా పాంటీ వేసుకోకుండా బెడ్ ఎక్కింది. ఫోన్ తీసి కిట్టుకి మెసేజ్ చేద్దాము, మరుసటిరోజు ప్లాన్ ఏంటో కనుక్కుందాము అనుకుంటుండగా తలుపు శబ్దం అయింది. ఈ టైం లో అమ్మ అక్క నిద్రపోయే టైం. ఏంటా అని తలుపు తీసింది. చుస్తే సమీర నైటీలో నుంచుని ఉంది. లోపల బ్రా వేసుకుని ఉంది అని పైకి కనిపించే బ్రా స్ట్రాప్స్ అచ్చు ద్వారా తెలుస్తోంది.
సమీర: సారీ. బిజీ నా?
స్పందన: ఏమి లేదక్కా. దా
సమీర లోపలి వచ్చింది. స్పందన బెంతనే పక్కనే ఉన్న చున్నీ తీసి మీద కప్పుకుంది. అదేంటో, అక్క, ఇంట్లో, అర్ధ రాత్రి అయినా సరే... ఒళ్ళు దాచుకోవాలి. ఆ విషయం చిరాకు అనిపించినప్పటికీ అక్క మోహంలో తేడా గమనించింది.
స్పందన: ఏమైంది? అంత ఒకే నా?
సమీర కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయాయి. స్పందన ఖంగారుగా చూసింది. తదుపరి గంటలో జరిగింది మొత్తం స్పందనకి చెప్పింది సమీర. అక్క చెప్పిన ప్రాబ్లెమ్ విని సమీరకి భయం, ఖంగారు, వొణుకు ఇలా చెప్పలేనివి అన్ని వచ్చాయి. లాప్టాప్ ఓపెన్ చేసి వీడియోస్ చూసింది. అక్కకి చూపించింది. ఆర్టికల్స్ చదివింది. అక్కకి ధైర్యం చెప్పింది. తనకి ఏమి తెలియకపోయిన సరే, అన్ని సద్దుకుంటాయి అది ఇది అని ధైర్యంగా మాట్లాడింది. ఇలా అక్కాచెలెళ్ళు ఇద్దరు ఉదయం అయిదు దాకా మెలుకువగానే ఉన్నారు.
స్పందన: అయిదు అయింది అక్క. అమ్మ లేచే టైం అయింది. నీ మొహం అంత ఏడుపుకి వాచింది. అమ్మ చుస్తే మళ్ళీ ఇబ్బంది. ఈ విషయం అమ్మకి చెప్పద్దు.
సమీర: ఓకే. చెప్పాలని కూడా లేదు. అమ్మ మనని పెంచడానికి పడ్డ కష్టాలు చాలు. ఇది తెలిసి ఈ ఏజ్ లో ఇంకో నొప్పి అక్కర్లేదు.
స్పందన: నువ్వు అవన్నీ ఆలోచించకు అక్క. కిట్టు చెప్పాడు కదా. టైం తీసుకోమని. టైం ఇస్తే అన్ని సద్దుకుంటాయో అని చెప్తుంటాడు. నాతో కూడా ఒకటి రెండు సందర్భాలలో అన్నాడు. (అక్కకి కిట్టుతో తాను మాట్లాడే విషయాలు తెలీవు అనుకుని ఎదో పైపైన చెప్పేసింది).
సమీర: సరే. నేను వెళ్తాను. నువ్వు నీ బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా టైలర్ దెగ్గరికి.
స్పందన: అబ్బా ఇప్పుడు అది ముఖ్యం కాదు లే.
సమీర: ఒసేయ్. పెళ్లి చేసుకోవాలి అని నువ్వే అంటున్నావు. కిట్టు కూడా ఓపెన్ అంటున్నాడు. నేను నిర్ణయించుకోడానికి ఇంకో రెండు మూడు రోజులు ఉంది. కానీ పెళ్లి చేసుకోవాలి అంటే అన్ని మామూలుగానే జరగాలి కదా. లేదంటే అమ్మ కి అందరికి అనుమానం వస్తుంది.
స్పందన: అవును నిజమే. కానీ నిన్ను ఇలా ఒక్కదాన్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదక్కా. పోనీ నువ్వుకూడా టైలర్ దెగ్గరికి రా మాతోటి.
