Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#87
పరవశంతో దీప్తి నవ్వుతూ తలను ప్రక్కకు త్రిప్పుకొంది.
వాణి ఉభయుల ముఖ భంగిమలను గమనించింది. ఆమెకు నాలుగేళ్ళ క్రిందటి తన కళ్యాణ్ ప్రేమకలాపం గుర్తుకు వచ్చింది. ఆనందంతో నవ్వుంది.
మధ్యాహ్న భోజనానికి కావలసిన వంటకాలను లావణ్య తయారుచేసింది. దీప్తి, శార్వరీలు ఆమెకు సహాయకులుగా వర్తించారు. భోజన సమయంలో.. కళ్యాణ్ తండ్రి తన చేతికి ఇచ్చిన మామిడి ఊరగాయల బాటిల్స్ ను డైనింగ్ టేబుల్ పైన వుంచి..



"అన్నయ్యగారూ!.. బాబాయ్ గారూ ఊరగాయలను నాతో మీకోసం పంపారు వేసుకోండి" ప్రీతిగా చెప్పింది దీప్తి.
ఆమె కలుగోలుపుతనానికి కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు.
"నీ చేత్తోనే అందరికీ వడ్డించమ్మా!" అన్నాడు కళ్యాణ్.



అందరికీ వడ్డించి చివరగా ఈశ్వర్ను సమీపించింది.
"బావా!.. మీకు.."
"వెయ్యి దీపు!"



దీపు అన్న ఈశ్వర్ పదాన్ని విన్న వాణి ఇరువురి ముఖాల్లోకి పరీక్షగా చూచింది. ఆమెకున్న అనుమానం తీరిపోయింది. సరదా సంభాషణలతో అందరూ ఆనందంగా భోజనం చేశారు.
రాత్రి భోజనానంతరం.. లావణ్య, వాణి గదిలో, దీప్తి శార్వరీ మరో గదిలో, కళ్యాణ్ ఈశ్వర్ మూడవ గదిలో హరికృష్ణ హాల్లో పడుకొన్నారు.



తల్లీ, కూతురు గతాన్ని గురించి, ప్రస్తుతంలో తమ రెండు కుటుంబాల మధ్యన వున్న భావాలను గురించి, ప్రజాపతి, ప్రణవి, దీప్తి, సీతాపతుల అభిప్రాయాలను గురించి, దీప్తి, సీతాపతుల పట్ల తనకు తన భర్తకు వున్న నమ్మకాన్ని గురించి, దీప్తికి ఈశ్వర్పైన, సీతాపతికి శార్వరి పైన ఉన్న ప్రేమాభిమానాలను గురించి వివరంగా మాట్లాడుకొన్నారు.



అంతా విన్న వాణి "అమ్మా!.. నేడు నా జీవితంలో గొప్ప పర్వదినం. నాలుగేళ్ల తర్వాత నీ ప్రక్కన పడుకొని నీ చేతిని నాపైన వేసికొని నా చిన్ననాటిలా.. నీ మాటలను వినే అవకాశాన్ని నాకు సర్వేశ్వరుడు కల్పించాడు. నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా మనస్సుకు శాంతిగా వుందమ్మా!" తన తలను తల్లి ఎదకు ఆనించి ఆమె వీపుపై చేయి వేసి చిన్నపిల్లలా మారిపోయింది వాణి. కూతురి తలను తన హృదయానికి ప్రేమతో హత్తుకొంది లావణ్య. "పండంటి మగబిడ్డకు తల్లివి అవుతావమ్మా" మనసారా దీవించింది.
"అమ్మా! మాట అడగనా!.."
"అడుగు తల్లీ!.."



"నాకు మన ఇంటికి రావాలని ఉందమ్మా!"
"నీ కాన్పు మన ఇంట్లోనే జరుగుతుందమ్మా! ఎవరు ఏమనుకున్నా నేనూ, మీ నాన్న లెక్కచేయము. ఇది మా స్వవిషయం. ఇందులో జోక్యం కల్పించుకొనే హక్కు ఎవరికీ లేదు. నీ కోర్కె తప్పక తీరుతుందమ్మా. నిశ్చింతగా వుండు" ఎంతో ప్రీతిగా చెప్పింది లావణ్య.



