Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#11
Episode - 2 

నీలిమ రెండు సూట్ కేసులు తీసుకుని అనుకున్నట్టుగా పొద్దున్నే ఎనిమిదింటికి చేరింది. మను కిందకి వెళ్లి రిసీవ్ చేసుకుంది. సెక్యూరిటీ వాళ్లకి చెప్పి నీలిమకి ఒక రెసిడెంట్ కార్డు తీసుకుంది. దాంతో ఎంట్రీ ఈజీ గా ఉంటుంది. ఎవ్వరు ఆపరు. ఫ్లాట్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఇద్దరు బాల్కనీలో కూర్చున్నారు. నీలిమకి తన రూమ్ బాగా నచ్చింది.   

నీలు: చాలా బావుంది మను ఈ ఫ్లాట్ 

మను: అవును. అందుకే నాకు ఖాళి చెయ్యడం ఇష్టం లేదు. రెండు నెలలు మొత్తం రెంట్ నేనే కట్టాను

నీలు: కొంచం కష్టమే కానీ ఇలాంటి అపార్ట్మెంట్ కోసం పర్లేదులే.

మను: అవును. కాకపోతే డబ్బులు కట్టేప్పుడే ఏడుపొస్తుంది.
ఇద్దరు నవ్వుకున్నారు. 

మను: ఇంకో రూమ్ మేట్ కూడా దొరికేస్తే మనకి ఖర్చులు ఇంకా తగ్గుతాయి.

నీలు: అవును. మన గ్రూప్లో ఇంకా ఎవరన్నా ఉన్నారా? 

మను: మన ఫ్రెండ్స్ లో ఎవరు లేరు. కానీ నీకు మన తార గుర్తుందా? 

నీలు: ఎవరు? ఇంటర్ అవ్వగానే పెళ్లి అయిపోయింది. అదేనా?

మను: అదే. అది ఇప్పుడు అమెరికా లో ఉంది. 

నీలు: ఓకే. 

మను: వాళ్ళ తమ్ముడు గుర్తున్నాడా?

నీలు: వాళ్ళ తమ్ముడా? ఎవరు 

మను: అదేనే, రోజు లంచ్ కి మన క్లాస్ కి వచ్చి కూర్చునే వాడు. 

నీలు: ఆయా, గుర్తొచ్చింది. వాడిని ఎక్కిరించే వాళ్ళము కదా అమ్మాయిలతోనే కూర్చుంటాడు అని.

మను: హా వాడే. వెధవ ఎప్పుడు చూసినా మన క్లాస్ లోనే ఉండేవాడు.

నీలు: అవును. వాడికి భయం కదా. అందుకే ఎప్పుడు అక్క కోసం మన క్లాస్ కి వచ్చేవాడు.

మను: వస్తే వచ్చాడు. కానీ వాళ్ళ అక్క కంటే ఎక్కువ మన వెనకాల తిరిగేవాడు

నీలు: వాడిప్పుడు ఏమి చేస్తున్నాడు

మను: అదే చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా చేస్తున్నాడు అంట. బెంగళూరులో ఏదో ప్రాజెక్ట్ ఉందట. ఇక్కడ కొన్నాళ్లపాటు ఉండటానికి చూస్తున్నాడట 

నీలు: ఓకే.. వాడికి ఫ్రెండ్స్ లేరా?

మను: ఏమోనే. తార ఫోన్ చేసి అడిగింది. నీ ఫ్లాట్ లో ఖాళీ ఉంది కదా.. మా తమ్ముడు అక్కడ ఉండచ్చా అని.

నీలు: మరి నువ్వేమి చెప్పావు.

మను: నేను నో చెప్పలేదు. అలోచించి చెప్తాను అన్నాను

నీలు: మరి ఏమి ఆలోచించావు?

మను: నా ఒక్కదాని నిర్ణయం కాదు కదా. నా రెండో రూమ్ మేట్ కూడా ఒప్పుకోవాలి కదా. అందుకే నిన్ను అడుగుతున్నాను

నీలు: హ్మ్మ్.. నీ ఉద్దేశం చెప్పు.

మను: ఏమోనే. బెంగళూరు లో మనకి రూమ్ మేట్స్ ఈజీగా దొరికేస్తారు. కాకపోతే మన లాగ నీటుగా ఉండి, ఇంటిని ప్రశాంతంగా ఉంచేవారు కావాలి. 

నీలు: అవును. నాకు కూడా అదే ఇంపార్టెంట్. 

మను: ఇప్పటిదాకా చూసినవాళ్లు నాకు నచ్చలేదు. పోనీ ఇంకా వెయిట్ చేద్దామా అంటే మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి.

నీలు: హ్మ్మ్

మను: కానీ అబ్బాయి కదా. వాడి అలవాట్లు ఏంటో మనకి తెలీదు. 

నీలు: ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

మను: ఇక్కడే. ఏదో పీజీ లో ఉంటున్నాడు

నీలు: అయితే వాడిని ఒకసారి వచ్చి ఇల్లు చూడమను. వాడితో మాట్లాడుదాము. వాడికి ముందే చెప్దాము, మా ఓనర్ ఒప్పుకుంటేనే నువ్వు రావచ్చు లేదంటే లేదు అని.

మను: ఓనర్ గాడు ఏమి పట్టించుకోదు. వాడు అమెరికాలో ఉంటాడు. 

నీలు: ఆ విషయం మనకి తెలుసు. వాడికి తెలీదు కదా. 

మను: గుడ్ ఐడియా. రేపే కిరణ్ ని రమ్మంటాను.

*****

మను కిందకి వచ్చి వెయిట్ చేస్తోంది. కిరణ్ వస్తే పైకి తీసుకెళ్లడానికి. అప్పుడే మనుకి కాల్ వచ్చింది. అది కిరణ్ నుంచి.

కిరణ్: హాయ్ అక్క. 

మను: కిరణ్. హాయ్. ఎక్కడున్నావు.

కిరణ్: నేను నువ్వు పంపిన లొకేషన్ కి వచ్చేసాను అక్క. 

మను: అవునా. నేను కిందనే ఉన్నాను. నాకు కనిపించట్లేదు.

కిరణ్: అవునా. నేను ఇక్కడే కార్ లో ఉన్నాను,

మను: ఏ కార్ లో వచ్చావు? 

మను తల తిప్పి చూసింది. అప్పుడే తన కళ్ళకి ఒక బ్లాక్ మహీంద్రా XUV కనిపించింది. 

మను: బ్లాక్ కార్ లో నువ్వేనా? 

కిరణ్: అవునక్క. హా కనిపించావు. పార్కింగ్ ఇక్కడే పెట్టుకొని?

కిరణ్ కి పార్కింగ్ స్పేస్ చూపించింది. వాడు పార్కింగ్ చేసి వచ్చాడు. వాడిని చూసి మను షాక్ అయింది. చిన్నప్పుడు లిల్లీపుట్ లాగా ఉండేవాడు. ఇప్పుడు అయిదు అడుగుల తొమ్మిది అంగుళాలు పొడుగు, మంచి మిలిటరీ హెయిర్ కట్, సన్నగా, బలంగా, ఫిట్గా ఉన్నాడు. 

మను: కిరణ్, ఎలా ఉన్నావు?

కిరణ్: బావున్నాను అక్క. నువ్వెలా ఉన్నావు?

మను: అల్ గుడ్. పద

పైకి వెళ్ళాక నీలు తలుపు తీసి కిరణ్ ని చూసి ఒక్కసారి షాక్ అయింది. పక్కనే ఉన్న మానుని చూసింది. మను కళ్ళతో సైగ చేస్తూ చిన్నగా నవ్వింది.

నీలు: హాయ్ కిరణ్. గుర్తు పట్టవా?

కిరణ్: ఎలా మర్చిపోతాను. నీ వాటర్ బాటిల్ లో నే కదా ఎప్పుడు నీళ్లు తాగే వాడిని.

మను: నా బాక్స్లో అన్నం తినేసేవాడివి.
ముగ్గురు నవ్వుకున్నారు.

వచ్చిన పని ప్రకారం ముందు కిరణ్ రూమ్ చూసాడు. ఇల్లు మొత్తం బాగా నచ్చింది. బెస్ట్ ఏంటి అంటే ముగ్గురికి మూడు వేరే వేరే బాత్రూములు ఉన్నాయి. 

కిరణ్: చాల బావుంది అక్క ఇల్లు.
వచ్చి హాల్ లో కూర్చున్నారు. నీలు జ్యూస్ తీసుకొచ్చింది. 



మను: సో కిరణ్. ఎన్ని రోజులైంది బెంగళూరు వచ్చి? ఏమి చేస్తున్నావు?



కిరణ్: నేను రెండ్లు నెలలు అయిందక్కా వచ్చి. ఇక్కడే ఒక రెండు చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి కోసం వచ్చాను. ఇప్పుడు బెంగళూరు లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళతో కాంట్రాక్టు కుదిరింది. అది ఒక రెండేళ్ల ప్రాజెక్ట్. అందుకే. మంచి ప్లేస్ కోసం చూస్తున్నాను.

నీలు: ఏమి ప్రాజెక్ట్?

కిరణ్: నేను ఒక 3D మోడలింగ్ చేసే కంపెనీకి పని చేస్తాను.

కిరణ్ తన పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. నీలు మను లకి చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. 

నీలు: ఫ్రీలాన్సర్ గా చేస్తున్నావు అని విన్నాను.

కిరణ్: అవునక్క. నేను పార్ట్ టైం ఫోటోగ్రాఫర్. వెడ్డింగ్, ట్రావెల్, ఈవెంట్స్ అన్ని చేస్తాను. 

మను: అయితే మల్టీ-టాలెంటెడ్ అన్నమాట

కిరణ్ (సిగ్గు పడుతూ): ఏదో అక్క. ఫుల్ టైం జాబ్ నాకు వేస్ట్ అనిపిస్తుంది. అంటే నేను సూట్ అవ్వను. అందుకే, నాకు కావలసిన పనులు చేస్తాను, కావలసినప్పుడు హాలిడే తీసుకుంటాను.

మను: వెరీ నైస్. 

కిరణ్: అన్నట్టు, కార్ పార్కింగ్ ఉంది కదా?

మను: రెండు స్లొట్స్ఉన్నాయి. ఒకదాంట్లో నా బైక్ ఉంది. రెండు కార్లు పెట్టుకోవచ్చు.  

నీలు: నీ డే ఎలా ఉంటుంది?

కిరణ్: పొద్దున్న పదింటికి లేస్తాను. జిం కి వెళ్తాను. తరువాత ఫ్రెష్ అయ్యి తినేసి 
పన్నెండింటికి నా పని మొదలవుతుంది. ఫీల్డ్ పని ఉంటె బయటకి వెళ్ళాలి. లేదంటే ఇంట్లో నుంచే. రాత్రి పన్నెండు అవుతుంది పని అయ్యేసరికి. నేను పడుకునే సరికి పొద్దున్న నాలుగు అవుతుంది.

మను: సూపర్. మాకు కూడా హైబ్రిడ్. వారానికి మూడురోజులు ఇంట్లోనే. సరే కిరణ్. చూసావు కదా. ఇది ఫ్లాట్. ఓనెర్కి చెప్తాను. వాళ్ళు ఊపుకుంటే నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు. 

కిరణ్: ఒకే అక్క. నేను ఇప్పుడు బయల్దేరుతాను.  

మను: సరే కిరణ్. బై

కిరణ్ వెళ్ళిపోయాడు.

మను: హ్మ్మ్ ఏమంటావ్?

నీలు: వీడు ఇంతే ఇంత పెద్ద అయిపోయాడు. అసలు లిల్లీపుట్ గాడు వీడేనా?

మను: అవును హంక్ లాగా అయ్యాడు.

నీలు: నాకు అయితే బాయ్ఫ్రెండ్ లేడు. మా ఇంట్లోవాళ్ళు ఇక్కడికి రారు. కాబట్టి నాకు అబ్బాయి ఫ్లాట్ మేట అయినా నాకు ఇబ్బంది లేదు.

మను: మా ఇంట్లో వాళ్ళు కూడా రారు. వచ్చిన బ్రాడ్ మైండెడ్ లే. అర్థం చేసుకుంటారు. 

నీలు: సరే అయితే. ఓనర్ కి కూడా ఒక మాట చెప్పేస్తే బెటర్ ఏమో.

మను: చెప్తాను. సరే అయితే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. లంచ్ తిందాము

మను తన రూమ్ లోకి వెళ్ళింది. తనకి డబ్బుల భారం తగ్గుతుంది అని కాస్త సంతృప్తి చెందింది.

నీలు తన రూమ్ లోకి వెళ్ళింది. బట్టలు అన్ని వార్డ్రోబ్ లో సద్దేసుకుంది. స్నానంకి వెళ్ళాలి అని బట్టలు తీసుకుంది. కానీ మనసులో ఒక చిన్న అనుమానం. అసలు ఈ వచ్చింది నిజంగా చిన్నప్పటి ఫ్రెండ్ తమ్ముడు లిల్లీపుట్ ఏ నా? లేక మను ఏమన్నా డ్రామా ఆడి తనకి కావాల్సిన అబ్బాయిని ఇంట్లోకి తెస్తోందా? ఏది ఏమైనా, చూద్దాము. తనకి ఇబ్బంది కలగనంత వరకు ఎవరు ఏమి చేసుకున్నా తనకి అనవసరం అనుకుంది.

కిరణ్ తన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 

ఇంకా ఉంది 
[+] 13 users Like JustRandom's post
Like Reply


Messages In This Thread
RE: ఓ చిన్ని ముద్దు - by JustRandom - 08-03-2025, 03:18 PM



Users browsing this thread: 6 Guest(s)