సమీర: లేదే. నేను రాలేను. కిట్టు మొహంలోకి చూసి మాట్లాడాలంటే ఎలానో ఉంది. నాకు ఒక్కడిని కాస్త టైం కావాలి. మీరు వెళ్ళండి. నేను ఇంట్లో ఉంటాను. భయపడకు. నీకు గంట గంటకి మెసేజ్ చేస్తుంటాను. సరేనా?
స్పందన అయిష్టంగానే ఒప్పుకుంది. సమీర బయటకి వెళ్లేసరికి కిచెన్ లో ఉంది సరోజ. సమీర బెడ్ రూమ్ తలుపు వేసి కాకుండా దెగ్గరికి వేసి ఉండటం గమనించలేదు. తల్లి చూడకుండా మెల్లగా తన రూంలోకి జారుకుంది సమీర.
అక్క వెళ్ళిపోగానే ఏమి తెలియనట్టు బయటకి వచ్చింది స్పందన. లోపల బ్రా వేసుకోలేదు. బుర్ర పని చెయ్యలేదు. అందుకే అలానే చున్నీ కప్పుకుని వచ్చేసింది.
సరోజ: అప్పుడే లేచేసావే?
స్పందన మొహం చుస్తే నిద్రపోయిన దానిలాగా లేదు.
సరోజ: ఏమైంది. నిద్రపోలేదు?
స్పందన: లేదమ్మా. రేపటి నుంచి పెళ్లి అయ్యాక ఇంకో వారం పాటు సెలవు అనుకుంటున్నాను. అందుకే పెండింగ్ పనులు అన్ని ఫినిష్ చేసేసాను.
సరోజ: కాఫీ తాగుతావా? లేక నిద్రపోతావా?
స్పందన: కాఫీ ఇవ్వు. మళ్ళీ పదింటికి వెళ్లి టైలర్ ని కలవాలి. బట్టలు అన్ని ఇచ్చేస్తుంది. అయ్యాక వచ్చి ఏకంగా మధ్యానమే పడుకుంటాను ఇంకా.
సరోజ కాఫీ ఇచ్చింది. ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు.
సరోజ: అక్క ఎలా ఉంది?
స్పందన నీళ్లు నమిలింది. అదేంటి చూసేసిందా అనుకుంది.
సరోజ: కిట్టుతో బయటకి వెళ్ళింది డిన్నర్ కి. ఇది పాజిటివ్ ఏ కదా.
సరోజ మనసులో ఉన్న భయాన్ని అలా అమాయకంగా అడిగేసరికి స్పందనకి జాలేసింది. పాపం అమ్మ ఎంత కష్టపడింది. స్ట్రిక్ట్ గా పెంచినప్పటికీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి ఉన్న అమాయకత్వం ఉంది.
స్పందన: అవును. మెసేజ్ ఫోన్ లో కూడా మాట్లాడుతోంది. తక్కువే కానీ ఇదివరకు కంటే పర్లేదు.
సరోజ రెండు చేతులు జోడించి భగవంతుడికి మొక్కింది. నా పిల్లల్ని చల్లగా చూడు దేవుడా అని కోరింది.
తల్లి అలా అనేసరికి స్పందనకి ఏడుపు తన్నుకు వచ్చింది. అమ్మకి ఎలా చెప్పాలి. అసలు తట్టుకోగలదా. కానీ అతి కష్టం మీద కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికి కళ్ళు చెమ్మగించాయి. అది సరోజ గమనించింది.
సరోజ: ఏంటి నాన్న? ఏడుస్తున్నావా?
స్పందన చిన్నగా అడ్డంగా తలా ఊపింది తలా ఎత్తకుండా కాఫీ కప్ వైపే చూస్తూ.
సరోజ: మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి అని బెంగా?
నిజానికి స్పందనకి ఆ ఆలోచన కూడా వచ్చింది. కాకపోతే మంచి ఉద్యోగం. ఇంకో ఐదారేళ్ళ కష్టపడితే ఇక్కడ ప్రాపర్టీస్ కొనచ్చు. ఒక రెండు మూడు కోట్లు బ్యాంకు బాలన్స్ పెట్టుకుని ఇండియా వచ్చేయచ్చు అందుకుంది. కానీ ఇప్పుడు ఇలా అక్కని వదిలి, తల్లికి తెలియకుండా.. ఎలా. అందులో అక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే తల్లి ఒక్కతే ఉండాలి. ఎలా అనే ఇంకో బెంగ.
స్పందన చిన్నగా కళ్ళు తుడుచుకుంది.
స్పందన: ఏమి లేదమ్మా. మిమ్మల్ని వదిలి అంత దూరం వెళ్ళాలి అంటే మిస్ అవుతాను అని.
సరోజ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి.
సరోజ: అక్క పెళ్లి అయ్యాక కొంచం గ్యాప్ ఇచ్చి నీకు చూస్తాను. ఎవరన్నా ఉంటే చెప్పమ్మా. మనకి పట్టింపులు ఏమి లేవు. మంచివాళ్లు అయితే చాలు.
స్పందన: అప్పుడే వద్దమ్మా. అయినా నాకు ఎవరు లేరు కూడా.
సరోజ: అప్పుడే కాదు లే. ఇంకో ఆరు నెలలు ఆగి. నీ పెళ్లి కూడా అయిపోతే నేను ఫుల్ టైం జాబ్ ఆపెడ్డాము అనుకుంటున్నాను. కాన్ఫరెన్స్ పని మీద రోజు వెళ్తున్నాను కదా. ఒక పెద్ద డీమ్డ్ యూనివర్సిటీ డీన్ పరిచయం అయ్యాడు. ఆయన గెస్ట్ లెక్చరర్ గా పిలిచాడు. రోజుకి మూడు క్లాస్ లు. వారానికి మూడు రోజులు ఉంటాయి అంతే. ఒక గంట లెక్చర్ కి అయిదు వేలు ఆఫర్ చేశారు. నేను ఇంకా ఒప్పుకోలేదు. కానీ కన్సిడర్ చేస్తున్నాను.
స్పందన: నీకు అంటే నెలకి రెండు లక్షలు కూడా రావు. నీ జీతం కంటే తక్కువే కాదమ్మా.
సరోజ: పని కూడా తక్కువే కదా. అందులో ప్రినిసిపాల్ గా అడ్మినిస్ట్రేషన్ అవన్నీ చూడటం వల్ల నాకు రీసెర్చ్ మీద టైం కేటాయించలేకపోతున్నాను. ఈ ఆఫర్ తీసుకుంటే రీసెర్చ్ కూడా చేయచ్చు. ఇంకా వేరే యూనివర్సిటీలలో కూడా గెస్ట్ లెక్చరర్ గా వెళ్లుచు. ఎటొచ్చి ఇటొచ్చి నా జీతం కంటే ఎక్కువే సంపాదించుచు.
స్పందన: నీ ఇష్టం అమ్మ. అయినా అసలు నీకు కష్టపడాల్సిన అవసరమే లేదు. రిటైర్ అవ్వాలి అంటే అయిపో.
సరోజ: పూర్తిగా రిటైర్ అంటే ఇంకా టైం ఉంది. కానీ మెల్లిగా పని తగ్గించుకుంటాను.
కాఫీ పూర్తి చేసేశారు.
సరోజ: సరే. నేను ఫ్రెష్ అయ్యి బయల్దేరుతాను. ఈరోజు కాన్ఫరెన్స్ కి కావాల్సిన ఫైనల్ ప్రెప్ ఉంది. ఇంకా రెండురోజులు కదా ఉంది.
పదిన్నరకు క్యాబ్ తీసుకుని హైటెక్ సిటీకి బయల్దేరింది స్పందన. కిట్టు అక్కడే ఇనార్బిట్ మాల్ దెగ్గర పిక్ చేసుకుని అక్కడి నుంచి ప్రగతి రిసార్ట్ కి వెళ్ళాలి. అక్కడే ఏదో ఈవెంట్ ఉంటే అక్కడికి వచ్చింది రాణి. వస్తూ వస్తూ స్పందన బట్టలు తెచ్చింది. అక్కడికి వెళ్లి బట్టలు తీసుకుని ట్రై చేసి ఏదన్న తేడా ఉంటే చెప్తే అక్కడికి అక్కడే కుట్టేసి ఇస్తాను అని చెప్పింది.
మనసులో బట్టల ఎక్ససిట్మెంట్ కన్నా అక్క గురించి బెంగతో ఉంది స్పందన. పదకొండున్నరకి చేరుకుంది. కిట్టు అప్పటికే వెయిట్ చేస్తున్నాడు.
