Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#85
"తల్లీ వాణీ!.. నీవు ఒట్టి మనిషివి కాదురా!.. ఏడవకు, పదమ్మా!" లావణ్య వాణి భుజంపై చేయి వేసింది. ఇరువురూ టాక్సీని సమీపించారు. కళ్యాణ్ వెనుక డోర్ను తెరిచారు. ఇరువురూ లోన కూర్చున్నారు.



కళ్యాణ్ ఈశ్వర్ను సమీపించి "ఈశ్వర్! మీరు మామయ్యగారు, శార్వరి, దీప్తి టాక్సీలో రండి. డ్రైవర్కు చెప్పాను. అతను మా టాక్సీ వెనకాలే వస్తాడు సరేనా!" 



హరికృష్ణవైపు చూచి.. "మామయ్యగారు!.. మీరు టాక్సీలో కుర్చోండి" ముందువైపు డోర్ తెరిచాడు.
హరికృష్ణ టాక్సీలో కూర్చున్నాడు. మిగతా ముగ్గురూ వెనుక సీట్లో కూర్చున్నారు.



కళ్యాణ్ వెళ్ళి ముందున్న టాక్సీ ముందు సీట్లో కూర్చున్నాడు. రెండూ టాక్సీలు ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరాయి.
"అమ్మా వాణీ!" కూతురు ముఖంలోకి చూచింది లావణ్య.
"ఏమ్మా!.."



"నీ ఆరోగ్యం బాగుంది కదా! లేడీ డాక్టర్ను కలిశావా!"
"ఇప్పటికి మూడుసార్లు కలిశానమ్మా! అంతా సవ్యంగా వుందని చెప్పింది."



"ఇప్పుడు ఎన్నోనెల!"
"ఐదవ నెలమ్మా!"



లావణ్య కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళనుండి కారిన కన్నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి.
వాణి తల్లి ముఖంలోకి చూచింది. నా గురించి నా తల్లి బాధపడుతూ వుంది. వారికి చెప్పకుండా నేను తీసుకొన్న నిర్ణయం వారి దృష్టిలో, అందరి దృష్టిలో కూడా తప్పే.. మూడేళ్ళ తర్వాత ఈనాడు వీరినందరినీ ఇలా కలుస్తానని నేను ఏనాడూ వూహించలేదు. వీరంతా కలిసి వచ్చారంటే నా తప్పును ఒప్పుగా స్వీకరించి.. నన్ను క్షమించారన్నమాట. నా జీవితంలో ఈరోజు ఎంతో సుదినం. దేవుడు దయామయుడు. నా కోర్కెను తీర్చాడు అనుకొంది వాణి. కొన్ని క్షణాల తర్వాత..
"అమ్మా!.."



"ఏం తల్లీ!.."



"దీప్తి అమెరికా నుండి ఎప్పుడు వచ్చిందమ్మా!"



"మూడు నెలలు అయింది."



"దీప్తి మీతో ఎలా రాగలిగిందమ్మా!.. మామయ్య ఒప్పుకున్నాడా!.."



"వాడా!.. ఒప్పుకోవడమా!" విరక్తిగా నవ్వింది లావణ్య. "వాడి హృదయం నిండా మాపై పగ, కక్ష. వాడు తప్పుచేసి మమ్మల్ని విరోధులుగా భావిస్తున్నాడు" విచారంగా చెప్పింది లావణ్య.



దీనికంతటికి కారణం నేనే కదా! అనుకొని విచారంగా తలను దించుకొంది వాణి.
తనమాటలు.. వాణి హృదయానికి బాధ కలిగించాయనై గ్రహించిన లావణ్య.
"వాడు తప్ప.. ఇంటివారు నా వదిన, దీప్తి, సీతాపతి అందరూ ఎంతో మంచివారు. ఈనాడు మేము ఇలా వచ్చేదానికి కారణం సీతాపతి, దీప్తి. నా మేనల్లుడు, మేనకోడలు."



"సీతాపతి బాగా ఎదిగిపోయి వుంటాడుగా. ఏం చేస్తున్నాడమ్మా!"



"వైజాగ్లో బి.టెక్ చదువుతున్నాడు. వాడు చాలా మంచివాడు. చిన్న వయస్సులోనే వాడికి మీ తాతయ్యలా గొప్ప వ్యక్తిత్వం, ఎంతో బంధుప్రీతి" ఆనందంగా చెప్పింది లావణ్య.



శార్వరికి, సీతాపతికి వయస్సులో ఎంత వ్యత్యాసమమ్మా!" అడిగింది వాణి.



"ఒకటిన్నర సంవత్సరం.. అవును ఇప్పుడు వారి వయస్సును గురించి ఎందుకు అడిగావు?" చిరునవ్వుతో అడిగింది లావణ్య.
వాణి తల్లి ముఖంలోకి చూచింది. కొన్నిక్షణాలు తర్వాత.. "నా మూలంగా విడిపోయిన మన రెండు కుటుంబాలు, బాంధవ్యాలను కలుపుకొని అందరూ పూర్వంలా ఆనందంగా వుండాలనేది నా కోర్కె" నవ్వుతూ చెప్పింది వాణి.



"నీ కోర్కె.. నా, మీ నాన్నగారి అభిప్రాయం. కానీ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా వుందో మనకు తెలియదు కదా!" సాలోచనగా చెప్పింది లావణ్య.
మౌనంగా కూర్చొని వున్న కళ్యాణ్ వైపు చూచింది లావణ్య.
"అల్లుడుగారూ!.. మా సంభాషణ మీకు!.." లావణ్య పూర్తి చేయకమునుపే..



"వినేదానికి చాలా ఆనందంగా వుంది అత్తయ్యగారూ!.. మీ మామగారి మనస్తత్వాలను గురించి వాణి నాకు చెప్పింది. మేము మిమ్మల్ని తలచుకోని రోజంటూ లేదంటే మీరు నమ్మగలరా!" చిరునవ్వుతో చెప్పాడు కళ్యాణ్.



లావణ్య నవ్వుతూ అల్లుడు కూతురి ముఖాల్లోకి చూచింది. ఈడు జోడు బాగుంది. నా అల్లుడు మంచి అందగాడు అనుకొంది.



వెనుక సీటు విశాలంగా లేని కారణంగా ఈశ్వర్ ఎడమవైపు డోర్ వైపున ముడుచుకొని కూర్చున్నాడు. మధ్యన విమానంలో లాగే దీప్తి. రోడ్డు మిట్టపల్లాల్లో దీప్తి చేయి తన చేతికి తగలడం.. నడుముకు క్రింది భాగం.. ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడం, ఈశ్వర్కు ఇబ్బందిని కలిగించాయి.
"అభీకెతనా దూర్ హై డ్రైవర్ సాబ్!" అడిగాడు ఈశ్వర్.



"బహుత్ దూర్ హై సాబ్!" అన్నాడు డ్రైవర్.
ఓరకంట తనను దీప్తి చూచే చూపులు ఈశ్వర్లోని సహనానికి భంగం కలిగిస్తున్నాయి.
"బహూత్ మీన్స్.. కెతిన్ కిలోమీటర్!" అసహనంగా అడిగాడు ఈశ్వర్.



"ఖరీబ్ దస్ కిలోమీటర్!" చెప్పాడు డ్రైవర్.
"అభీ దస్ కిలోమీటర్!.." ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.



"హా జీ!.."
"బావా!.." దీర్ఘం తీస్తూ పిలిచింది దీప్తి.
"ఏమిటి?.." అసహనంగా అడిగాడు ఈశ్వర్.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:55 AM



Users browsing this thread: 1 Guest(s)