11-03-2025, 01:26 PM
(This post was last modified: 11-03-2025, 01:27 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
CHAPTER 8
వారాలు గడిచే కొద్దీ, కార్తీక్ ఆరోగ్యం చెడిపోతూ, నాకు వాళ్ళ ఇంట్లో రాత్రి పడుకునే అవకాశాలు ఎక్కువగా కలిపించసాగాడు. ఇప్పుడు నేను డాన్స్ కూడా బాగా చేయగలుగుతున్నా. అయితే కార్తీక్ ఆరోగ్యం ఎంత పాడవుతుందో, రాధకి బాధ కూడా ఎక్కువ అవసాగింది. నేను దగ్గరలో ఉంటే నన్ను కౌగలించుకుని ఉండమని కోరేది. లేదా తన గోళ్లు కొరుక్కుంటూ, జుట్టు చెదరగొట్టుకుంటూ వుండేది. రాధ చాలా ధైర్యం వున్న వ్యక్తే అయినా అంత పెద్ద ఇంటిలో వంటరిగా గడపడానికి ఇష్టపడేది కాదు. అలా ఉంటే, తర్వాత జీవితం గురించి ఆలోచిస్తూ తనకి పిచ్చి ఎక్కుతుందని చెప్పేది. ఆమె తన భర్తను కోల్పోతుందన్న విషయాన్ని తన మనసు నుండి మళ్లించే పనిని నేను తీసుకున్నాను. అయితే ఆమె ప్రేమికుడిగా నాకు ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా నేను నా ప్రయత్నాన్ని మానకుండా తనని అప్పుడప్పుడూ ఆశ్చర్యపరుస్తూ, కొత్త ప్రదేశాలు చూపిస్తూ, కొత్త పనులని చూపిస్తూ, బుక్స్ చదివిస్తూ, సినిమాలకి తీసుకెళుతూ, పార్క్ ల చుట్టూ తిప్పుతున్నా.
ఒక Dracula హారర్ సినిమాకి వెళ్ళినప్పుడు, అది చూస్తూ ఆమె అందులో లీనమైపోయింది. నేను మెల్లిగా నా వేలిని తన పైపెదవి పై పెట్టి, తనకి కోరలు ఉన్నాయేమో అన్నట్టు వెతికా. ఒక్కసారిగా బెదిరిపోయి, కుర్చీ నుండి ఎగిరి, తర్వాత నా జోక్ అర్ధమై నవ్వింది.
"మనం ఈరోజు కి ప్లాన్ చేస్తున్నామా ?" అని తనని ఒక హోటల్ కి రాత్రి భోజనానికి తీసుకుని వెళ్ళినప్పుడు అడిగింది. నాకు తనని గొప్ప గొప్ప హోటల్స్ కి తీసుకెళ్లడం ఇష్టం ఎందుకంటే ఆమె దగ్గర తాను వేసుకోవడానికి, చాలా ఖరీదైన బట్టలని తన బెడ్ రూమ్ లో నింపుకుని వుంది. తాను ఆ బట్టలని వేసుకుంటే, అందులో అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఈరోజు తాను వేసుకున్న ఎరుపు గౌన్, తన స్థన సంపదని, చీలికని స్పష్టంగా చూపిస్తుంది. నాకు తనతో డాన్స్ చేయాలని అనిపించింది.
"లేదు" నేను తనకి అభయం ఇచ్చా. "నువ్వు వూరికే కార్తీక్ గురించి ఆలోచించి పిచ్చిదానివి కాకుండా విరామం ఇస్తున్నా. తనకి మందులు ఎక్కువగా ఇస్తున్నారు. అతను కదలలేకుండా వున్నాడు. నువ్వు తనకి స్నానం చేపించి, బట్టలు తొడిగి, తినిపించాలి. అంతా చేసాక కూడా నువ్వు నాకు సమయం ఇస్తావని తెలుసు. అయితే నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో నీకు విరామం కావాలి. లేకపోతె నీ శక్తి పోయి, నువ్వు అడ్డం పడతావు. అయినా నాతో ఎందుకు అంత ఎక్కువ సెక్స్ ని కోరుకుంటావు ? నీకు భావప్రాప్తి కలిగే సమయంలో తప్ప, మిగిలిన సమయంలో నువ్వు బాగానే ఆలోచిస్తుంటావు".