కిట్టు: హలో. ఎమన్నా తింటావా?
స్పందన అడ్డంగా తలా ఊపింది. స్పందన డల్ గా ఉండటం గమనించాడు. రాత్రి సమీర అంతా చెప్పి ఉంటుంది అని ఊహించాడు. కానీ ఏమి మాట్లాడలేదు.
కిట్టు: ఓయ్. పక్కా నా? లంచ్ చేసే టైం అయింది ఆల్మోస్ట్.
స్పందన: ఆకలి లేదు కిట్టు
కిట్టు ఏమనలేదు. ప్రగతి రిసార్ట్ లో రెస్టారంట్ లో తినిపిద్దాము అనుకున్నాడు. సరే అని కార్ స్టార్ట్ చేసి అలా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారు. అప్పుడు స్పందన కి తట్టింది. పాపం కిట్టు కి ఆకలి వేస్తోందేమో అని.
స్పందన: అయ్యో. సారీ. నిన్ను అడగలేదు. నీకేమన్నా ఆకలేస్తోందా? ఎమన్నా తిన్నావా?
కిట్టు (అలా డ్రైవ్ చేస్తూ ముందుకి చూస్తూనే): ఏమి తినలేదు. పెద్దగా ఆకలి లేదు. లంచ్ చేద్దాములే అక్కడ.
ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. ఏదో మ్యూజిక్ నడుస్తోంది. ఇంకో గంటలో ప్రగతి రిసార్ట్ కి వెళ్లారు. రాణి చెప్పిన ప్లేస్ కి వెళ్లారు. అక్కడ ఆవిడ అసిస్టెంట్ వచ్చి వీళ్ళని సూట్ రూమ్స్ దెగ్గరికి తీసుకెళ్లింది. అక్కడే రాణి ఒక సూట్ లో ఉంది. ఆవిడతో పాటు ఇంకో ఇద్దరు ఎవరో ఉన్నారు. రూమ్ అంతా బట్టలు, మెటీరియల్ ఉన్నాయి.
రాణి: రండి రండి. ఎలా ఉన్నారు. ఎక్కడి దాకా వచ్చాయి పెళ్లి పనులు అని అడిగింది.
స్పందన బుర్ర ఎక్కడో ఉంది. రానికి వాళ్ళు చెప్పిన అబద్దం గురించి మర్చిపోయింది. అది గమనించిన కిట్టు అందుకున్నాడు.
కిట్టు: నడుస్తున్నాయి రాణి గారు. మీరు ఆ టైం కి ఉంటున్నారా? (మళ్ళీ కంఫర్మ్ చేసుకోడానికి అడిగాడు)
రాణి: లేదండి. నా బెంగళూరు ప్రోగ్రాం కంఫర్మ్ అయింది. వెళ్ళాలి. కానీ మీరు నాకు ఫోటోలు పెట్టండి. మోడలింగ్ ఎలాగూ చెయ్యము అన్నారు. కనీసం మా క్లైంట్స్ అని మీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అయినా పెట్టుకుంటాము. మీ లాంటి అందమైన జంటలు చుస్తే మాకు ఇంకా పెళ్లి కాంట్రాక్ట్స్ వస్తాయి.
స్పందన కిట్టు వైపు చూసింది. కిట్టు నవ్వు నటిస్తూనే స్పందన వైపు చూసాడు. డల్ గా ఉంది. స్పందన చేతిని చిన్నగా తట్టాడు. స్పందన రికవర్ అయింది.
రాణి: మీ బట్టలు అన్ని పక్క రూంలో ఉన్నాయి. ఎదురుకుండా ఇంకో రూమ్ కూడా బుక్ అయింది మనకే. అంటే ఈవెంట్ రాత్రి లేట్ అయితే ఉండటానికి చేసుకున్నాము. మీరు వెళ్లి అక్కడే వెయిట్ చేయండి. నేను పంపిస్తాను. ఇక్కడ పెళ్లి రేపు. ఈరోజు నైట్ రిసెప్షన్ ఉన్నాయి. కాబట్టి ఎవరొకరు వస్తూనే ఉంటారు. మీకు ఇబ్బంది.
