12-03-2025, 10:29 AM
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
అసలు మీకు ఇష్టంలేని వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని గౌరవించగలరా? ఒక మనిషి మీకు తెలిసినా తెలియకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళ ఇష్టాలను కూడా మీరు గౌరవించగలిగితే సమాజం ఎంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి సమాజానికి స్వార్ధం లేని మనుషులే ముఖ్యం. వాళ్ళే మూలం!
అందరికీ అన్ని పనులూ రావు, సీత అయితే ఎంతో చక్కగా పెడుతుంది. ముగ్గు అందంగా పెట్టాలంటే సీతకే సాధ్యం. రోజూ అందరికంటే ముందుగానే నిద్రలేచే సీత ఈరోజు ఇంకా నిద్ర లేవలేదు. తనని నిద్ర లేపడానికి సీత అత్తయ్య సీత గదికి వెళ్ళింది. సీత అప్పటికే రెడీ అయ్యి, పూలు పెట్టుకుని, దుప్పటి కప్పుకొని పడుకుంది. అత్తయ్య ఆశ్చర్యపోయింది. అదే సీతంటే! అందం, అణుకువ, తెలివి, అన్నిటికన్నా ముఖ్యంగా తన మావయ్య నేర్పిన ఒక పద్దతి - ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాలని గౌరవించే నిస్వార్ధమైన మనసు. ఇవన్నీ కలిపితేనే సీత.
అత్తయ్య బయటకి వెళ్ళగానే, సీత స్టూల్ తీసుకుని చెట్టు దగ్గర పూలు కోస్తున్న అమ్మమ్మ దగ్గరకి వెళ్ళింది. ఆవిడ పూలు కోస్తుందన్న విషయం సీతకి తెలుసు. ఎలా అంటే, సీతకి అలా తెలిసిపోతాయి అంతే. అవును, రాత్రి అత్తయ్య మావయ్య గదిలోనుంచి కొన్ని శబ్దాలు వచ్చాయి. అవి సీతకి వినబడ్డాయి. అప్పుడు కచ్చితంగా పూలు పూస్తాయి. అలా పూలు పూసిన ప్రతిసారి అమ్మమ్మ ఆ పూలు కోస్తుంది. అందుకే సీత స్టూల్ తీసుకొని వచ్చింది.
అవును, ఈ పెరట్లో వుండే సిరిమల్లె చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సిరిమల్లె చెట్టుకి పువ్వు పూసిందంటే, ఆ ఇంట్లో వాళ్ళ పువ్వు మీద ఎవరో ఆశపడ్డారని అర్ధం. ఎవరైనా ఈ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మగవాళ్ళ మీద మనసు పారేసుకున్నా, వాళ్ళ గురించి తప్పుడు ఉద్దేశంతో ఆలోచించినా, శారీరకంగా కావాలని కోరుకున్నా, వాళ్ళని తప్పుడు చూపుతో చూసినా సరే, ఆ తరువాత రోజు ఉదయం ఈ సిరిమల్లె చెట్టు పూలు పూస్తుంది. లేదంటే పూయదు. అమ్మమ్మ సీతకి ఇదే చెప్పింది.
రాత్రి అత్తయ్య మావయ్య గదిలో నుంచి కొన్ని శబ్దాలు వచ్చాయి. మావయ్య అత్తయ్యని ఆ చూపుతో చూసి ఉంటాడు, అందుకే ఈరోజు ఈ సిరిమల్లె చెట్టు పూలు పూసింది.
సీత ఎప్పుడూ పూలు ఉండకూడదనే కోరుకుంటుంది. ఎందుకంటే, ఉండకూడదూ ఉండకూడదూ అనుకుంటే వుంటాయి, వుండాలి వుండాలి అంటే ఉండవ్! అర్ధమయ్యిందిగా, ఇదే సీత! ఎవరికి ఏం కావాలో, ఎవరి మనసులో ఏముందో సీతకి అన్నీ తెలుసు.
రేలంగి మావయ్య మార్నింగ్ వాక్ నుంచి ఇంటికి వచ్చి సీతని పిలిచాడు. సీత వెంటనే వెళ్లి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. సీత రేలంగి మావ్వయ్య వాళ్ళ చెల్లెలి కూతురు. సీత చిన్నప్పుడే తన తల్లితండ్రులు చనిపోవడంతో, రేలంగి మావ్వయ్యే తనని చేరదీసాడు. అందుకే, సీతకి రేలంగి మావయ్య అంటే గౌరవం, ఆయన పాటించే పద్దతులకు కూడా.
మనసులో ఎటువంటి బేధాలూ పెట్టుకోకుండా, అందరినీ సమానంగా చూడాలి, అందరి ఇష్టాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకునే వ్యక్తి, అదే పాటిస్తాడు కూడా.అందుకే ఈయనంటే ఊరిలో అందరికీ గౌరవం. రేలంగి మావయ్యకి ఇద్దరు కొడుకులూ, ఒక కూతురు. చిన్నోడు హైదరాబాద్ లో జాబు వెతుక్కుంటున్నాడు. అందంగా ఉంటాడు, అమ్మాయిల విషయంలో చురుకుగా ఉంటాడు. ఇక పెద్దోడు, వాడికి నచ్చినట్టు ప్రవర్తిస్తాడు, అప్పటికప్పుడు అనిపించింది చేసేస్తాడు, పెద్దగా ఆలోచించడు. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే అస్సలు తట్టుకోలేడు. అలా ఇన్సల్ట్ చేసాడనే, తన మావయ్య కంపెనీలో చేస్తున్న జాబు మానేసి, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడు.