14-03-2025, 08:38 PM
అంజలి సోఫా లో కూర్చొని లోరెన్ వైపుకి చూస్తోంది..
ఒకవేళ ఈ అమ్మాయి తనకు కాబోయే సవితి అని అనుమానం కలుగుతోంది..
కానీ చుస్తే ఆ అమ్మాయి కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి..
అలానే రితిక మొహం కూడా ఉబ్బి పోయింది ..
కారణం ఏంటో తెలీదు..
చలి విపరీతంగా గా ఉండటం తో ఫైర్ ప్లేసులో కొన్ని చెక్క ముక్కలు వేసి.. వెలిగించింది...
అందరికి వేడి వేడిగా కాఫీ తయారు చేసి ఇచ్చి ..
చెప్పు అక్క.. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు.
సూర్య రాయబారానికి పంపించాడా?
అంజలి మాటలు విన్న రితిక కు నోరు పెగలలేదు ...సరికదా గొంతు తడిఆరిపోయి..
పూడుకుపోయినట్టు ..గొంతులోనే మాటలు ఆగిపోతున్నాయి కానీ బయటకి రావట్లేదు..
నిన్న అర్ద రాత్రి సమాచారం విన్న వెంటనే బయలుదేరి వచ్చేసింది.
రితిక: అంజలి.. కాసేపు ఉండు .. మాట్లాడతాము.. జర్నీ చేసి చేసి అలసిపోయాము.
అంజలి: అది సరే అక్క.. ఆ అమ్మాయిని తీసుకుని వస్తా అని వెళ్లిన వాడు..
ఇక్కడి వరకు వచ్చి.. మిమ్మల్ని ఇక్కడ
వదిలేసి .. తాను వెళ్లిపోవడం కరెక్ట్ అంటావా ?
నన్ను చూడకూడదు అనేంత పెద్ద తప్పు ఏమిచేసాను ?
రితిక: నీకు కాసేపట్లో అర్ధం అవుతుంది అంజలి.. మనిషికి తన వాళ్ళు తనపక్కన ఉన్నన్నాళ్ళు వారి విలువ
తెలీదు, ఒకసారి దూరం అయితే తెలుస్తుంది.
అంజలి: నువ్వు కూడా సూర్య నే సపోర్ట్ చేస్తున్నావు అన్నమాట..
రితిక: చేయి దాటిపోయాక ఇక అనుకుని ఏమి లాభం..
అంజలి: ఏంటి అక్క... అయితే నన్ను ఒదిలేస్తున్నాడా.. దానికి నువ్వు సమర్దిస్తున్నావా..
రితిక: టిఫిన్ కాసేపట్లో వస్తుంది..తినేసి ఫ్రెష్ అయితే నిన్ను మీ ఊరిలో దిగబెట్టాలి.. అక్కడ మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
అంజలి కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి.. ఇదెక్కడి న్యాయం అక్క..
నాకు కోపం రావడం కూడా తప్పేనా, సవితిని తీసుకువస్తా అంటే సైలెంట్ గా ఒప్పుకోవాలా?
గట్టిగా మాట్లాడితే నన్ను తన జీవితంలో నుంచి తుడిచేస్తాడా..
పెద్ద మగాడిలా మాటలు మాట్లాడితే సరిపోదు అక్క.. ధైర్యంగా నా ముందుకు వచ్చే చెప్పొచ్చుగా..
రితిక: నీకు మీ ఊరు వెళ్ళాక అర్ధం అవుతుంది అంజలి. ఇప్పుడు పాత విషయాలు ఎందుకు?
అంజలి: అంతా కలిపి 12 గంటలు కాలేదు అప్పుడే పాత విషయాలు ఎలా అవుతాయి అక్క.
రితిక :నీకు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు అంజలి.. ప్రస్తుతానికి నువ్వు రెడీ అయితే .. మనం రిటర్న్ బయలుదేరుదాము.. నిన్ను ఇంటి దగ్గర దింపిన తరువాత ఖచ్చితంగా మాట్లాడుకుందాం.
అంజలి: లేదక్కా.. సూర్య వచ్చి నాతో మాట్లాడే దాక నేను ఇక్కడినుంచి కదిలేది లేదు.
అని అంజలి సూర్య నెంబర్ కి మరోసారి ఫోన్ కాల్ చేసింది..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఢిల్లీ
పాలమ్ ఎయిర్ఫోర్స్ బేస్
ఆల్ఫా 23 టీం పైలట్స్ ఇద్దరు C-130 ని హ్యాంగర్ లో పార్క్ చేసి. డిబ్రీఫింగ్ సెషన్ కి
ఉదయం 4:30 నుంచి కూర్చున్నారు.
మిలిటరీ ఆఫీసర్ మేజర్ సంజయ్ వర్మ చైర్ లో కూర్చుని క్షుణ్ణంగా పైలెట్స్ ఇద్దరినీ చూస్తున్నాడు.
అరగంట క్రితం కల్నల్ రితిక కాల్ చేసి.. పాలమ్ ఎయిర్ బేస్ కి రమ్మని ఆర్డర్ వేస్తె వచ్చాడు, ఆమె ఇద్దరు ఐరిఫోర్స్ పైలెట్స్ ని విచారించమని ఆదేశించింది.. అతను అయోమయం లో పడ్డాడు, ఆర్మీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ తో ఎయిర్ ఫోర్స్ పైలెట్స్ ఎందుకు మాట్లాడుతారో అర్ధం కావట్లేదు, అన్నిటికి రితిక ఒక్కటే సమాధానం..
నిన్ను ఆపినవాడికి బ్రిగేడియర్ సిన్హా పేరు చెప్పు చాలు అంది.
ఈ రోజు ఆ ప్లేన్ లో అసలు ఏమిజరిగిందో ప్రతి చిన్న విషయం కనుక్కో మని చెప్పి, శ్రీనగర్ కి మిలిటరీ ప్లేన్ లో బయలుదేరింది. ఆమెతో పాటు ఒక అందమైన తెల్ల తోలు అమ్మాయి ఉందని ఆశ్చర్యపోయాడు.
సంజయ్ వర్మ: అసలేమి జరిగింది.. ఈ రోజు మీరు ఎన్నింటికి ఎక్కడ లేచారో దగ్గరినుంచి ఇక్కడ ప్లేన్ ఇంజిన్ ఆపేంతవరకు మీ జీవితం లో జరిగిన ప్రతి విషయం ప్రతి సంఘటన గురించి నాకు తెలియాలి. మరీ ముఖ్యంగా
ప్లేన్ ఇంజిన్ స్టార్ట్ నుంచి ఇక్కడ ల్యాండ్ అయ్యేంతవరకు జరిగిన సంఘటనలు పూస గుచ్చినట్టు.. ప్రతిది నాకు తెలియాలి.
ఇండియా మ్యాప్ టేబుల్ మీద పెట్టి.. శ్రీనగర్ అమ్రిత్సర్ ఢిల్లీ మీద ఎర్రని మార్కర్ తో మార్క్ చేసి.. ఇప్పుడు చెప్పండి అని వారికీ మాట్లాడే అవకాశం ఇచ్చాడు.. రూమ్ లోపల ఇద్దరు స్టెనోగ్రాఫేర్లు ఉన్నారు ఒకరు షార్ట్ హ్యాండ్ లో రాస్తోంటే ఇంకొకరు టైపింగ్ చేస్తున్నారు. ఒకరు ఎయిర్ ఫోర్స్ బేస్ లో పనిచేసే వ్యక్తి ఇంకొకరు ఆర్మీ నుంచి ఇక్కడ పని మీద వచ్చారు. మొత్తానికి పైలెట్స్ జరిగిన విషయాన్నీ పూస గుచ్చినట్టు చెప్పటం ఆరంభించారు.
గత రెండు గంటలనుంచి ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంది..ప్రతి అరగంటకి ఒక కాఫీ తాగుతూ ఉన్నారు అందరు.
సంజయ్: ప్యాకేజి డ్రాప్ పాయింట్ గురించి మీకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు.
పైలెట్ 1: ఎయిర్ బేస్ కమాండర్ ఆదేశాలు ఇచ్చారు.
పైలెట్ 2: ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు అడగటానికి ఉండదు సర్.
సంజయ్: తలాడిస్తూ నాకు తెలుసు, డిసిప్లిన్ అంటే ఏంటో.
సరే .. డ్రాప్ పాయింట్ గురించి పారా జంపర్ కి ఎప్పుడు చెప్పారు.
పైలెట్ 1: ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యిన 10 నిమిషాలకి చెప్పాము, లొకేషన్, ఆల్టిట్యుడ్, స్పీడ్ అన్ని చెప్పి చివరిగా
డ్రాప్ పాయింట్ ఎంతసేపట్లో చేరుకోబుతున్నామో కూడా చెప్పాము. కావాలంటే మీరు బ్లాక్ బాక్స్ వెరిఫై చేయండి.. మేము ఎటువంటి తప్పు చేయలేదు.
సంజయ్: ఓకే .. అడిగినదానికి మాత్రమే సమాధానం చెప్పండి, మీరు ఇక్కడ తప్పు చేసారోలేదో చెప్పే న్యాయ నిర్ణేతలు కాదు.
నెక్స్ట్.. ఒక్కాసారి డ్రాప్ జరిగాక వెనక్కి ఎందుకు తిరిగారు..
పైలెట్: డ్రాప్ చేసిన 5 నిమిషాలకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి కాల్ వచ్చింది F-16 యుద్ధ విమానాలు దగ్గర్లో ఉన్నాయని.. ప్యాకేజీని వెనక్కి వెళ్లి చూడమని అడిగారు.
సంజయ్: అంటే మీకు తెలియదా F-16 యుద్ధ విమానాలు ఉన్నాయని.
పైలెట్ 1: తెలియదు సర్
పైలెట్ 2: తెలుసు సర్ అని నాలుక కరుచుకున్నాడు.
సంజయ్: ఏమి తెలుసు ఏమి తెలియదు అని ఇద్దరినీ కసురుకున్నాడు.
పైలెట్ 1: సర్ రాడార్ లో మాకు వెనక ఉన్న యుద్ధ విమానాలు ఎలా కనపడతాయి సార్..
సంజయ్: మళ్ళి ఆలోచనలోపడ్డాడు..
పైలెట్ 1: సర్ రాడార్ నోస్ కోన్ లో ఉంటుంది.. అక్కడి నుంచి మా ముందు ఉండేవి మాత్రమే కనపడతాయి.
అని నిజం చెప్పాడు.
సంజయ్: మరి అతను ఎందుకు తెలుసు అని చెప్పాడు..
పైలెట్ 1 : నీళ్లు నములుతూ నాకు తెలీదు సార్ అన్నాడు.
సంజయ్: కోపం కంట్రోల్ లో ఉంచుకుని.. నువ్వు నిజం చెప్పు ...పైలెట్ 1 చెప్పేది నిజమేనా..
పైలెట్ 2: నిజమే సర్ ...అయన ఇప్పుడు చెప్పింది నిజమే.
సంజయ్: ఈసారి కోపం నషాలానికి ఎక్కింది.. అంటే అంతకు ముందు చెప్పినవి అబద్దాల?
పైలెట్ 2: కాదు సర్.
పైలెట్ 1 : సర్ అతను జూనియర్ పైలెట్ సర్.
పైలెట్ 2: అవును సర్..
సంజయ్ కి వీళ్ళని ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు.. అసలు ఇలాంటి ఆపరేషన్లకు ఇలాంటి అనుభవం లేని పైలోట్స్ ని పంపిన కమాండింగ్ ఆఫీసర్ ని అనాలి.. అని ..
సంజయ్: సరే ఆ తరువాత
F-16 లగురించి తృటిలో తప్పించుకున్నాం అనే భావన వాళ్ళ కళ్ళల్లో కనపడింది.
పైలెట్ 1 : 26,000 అడుగుల ఎత్తులో పారా జంపర్ ఉన్నట్టు రాడార్ లో కనపడింది.. ఆకాశంలో పిడుగులు padinattu ఒక్కసారిగా 100 ట్రేసర్స్ బుల్లెట్స్ మెరుపులు కనపడ్డాయి..
పైలెట్ 2 : నిజం సార్.. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఐదు బుల్లెట్లలో ఒకటి ట్రేసర్ బులెట్ ఉంటుంది.
సంజయ్: అంటే సుమారు 500 బుల్లెట్లు కాల్చబడ్డాయి అంటారు.. అంతేనా.
పైలెట్స్ ఇద్దరు ఒకేసారి ఔను అన్నారు.
సంజయ్: సరే అక్కడి నుంచి మీరు అమ్రిత్సర్ లో దిగకుండా
ఇక్కడికి ఎందుకు వచ్చారు.
పైలెట్స్: ఏటీసీ నుంచి రేడియో లో మెసేజ్ వచ్చింది రిటర్న్ టు బేస్ అని.. అందుకే ఇక్కడికి వచ్చాము.
సంజయ్: సరే మీకు ఏదైనా చెప్పాలని ఉంటే చెప్పండి
పైలట్స్: చెప్పడానికి ఏమి లేదు సార్.
సంజయ్: పారా జంపర్ తో పాటు ఎవరైనా ప్లేన్ లోపలకి వచ్చారా..
పైలట్ 2: హ సార్.. మీకు ఒక విషయం చెప్పాలి.
సంజయ్: నాంచకుండా విషయం ఏంటో చెప్పు నాయన.
పైలట్ 2: మేము ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు బ్యాక్ కార్గో డోర్ ఓపెన్ అయ్యే ఉంది.
సంజయ్: అదేంటి ఒకసారి అతను దూకేసాక మీరు కార్గో డోర్ క్లోజ్ చేస్తారు కదా..
పైలట్ 1: ఎస్ సార్.. చేస్తాము..
సంజయ్: చేస్తాము కాదు చేశారా లేదా అది చెప్పండి.
పైలట్ 1: చేసాము సార్.
పైలట్ 2: అవును సార్ అది నిజం.
సంజయ్: మరి ఎందుకు ఒపన్ అయ్యి ఉంది ల్యాండ్ అయినప్పుడు.
పైలట్ 2: ఇంక సాఫ్ట్వేర్ హార్డ్ వేర్ చెక్ చేయలేదు.. మేము దిగగానే మీ దగ్గరికి వచ్చాము సార్.
పైలట్ 1: ష్ ఎక్కువ మాట్లాడకు..
సంజయ్: హేయ్.. నువ్వు అతన్ని నా ముందే భయపెడుతున్నావ్.. ఏంటి కధ?
పైలట్ 1: సార్ నాకు ప్రమోషన్ రాకపోయినా పర్లేదు కాని దూరంగా ట్రాన్సఫర్ రాకుంటే చాలు.. అందుకే..
పైలట్2 : అంతే సార్..
సంజయ్: విసుకు వచ్చేసింది.. ఇలా మీరు వినరు..
మీరు నాకు పూర్తిగా కోపరేట్ చేయకపోతే నెక్స్ట్ మీకు ఆఫ్రికా లో UN PEACE కీపంగ్ మిషన్ కి ట్రాన్సఫర్ చేయిస్తాను.
మర్యాదగా మీరు మొత్తం విషయం చెప్పండి.
పైలట్ 1: చెప్పడానికి ఏముంది సార్.. ఈ స్పెషల్ ఫోర్సస్ వాళ్లతో ఇదొక గొడవ..
పైలట్ 2: మనం ఎయిర్ ప్లేన్ దగ్గరికి వెళితే మీకు క్లియర్ గా అర్ధం అయ్యేలా చెప్తాము సార్. ప్లీజ్.
సంజయ్: అబ్బో టైం 8:30 దాటుతోంది.. సరే పదండీ అక్కడికే వెళ్దాం.. కూర్చుని నాకు కాళ్ళు లాగుతున్నాయ్.
కాసేపటికి అందరు ప్లేన్ ఉన్న హాంగర్ దగ్గరికి చేరుకున్నారు..
పైలట్ 1 : క్షుణ్ణంగా పరిశీలించి.. టైటానియం మెటల్ పీస్ బయటికి తీసి.. చూపించాడు.. ఇదిగోండి ఈ పీస్ వల్ల చైన్ లో అడ్డుపడి లాక్ పడలేదు.. సెన్సర్ ని స్క్రు డ్రైవర్ ద్వారా తీసి పారెశాడు..
పైలట్ 2: అలా ఎందుకు చేశాడు అంటారు..
సంజయ్ : నాకు కూడా అదే అర్ధం కావట్లేదు..
మీరు ఇద్దరు శ్రీనగర్ నుంచి టేక్ ఆఫ్ అయినప్పుడు
మైక్ సెట్ లోను పారా జంపర్ తో మాట్లాడేటప్పుడు కూడా ఫ్లైట్ శ్రీనగర్ టు ఢిల్లీ అన్నారు.. కాని మీరు అమ్రిత్సర్ వైపుగా విమానాన్ని నడిపారు, మళ్ళీ ఫ్లైట్ అమ్రిత్సర్ దగ్గరకు వచ్చాక ఢిల్లీ రమ్మన్నారు అంటున్నారు.. ఏంటి విషయం.. లేదంటే విషయం బ్రిగాడిర్ సిన్హా దగ్గరికి వెళ్తుంది.
పైలెట్స్ : సార్ మా కమాండ్ ఏంటంటే ఆర్డర్ ఫాలో అవ్వడం..
మాకు బ్రీఫ్ లో అమ్రిత్సర్ అనే చెప్పారు, కాని రేడియో సెట్ లో ఢిల్లీ అని చెప్పమని చెప్పారు..
సంజయ్: ప్రోటోకాల్?
పైలెట్స్ : తెలియదు సార్.. స్పెషల్ ఫోర్సస్ వాళ్ళతో ఏది తిన్నగా ఉండదు.. చివరి నిమిషం లో చేంజ్ చెస్తారు.
సంజయ్: ఏంటి ఇది.. తీగ బట్టలు అరేసుకునే తీగలాగా ఉంది.. దేనికి ఇది..
పైలెట్స్: ఏంటి సార్ అసలు మీరు నిజంగా మిలిటరీ నుంచే వచ్చారా.. దీన్ని స్టాటిక్ లైన్ జంప్ (STATIC LINE JUMP) అంటారు.. తెలీదా మీకు..
పారాజుంపర్ యొక్క పారాచూట్ ఈ లైన్ తో అనుసంధానమై ఉంటుంది.. జంప్ చేయగానే పారాచూట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వడం కోసం వాడతారు.
బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి స్టాటిక్ లైన్ అవసరం లేదు.
సంజయ్: సరే.. మరి అలాంటప్పుడూ అంత అనుభవం లేని వాడికి నైట్ టైం జంప్ చేయడం అవసరం అంటారా.
పైలెట్స్: మేము ఇంతవరకు సింగల్ పారా జంపర్ ఇలా నైట్ టైం స్టాటిక్ లైన్ తో దూకటం మేము చూడలేదు.
సంజయ్: అది కూడ ఓకే.. దూకే వాడు దూకకుండా కార్గో డోర్ లాక్ పడకుండా చేసాడు అంటే..
పైలెట్స్ : మెంటల్ కేసులు సర్ ఆ స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు.
సంజయ్: అతను అలా చేయడానికి ఒక్కటే కారణం కనబడుతుంది..
సంజయ్ : మీ బాధ అర్ధం అయింది. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని వారిని హంగేర్ నుంచి పంపేశాడు.
ఆ ఇద్దరు పైలెట్స్ చూడనిది సంజయ్ గమనించాడు, రెండు రక్తపు చుక్కలు.
సంజయ్ దృష్టిలో ఆ నల్లని బాక్స్ పడింది , ఎందుకు ఏంటి? కొంపతీసి (కాఫిన్)శవ పెటిక కాదు కదా.
అనుమానం పెనుభూతం అని ఊరికే అనలేదు అన్నట్టు.. ఓపెన్ చేసి చుస్తే లోపల
ఎదురుగా ఒక sniper rifle కనపడింది.. SAKO TRG-42
వింతైన విషయం ఏంటంటే చిన్న చిన్న ఐస్ ముక్కలమీద ఉంది ఆ sniper rifle
మరి దీని కింద ఏమున్నట్టు?..
అని కొద్దీ కొద్దిగా ఐస్ ముక్కలని బయటికి వేస్తూ ఉంటె .. ఏదో మెత్తగా తగిలింది..
చుట్టూ ఉన్న ఐస్ వేరు చేసి చుస్తే నిన్నటి నుంచి తాను ఏ ఇద్దరికోసం అయితే వెతుకుతున్నాడో అతనే.
కళ్ళు భయం తో బిగుసుకుపోయిన రజాక్ తలకాయ ఉంది.. వెంటనే ఆ నల్ల పెట్టి కి మూత బిగించి.
వెంటనే జనరల్ సిన్హా కు కాల్ చేశాడు..

రావల్పిండి
పాకిస్తాన్
రాత్రి చాల సంతోషంగా పడుకున్న జనరల్ అసిమ్ రజా పక్కన ఫాతిమా లేకపోవడం తో చుట్టూ చూశాడు.
ఇల్లు మొత్తం చుసిన జాడ ఎక్కడ కనపడలేదు..
బేగం రేపు సాయంత్రం కానీ రాదు దుబాయ్ షాపింగ్ ట్రిప్ నుంచి..
ఇక చేసేది లేక ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు..
ఉదయం 9:00 AM కి టిఫిన్ చేస్తూ మరోసారి ఇఫ్తికార్ గురించి ఆలోచనలో పడ్డాడు.
గత కొంతకాలంగా తన అహాన్ని, పొగరుని, గౌరవాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టిన ఇఫ్తికార్ గాడి చావు వార్త
వినడం చాల సంతోషంగా అనిపించినా, ఆ తృప్తి తత్కాలికం అనేలా మనసులో ఆలోచనలు మల్లి సుడిగుండాల
వలె గుండెని పిండేస్తున్నాయి.
వాడు అంత తేలికగా చచ్చే రకం కాదు అనే బుర్రలో పుట్టిన చిన్న ఆలోచన మొత్తం శరీరాన్ని ఇప్పుడు దహించివేస్తోంది
వెంటనే ఫోన్ అందుకుని, ఢిల్లీ లో ఉన్న రాయభారా కార్యాలయంలో పనిచేస్తున్న రెహమాన్ కు కాల్ కలిపి మాట్లాడాడు.
రహమాన్: చాచా .. ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశారు.
జనరల్: నిన్న రాత్రి నిద్రపట్టలేదు, నీ పరిస్థితి ఎలా ఉంది.