సరే అని ఇద్దరు ఎదురుగ ఉన్న రూంలోకి వెళ్లారు. ఒక క్వీన్ బెడ్. ఒక సోఫా కం బెడ్, మంచి రూమ్. చాలా బావుంది. బయట సిందాహం ఎక్కువ ఉండటంతో బాగా చిరాకు అనిపించింది.
స్పందన: తలుపు వేసేయ్యవా ప్లీజ్
కిట్టు లేచి తలుపు వేసాడు. ఒక్క సారి అంతా నిశ్శబ్దం. బయట అరుపులు హోలా ఏవి వినిపించట్లేదు. కాస్త ప్రశాంతంగా అనిపించింది ఇద్దరికీ.
స్పందన సోఫాలో కూర్చుంది. కిట్టు ఎదురుగ కుర్చీలో కూర్చున్నాడు. కిట్టు ఫ్రిడ్జ్ లోంచి రెండు కూల్ డ్రింక్స్ తీసి ఓపెన్ చేసి ఒకటి స్పందనకి ఇచ్చాడు. స్పందన తీసుకుని సిప్ చేసింది.
కిట్టు: నీ మైండ్ ఎక్కడో ఉంది కదా.
స్పందన అలా తలా కూడా ఎత్తకుండా చిన్నగా కళ్ళు ఆత్రమే ఎట్టి కిట్టు వైపు చూసింది.
కిట్టు: సమీర మాట్లాడిందా?
స్పందన తల ఊపింది.
కిట్టు: హ్మ్.. నన్ను ఏమన్నా అడగాలా?
స్పందన తల ఎట్టి చూసింది. తన మనసులో ఎన్నో ప్రశ్నల సందోహం. అది తనకి తెలియకుండానే తన కళ్ళల్లో కనిపించింది. అది కిట్టు గమనించాడు.
కిట్టు: నేను పెళ్లి కాన్సల్ చెయ్యట్లేదు. మీ అక్కకి ఇష్టం లేకపోతే అప్పుడు నేనే చేస్తాను. చెప్పిందా ఆ విషయం.
స్పందన తల ఊపింది. కానీ తన కళ్ళలోంచి రెండు బొట్లు నీళ్లు కారాయి. కిట్టు వెంటనే లేచి వెళ్లి స్పందన పక్కన కూర్చున్నాడు సోఫా లో.
కిట్టు: ఏయ్. ఏంటిది. నేనేమన్నా తప్పు అన్నానా? మీ అక్కని నేను ఏమి బలవంత పెట్టట్లేదు కదా.
స్పందన వెంటనే కిట్టు చేతిని తన చేతిలోకి తీసుకుంది. రెండు చేతుల మధ్య కిట్టు కూడా చేతినుండి గట్టిగ పట్టుంకుంది.
స్పందన: నాకు ఏమి చెయ్యాలో తెలీట్లేదు (అంటూ గట్టిగ ఏడ్చింది)
అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్న తాను కిట్టు దెగ్గర ఎందుకో ఉండబట్టలేక పోయింది.
కిట్టుకి తనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. పక్కనే ఉన్న టేబుల్ మీద టిష్యూ పేపర్ తీసి స్పందనకి అందించాడు.
కిట్టు: ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు?
స్పందన కళ్ళు తుడుచుకుంది. నీళ్లు తాగింది. ఒక ముప్పయి సెకెన్ల పాటు కిట్టు చేతిని పట్టుకుని తరువాత కంట్రోల్ చేసుకుంది.
స్పందన: నువ్వు చెప్పేది ప్రాక్టికల్ అంటావా?
కిట్టు: అంటే?
స్పందన: ఫిసికల్ రేలషన్ లేకుండా పెళ్లి నిలబడుతుందా?
కిట్టు ఏమి మాట్లాడలేదు.
స్పందన: ఇప్పుడు నువ్వు మంచితనంతో ఒప్పుకుంటున్నావు. కానీ.. కానీ.. నీ అవసరాలు నీకుంటాయి. అవి లైఫ్ లాంగ్ అణిచిపెట్టుకోలేవు కదా.
కిట్టు ఇంకా ఏమి అనలేదు.
