Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#93
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 16

మరుదినం ఉదయం ఆరున్నరకు తల్లి ఆదేశం ప్రకారం ఈశ్వర్, దీప్తిని తన స్నేహితురాలు డాక్టర్ రాధ వివాహానికి కార్లో బయలుదేరారు.
బయలుదేరబోతున్న దీప్తిని పిలిచింది వాణి.
"ఏం వదినా!" వాణిని సమీపించింది దీప్తి.
వాణి నవ్వుతూ "మంచి అవకాశం... సద్వినియోగం చేసుకో మరదలా!" దీప్తి బుగ్గను సున్నితంగా గిల్లింది వాణి.



సిగ్గుతో తలదించుకొని సరే అన్నట్లు తలాడించి హాల్లోకి వచ్చి అందరికీ చెప్పి బయలుదేరింది దీప్తి.
ముందుసీట్లో ఈశ్వర్ ప్రక్కన కూర్చొని వున్న దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూచింది. అతను దీక్షగా ముందున్న రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నాడు. ఉదయం అతను తలస్నానం చేశాడు. శిరోజాలు నొసటిపైకి జారి మెల్లగా ఏసీ కార్లో అటూ ఇటూ కదులుతున్నాయి. చక్కటి నాసిక, విశాలమైన కళ్ళు నొసలు, కళ్ళకు అద్దాలు బాలీవుడ్ హీరోలా ఠీవీగా కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు ఈశ్వర్.



మనిషి మంచి అందగాడు... అందుకే పొగరు... పదిహేను నిముషాల ముందు బయలుదేరాము. నోరు తెరిచి ఒక్కమాట మాట్లాడ్డేం! అనుకొంది దీప్తి.



బయలుదేరే ముందు వాణి తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పెదవులపైన చిరునవ్వు. గొంతు సవరిస్తూ ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూచింది. ఈశ్వర్ దృష్టి యధాతథంగా వుంది. నిశ్శబ్దాన్ని భరించలేకపోతూ వుంది దీప్తి. సీట్లో అటూ ఇటూ కదిలింది. ఆమె స్థితిని గమనించిన ఈశ్వర్...
"ఏం!... ఏదైనా సమస్యా!..." అడిగాడు.



"అవును..."
"ఏమిటిది?"
"మీరే!..." వెంటనే చెప్పేసింది దీప్తి.



"నేనా!..." క్షణంసేపు ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.



"అవును!... అవును!..."
"నేనేం చేశాను?"
"నాతో మాట్లాడ్డం లేదుగా!"
ఆశ్చర్యంగా చూచాడు దీప్తి ముఖంలోకి ఈశ్వర్.
చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ చురచురా చూచింది దీప్తి.



"డ్రైవింగ్ చేస్తున్నాగా దీపూ!" అనునయంగా చెప్పాడు.
"డ్రైవింగ్ చేస్తే మాట్లాడకూడదా?"
"మాట్లాడకూడదు!"
"మాట్లాడవచ్చు.... మనస్సు వుంటే...!"
"అంటే.... నాకు మనస్సు లేదంటావా!" ఆశ్చర్యంగా దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.



దీప్తి చిరుకోపంతో ముఖాన్ని చిట్లించి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ... "నాకు కనబడటం లేదు" అంది.
ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి నిట్టూర్చి "నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు?"
నా తింగరి బావా! నేను చెబితే గాని నీకు అర్థం కాదా! నా మాటలు, ముఖ భంగిమలు, చూపులు నీకు అర్థం కాలేదా! లేక నన్ను ఆటపట్టించేదానికి నటిస్తున్నావా! అనుకొంది దీప్తి.
"అడిగింది నిన్నే! ఏం కావాలి? అడుగు!" ఈశ్వర్ మాటల్లో దీప్తికి అధారిటీ వినిపించింది.
చిరునవ్వుతో ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
"అడగనా!" అంది.



"అడుగు"
"నాకు... నీవు కావాలి" నవ్వుతూ నాలుకను బయటికి తీసి పెదవుల మధ్యన ఆడించింది.



ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి చిరునవ్వుతో ముఖాన్ని రోడ్డు వైపుకు త్రిప్పాడు.
"నేను మనవూరికి తిరిగి వెళ్ళగానే నాకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసివున్నారు మీ మామగారు!" విచారంగా చెప్పింది దీప్తి.



"వాడెవడు?" ఆవేశంగా అడిగాడు ఈశ్వర్.
"పరంజ్యోతి కొడుకంట!"



" పెళ్ళిచూపులు జరుగవు" మెల్లగా సాలోచనగా చెప్పాడు ఈశ్వర్.
"బావా!..." ఆశ్చర్యంతో అంది దీప్తి.



"అవును... వాడు మీ ఇంటికి నిన్ను చూచేదానికి రాబోడు."
"బావా!... ఎలా ఆపగలవు?"
"వెయిట్ అండ్ సీ!"
"బావా!"
"ఏం... నీకు నా మాట మీద సందేహమా!"
"...వు...ను" మెల్లగా అంది దీప్తి.



"నా మాట నమ్ము. సందేహపడకు దీపూ!" తన ఎడం చేతిని దీప్తి కుడిచేతిపై వుంచాడు ఈశ్వర్.



దీప్తి ఆనందంగా నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
ఈశ్వర్ తన ఎడంచేతిని దీప్తి తలపై వుంచి సున్నితంగా కదిలించాడు. "నీవు... నాదానివి" అన్నాడు మెల్లగా.



మాటలు విన్న దీప్తి పరవశంతో కళ్ళు మూసుకొంది.
ఈశ్వర్ తన ఎడమ చేతితో దీప్తి కుడిచేతిని పట్టుకొన్నాడు. సున్నితంగా చేతిని నొక్కి వదిలేశాడు. దీప్తి ముఖంలోకి చూచాడు. ఆమె ఆనందంగా కళ్ళు మూసుకొని ఉంది. కొన్ని క్షణాల్లో వారి కారు రాధ... వివాహం జరిగే కళ్యాణ మండపం ముందు ఆగింది.



ఇరువురూ కారునుండి దిగారు. మండపంలోకి ప్రవేశించారు. రాధ వున్న గదిలోనికి వెళ్ళరు. పెండ్లి కూతురు అలంకరణలో వున్న రాధ... దీప్తిని చూచింది. లేచి... పరుగున వచ్చి దీప్తిని కౌగలించుకొంది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 16-03-2025, 10:02 AM



Users browsing this thread: 1 Guest(s)