రెహమాన్: ఇంకా తెలియరాలేదు చాచా, కాసేపట్లో డాక్టర్ ని కలుస్తాను, టెస్ట్ చేసి రిజల్ట్ ఇంకో గంటలోపు
తెలుస్తుంది.
జనరల్: రిపోర్ట్ రాగానే శుభవార్త నా చెవిలో వెయ్యి బేటా..
ఖుదా హాఫిజ్
రెహమాన్ : తప్పకుండ చాచా..
అల్లాహ్ హాఫిజ్
ఆ తరువాత తన బ్యాచ్ మెట్ ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్ కు కాల్ చేశాడు.
నూర్: హ చెప్పు అసిమ్ .. హ్యాపీ?
జనరల్: ఏమి హ్యాపీ, ఇప్పుడే ఢిల్లీ కి కాల్ చేశాను.
ఇంకో గంటా రెండుగంటల్లో మనకి అటువైపు నుంచి ఆ ఇఫ్తికార్ గాడి చావుకి సంబంధించిన కన్ఫర్మేషన్ వస్తుంది.
నూర్: సరే అయితే , మరి నాకెందుకు కాల్ చేశావు.
జనరల్: యేమని చెప్పను, పొద్దున్న లేచిన దగ్గరినుంచి గుండె దడ తగ్గట్లేదు, ఏదో చేదు జరగబోతుంది
అని ఆలంకు .. అందుకే ఇంత త్వరగా నీకు కాల్ చేస్తున్నా
నూర్: అది నీ మాటల్లోనే తెలుస్తోంది కానీ, నేను ఎలా హెల్ప్ చేయగలను?
జనరల్: ఏమి లేదు, నువ్వు ఆ బాడీ కోసం వెతికిస్తే బాగుంటుంది, ఎలాగో నారొవల్ దగ్గర్లోనే కాబట్టి
సియాల్కోట్ నుంచి హెలికాప్టర్ పంపించాం వచ్చు కదా..
నూర్: నీ దగ్గర ఉన్నాయి కదా.. నువ్వే పంపొచ్చుగా..
జనరల్: నేను ఇలాంటి ఒక ఆపరేషన్ చేస్తున్నట్టు ఎవరికి తెలీదు, నాకొడుకు , నువ్వు ఇంకో నలుగురు అంతే.
నూర్: నన్ను బలే ఇరకాటంలో పెట్టావే, సరే పంపిస్తాను.
జనరల్: ఇంకోసారి ఆ పైలెట్స్ తో మాట్లాడితే బాగుంటుంది ..
నూర్: తప్పకుండ మాట్లాడతా .. సరే అసిమ్ .. ఉంటాను.
నూర్ మనసులో .. ఇలాంటి పిరికి వాడికి జనరల్ పదివి ఇచ్చారు, వీడికి ప్రైమ్ మినిస్టర్ ని కంట్రోల్ చేసేంత
పవర్ చేతిలో ఉన్నా వాడడం తెలియని ఒక బఫ్ఫున్ అని మనసులో నవ్వుకుని
లాహోర్ ఎయిర్ బేస్ కి కాల్ కలిపాడు.
నూర్ అహ్మద్: ఎయిర్ మార్షల్ కాలింగ్
బేస్ కమాండర్: ఎస్ సార్, బేస్ కమాండర్ రిపోర్టింగ్.
నూర్ అహ్మద్: నిన్న నైట్ చిలస్ నుంచి లాహోర్ వచ్చిన ఇద్దరు F-16 పైలెట్స్ ఇద్దరు
నా తో ఇంకొక 5 నిమిషాల్లో మాట్లాడాలి. అండర్ స్టుడ్ ?
బేస్ కమాండర్: ఎస్ సర్.
కాల్ కట్ అయ్యింది..
బంక్ బెడ్ మీద పడుకున్న ఇద్దరినీ లేపి జీప్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో 4 నిమిషాల్లో కూర్చోపెట్టారు.
ఖచ్చితంగా 5 నిమిషాలకి వీడియో కాల్ లో అటు వైపు నూర్ అహ్మద్ నిన్న చుసిన ఇద్దరు పైలెట్స్ ని చూసి
గుడ్ మార్నింగ్ జెంట్లేమెన్ అన్నాడు.
నూర్: ఈగల్ వన్ , ఈగిల్ టు .. నిన్న మీరిద్దరూ కలిపి నేను చెప్పిన టార్గెట్ ద్వాంసం చేశారా?
ఈగల్ వన్ : ఎస్ సర్ .
ఈగిల్ టు: ఎస్ సర్.
నూర్: గుడ్
ఈగల్ వన్ : సర్ .. ఇంకో విషయం.
నూర్ : ఏంటది..
ఈగల్ వన్ : మేము టారెట్ ఫిక్స్ చేసి షూట్ చేయడానికి కొన్ని సెకండ్స్ ముందు రాడార్ లో C-130
వెనక్కి తిరిగి మా వైపు వచ్చింది.
నూర్: హ హ హ .. ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మిమ్మల్ని ఏమి చేయగలదు.. బహుశా జంప్ చెసిన వాడి కోసం
వెనక్కి తిరిగి మీ వైపు వచ్చి ఉంటుంది.
ఈగిల్ వన్ : అదికాదు సర్.. మేము షూట్ చేశాక వెన్నక్కి వెళ్ళిపోయింది. ఆ టైములో
ఈగల్ టు: ఆ టైమ్ లో .. మేము చూశాము సర్..
నూర్: ఏంటది?
ఈగిల్ వన్ : వెనక ఉన్న కార్గో బే డోర్ ఓపెన్ గానే ఉంది.
నూర్: అయితే ఏమైంది..
ఈగల్ వన్: మేము లాహోర్ ఎయిర్ బేస్ లో దిగే వరకు గమనించాము సర్, ఆ 15 నిముషాల
తరువాత కూడా డోర్ క్లోజ్ కాలేదు.
నూర్: ఒరేయ్ అడ్డా గాడుదుల్లారా ఇప్పుడు రా మీరు చెప్పేది.
ఈగల్ వన్ : ఇప్పుడు మీరు అడగక ముందే చెప్పాము కదా సర్.
నూర్: గెట్ లాస్ట్ ఇడియట్స్ అంటూ కాల్ కట్ చేశాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
అరేయ్ టైం 9:00 అవుతోంది ,
ఇద్దరు స్లీపర్ సెల్స్ షార్ట్ వేవ్ రేడియో లో మాట్లాడుకుంటున్నారు..
వీడేంట్రా ఇంకా బయటకి రావట్లేదు..
టిఫిన్ కూడా ఎవరో ఇచ్చి వెళ్లారు .. పొద్దున్నే ఇద్దరు కత్తి లాంటి ఫిగర్స్ వచ్చారు.
వీడికి ఎక్కడో సుడి ఉంది రా లోపల ఉన్నావేమి వాడికి సరిపొవట్లేదంటావా..
నీకే బానే మాట్లాడతావు, చక్కగా పక్క సీట్ లో కాంగ్రి పెట్టుకుని కార్ లో హాయిగా నిద్రపోయి ఉంటావు
నేను ఈ చెట్ల మధ్య బిగుసుకు పోతూ చస్తున్నాను..
ఒరేయ్ ఒకరోజు నువ్వు ఇంకో రోజు నేను అని వాటాలు వేసుకున్నాంగా..
ఇంకెందుకు ఏడుపు?
రేయ్ వాడికి ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా ఉన్నదో లేదో..
ఒరేయ్ వాడెక్కడో ఉంది ఫోన్ లిఫ్ట్ చేస్తే మనకి ఎలా తెలుస్తుంది బే..
అది నిజమే కదా.. అయితే ఇంట్లోకి వెళ్దామా.. అందరు ఆడవాళ్లే కదా ..
ఒరేయ్ మనం ఒకసారి వెళ్తే మన మొఖాలు చూస్తారు, ఆతరువాత మనం ఈ పరిసర
ప్రాంతాల్లో నిఘా పెట్టడానికి పనికిరాము.. మన బాస్ రోజుకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు.
వాటిని పోగొట్టుకుంటావా?
ఒరేయ్ మనం పనిచేసేది డబ్బుకోసం కాదు.. మన పవిత్ర యుద్ధం కోసం..
మర్చిపోమకు.
ఒరేయ్ తిండి తినడానికి, పెళ్ళాం పిల్లల్ని పోషించడానికి ఏదోకటి పనిచేస్తావు
అలానే ఇది అనుకో అంతే.. ఇలా పిచ్చి వాగుడు వాగితే ఇంకోసారి నేను రాను.
సెక్యూరిటీ అధికారి కంట్లో పడితే ఇంకా అంతే ..
నీ కర్మ..
రేయ్ ... పైన రూమ్ లో కర్టెన్ పక్కకి జరిగింది.. చూస్తుంటే మగడు లా ఉన్నాడు.
నాకు కార్ లో నుంచి కనపడటం లేదు.. నువ్వే చూసి చెప్పు..
హ మొహం కనపడటం లేదు కానీ, ఖచ్చితంగా మగాడే..
అదెలా చెప్పగలవు రా నువ్వు ..అంటూ నవ్వాడు..
చుస్తే తెలుస్తుంది లేరా..
ఏమి చూసావు రా.. కొంపతీసి..
హ హ హ .. నడకలో వ్యత్యాసం తెలుస్తుంది గా .. ఎవరితోనో సీరియస్ గా ఫోన్లో మాట్లాడుతున్నాడు.
కండలు తిరిగిన దేహం, వాడి చెయ్యి ఎంత ఉందొ చూశావా అసలు..
ఫుల్ హాండ్స్ లూస్ షర్ట్స్ వేయడం వల్ల తెలియట్లేదు కానీ,
ఏంట్రా ఎన్నాళ్ళనుంచి నీ చూపు మగాళ్ల మీద పడింది..
వాడిని చుస్తే నువ్వు కూడా అలానే అంటావ్..
ఇప్పుడు అర్ధం అయ్యింది ఆడవాళ్లు ఎందుకు వాడి చుట్టూ తిరుగుతున్నారో..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
నూర్ అహ్మద్ రెండు హెలికాప్టర్ లు సెర్చ్ ఆపరేషన్ కి సియాల్కోట్ నుంచి పంపించాడు.
ఇంతకు ముందు అసిమ్ రజా మనసులో మొదలయిన ఆందోళన ఇప్పుడు నూర్ లోను మొదలయ్యింది.
అసిమ్ రజా: హలో నూర్ ఏంటో చెప్పు.
నూర్: రేయ్ నీకో విషయం చెప్పాలి, ఎక్కడ ఉన్నావ్.
అసిమ్ రజా : ఏమైంది రా .. నేను ఆఫీస్ లో ఉన్నా.
నూర్: సరే అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను, అంటూ ఇద్దరు పైలెట్స్ చెప్పిన విషయాలు చెప్పాడు.
జనరల్: అంటే, ఏంటి నీ ఉద్దేశం ?
నూర్ : ఏమి అర్ధం కావట్లేదు, గురుదాస్ పూర్ నుంచి జంప్ HAHO చేస్తే నారొవల్ చేరుకోవచ్చు, అదే చేసాడు అనుకుందాం, మరి డోర్ ఎందుకు క్లోజ్ అవ్వలేదు, ముందు ఏదైనా డికాయ్ (decoy) పారాచూట్ తో మనల్ని మోసం చేసి ఆ తరువాత తెలివిగా HALO జంప్ చేసి ఉండవచ్చు,
HALO జంప్ చేస్తే మన F-16 రాడార్ లలో కనపడే అవకాశమే లేదు.
కానీ HALO చేస్తే మహా అయితే 2 లేదా 3km ముందుకి వెళ్లగలడు, అంటే బోర్డర్ దాటలేడు.
అతని టార్గెట్ కనుక నారొవల్ అయితే గురుదాస్ పూర్ లో జంప్ చేసి ఉండాలి, అంటే చచ్చాడు అని అర్ధం.
ఒకవేళ లాహోర్ పక్కన మురీద్కే (muridke) అయితే అమ్రిత్సర్ దగ్గర్లో HAHO జంప్ చేయాలి, కానీ ఆలా కూడా జరగలేదు. HAHO జంప్ అమ్రిత్సర్ దగ్గర్లో చేసి ఉంటె ఖచ్చితంగా మన F-16 రాడార్లో కనిపించేది.
లాహోర్ నుంచి అమ్రిత్సర్ 40 నిమిషాల ప్రయాణం, అంతా కలిపి 40 kms ప్రయాణం.
వాళ్ళు డోర్ లాక్ చేయకపోవడం వల్ల ఇన్ని ఆలోచనలు వచ్చి పడ్డాయి.
ఎందుకైనా మంచిది అని నీకు ముందే చెప్తున్నాను.
ముందు హాఫిజ్ భాయ్ మురీద్కే లో ఉన్నాడేమో కనుక్కో , ఆ తరువాత లాహోర్ గురించి ఆలోచించు.
ఎప్పుడైతే ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్ చివరిసారిగా లాహోర్ అన్నాడో , అప్పుడే అసిమ్ రజా పై ప్రాణం పైనే పోయింది. గబా గబా సెక్రటరీ ని పిలిచాడు, ఫాతిమా ఆఫీసులో లేదు.
వెంటనే బీపీ టాబ్లెట్ ఒకటి వేసుకుని కొడుకు మహమూద్ రజా మొబైల్ నెంబర్ కి కాల్ చేశాడు..
కాల్ వాయిస్ మెయిల్ కి వెళ్ళింది.
కోడలు అయేషా కి చేస్తే నెంబర్ నాట్ రీచబుల్ అని వచ్చింది.
వెంటనే లాహోర్ ఆర్మీ రేంజర్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి అర్జెంటుగా మహమూద్ రజా ఇంటికి పంపాడు.