తను తన చేతిని నా చేతి మీద పెట్టింది.
"ఇదంతా చేయడం వల్ల మరి నీకేం లాభం ?" అంటే తన ఉద్దేశంలో సెక్స్ ఒక్కటే కాదు. తను చెప్పింది.
"నీతో నాకు సమయం సంతోషంగా గడుస్తుంది. కంప్యూటర్ లేదా టీవీ చూడడం కన్నా బావుంటుంది. నేను త్వరలోనే విడాకులు తీసుకోబోయే భార్య, తన ప్రేమికురాలితో కలిసి ఉంటుంది. పిల్లలు తమ పనుల్లో తాము మునిగిపోయారు. నా ఇల్లు నీ ఇంటిలాగే ఖాళీగా ఉంది."
"నా భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు, నేను నీతో నా జీవితంలోనే జీవించని కొన్ని అద్భుతమైన రోజులు నీతో గడపడం, నాకు పెద్ద తప్పు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది".
మా మధ్య ఈ సంభాషణ చాలా సార్లు జరిగింది.
"నీకు చేతనైనంత నువ్వు చేస్తున్నావు. ఇంకా నిన్ను నువ్వు ఎందుకు శిక్షించుకుంటావు ? మనకి జీవితం ఏమిచ్చిందో దానికి అనుకూలంగా వెళ్ళాలి. నీకు ఒక చేయి విరిగిందనుకో, ఆట ఆడేటప్పుడు, నీకు కుదిరినంత వరకు దానితో కష్టపడాలి".
"నాకు ఇక్కడున్న ఒకే ఒక్క స్నేహితుడివి నువ్వు. నా కుటుంబం ఇక్కడ ఉండి నన్ను ఓదార్చితే బావుండేది. మేము ఈ వూరికి రావడానికి కారణం, కార్తీక్ కూతురు ఒక డాక్టర్, తాను వాళ్ళ నాన్నని ఇక్కడ ఆసుపత్రి రోగుల మీద జరిపే పరీక్షల్లో భాగంగా ఇక్కడ చేర్పించింది. ఆమె చాలా మంచిది. అయితే తనతో బంధం పెద్దగా నాకు ఏర్పడలేదు. నువ్వే లేకపోయి ఉంటే, నా జుట్టు పీక్కుని, పిచ్చిదాన్ని అయ్యేదాన్ని".
"ఆహా, నీకు మీసాలు ఉంటే బావుండేదని నేను అనుకుంటుంటా. అలాంటిది నీకు బట్టతల వున్నా అందంగా వుండేదానివేమో".
నా చేతి మీద కొట్టి నవ్వింది.
"నా భావం ఏమిటో నీకు తెలుసు. తన జబ్బు వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నాడు. నాకైతే, అతను ఎలా తట్టుకుంటున్నాడో తెలియడం లేదు. ఒక డాక్టర్ గా, తన జబ్బుని జబ్బులానే చూస్తున్నాడు. అతను తన జబ్బు గురించి వేరే డాక్టర్ లతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. అతన్ని డజను మంది డాక్టర్ లు చూస్తుంటారు. కార్తీక్ వాతావరణం గురించి మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటారు".
"ఒక విధంగా, అతనికంటే నీకు కష్టం. అతను అసౌకర్యాన్ని భరిస్తున్నాడు, తప్పుడు భావనను కాదు. నిన్ను అతను ఎలా ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నాడో నీకు తెలుసు. షాపింగ్కు వెళ్లమని అతను ఎన్నిసార్లు చెబుతాడు? కాబట్టి నువ్వు మార్చలేని దానికి నువ్వే బాధపడటం ఆపివేసి, బదులుగా ఏదైనా కొత్తగా ఆలోచించు."
"అంటే ఎలా ?".
నిజమే. డ్రైవింగ్ దూరంలో ఉన్న మంచి రెస్టారెంట్ల అన్నిటిలో మేము త్వరగా డబ్బు ఖర్చు చేసేస్తాము. అలాగే ఎంత డబ్బు ఖర్చు చేసినా, చాలా సినిమాలు 100 రూపాయలకన్నా విలువైనవి కావు.
"అతను ఆసుపత్రిలో కొన్ని రోజులు గడపాల్సి వస్తే, మనం అన్నింటి నుండి బయటపడదాం. ఒక హోటల్లో రూము తీసుకుందామని అనుకుంటున్నాను. నా ఖర్చుతోనే."
ఆమె తన కళ్ళని పెద్దవి చేసి చూసింది "కానీ మనం ప్రేమించుకోవడం లేదు కదా" అంది.
"లేదు! దీన్ని ఒక సెలవు ఎంజాయిమెంట్ అనుకో. గోవాలో ఒక ఒంటరి బంగ్లాను నేను కనుక్కున్నాను. అక్కడ మనం నగ్నంగా ఈదవచ్చు. రోజంతా పీతలని తినవచ్చు. కార్తీక్ పరిస్థితి మరింత దిగజారిపోయే ముందు నీకు సెలవు అవసరం. నువ్వు తర్వాతి కొన్ని నెలల్లో అవసరమయ్యే అంతర్గత శక్తిని నువ్వు ఏర్పరచుకుంటావు."
"నువ్వు నా గురించి అంత దూరం ఆలోచించావా ?"
"నేను మనుషుల్ని ప్రేమతో చూసుకునే వ్యక్తిని".
"కార్తీక్ చనిపోయాక ఏమి జరగొచ్చు ?"
"అది జరిగినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం" నేను ఈ సంభాషణ వస్తుందని చాలా భయపడుతున్నాను.
"చూడు, అతను బతికుండగా నువ్వు నా గురించి, మన గురించి ఎలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. నీ జీవితం పది సంవత్సరాలుగా అతని చుట్టూ తిరుగుతోంది. అతను నీ ప్రాణాలను కాపాడాడు. నువ్వు నీ కృతజ్ఞతను చూపించడానికి ప్రతిదీ చేసావు. నువ్వు ఎంత ప్రత్యేకమో నీకు తెలియదు. నువ్వు అత్యంత నిస్వార్థురాలివి. నువ్వు అతనికి అవసరమైన మందులు కొనడానికి చాలా కష్టపడుతున్నావు. నాకు తెలుసు - నువ్వు చాలా కష్టపడతావు. అతను లేనప్పుడు, నీ జీవితంలో ఒక పెద్ద ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని ఎవరొచ్చి నింపుతారో ఎవరికి తెలుసు ?"
"కాబట్టి నేను ఒక సరళమైన ప్రతిపాదన చేస్తున్నాను - నువ్వు నీ కాళ్ళ మీద నిలబడటానికి, ఆ రెండేళ్ల ఒప్పందానికి కట్టుబడి ఉందాం. ఆ సమయానికి నాతో ఉండాలా లేదా వెళ్లిపోవాలా అని నీకు తెలుస్తుంది. అయితే, రెండు ఇళ్ల అద్దెలు ఇంకా ఇతర ఖర్చులు చెల్లించడానికి బదులుగా, డబ్బు ఆదా చేయడానికి మనం కలిసి ఉండాలని నేను ప్రతిపాదిస్తున్నాను. నేను నీ ఇంటి అద్దెతో సహా ప్రతిదీ చెల్లిస్తాను. అలాగే చాలా సెలవులు కూడా ఇస్తాను. కానీ నీ జీతం రెండవ సంవత్సరానికి 50,00,000 కి తగ్గుతుంది. నేను నీపై ఇప్పటికీ కోటి ఖర్చు చేస్తాను కాబట్టి నీకు 50,00,000 ఆదా అవుతుంది. ఆ డబ్బుతో నువ్వు ఏమి చేస్తావో నీ ఇష్టం. నీకు నీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మరియు నీ స్వంత జీవితాన్ని ఎంచుకోవడానికి ఆర్థిక వనరులు ఉంటాయి."
తన ముందున్న ఆహారాన్ని తింటూ మౌనంగా ఉండిపోయింది.
"నా గురించి నువ్వేమనుకుంటున్నావు ? ఒక లంజలా నా ? ఒక వేశ్యలా నా ? ఒక ఉంపుడుకత్తెలా నా ? గర్ల్ ఫ్రెండ్ లా నా ? కాబోయే భార్య లా నా ?"
