Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#83
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 15

రైలుబండి చెన్నై వైపు పరుగు లంఘించింది. వారి ప్రయాణం ఢిల్లీకి. చెన్నై నుంచి విమాన పయనం.
వదినా మరదలు అయిన దీప్తి, శార్వరీలు ఎంతో సరదాగా మాట్లాడుకోసాగారు. వారి అన్యోన్యత మాటలను విని హరికృష్ణ, లావణ్యలు ఒకరినొకరు చూచుకొని ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.
శార్వరీతో మాట్లాడుతూనే దీప్తి, ఈశ్వర్ను క్రీకంట గమనిస్తూనే వుంది.



చేతన్ భగత్ వ్రాసిన వన్ ఇండియన్ గర్ల్ ఇంగ్లీషు నవలను ఈశ్వర్ చదువుతున్నాడు. మధ్య మధ్యన దీప్తి నవ్వును.. మాటలను విని పుస్తకం చాటునుంచి ఆమె చర్యలను గమనిస్తున్నాడు.
దీప్తి, ఈశ్వర్ నయన సంభాషణను హరికృష్ణ, లావణ్యలు గమనించారు. వారి పెదవులపై చిరునవ్వు. మనస్సున ఆనందం. రైలు చెన్నై చేరింది. ఈశ్వర్ స్నేహితుడు మురుగన్ పంపిన టవేరా కారు డ్రైవర్, వారిని ఎయిర్ పోర్టుకు చేర్చాడు. డ్రైవర్కు ఈశ్వర్ ఐదువందలు ఇచ్చాడు. అతను వద్దుసార్ అన్నాడు. బలవంతంగా అతని జేబులో పెట్టాడు ఈశ్వర్. అతని చర్యకు దీప్తికి ఎంతో ఆనందం.



"అత్తయ్యా!.. ఎవరి ఋణాన్ని మనం వుంచుకోకూడదు కదూ!"



"ఆఁ.. ఆఁ.. అవును పద" అంది లావణ్య.



లగేజీని ట్రాలీలో సర్దేదానికి ఈశ్వర్కు దీప్తి, శార్వరీ సాయం చేశారు.
ఒక ట్రాలీని ఈశ్వర్ మరో ట్రాలీని దీప్తి తీసుకొని ఎంట్రీ సెక్యూరిటీ చెక్ ముగించుకొని.. బోర్డింగ్ కార్డులను తీసుకొని.. ఏరో బ్రిడ్జి ద్వారా స్పెయిన్ జెట్ బోయింగ్లో ప్రవేశించారు. రోలో డి సీటు శార్వరికి, సీటు ఈశ్వర్కు, ఎఫ్ సీటు దీప్తికి.
"అన్నయ్యా!.. నేను కిటికీవైపు కూర్చుంటాను" అంది శార్వరి.



"అలాగే అమ్మా!.. కూర్చో!"



"అది నా సీటు.." అంది దీప్తి.



"చిన్నపిల్ల శారూ కూర్చుంటానన్నది కదా!.." ప్రశ్నార్థకంగా దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.



"మరి నేనెక్కడ?"



"శారూ ప్రక్కన కూర్చో!"



"మరి మీరు!.."



"అన్నయ్య నీ ప్రక్కనే కదా కూర్చోవాలి వదినా! మూడు సీట్లు మనవేగా!"



"ఓహో!.. అలాగా సరే!" అమాయకంగా ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అంది దీప్తి.



ముగ్గురూ కూర్చున్నారు. వారి వెనుక సీట్లో కిటికీ వైపు లావణ్య, ప్రక్కన హరికృష్ణ, అతని ప్రక్కన గిరిదాదాడీవాలా కూర్చున్నారు. బెల్ట్ పెట్టుకోమనే సందేశం. పైలెట్ పేరు, సహాయకుని పేరు, ఎయిర్ హోసెస్ట్ పేర్లు, వూర్లు వివరణం- సీనియర్ ఎయిర్ హోసెస్ట్ తొలుత హిందీలో, తర్వాత ఆంగ్లంలో తెలియజేసింది.



జూనియర్ ఎయిర్ హోసెస్ట్, బెల్టు పెట్టుకొనే విధానాన్ని, విమానంలో ఆక్సిజన్ కొరవడినప్పుడు లగేజ్ కేజ్ బాటమ్ నుంచి క్రిందికి జారే ఆక్సిజన్ మాస్క్ వివరాలను, ప్రమాదవశాత్తు విమానం నీటిపై దిగవలసి వచ్చినప్పుడు సీటు క్రింద వున్న రక్షా జాకెట్ను విధంగా ఉపయోగించాలనే విధానాన్ని, ఆయా పరికరములను చూపుతూ, ప్రసారానుసారంగా అభినయం చేసింది. చివరగా రెండున్నర గంటలలో విమానం ఢిల్లీ చేరగలదని చెప్పి, ప్రసంగాన్ని ముగించింది సీనియర్ ఎయిర్ హోసెస్ట్.



విమానం రన్వేలో ప్రవేశించి.. నేల విడిచి ఆకాశంలోకి ఎగిరింది. కొద్ది నిముషాల్లో ముఫ్ఫై వేల అడుగుల ఎత్తున విను వీధిలో.. దేశంలో ఉత్తరపు వైపున వున్న ఢిల్లీ వైపుకు గంటకు ఎనిమిది వందల మైళ్ళ వేగంతో ముందుకు సాగింది.



నవల వన్ ఇండియన్ గర్ల్ చదువుతున్నాడు ఈశ్వర్. శార్వరీ కొంతసేఫు కిటికీ గుండా కనిపించే దూదిపింజల్లాంటి తెల్లని మేఘాలను చూచి తలను దీప్తి వైపు త్రిప్పింది.



దీప్తి స్పైస్ జెట్ మంత్లీ మ్యాగజైన్ చదువుతూ ఉంది. మధ్యమధ్యనా ఈశ్వర్ ముఖంలోకి చూచేది.
అతను ఎంతో ఏకాగ్రతతో నవలను చదువుతున్నాడు.



"వదినా!.. నాకు రోజు ఎంతో ఆనందంగా వుంది!" నవ్వుతూ చెప్పింది శార్వరి.



"ఎందుకు?"



"మనమంతా కలిసి విమానంలో వాణి అక్కయ్యను చూచేటందుకు ఢిల్లీకి వెళుతున్నందుకు.."



"అవును శారూ!.. నాకూ చాలా సంతోషంగా వుంది. బావా! మరి మీకు" ఈశ్వర్ చేతిపై తట్టి అడిగింది.
దీప్తి చేతి తాకిడికి.. ఈశ్వర్ చేతినుండి నవల క్రిందికి జారింది. దీప్తి క్రింద పడబోయిన నవలను తన చేతుల్లోకి తీసుకొంది.



నవ్వుతూ "సారీ బావా!" అంది.



చిరుకోపంతో దీప్తి ముఖంలోకి చూచిన ఈశ్వర్ ఆమె ముఖ భంగిమను చూచాడు. అప్రయత్నంగా అతని పెదవులపైన చిరునవ్వు.



"కావాలనే అంతా చేశావు కదూ!" మెల్లగా అడిగాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:52 AM



Users browsing this thread: