15-03-2025, 10:13 AM
(13-03-2025, 05:19 PM)JustRandom Wrote: Episode - 13
మరుసటిరోజు అలా గడిచిపోయింది. రాత్రి పదింటికి స్నానం చేసి బెడ్ ఎక్కాడు కిట్టు. బెడ్ రూమ్ లో ఉన్న టీవీ ఆన్ చేసి ఏదో స్పోర్ట్స్ ఛానల్ పెట్టుకున్నాడు. సమీర తో మాట్లాడాలి అనిపించింది. మెసేజ్ చేశాడు.
కిట్టు: హాయ్. ఫ్రీ గా ఉన్నారా?
సమీర: మీకే మెసేజ్ చేయబోతున్నాను
అది చూసి కిట్టు సంతోషించాడు.
కిట్టు: నాకు తెలిసిపోయింది. అందుకే నేనే చేసాను.
సమీర: హ హ.
కిట్టు: తిన్నారా?
సమీర: ఇప్పుడే అయింది. కొలీగ్స్ అందరు ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లిపోయారు. మీరు తిన్నారా?
కిట్టు: రేపు బయల్దేరుతారా?
సమీర: అవును రేపు సాయంత్రం ఫ్లైట్.
కిట్టు ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు కానీ సమీరతో ఏమనాలో అర్ధం కావట్లేదు.
స్పందన లాగ టకాటకా మాట్లాడితే పర్లేదు. తిను మాత్రం చాలా పొడి పొడి గా మాట్లాడే అమ్మాయి.
కిట్టు: ఎయిర్పోర్ట్ కి రానా?
సమీర ఆలోచించింది. ఏమి చెప్పాలి. తనకి కిట్టుని హర్ట్ చెయ్యడం ఇష్టం లేదు.
సమీర: మీకు ఎందుకు ఇబ్బంది.
కిట్టు: ఇందులో ఏముంది. ఊరికే అలా సరదాగా.
సమీర: సరే. మీ ఇష్టం.
కిట్టు: బలవంతం లేదు. మీకు ఒకే అయితేనే.
సమీర: హా పర్లేదు. రండి.
కిట్టు: ఇంకేంటి?
సమీర: ఏమి లేదు. బాగా అలసిపోయాను. ఇంక రెస్ట్ తీసుకుంటాను.
కిట్టు: అఫ్ కోర్స్. రెస్ట్ తీసుకోండి. రేపు కలుద్దాము. గుడ్ నైట్.
సమీర: గుడ్నైట్.
సమీర ఫోన్ పక్కనపెట్టి అలా నిద్రపోయింది.
కిట్టు నిద్రపోదాము అనుకుంటుంటే ఫోన్ లో మెసేజ్ వచ్చింది. చూడగానే కిట్టు మోహంలో చిన్న నవ్వు. అది వాడికి కూడా తెలీదు.
స్పందన: ఓయ్ హీరో. ఏమి చేస్తున్నావు?
కిట్టు: ఈ ప్రపంచాన్ని ఎలా బాగు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.
స్పందన: అంత ఖాళీగా ఉన్నావా?
కిట్టు: లోకకల్యాణం కోసం తప్పదు.
స్పందన: ముందు నీ కళ్యాణం గురించి ఆలోచించు.
కిట్టు: దానికేమి. అన్ని బాగానే జరుగుతున్నాయి కదా?
స్పందన: జరుగుతున్నాయిలే. ఏదో నా పుణ్యమా అని.
కిట్టు: ఇందులో నువ్వేమి చేశావు?
స్పందన: నేను ఒప్పుకున్నాను కాబట్టే అక్క నిన్ను చేసుకుంటోంది. కాబట్టి మీ ఇద్దరు ఇక నుంచి మీ లైఫ్లో ఏమి జరిగిన అది నా వల్లే అని ఫిక్స్ అయిపో.
కిట్టు: ఇదేమి దౌర్జన్యం?
స్పందన: అదంతేలేవోయ్.
కిట్టు: ఒకే. నీ పిచ్చ నీ ఆనందం.
స్పందన నవ్వింది. అదేంటో ఈ చిన్న బాంటర్ తనకి నచ్చుతోంది.