"అమ్మా మరో మాట!.."
"ఈశ్వర్, దీప్తిలు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారమ్మా విషయం వారిని చూచిన తొలిగంటలోనే నాకు అర్థం అయింది. వారిరువురికి వివాహం జరిపిస్తే బాగుంటుందమ్మా!"



"నీవు గ్రహించింది నిజం. మీ అత్తయ్య ప్రణవి నిర్ణయమూ అదే. ఈశ్వర్, దీప్తీల వివాహం త్వరలో తప్పక జరుగుతుంది. అంతేకాదు నాకు కాబోయే అల్లుడు నా మేనల్లుడు సీతాపతే. వాడికి శార్వరి అంటే ఎంతో ఇష్టం. మన కుటుంబ సభ్యులందరి మీదా వాడికి ఎంతో గౌరవం. మంచి మనస్సు వున్న వారికి కొంత ఆలస్యం అయినా, వారి మంచి సంకల్పాలు తీరుతాయమ్మా! పొద్దుపోయింది నిద్రపో!" తన మనస్సులోని అన్ని విషయాలను పెద్ద కూతురితో వివరంగా చెప్పింది లావణ్య.



నాలుగేళ్ల తర్వాత తల్లితో.. ఆనాటి ప్రేమాభిమానాలను చూచి వాణి సంతోషంతో కళ్ళు మూసుకొంది.
ఒకే మంచంపై పడుకొన్న కళ్యాణ్, ఈశ్వర్లు మంచి స్నేహితుల్లా ఉద్యోగాల గురించి, భవిష్యత్ జీవితానికి సంబంధించి వారి మనసుల్లో వున్న అభిప్రాయాలను గురించి మాట్లాడుకొన్నారు.



"బావా!.. అన్నయ్య దినకర్ అమెరికా నుండి రాడు. ఒకవేళ.. రావాలనుకొన్నా అతని నిర్ణయాన్ని వదిన అంగీకరించదు. వారి ఇద్దరు పిల్లలు పుట్టింది అక్కడనే. అమ్మా నాన్నలు మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలతో పెంచారు. మేము కోరిన రీతిగా చదివించారు. వారు మాపట్ల చేయవలసిన ధర్మాన్ని చక్కగా పాటించారు. రోజురోజుకు వారికి వయస్సు పెరుగుతూ వుంది. అన్నయ్య వదినల తత్వం వారికి ఎంతో బాధాకరం. కారణంగానే నేను వారితోటే వుండాలని నిర్ణయించుకొన్నాను. వారి ఆనందమే నా ఆనందం. వారి సంతోషం కోసం.. వారి తనయుడిగా నేను ఏమైనా చేసేదానికి సంసిద్ధం. అదే వారిపట్ల నా ధర్మం" ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్.



"ఈశ్వర్!.. మీ అక్కయ్య నాతో ఎన్నోసార్లు చెప్పింది నీ మంచితనాన్ని గురించి. తల్లితండ్రుల ఆనందం కోసం నీవు తీసికొన్న నిర్ణయాన్ని గురించి. అప్పట్లో మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. కానీ.. నేడు నిన్ను చూశాక.. నీ మాటలను విన్నా తర్వాత.. నీ నుండి నేను కొంత నేర్చుకొన్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ ఈశ్వర్. నేను మరచిన ధర్మాన్ని నాకు గుర్తుచేశావు" కాస్త ఆవేశంగానే చెప్పాడు కళ్యాణ్.



కొన్నిక్షణాల తర్వాత మంచం నుంచి లేచి హాల్లోకి నడిచాడు. కళ్ళు మూసుకొని వున్న హరికృష్ణను పరీక్షగా చూచి దుప్పటిని కాళ్ళవరకూ సవరించి గదిలోనికి వెళ్ళిపోయాడు కళ్యాణ్.
మంచంపై పడుకొని పైన తిరుగుతున్న ఫ్యాన్ను తదేకంగా చూస్తూవుంది దీప్తి. దాదాపు పదినిముషాలుగా మౌనంగా వున్న దీప్తిని చూచి శార్వరి..
"వదినా!.."



దిగాలుపడి శార్వరి ముఖంలోకి చూచింది దీప్తి.
" విషయాని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్. నాతో చెప్పవా నేనేదైనా సాయం చేయగలనేమో!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 10:07 AM



Users browsing this thread: 1 Guest(s)