11-03-2025, 08:31 PM
![[Image: Untitled.jpg]](https://i.ibb.co/3Y5jYztS/Untitled.jpg)
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
చిలస్ ఎయిర్ ఫీల్డ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ 10:15 PM
వీడియో కాన్ఫరెన్స్ రూమ్ లో నలుగురు పైలెట్స్ రాబోయె మిషన్ గురించి కొంచెం ఒత్తిడికి
లోనైయున్నారు. ఇంతలో వీడియో కనెక్ట్ అవడం తో అందరు ఒకింత ఉపశమనం పొందారు.
నూర్ అహ్మద్: జెంట్లేమెన్, మిమ్మల్ని చుస్తే నాకు చాల సంతోషంగా ఉంది. హౌ అర్ యు ?
పైలెట్స్: థాంక్ యు సర్, వి ఆర్ ఫైన్.
నూర్: హ్మ్మ్.. మిషన్ కి వెళ్లేముందు కొంచెం దిగులు దుడుకు ఉండటం సహజం.
ఎనీవే నేను మీకు ఒక బాధ్యత అప్పచెప్పబోతున్నాను..
పైలెట్స్: చెప్పండి సర్.
నూర్: ఇంకాసేపట్లో మీరు మీ F-16 యుద్ధవిమానాల్ని తీసుకుని ఒక నరరూప రాక్షసుడిని చంపబోతున్నారు.
గ్రూప్ లీడర్ పైకి లేచి నూర్ అహ్మద్ని ఉద్దేశించి ప్రశ్న అడిగాడు
కెప్టెన్: విత్ యువర్ పర్మిషన్: కాన్ ఐ టాక్ ఫ్రీలీ సర్,
నూర్: డైరెక్ట్ గా ప్రశ్నలు వేయకుండా ముందు పెర్మిషన్ అడిగినందుకు సంతోషించాడు.
ఎస్ పర్మిషన్ గ్రాంటెడ్.
కెప్టెన్: ఒక మనిషిని చంపడానికి మన ఫైటర్ జెట్స్ ను ఉపయోగించడం ఏంటో అర్ధం కాలేదు జనాబ్.
నూర్: పరిస్థితులు అనుకూలించి కొన్ని కొన్ని సందర్భాలలో అనుకోని తరహాలో మనం పని చేయాల్సి ఉంటుంది.
మనకి ఈ రోజు అలంటి అవకాశమే వచ్చింది అని చెప్పుకోవాలి.
కెప్టెన్: విషయం అర్ధం అయ్యింది.. ప్రశ్నలకు జవాబు దొరకదని..
నూర్: మీరు నేను చెప్పే విషయాలు గుర్తుంచుకోండి..
1. ఎట్టి పరిస్థితలో భారత భూభాగంలోకి లేదా భారత గగనతలం లోనికి ప్రవేశించరాదు.
2. LOC (లైన్ అఫ్ కంట్రోల్) ఏర్పడినప్పుడు ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం,
LOC గీతకి ఇరువైపులా 10 kms పాటు నో ఫ్లై జోన్ గా నిర్దారించారు. కావున మీరు ఆ విషయాన్నీ గుర్తు
పెట్టుకుని మీ విమానాల్ని నడపండి.
3. ఒక C-130 HERCULES ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక వ్యక్తి లేదా కొంత మంది పారా జుంపింగ్ చేయబోతున్నారు.. నా ఉద్దేశం నిజమైతే అతని టార్గెట్ నరోవాల్(NAROWAL) లేదా గుజ్రాన్వాలా (GUJRANWALA).
కెప్టెన్ చేయి ఎత్తి మరోసారి ప్రశ్న అడిగాడు..
![[Image: Untitled.jpg]](https://i.ibb.co/xKyPrfXF/Untitled.jpg)
మురీద్కె (MURIDKE) మీద ఎటాక్ చేస్తూ ఉండవచ్చు కదా.. అక్కడ మన హాఫిజ్ భాయ్ మన లష్కర్ ఏ తోయిబా
ముజాహిదీన్ లతో ట్రైనింగ్ నిర్వహిస్తూ ఉంటాడు కదా..
(హాఫిజ్ భాయ్-- హాఫిజ్ సయీద్)
నూర్ అహ్మద్: నేను చెప్పింది చేయండి ఎక్సట్రాలు చేస్తే మీ తోకలు కత్తిరిస్తా.. నారొవల్ లో ఇలియాజ్ కాశ్మిరీ ఉన్నాడు.
గుజ్రాన్వాలా నిండా మన ముజాహిదీన్స్ నిండిపోయి ఉంది,.. నా ఉద్దేశం నిజం అయితే.. ఆ c-130 ప్లేన్ పఠాన్కోట్ (PATHANKOT) దాటి 'గురుదాస్ పూర్' చేరేలోపు పారా జంప్ చేసే అవకాశం ఉంది..
మీరు ఆ వ్యక్తి మన పాకిస్తాన్ ఉపరితలం అదే మన గగనతలం లోకి ప్రవేశించిన వెంటనే.. అతన్ని హతమార్చాలి.
4. మీరు చిలస్ ఎయిర్ ఫీల్డ్ నుంచి ఇస్లామాబాద్, జీలం, గుజరాత్, సియాల్కోట్, మీదుగా ప్రయాణించండి ..
పైన చెప్పిన విషయాలు గుర్తు ఉంచుకోండి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరు బోర్డర్ దాటకూడదు, ఆ పారా జంపర్ మన గగనతలం లోకి వచ్చాక అతన్ని మట్టుబెట్టండి..
5. మిస్సైల్స్ అవసరం లేదు కనుక వాటిని ప్లేన్ నుంచి తొలగించండి.. అధిక బరువు కదా..
అలాగే మీ జెట్ లో ఉండే గన్ లో కొత్త బుల్లెట్స్ తో పూర్తిగా నింపుకోండి.. మీరు పొరపాటున పారాచూట్ మీద కాలిస్తే
అతను తప్పించుకునే అవకాశం ఉంది.
ఈ సరి ఇంకో పైలట్ లేచి నవ్వుతు.. సర్ పారాచూట్ ని కాలిస్తే అతను అంత ఎత్తునుంచి కింద పడితే బ్రతుకుతాడా..
నూర్ అహ్మద్: పైలట్ ని జాలి చూపు చూసి.. పారా జంపర్స్ బ్యాక్ అప్ పారాచూట్ తో పాటు జంప్ చేస్తారు..
ఒక వేళా మనం మొదటి పారాచూట్ ని పాడుచేస్తే ఫ్రీ ఫాల్ లోకి వెళ్ళిపోతాడు.. అంత స్పీడ్ తో కిందకు పడుతున్న వ్యక్తి ని మీ ప్లేన్స్ నుంచి కాల్చడం అంత తేలిక కాదు..
అతను అప్పుడు రెండో పారాచూట్ 2000 అడుగుల ఎత్తులో ఓపెన్ చేస్తే మనకి దొరికే అవకాశమే లేదు.. అర్ధం చేసుకోండి..
ఇలాంటి ప్రశ్న అడిగావు అంటే నువ్వు పైలట్ గా పనికిరావు.. వెళ్లి కాంటీన్ లో అంట్లుతోముకో.. అంటూ వీడియో కాన్ఫరెన్స్ ముగించాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
శ్రీనగర్ ఎయిర్ బేస్
11:45 PM
టేక్ ఆఫ్ పర్మిషన్ రాగానే .. సూర్య మరొక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం లోకి వెళ్ళాడు..
వైష్ణవి, అంజలి, లోరెన్, షాహినా, మాలేక్ తో పాటు ..
అమ్మవారి విగ్రహం..
పూజారిగారు
ఎర్రని పట్టు చీర కట్టుకుని, పెద్ద బొట్టు..
తనని గుడిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ..
నిదానంగా ఊపిరి మీద కంట్రోల్ తెచ్చుకుని ప్రతి సెకండ్ కౌంట్ చేస్తున్నాడు..
విమానం విజయవంతంగా టేక్ ఆఫ్ అయ్యింది ..
ప్లేన్ రన్ వే మీదకు రాగానే .. దూరం నుంచి ఆ c-130 HERCULES ప్లేన్ ని రెండు రోజుల నుంచి గమనిస్తున్న
స్లీపర్ సెల్స్, మిర్పూర్ ( పాక్ ఆక్రమిత కాశ్మీర్) కంటోన్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తికీ మెసేజ్ చేశాడు.
xxxx: "చిడియా ఉడ్ గయి" ( పిట్ట ఇప్పుడే ఎగిరింది)
అటు వైపు ఆ మెసేజ్ చదివిన వ్యక్తి ..
yyyyy: "ఛీల్ కో షికార్ కర్నె కా షౌక్ హాయ్" (గద్ద కి వేటాడడం అంటే ఇష్టం )
అని నూర్ అహ్మద్ కు పంపించాడు..
10 నిమిషాల అనంతరం తన తలకి ఉన్న హెడ్ సెట్ లో పైలట్ వాయిస్ వినపడింది ..
పైలట్: ఆల్ఫా 23 ఎన్ రూట్ టూ ఢిల్లీ.. స్పీడ్ 300నాట్స్ ఆల్టిట్యుడ్ 190
లెవెలింగ్ ఆట్ 380.. మెయింటైనింగ్ స్పీడ్.. డ్రాప్ పాయింట్ ఇన్ T-26 మినిట్స్. ఓవర్
సూర్య: రోజర్ థాట్. ఆల్ఫా 23. ఓవర్.
చేతికి ఉన్న గార్మిన్ ఏవియేటర్ (GARMIN D 2 MACH1 PRO AVIATOR) లో 24 నిమిషాలకు వాచ్ సెట్ చేసుకున్నాడు.
జంప్ చేయడానికి పూర్తిగా సన్నద్ధం అవుతున్నాడు.
![[Image: Screenshot-11-3-2025-152553-www-garmin-com-1.jpg]](https://i.ibb.co/LDJNNKnD/Screenshot-11-3-2025-152553-www-garmin-com-1.jpg)
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సూర్య కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యట్లేదు..
కోపంతో ఈ సారి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసింది
అమ్మ: ఏంటే అంజలి ఈ టైములో కాల్ చేశావ్. అంతా క్షేమమేనా?
అంజు: లేదు అమ్మ.. నాకు సూర్య ఒక సవితిని తెచ్చాడు..
అమ్మ: ఏంటే అర్ధరాత్రి పదకొండు ఇంటికి జోకులు వేస్తున్నావ్ , సవితి ఏంటి? అసలు విషయం ఏంటో చెప్పు నువ్వు.
అంజు: నాకన్నా ముందే ఇంకో అమ్మాయి పరిచయం ఉందంట.. మేము ఇద్దరం కావాలంట.
అంటూ మొత్తం విషయం పూస ఉచ్చినట్టు చెప్పింది.
అమ్మ: ఇంతకీ మీ ఇద్దరి మధ్య ...
అంజు: ష్ అమ్మ ..అసలు ఎలా అడుగుతున్నావు నన్ను నువ్వు అలా..
అమ్మ: తెలుసుకోకపోతే ఎట్లా.. నువ్వు నా దగ్గర నీ మనసులో ఉన్న భారాన్ని దించుకో, నేనేమి అనుకోను.
అంజు: లేదమ్మా.. ఏదో పైపైన తప్ప.. చి.. లేదు .. నాకు కంపరంగా ఉంది ఇప్పుడు అవి తలుచుకుంటే.