స్పందన: సరే విను. ఇప్పుడే ఆ టైలర్ రాణి ఫోన్ చేసింది. మానని బట్టలు కోసం ఎల్లుండి రమ్మంది. లొకేషన్ పంపిస్తాను అంది.
కిట్టు: హమ్మయ్య. రేపు వెళ్ళాలి అంటే ఎలానా అని ఆలోచిస్తున్నాను.
స్పందన: రేపు బిజీ నా?
కిట్టు: చాలా. నా కాబోయే శ్రీమతిని పిక్ చేసుకోవాలి.
స్పందన: అబ్బో! అబ్బో! ఫెంటాస్టిక్. వెళ్లేప్పుడు ఖాళీ చేతులతో కాకుండా ఏమన్నా తీసుకెళ్ళు.
కిట్టు: అబ్బా చా. మాకు తెలీదు మరి. నేను మీ అక్క కోసం గిఫ్ట్స్ ఎప్పుడో కొన్నాను. ఇవ్వడం కుదరక అన్ని నా దెగ్గరే పెట్టుకున్నాను.
స్పందన: అబ్బో! బావ రొమాంటిక్ అనమాట.
కిట్టు నవ్వే స్మైలీ పంపాడు.
స్పందన: ఐ అం వెరీ హ్యాపీ. చక్కగా ఎంజాయ్ చెయ్యండి. అది తక్కువ
మాట్లాడుతుంది. నీతో కూడా మాట్లాడట్లేదు అని టెన్షన్ పడ్డాను. కానీ మెల్లిగా ఓపెన్
అప్ అవుతోంది అనుకుంటా.
కిట్టు: హ్మ్. చెప్పాను కదా. టైం ఇవ్వాలి. అన్ని అవే సెట్ అవుతాయి
స్పందన: నిజంగా. చాల సెన్సిబ్లె అబ్బాయివి నువ్వు. మా అక్కని బాగా చుస్కో.
కిట్టు: బెంగ పడకు. నీ స్కోరికార్డులో నాకు ఎన్ని మార్కులు వేశావో ఏమో మరి. నేను మాత్రం కొంచం మంచోడినే.
స్పందన: సరే అయితే. ఎల్లుండి కలుద్దాము. రేపు ఎంజాయ్.
మరుసటిరోజు రాత్రి ఎనిమిదింటికి హైదరాబాద్ కి చేరుకుంది సమీర. బయటకి వచ్చేసరికి రిసీవ్ చేసుకోడానికి వచ్చిన కిట్టు కన్పించాడు. కిట్టు చక్కటి నల్లటి టీ-షర్ట్ వేసుకుని జీన్స్ వేసుకుని వచ్చాడు. చూడగానే చక్కగా నవ్వాడు. సమీర గంధపు రంగు చుడిదార్, ఎర్రటి చున్నీ, జుట్టు విరిబోసుకుని జస్ట్ ఓకే క్లిప్ పెట్టుకుని చూడటానికి చక్కగా ఉంది.
సమీర ట్రాలీ బాగ్ తీసుకుని వచ్చింది. దెగ్గరికి చేరుకోగానే ఎలా పలకరించాలి అన్న ఆలోచన మళ్ళీఇద్దరి మదిలో మెదిలింది. కిట్టు వాటేసుకుంటాడేమో అని సమీర చూసింది. సమీర దెగ్గరికి వస్తే హాగ్ చేసుకుందాము అన్నట్టు కిట్టు చూస్తున్నాడు.
దెగ్గరికి వచ్చి నుంచుంది సమీర. ఒక అయిదు సెకన్లు అలా చూసుకున్నారు. నవ్వుతు మొహమాటపడుతూ.
కిట్టు: ట్రిప్ బాగా జరిగిందా?
సమీర: బాగా అయింది.
కిట్టు: వెళ్దామా?
సమీర: డిన్నర్ చేశారా?
కిట్టు చిన్నగా నవ్వాడు. సమీర డిన్నర్ కి వెళ్దామా అని తన శైలిలో అడిగింది అని అర్థం అయింది.
కిట్టు: లేదు. మిమ్మల్ని పిక్ చేసుకుని వెళదాము అని టేబుల్ రిజర్వు చేశాను. పదండి.
సమీర చిన్నగా నవ్వింది. తన చేతిలోంచి ట్రాలీ బాగ్ తీసుకున్నాడు కిట్టు. అలా నడుస్తుంటే కాస్త దెగ్గరికి జరిగి సమీర వెనుక వీపు మీద చెయ్యి ఆంచాడు.
కిట్టు తనని మొదటి సారి అలా టచ్ చేసాడు. సమీర కి టెన్షన్ మొదలైంది. అంత మందిలో, పబ్లిక్ లో ఉన్నా సరే, ఒక మగాడు తనని టచ్ చేసాడు అనేసరికి గుండె వేగం పెరిగింది.
కిట్టు అలానే నడుస్తూ ఉన్నాడు. సమీర వీపు మీద చెయ్యి వేయడంతో తన వొంట్లో కూడా ఏదో తెలియని అలజడి. తనకి కాబోయే భార్య. మొదటిసారి అంత దెగ్గరికి వచ్చాడు. భుజం మీద చెయ్యి వేసి దెగ్గరికి తీసుకోవాలి అనుకున్నాడు. కానీ సమీర ఇబ్బంది పడుతుందేమో అని అలా వీపు మీద చెయ్యి వేసి నడిచాడు. ఏవో జనరల్ మాటలు మాట్లాడుకుంటూ పార్కింగ్ కి వచ్చారు. అక్కడ కార్ ఎక్కి ఎయిర్పోర్ట్ బయట వున్న నోవొటెల్ హోటల్ కి వెళ్లారు. అక్కడ రిజర్వు చేసిన టేబుల్ దెగ్గర కూర్చున్నారు.
ఒక అరగంట పాటు జనరల్ విషయాలు మాట్లాడుకున్నారు. తరువాత స్పందన గురించి టాపిక్ వచ్చింది. అలా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కిట్టు. తాను ఒక కొత్త అపార్ట్మెంట్ కొండము అన్న ప్లాన్ లో ఉన్నాడు. ఆ వెంచర్ విషయాలు చెప్తూ ఉన్నాడు. కానీ సమీర మనసు ఎక్కడో ఉంది. కొంచం సేపు అయ్యాక కిట్టు అది గమనించాడు.
కిట్టు: అంతా ఒకే నా?
సమీర కాస్త సందేహించింది. కానీ ఇంక తన మనసులో మాట చెప్పకపోతే కష్టం అనుకుంది. తానూ ఆ ప్రెషర్ హేండిల్ చేయలేకపోతోంది.
సమీర: మీతో ఒక ముఖ్యమైన విషయము చెప్పాలి.
కిట్టు చిన్నగా తల ఊపాడు.
సమీర: ఇది ఇప్పుడు చెప్పాచ్చో లేదో నాకు తెలియట్లేదు. కానీ చెప్పకపోతే పెద్ద తప్పు అవుతుంది. మీరు చాల మంచి మనిషి. అన్ని నిజాయితీగా ముందే నాకు చెప్పేసారు. కానీ నేను ఇది మీకు చెప్పలేకపోయాను. నిజానికి ఎవ్వరికి తెలియదు.
కిట్టు తినడం ఆపి చేతులు రెండు టేబుల్ మీద పెట్టి ఫోకస్ తో వింటున్నాడు.
కిట్టు: ఏ విషయం అయినా పర్లేదు. చెప్పండి.
సమీర: నాకు. నాకు ఒక ఫోబియా ఉంది.
కిట్టు: ఫోబియా నా? ఏంటది?
సమీర: నాకు జెనోఫోబియా ఉంది.
కిట్టుకి దాని అర్థం కూడా తెలియదు.
కిట్టు: అంటే ఏంటి?
సమీర కొంచం నీళ్లు నమిలింది. ధైర్యం తెచ్చుకుని చెప్పింది.
సమీర: నాకు.. నాకు... నాకు సెక్స్ అంటే భయం
కిట్టుకి ఫుజ్ పోయింది. అలా చూస్తున్నాడు.
సమీర: చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు సెక్సువల్ గా ఎవ్వరితో ఇంవోల్వ్ కాలేదు. కాబట్టి అది నాకు తెలియలేదు. కానీ పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా నాకు సెక్సువల్ కోరిక కలగలేదు. అదేంటో అర్థం కాకా డాక్టర్ డేగరికి వెళ్ళాను. కౌన్సిలింగ్ చేసాక చెప్పారు. నాకు వున్న కండిషన్ ని జెనోఫోబియా అంటారట. అంటే సెక్స్ పట్ల ఆసక్తి ఉండదు, భయం ఉంటుంది, ఎవరన్నా సెక్సువల్ గా ముట్టుకున్నా చాల భయం ఇబ్బంది వస్తుంది.
నెక్స్ట్ పది నిమిషాల పాటు సమీర తనకి వున్న కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది.
కిట్టు సైలెంట్ గా ఉన్నాడు. ఏమి చెయ్యాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీట్లేదు. అలా వింటున్నాడు.
చెప్తూ చెప్తూ సమీర కన్నీళ్ళలో నీళ్లు వచ్చేసి బొటబొట కారాయి.
సమీర: మనకి ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా మీరు చాల ట్రై చేసినా నేను మీకు రెస్పొంద్ అవ్వలేకపోయాను. కానీ మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా అలా ఉన్నారు. అంత మంచి మనిషి మీరు. మిమ్మల్ని ఇలా దూరం ఉంచి బాధ పెడుతున్నందుకు చాల బాధగా ఉంది. చెప్తే మీరు పెళ్లి కాన్సల్ అంటారేమో అన్న బాహాయంతో చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏది అయితే అది అవుతుంది అని చెప్తున్నాను.
సమీర ఏడుస్తోంది. ఇది చెప్పడానికి చాలా ధైర్యం తెచ్చుకుంది. కానీ చెప్పాక మనసు తేలికపడాలి కానీ ఇంకా భారం పెరిగింది. పెళ్లి కాన్సల్ అంటే కారణం ఏమని చెప్పాలి? అమ్మ బాధ పడుతుంది. చెల్లి బాధ పడుతుంది. చెల్లి పెళ్లి సంగతి ఏంటి? ఇలా ఎన్ని ఆలోచనల మధ్య రగిలిపోతోంది. ధారాళంగా కలల్లోంచి నీళ్లు వస్తున్నాయి.
అప్పటివరకు షాక్ లో వున్న కిట్టు తేరుకున్నాడు. సమీర అలా ఏడుస్తుంటే తనకి జాలి వేసింది.
కిట్టు: సమీర. ఏడవకండి. ముందు నీళ్లు తాగండి.
సమీరాకి నీళ్లు ఇచ్చాడు. తాను తాగి కళ్ళు తుడుచుకుంది. కొంచం నార్మల్ అయింది.
కిట్టు: ఇది చెప్పడానికి చాలా ధైర్యం కావలి. మీరు ఇంత ధైర్యం చేశారు చుడండి, ముందుగా మీరు ప్రౌడ్ ఫీల్ ఆవలి.
సమీర కి ఏడుపుకి ఎక్కిళ్ళు వస్తుంటే కిట్టు ఇంకో గ్లాస్ వాటర్ ఇచ్చాడు. నీళ్లు తాగింది.
కిట్టు: నాకు మీ కండిషన్ గురించి డీటెయిల్స్ తెలీదు. కానీ మీరు చెప్పినదాని బట్టి ఎంత బాధ మీరు ఒక్కరే భరిస్తున్నారో అర్థం అయింది. ముందుగా మీకు ఒకటి చెప్తాను. మీరు మనసులో దాచుకుంటే ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వదు. కొన్నిసార్లు షేర్ చేసుకుంటే మనకి మేలు అవుతుంది. నాకు ఇబ్బంది కాకూడదు అని పెళ్లికి ముందు ఇది నాకు చెప్పారు అంటే మీరు ఎంత రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తారో ఇది ఒక నిదర్శనం.
సమీర కిట్టు మొహంలోకి చూసింది. కోపం లేదు. బాధ లేదు. భయం లేదు. ఏమి తేడా లేదు.