స్పందన: ఇంట్లో మా అక్క నీకు ఇవ్వలేనిది.. నీకు కావాలి అనిపిస్తే.. బయట.. అంటే నా ఉద్దేశం.. ఎన్నాళ్లని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు.. అంటే మా అక్క బాధ పడుతూనే ఉంటుంది.. అంటే నువ్వు కూడా బాధ అనుభవించాలి.. వాటి వల్ల గొడవలు అవి వస్తే.. నీకు అర్థం అవుతోందా నేను ఏమి అడగాలి అనుకుంటున్నానో.
కిట్టు: నీ భావం అర్థమవుతోంది. ఫిసికల్ రేలషన్ లేకుండా భార్యని బాగా చేసుకోగలనా? అది అడ్డు పెట్టుకుని తనని మెంటల్ గా టార్చర్ చేస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇప్పడూ ఓపికగా ఉన్న ఇలా ఎన్నాళ్ళు ఉండగలను అనే కదా?
స్పందన అవును అన్నట్టు తల ఊపింది.
కిట్టు ఒక నిట్టూర్పు వదిలాడు. తన మనసులో కూడా గజిబిజిగా ఉంది. కానీ స్పందన ఖంగారు పడకుండా ఎలా చెప్పాలో ఆలోచించాడు.
కిట్టు: నిజం చెప్పాలి అంటే నా దెగ్గర సమాధానం లేదు.
స్పందన అలా చూస్తోంది.
కిట్టు: నిన్నొక ప్రశ్న అడుగుతాను. నాకు ఆన్సర్ చెప్పు.
స్పందన తల ఊపింది.
కిట్టు: ఒక పెళ్లి అయినా అమ్మాయి ఒకరోజు బిజినెస్ ట్రిప్ అని వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. మొదట మాములుగా మాట్లాడిన ఇద్దరికీ మధ్యలో ఏదో చిన్న స్పార్క్ ఉంది. అది గమనించి వాడితి ఫ్లర్ట్ చేసింది. వాడు కూడా ఆ అమ్మాయితో విపరీతంగా ఫ్లర్ట్ చేసాడు. కలిసిన మూడోరోజే ఇద్దరికీ ఒక ముతుల్ ఫీలింగ్ మొదలైంది. అది ఒక టెన్షన్. ఒక ఎనర్జీ. మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం. పక్క పక్కనే కూర్చోవడం. అందరిలో ఉన్న వీరి మధ్యన ఇంకో ఏదో పారలెల్ సంభాషణ నడవడం. ఇలా జరిగాయి.
స్పందన ఆసక్తిగా వింటోంది. అసలు ఉన్న సమస్యకి కిట్టు చెప్పేదానికి లింక్ అర్థం కాలేదు. కానీ కిట్టు మీద అప్పటికే నమ్మకం ఏర్పడింది. ఏదో ఉండే ఉంటుంది అని వింటోంది.
కిట్టు: నాలుగో రోజు ఆ అమ్మాయి డిన్నర్ చేద్దాము అని అడిగింది. ఐదో రోజు డిన్నర్ అయ్యాక డ్రింక్ కూడా చేశారు. నైట్ హోటల్ రూమ్ కి వెళ్లి కాసేపు స్పెండ్ చేసారు. ఆరోరోజు డిన్నర్ కూడా హోటల్ కి తెప్పించుకున్నారు. ఆరోజు రాత్రి డ్రింక్ చేశాక ఇద్దరు సెక్సువల్ గా ఇంవోల్వ్ అయ్యారు. ఇంకో నాలుగు రోజులు ఆ బిజినెస్ ట్రిప్ జరిగింది. ఆ నాలుగు రోజులు వాళ్ళు సెక్సువల్ గా ఇంకా దెగ్గర అయ్యారు. ఆ ట్రిప్ అయ్యాక ఆ అమ్మాయి తన ఇంటికి వెళ్ళిపోయింది. అబ్బాయి తన ఇంటికి వచ్చాడు. కానీ నెల రోజులలో ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి మెసేజ్ లు చేయడం మొదలెట్టింది. ఏదో చిన్న ఫన్ అనుకుని అక్కడికి అక్కడే ఎండ్ అవుతుంది అనుకుని మొదలెట్టిన ఎఫైర్ సీరియస్ అవ్వడం గమనించాడు ఆ అబ్బాయి. తనకి పెళ్లి అయింది అని ఆ అమ్మాయికి గుర్తు చేశాడు. దానికి ఆ అమ్మాయి పెళ్ళిలో హ్యాపీగా లేను అని డివోర్స్ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పింది. దానికి ఈ అబ్బాయి మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు. వద్దు అన్నాడు.
స్పందన కళ్ళు పెద్దవి చేసి చాల ఫోకస్ చేసి వింటోంది.
స్పందన: తరువాత ఏమైంది?
కిట్టు: ఆ అబ్బాయి మళ్ళీ ఇంకో బిజినెస్ ట్రిప్ లో ఈ అబ్బాయిని కలిసింది. ఈసారి ఇది చిన్న ట్రిప్. గతసారి లాగ పది రోజులు కాదు. కేవలం నాలుగు రోజులు. మీటింగ్ అయ్యాక అబ్బాయిని రిక్వెస్ట్ చేసి డిన్నర్కి కలిసింది. మళ్ళీ డ్రింక్ చేశారు. అయితే ఒకసారి అలవాటు అయినా సుఖం. ఇద్దరికీ మంచి సెక్సువల్ కంపాటబిలిటీ ఉంది. టెంప్ట్ అయ్యారు. మళ్ళీ ఆరోజు రాత్రి కూడా కలిశారు. అర్థ రాత్రి రెండింటికి ఎవరు బెల్ కొట్టారు. ఎవరా అని వెళ్లి అమ్మాయి రూమ్ తలుపు తీసింది. ఎదురుగా తన భర్త ఉన్నాడు. వాడు అమ్మాయింది నెట్టుకుని లోపకి వచ్చాడు. లోపల తన భార్య బెడ్ మీద ఇంకో మగాడిని చూసాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ సమయంలో వాడు ఏమి చేసుంటాడు అనుకుంటున్నావు?
స్పందన నోరెళ్ళబెట్టి చూసింది.
స్పందన: ఏమో. కొట్టాడా? గొడవ చేశాడా?
కిట్టు ఒక నిమిషం ఆగాడు. ఏదో గుర్తుకి తెచుకున్నట్టు కళ్ళు మూసుకున్నాడు.
కిట్టు: ఆ వ్యక్తి అరవలేదు. భార్యని కొట్టలేదు. ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తిని కూడా ఏమి అనలేదు. వాడు భార్య వైపు చూసే ఒకటే అన్నాడు. "నీకు ఇష్టం లేదు అంటే నేనే డివోర్స్ ఇచ్చేవాడిని. నన్ను ఇంత మోసం చేయాల్సిన అవసరం లేదు. కనీసం మన పాప కూడా గుర్తుకి రాలేదా నీకు?" అని అడిగాడు.
స్పందన ఒక నిట్టూర్పు వదిలింది.
కిట్టు: ఆ వ్యక్తి బెడ్ మీద ఉన్న తన భార్య లవర్ ని చూసి "ఈరోజు నన్ను మోసం చేసింది. రేపు నిన్ను చెయ్యదు అనుకుంటున్నావా?" అని అడిగి రూమ్ లోంచి వెళ్ళిపోయాడు. అది జరిగిన వారం కి ఆ అమ్మాయికి డివోర్స్ నోటీసు వచ్చింది. బయటకి చెప్తే పరువు పోతుంది అని ఆ అమ్మాయి ఏమి గొడవ చేయకుండా డివోర్స్ ఇచ్చేసింది. ఏడాది లో వాళ్ళు విడిపోయారు. అయితే ఆ అమ్మాయి భర్తని కోల్పోయి, పాపకి దూరం అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇంకో ఏడాదిలో ఉద్యోగం పోయింది. జరిగింది ఎవరికీ చెప్పలేక, తనని తానూ క్షమించుకోలేక, ఒకో NGO లో జాయిన్ అయ్యి జనాలకి సేవ చేస్తూ ఉంది పోయింది.
స్పందన అలా చూసింది.
కిట్టు: ఇప్పుడు ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి ఉన్నాడు కదా. వాడు ఎలాంటివాడు. అలంటి సంబంధం నీకు వస్తే నువ్వు ఒప్పుకుంటావా?
స్పందన షాక్ అయింది. తనకి ఏమి చెప్పాలో తెలీలేదు. బ్లాంక్ గా చూసింది.
కిట్టు: కానీ మీ అక్క ఒప్పుకుంది. ఎందుకంటే ఆ ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తిని నేనే.