అమ్మ: హ్మ్మ్ అర్ధం అయ్యింది..
అంజు: ఏంటి
అమ్మ: ఒక వేళ అతను మీ ఇద్దరికీ పెళ్లి అయ్యాక ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అయ్యేదానివి,
ఒక వేళా మీ ఇద్దరు శారీరకంగా కలిశాక చెప్తే ఎలా ఉండేది నీ రియాక్షన్.
అంజు: అది కాదు అమ్మ.. నువ్వు అతన్ని సమర్దిస్తున్నావ్
అమ్మ: నేను నిజం చెప్తున్నా.. పాజిటివ్ గా కొంచెం ఆలోచించు, కనీసం ఇప్పుడైనా చెప్పాడు కదా.
బయట మార్కెట్లో ఎంత మంది ఆఫ్ఫైర్లు పెట్టుకోవట్లేదు, అతను నీకు ముందే చెప్పాడు. ఇప్పుడు అతనితో
ఉండాలో వద్దో అనేది నీ నిర్ణయం.
అంజు: ఆ నిర్ణయం ఎలా తీసుకుంటానో నాకు తెలియకే నిన్ను అడుగుతున్నా.
అమ్మ: నిజం చెప్పు, అతను నీకు కావాలా వద్దా.
అంజు: ఏమో.. సూర్య ఆ అమ్మాయిని వదిలేసి వస్తే కావాలి.
అమ్మ: ష్ .. నువ్వు అతన్ని తిట్టి తరిమేసావా లేదా?
అంజు: లేదు.. అతనే వెళ్ళిపోయాడు.
అమ్మ: ఇప్పుడు అతను ఆ అమ్మాయి తో ఉంటె ? నువ్వు తట్టుకోగలవా?
అంజు: ఏంటమ్మా..నాకు లేని పోనీ భయాలు రేపుతున్నావు.
అమ్మ: రియాలిటీ తల్లి, అతను మగాడు.. ఎక్కడికైనా వెళ్తాడు, వెళ్లగలడు.
అంజు: నువ్వు ఏంటమ్మా అలా మాట్లాడతావు..
అమ్మ: నువ్వు అతను చెప్పేది విన్నావా .. లేదు
నువ్వు వింటేనే కదా అసలు పరిస్థితి ఏంటో అర్ధం అయ్యేది..
పోనీ ఆ అమ్మాయిని చూశావా.. లేదు
నీకన్నా అందగత్తె, గుణావతా, ఏంటో తెలుసుకోవాలా లేదా.
ఇప్పుడు నువ్వు గేమ్ లో ఉంటేనే కదా అవతల వాడిని ఓడించడానికి దారులు చూడగలిగేది.
నువ్వు ఫస్ట్ రౌండ్ లోనే మిడిల్ డ్రాప్ వేస్తె .. ఇక ముందు జరగబోయే ఆటలో నువ్వు అరటిపండువు అవుతావు.
అర్ధం అయ్యిందా.
అంజు: అయితే ఇప్పుడు ఏమి చెయ్యను.
అమ్మ: నువ్వేమి చెయ్యకు, అతన్ని నీ దగ్గరికి రాని. అప్పటివరకు సైలెంట్ గా ఉండు.
అంజు: సరే..
అమ్మ: ఒసేయ్ గుర్తుపెట్టుకో.. ఎంతటి మగ మహారాజైన పడక గదిలో కాంతాదాసుడే..
సూర్య సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. నీతో శారీరకంగా కలవకుండా నీదగ్గర ఉన్న ఒకేఒక్క ఆయుధాన్ని
నీకు లేకుండా చేశాడు. దీనర్థం అతను చెడ్డవాడని కాదు..చేతకానివాడు అని కాదు. నీ మేలు కోరే వాడు.
సెక్స్ తరువాత ఆడది ఒక మగాడ్ని చూసే విధానంలో మార్పు వస్తుంది.. సెక్స్ ఇద్దరి వ్యక్తుల్ని ఒక్కటి చేస్తుంది.
కాని అతను నీ మంచిని కాంక్షించాడు, ఒక వేళా మీ ఇద్దరికీ పెళ్లి కాకపోతే నీ మొదటీ శృంగార అనుభవం నీ భర్తతో జరగాలి
అనుకోవడం తప్పు కాదు కదా.. అతనికి ఏంటో మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని నువ్వే చెప్పావ్.
మరి నిన్ను ఎందుకు స్పెషల్ గా చూశాడు. అతని కారణాలు అతనికి ఉన్నాయి.. కాబట్టి నువ్వు ముందు అతనితో మాట్లాడు.
ఆతరువాత ఏమి చెయ్యాలో ఆలోచించు.
అంజు: సరే అమ్మ.. నాన్న ఉన్నారా..
అమ్మ: వింటున్నారు..
అంజు: ఏంటమ్మా నువ్వు..
అమ్మ; లేదు లేవే ఊరికే జోక్ చేశా.
అంజు: సరే ఇక ఉంటాను.
అమ్మ: ముందు నీ సవతిని చూడు, గెలవగలను అనుకుంటే ముందుకు అడుగువెయ్యి, లేదా వదిలేసి వచ్చేయి.
అంతే ఇంకా ఎక్కువ ఆలోచించకు.
బాయ్ ..
అంజలి: బాయ్ అమ్మా.
బాత్రూం లో మొహం కడుక్కుని బయటకు వచ్చిన అంజలికి .. సూర్య గుర్తుకు వస్తున్నాడు..
ఒకసారి మాట్లాడాలి అనిపించింది.. కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యట్లేదు..
అంజలికి సూర్య ని చూడాలనిపించింది.. ఈసారి వీడియో కాల్ చేసింది.. నో రెస్పాన్స్..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఎయిర్ మార్షల్ ఆదేశాల మేరకు రెండు F-16 యుద్ధ విమానాలు చిలస్ ఎయిర్ ఫీల్డ్ (chilas air field )
నుంచి పైకి ఎగిరాయి.. భారత భూభాగం లోనికి ప్రవేశించకుండా లైన్ అఫ్ కంట్రోల్ కి 10 kms
లోబడి కేవలం 5000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాయి..
ఇస్లామాబాద్ దాటి గుజరాత్ దగ్గర F-16 పైలోట్స్ రివ్వున నిట్ట నిలువుగా 38000 అడుగుల ఎత్తుని 2 నిమిషాల్లో చేరుకున్నారు..
రాడార్ ఓపెన్ చేసి చుస్తే .. 80 kms దూరంలో c-130 జమ్మూ నగరాన్ని దాటుతూ కనపడింది..
c-130 hercules ప్లేన్ లోపల పైలెట్స్ ఇద్దరు కోక్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు
అర్ద రాత్రి ఒంటరిగా పారా జంపింగ్ ఏంటో అర్ధం కావట్లేదు..
ఏమి చేస్తాం చెప్పు, ఆర్డర్ వేశాక తప్పుతుందా..
టైం దగ్గర పడింది.. అతన్ని నిద్రలేపుదాం.
రేయ్ రాడార్ లో చూశావా..
ఏంటి?
యా.. రెండు ఐటమ్స్ మిణుకు మిణుకు మంటూ మన దగ్గర్లో కనిపిస్తున్నాయి..
రాడార్ friend or foe ఐడెంటిఫికేషన్ లో FOE అని చూపించింది
( friend అంటే మిత్రుడు, FOE అంటే శత్రువు)
రెండు F-16 యుద్ధ విమానాలు సియాల్కోట్ నుంచి లాహోర్ వైపు వెళ్తున్నారు ఉన్నాయి..
ఈ విషయం చెప్పాలంటావా అతనికి
అతనికి F-16 ప్లేన్ లతో ఏమి పని రా..