కిట్టు: దీనికి ట్రీట్మెంట్ ఉందా?
సమీర: కౌన్సిలింగ్ చేస్తారు. కొన్ని మెడిసిన్ ఉంటాయి. కానీ దీనికి కారణాలు అనేకం. ఎప్పుడు తగ్గుతుందో ఎలా తగ్గుతుందో తెలీదు. అసలు తగ్గుతుందో లేదో కూడా తెలీదు.
కిట్టు ఒక రెండు నిమిషాల పాటు ఏదో ఆలోచించాడు. ఏదో నిర్ణయం తీసుకున్నట్టు తనలో తాను తల ఊపి మాట్లాడాడు.
కిట్టు: ఖంగారు పడద్దు. డాక్టర్ దెగ్గరికి వెల్దాము. కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అవుదాము. మ్యారేజ్ కౌన్సిలింగ్ కి కూడా వెళదాము. నేను కూడా వస్తాను. మీరొక్కరే బాధ పడకండి. నేనున్నాను.
సమీర ఆశ్చర్యంగా చూసింది.
కిట్టు: టైంతో పాటు అన్ని సద్దుకుంటాయి. ముందు ఈ టైములో మీరు ఆలోచించకండి. పట్టుమని రెండు వారాలు ఉంది పెళ్ళికి. ఇవన్నీ స్ట్రెస్ తీసుకోకండి.
సమీర నమ్మలేకపోతోంది. అసలు కిట్టుకి అర్థం అయిందా లేదా అన్నట్టు చూసింది.
సమీర: మీకు అర్థం అవుతోందా కిట్టు? నేను ఫిసికల్ గా ఇంవోల్వ్ అవ్వలేను. అవ్వాలి అని ఉన్నా నాకు భయం.
కిట్టు: అర్థము అయింది. అందుకే కలిసి ప్రాబ్లెమ్ డీల్ చేద్దాము. పెళ్లి అయ్యాక చేసుకుందాము. ఇప్పుడు టెన్షన్ పడద్దు అంటున్నాను.
సమీర నోరెళ్లబెట్టింది.
సమీర: అంటే ఇది తెలిసి కూడా పెళ్లి ఒకే న?
కిట్టు: మీ మనసులో ఇంకా ఎవరన్నా ఉన్నారు అన్నా, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నా, మీరు పెళ్లి వద్దు అన్నా నాకు చెప్పండి. ఇప్పుడే కాన్సల్ చేసేస్తాను. మీ పేరు రానివ్వను. నేనే కాన్సల్ చేసాను అని చెప్తాను.
సమీర ఇంకా అలానే నమ్మలేనట్టు చూసింది.
కిట్టు: కానీ మీ మీద నాకు గౌరవం పెరిగింది. హెల్త్ ఇష్యూ కాబట్టి నేను ఇది పెట్టుకుని పెళ్లి కాన్సల్ చెయ్యను. మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి.
సమీర: ఎమోషనల్ గా కాదు. లాజికల్ గా ఆలోచించండి. ఇది చాలా పెద్ద డెసిషన్.
కిట్టు చిన్నగా నవ్వాడు.
కిట్టు: లోజికల్గానే ఆలోచిస్తున్నాను. రేపొద్దున పెళ్లి అయ్యాక నాకు ఆక్సిడెంట్ అయ్యి నేను సెక్స్ కి పనికిరాను అంటే? ఇలాంటి కండిషన్ నాకే ఉంటే? పెళ్లి అయ్యాక ఏజ్ వచ్చినప్పుడు ఇదొక రోగం వచ్చి ఫిసికల్ రేలషన్ కి మనము పనికిరాము అంటే? ఇలా ఆలోచిస్తూ పోతే చాలా చెప్పచు. కానీ మీకున్న కండిషన్ సైకలాజికల్ కదా. ఇది క్యూర్ అయ్యే అవకాశం ఉన్నా లేకపోయినా నేను ట్రై చెయ్యకుండా వదలలేను. అందుకే అంటున్నాను. కష్టం వచ్చింది. కలిసి హేండిల్ చేద్దాము. నేను మిమ్మల్ని ఫిసికల్ రేలషన్ కోసం ఇబ్బంది పెట్టను.
సమీర కి అర్థం కాలేదు. కుప్పలు తెప్పలు ప్రశ్నలు.
కిట్టు: అంటే నా ఉద్దేశం ఊర్లో బయటవాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటాను అని కాదు. మీకు నా మీద నమ్మకం ఉంటే ముందుకి వెళదాము. లేదంటే కాన్సల్ చేద్దాము.
సమీరకి కొంచం మనసులో భయం తగ్గింది. పెళ్లి కాన్సల్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉంది.
కిట్టు: నాలుగు రోజులు టైం తీసుకోండి. మీ నిర్ణయం చెప్పండి.
ఇద్దరు ఇక ఏమి తినలేదు. బయల్దేరిపోయారు. సమీరని వాళ్ళ ఇంటి దెగ్గర దింపడానికి వెళ్ళాడు. పైకి రమ్మంది. తనకి వెళ్లే మూడ్ లేనప్పటికీ సమీర అడిగింది అని వెళ్ళాడు.
రాత్రి పదకొండు అయింది. సరోజ వచ్చి గంట అయింది. కానీ చాలా బిజీగా లాప్టాప్ లో ఏదో చేసుకుంటోంది. అల్లుడ్ని చూసి వెంటనే లోపలి వెళ్లి నైటీ మీద చున్నీ వేసుకుని వచ్చింది.
స్పందన రూమ్ లోంచి బయటకి వచ్చింది. కిట్టుని చూసి నవ్వింది. సరోజకి కిట్టుతో తాను అంత చనువుగా మాట్లాడుతోంది అను తెలీదు. కాబట్టి తల్లితిడుతుంది అని సరోజ ముందు మామూలుగానే ఉంది స్పందన.
సరోజ: సారీ బాబు. మీరు వస్తారు అని తెలీదు.
కిట్టు: అయ్యో అదేంటండి. నేనేమన్నా సెలెబ్రిటీనా? ఇంట్లోనే ఇలానే కదా ఉంటాము?
సరోజ నవ్వింది.
సరోజ: మొదటి సారి ఇంటికి వచ్చారు. ఏమి తీసుకుంటారు.
కిట్టు: ఏమొద్దండి డిన్నర్ చేసే వస్తున్నాము.
స్పందన సమీర పక్కన కూర్చుంది. అక్క బావా డిన్నర్ కి వెళ్లారు అంటే తనకు ఆనందంగా అనిపించింది. అక్క చేతిని పట్టుకుని చిన్నగా నొక్కింది.
సరోజ: మొదటిసారి వచ్చారు. ఇల్లు చుడండి. సమీర, చూపించమ్మా.
కిట్టు వెంటనే స్పందన మొహం చూసాడు. తాను చెప్పలేదు అన్నట్టు సైగ చేసింది.
కిట్టు: ఇంత రాత్రి ఎందుకులెండి. అందరు కంఫోర్టాబుల్ గా ఉండే టైం. ఈసారి వచ్చినప్పుడు చూస్తాను.
సరోజ కి కిట్టు సమాధానాలు నచ్చుతున్నాయి. సెన్సిబుల్ అబ్బాయి అనుకుంది.
కిట్టు: సరే అంది. నేనుంటాను.
కిట్టు బయల్దేరాడు. సోఫాలో ఉన్నా సమీర స్పందనల వైపు చూసి అన్నాడు.
కిట్టు: నేను చేరాక మెసేజ్ చేస్తాను.
వాడు అన్నది ఎవరితోనో తెలీదు. కానీ సమీర స్పందన ఇద్దరు తల ఊపారు. అది కిట్టు మాత్రమే గమనించాడు. అంత టెన్సిం లో కూడా వాడికి కామెడీగా అనిపించింది.
సరే అని చెప్పి ఇక ఇంటికి బయల్దేరాడు.
ఇంకా ఉంది.
కథ బాగుందండి, నా కథ నేనే చదువుకునట్టుగా ఉంది, అంటే సమీర పోసిషన్ లో కాదు, కిట్టు ప్లేస్ లో ఉన్నటుగా!!!
-- సుహాసిని శ్రీపాద