స్పందన కింద భూమి కంపించింది. చేతిలో ఉన్న జ్యూస్ బాటిల్ కింద పడి పోయింది. నమ్మశక్యంగా లేదు. చుట్టూ ఉన్నవి అన్ని గిర్రున తిరుగుతున్నాయి.
కిట్టు: నాకు ఆ అమ్మాయికి పాప ఉందని తెలీదు. ఆ అమ్మాయి చెప్పలేదు. ఉంది ఉంటే నేను అసలు తన జోలికి వెళ్లే వాడిని కాదు. నా జీవితం లో చేసిన అతి పెద్ద తప్పు.
స్పందన: అక్కకి తెలుసా? అసలు ఎందుకు చెప్పావు?
కిట్టు: అబద్దం చేసిన డామేజ్ ఏంటో కళ్లారా చూసాను. ఆ అమ్మాయి నాకు అబద్దం చెప్పింది. తన భర్తకి అబద్దం చెప్పింది. జీవితం నాశనం చేసుకుంది. కానీ నేను కూడా తప్పే చేసాను.. పెళ్లి అయినా అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడం నాదే తప్పు. అది మ్యూచువల్. ఎవ్వరికి నష్టం కలగకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చిన్న ఎఫైర్ అక్కడికి అక్కడ అయిపోయి ఉంటే అది వేరు. ఆ రకంగా చుస్తే తప్పు కాదు. కానీ జరిగిన పరిణామాలు చుస్తే ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది.
స్పందన బ్లాంక్ గా చూసింది. కిట్టు చెడ్డవాడా? కానీ తను చేసిన తప్పులు అన్ని ముందే చెప్పాడు కాబట్టి మంచివాడా? అర్థం అవ్వట్లేదు. గందరగోళంగా ఉంది బుర్ర అంతా.
కిట్టు: ఒక ఎఫైర్ వల్ల వచ్చే నష్టం చూసినవాడిని. మీ అక్కని మోసం చెయ్యను. నా వల్ల తెలియకుండా ఒక కుటుంబం నాశనం అయింది. నేను కావాలని చెయ్యలేదు. కానీ నా పాత్ర ఉంది. అది నేను జీవితాంతం మర్చిపోలేను. నన్ను వేధిస్తూనే ఉంటుంది. అలాంటి నన్ను మీ అక్క నమ్మింది. అంత మంచి అమ్మాయిని నేను మోసం చెయ్యలేను. అందుకే, తనని ఎప్పుడు ఫోర్స్ చెయ్యలేదు. చెయ్యను. తనకి ఇష్టం లేనిది చెయ్యను. తను ఒప్పుతుంటే పెళ్లి చేసుకుని ట్రీట్మెంట్ దెగ్గర ఉంది ఇప్పిస్తాను. తను వద్దు అంటే నా మీద వేసుకుని పెళ్లి కాన్సల్ చేస్తాను.
స్పందన అలా కూర్చుండిపోయింది. ఎన్నో అడగాలి. ఇంకా ఏదో తెలుసుకోవాలి. కానీ కిట్టు గతం ఇంత డార్క్ గా ఉంది అంటే నమ్మలేకపోయింది. కానీ అంత సిన్సియర్ గా అన్ని చెప్పాడు అంటే ఏమనుకోవాలి. తన అక్కకే కాదు. తనకి కూడా చెప్పాడు. అంటే తన మీద కూడా కిట్టుకి అంత నమ్మకం ఉందా? ఇప్పుడు తను ఏమి చెయ్యాలి?
కిట్టు: నాకు ఫ్రెండ్స్ లేరు స్పందన. నేను అన్ని అందరిని వదిలేసాను. ఆ సమయంలో ఈ సంబంధం కుదిరింది. మీ అక్క మీద నాకున్న గౌరవం మాటల్లో చెప్పలేనిది. అనుకోకుండా నీతో స్నేహం ఏర్పడింది. నిజానికి నాకున్న ఏకైక ఫ్రెండ్ నువ్వే. అందుకే ఇదంతా చెప్పాను. నువ్వు నన్ను జడ్జి చేసినా నీ మీద నాకు కోపం రాదు. నేను అర్థం చేసుకోగలను.
ఇంతలో బెల్ మోగింది. రాణి assistant బట్టలు తీసుకుని వచ్చింది.
ఇంకా ఉంది
Nice story