"చాలా సరదాగా ఉండే పొరుగు మనిషి" అని నేను త్వరగా సమాధానమిచ్చి, పరీక్షలో పాస్ అయినట్లు అనుకున్నాను. స్పష్టంగా, నేను మిగిలిన జీవితాన్ని ఆమెతోనే గడపాలని కోరుకున్నాను. మరి ఎవరు కోరుకోరు? ఆమె నాకు దొరకడం అంటే, గాలి నా చేతుల్లోకి లాటరీ టికెట్ను తెచ్చి పడినట్లుగా వుంది. ఈ బంధాన్నితెంచడం చాలా కష్టం. దీన్ని సరిగ్గా ఎలా నిలుపుకోవాలి అని ఆలోచించడం నన్ను ఒత్తిడికి గురిచేసింది. ఆమెను కోల్పోవడం నా వివాహాన్ని కోల్పోవడం కంటే నన్ను ఎక్కువగా నిరాశపరుస్తుంది. నేను ఎత్తైన రెండు కొండలకి తాడు కట్టి, ఆ బిగువైన తాడు మీద నడుస్తూ మా బంధాన్ని బాలన్స్ చేస్తున్నట్లుగా ఉన్నాను.
"నువ్వు నీ కొడుక్కి నన్ను గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు".
"నేను అతన్ని గందరగోళానికి గురి చేయాలని అనుకోలేదు. నేను నీ బాగోగులు పట్టించుకునే వ్యక్తిని. నీ భర్త తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. నా పని నీ బాధలని దూరంగా ఉంచడం. కాబట్టి నేను నీ ప్రత్యేకమైన స్నేహితుడిని అని అనుకుంటాను." నేను నాటకీయంగా ఆగిపోయాను. "షిట్. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తే, నువ్వే నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది."
రాధ నవ్వింది. ఆ నవ్వు నా గుండెని లాగింది.
"అర్జున్, నీకు ఎప్పుడు ఏది మాట్లాడాలో బాగా తెలుసు".
ఆమె అలా అనగానే నేను ఆమెను తప్పుగా నిరూపించాను.
"నేను ఎల్లప్పుడూ కోరుకునే, ఎప్పుడూ పొందని వివాహం నాకు ఇప్పుడు లభించింది. నువ్వే నా భార్య కావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను."
అయ్యో ... ఇది నేను బయటికే అన్నానా ? నేను తప్పు చేశా అని నాకు అర్ధం అయింది. అయితే ఎంత పెద్ద తప్పో నాకు తెలియదు.
"వెయిటర్, మాకు ఇంకా వైన్ కావాలి" అని పెద్దగా అరిచాను.
నేను నా రొయ్యల పాస్తాని తింటూ, ఆమెతో కళ్ళు కలపడానికి భయపడ్డాను. ఆమె నా నుదుటిని చూస్తున్నట్లు నాకు అనిపించింది. నా తండ్రిలా నా జుట్టు ఊడి పోకుండా వున్నందుకు సంతోషించాను. ఆమె నా ప్రతిపాదనను అంగీకరించినప్పటి నుండి మొదటిసారిగా, ఆమె సమక్షంలో నాకు అసౌకర్యంగా అనిపించింది. మేము తింటూ చాలా కొద్దిగా మాట్లాడుకున్నాము. ఇంటికి వెళ్లి ఒకే మంచంలో పడుకున్నా, మొదటి సారి మేము సెక్స్ లో పాల్గొనలేదు. అలా అవడం ఇదే మొదటిసారి. ఆమె నన్ను వెనుకనుండి వాటేసుకుంది. నా ముఖం తనకి చూపించే ధైర్యం నాకు లేదు. నేను దాదాపుగా ఏడ్చే స్థితికి దగ్గరగా వున్నా.
నేను ఏదైనా అమాయకపు మాటలు చెప్పి ఆమెను కోల్పోతే - అది నిజమే అయినా - ఆ నష్టం నన్ను నాశనం చేస్తుంది. సైకో కిల్లర్ ఒక గొడ్డలితో వారిని చంపడానికి వెంబడిస్తున్నప్పుడు హారర్ సినిమాల్లోని ఆ అమాయకపు ఆడపిల్లలు కింద పడిపోతుంటారు. దయచేసి, నన్ను ఆ అమాయకపు ఆడపిల్లల్లో ఒకరిగా చేయవద్దు.
***