లైట్ తీస్కో.. కాసేపట్లో వాడిని వదిలించుకుని ఢిల్లీ లో దిగి హాయిగా పడుకుందాం.
.......................
హలో, ఆల్ఫా 23 ..
సూర్య: ఎస్ ..ఆల్ఫా 23 కాపీ
ఆల్ఫా 23: గెట్ రెడీ ఫర్ ది డ్రాప్.. T-3 మినిట్స్, స్ట్రాప్ యువర్ సెల్ఫ్ , కార్గో బే డోర్ ఓపెనింగ్,
సూర్య: రోజర్ థాట్.
కార్గో డోర్ ఓపెన్ అవ్వడం తో ఒక్కసారిగా గాలిబయటికి పోవడం తో కొంచెం సేపు గందరగోళం అయ్యింది.
సెటిల్ అయ్యాక.. సూర్య బెల్ట్ తప్పించి .. ఒకసారి పారాచూట్, వాచ్, షూస్, హెల్మెట్ అన్ని ఇంకోసారి చెక్ చేసుకున్నాడు.
తన బ్యాగ్ లో ఉన్న ఒక చిన్న టైటానియం ముక్కని తీసుకుని, డోర్ లాక్ చైన్ లోపల పెట్టాడు.. స్క్రూ డ్రైవర్ తో డోర్ సెన్సార్ తిసేసాడు.
దానితో ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేంతవరకు కార్గో బే డోర్ క్లోజ్ అవ్వదు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
eagle one : copy
eagle two : copy.
eagle one : కార్గో డోర్ ఓపెన్ అయ్యింది. కాపీ
eagle two : copy .. జాగ్రత్తగా వెంబడించాలి గుర్తు ఉంచుకో..కనీసం 50 kms దూరంలో ఉందాం.
eagle one : copy .
3 నిమిషాల తరువాత..
eagle one : రాడార్ లోపల ఒక చుక్క కనిపించింది.. చుస్తే పారాచూట్ ఓపెన్ అయ్యినట్టూ ఉంది..
eagle two : కాపీ .. నా రాడార్ లో కూడా కనిపించింది..
eagle one : వెయిట్ చేద్దాం..
10 నిమిషాల తరువాత..
eagle one : పారాచూట్ లైన్ అఫ్ కంట్రోల్ (LOC) క్రాస్ అయ్యింది. ఎత్తూ 28,000 అడుగులు
eagle two : copy..
eagle one : prepared to engage:: over
eagle two : copy :: over
eagle one : target acquired ..over
eagle two: light up the target :over
altitude 25000 speed 180 నాట్స్. టైం 12:40 over
కటిక చీకటిగా ఉన్న ఆ కాళ రాత్రి పైలోట్స్ ఇద్దరు తమ విమానంలో ఉన్న
20mm గాట్లింగ్ గన్ ఆ పారాచూట్ లో ఉన్న వ్యక్తి పై గురి పెట్టారు.
ఆన్ మై కౌంట్
3
2
1
ఫైర్
కాసేపటికి ముక్కలు ముక్కలైన ఆ శరీరం తాలూకు అవశేషాలు పాకిస్తాన్ భూభాగం లో చెల్లాచెదురుగా పడ్డాయి...
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
అంతకు 5 నిమిషాల ముందు..
రేయ్ ఏటీసీ(ATC) నుంచి మెసేజ్ వచ్చింది.. (ATC: AIR TRAFFIC CONTROL)
అమ్రిత్సర్ ఏటీసీ: హలో ఆల్ఫా 23
ఆల్ఫా 23: ఎస్ ఆల్ఫా 23, కాపీ.
ఏటీసీ: మీరు F-16 యుద్ధవిమానాలని చూశారా.
ఆల్ఫా 23: ఎస్ .. ఓవర్ సియాల్కోట్.
ఏటీసీ : టర్న్ అరౌండ్ అండ్ చెక్ ది ప్యాకేజి ( వెనుకకు తిరిగి పారా జంపర్ ని పరిశీలించండి)
ఆల్ఫా 23: రోజర్ థాట్. ఓవర్
C-130 వెనక్కు తిరిగి రాడార్ లో చూస్తుంటే ..
పారాచూట్ 26,000 అడుగుల ఎత్తులో ఉంది.. కానీ పాకిస్తాన్ భూభాగం లోనికి వెళ్ళిపోయాడు..
దూరం నుంచి చూస్తుంటే.. F-16 నుంచి ట్రేసింగ్ బుల్లెట్స్ కనపడ్డాయి..
సుమారు 100 మెరుపులు .. ప్రతి 5 బుల్లెట్లలో ఒక ట్రేసింగ్ బుల్లెట్ ఉంచుతారు..
అంటే సుమారు 500 బుల్లెట్లు కాల్చబడయ్యి ...
అదే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికీ తెలియజేశారు.
![[Image: 9myw0k.gif]](https://i.ibb.co/RfrpF6v/9myw0k.gif)
TRACING BULLETS
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కాసేపటికి రెండు F-16 విమానాలు లాహోర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాయి..
విషయాన్ని ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్ కి ఆపరేషన్ అయినా వెంటనే రేడియోలో చెప్పారు.
నూర్ అహ్మద్ వారిని అభినందించి.. తన మిత్రుడైన జనరల్ రజా కి కాల్ చేశాడు.
రజా: నేను నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా..
నూర్: హ హ హ .. ఆపరేషన్ సక్సెస్.. ఇప్పుడే వార్త అందింది..
రజా: మషా అల్లాహ్.. నీ నోట్లో చెక్కర పొయ్య .. ఎంత మంచి వార్త చెప్పావు రా..
నూర్: హ.. నాకు పని అప్పచెబితె పూర్తీ చేయకుండా వదిలిపెట్టను.. సరే రేపు ఉదయం తీరిగ్గా మాట్లాడుకుందాం
ఇక పడుకో..
రజా: సరే నూర్ .. ఉంటాను..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
అర్ధరాత్రి ఏంటి ఈ గోల అని లేచి కూర్చుంది అంజలి,
ఎవరో తలుపు కొడుతున్నారు.. ఫోన్ లో టైం చుస్తే 5:35 అయ్యింది.
ఆమ్మో అస్సలు టైం తెలియలేదు..
ఏ టైములో ఎవరో ఎందుకు వచ్చారో అని.. ఒకవేళ వచ్చింది సూర్య ఏమో నని.
అవును కదా.. నేను లేచే ముందే వస్తాను అని నిన్న చెప్పాడు.. మాట ఇస్తే తప్పకుండ నిలబెట్టుకుంటాడు.
అంటూ బుంగ మూతి పెట్టుకుని..ఆ శాటిన్ నైట్ గౌన్ లో తన ముందు ఎత్తులు వెనక వంపులు నిండుగా కనపడుతున్నాయి.
వెళ్లి తలుపు తియ్యగానే .. ఎదురుగా ఎర్రని కళ్ళతో.. ఇద్దరు నుంచుని ఉన్నారు
ఒకరు తనకు తెలిసిన రితిక, సూర్య కి కొలీగ్.. తెల్లని అమ్మాయి,,
ఇద్దరి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి..
అంజు: ఏంటక్కా.. ఇప్పుడు వచ్చావు..
వస్తున్నట్టు సూర్య కూడా చెప్పలేదు.. హ చెప్పాడు.. తాను రాకపోతే నువ్వు వస్తావని చెప్పాడు.
రితిక: లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంజలి..
ఈమె లోరెన్ .. ఫ్రాన్స్ నుంచి వచ్చింది. సూర్య కి క్లోజ్ ఫ్రెండ్.
అంటూ అందరు లోపలికి వెళ్లారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx