Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#2
Episode - 1

బెంగళూరు లోని ఎలెస్ట్రానిక్ సిటీ లో ఎక్ష్ప్రెస్స్ వే పక్క ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. అందులో ఇరవయ్యో ఫ్లోర్ లో రోడ్ వైపుకి ఉన్న 3BHK కార్నెర్ ఫ్లాట్ లో ఉంటోంది మను. ఇంకో ఇద్దరు రూమ్ మేట్స్ తో పాటు రెండేళ్ల నుంచి అక్కడే ఉంటోంది. ముగ్గురు అమ్మాయిలు రెంట్ కి ఉన్నప్పటికీ కాంట్రాక్టు మను పేరు మీదనే ఉంది. 

ఆఫీస్ కి దెగ్గర, అన్నిటికి దెగ్గర అవ్వడంతో తాను అక్కడే ఇల్లు కొనుక్కోవాలి అనే ఆలోచనలో కూడా ఉంది. దానికి కావాల్సిన డబ్బులు కూడా దాచుకుంటోంది. 
అయితే, తన రూమ్ మేట్స్ ఇద్దరికీ పెళ్లి కుదరడంతో వాళ్ళు ఖాళి చేయడానికి నోటీసు ఇచ్చారు. అంటే నెలకి మొత్తం అయ్యే అద్దె అరవయి వేలు తానే కట్టే పరిస్థితి వచ్చింది. నెలకి రెండు లక్షలు సంపాదించే మనుకి అరవయి వేలు పెట్టె స్తోమత ఉంది. కానీ అద్దెకి అంత ఇవ్వాలా అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ పెట్టింది. రెండు రూమ్ లు ఖాళీగా ఉన్నాయి, ఇద్దరు అమ్మాయిలు రావచ్చు అని. రెండు నెలలు గడిచాయి, ఎంతో మంది వచ్చి చూసారు కానీ మను కి వారు నచ్చలేదు. అందుకని తాను రిజెక్ట్ చేసింది. 

ఇంకా మూడో నెల కూడా అలానే కట్టాలి అని అనుకుంటున్నా సమయంలో తన చిన్న నాటి స్నేహితురాలు అయిన నీలిమ నుంచి మెసేజ్ వచ్చింది. నీలిమ మెసేజ్ చూసి వెంటనే తనకి కాల్ చేసింది మను.

మను: నీలిమ, ఎలా ఉన్నావు?

నీలు: బాగున్నాను మను. అసలు ఎన్ని ఏళ్ళు అయిపోయిందే

మను: అవును. టెన్త్ క్లాస్ తరువాత మల్లి ఇప్పుడు అంటే పదేళ్లు దాటింది.

నీలు: అవును. ఎలా ఉన్నావు ఏంటి విషయాలు.

మను: ఏమున్నాయే. అంత నార్మల్. నువ్వు చెప్పు. బెంగళూరు వచ్చేశావా?

నీలు: లేదే. నెక్స్ట్ మొంత్ ఒకటో తారీకు జాయినింగ్. ఇంకా పది రోజులు ఉంది. 
అందుకే ఉంటానికి పీజీ చూస్తుంటే మన కాలేజ్ గ్రూప్ లో నీ మెసేజ్ చూసాను. 

మను: సూపర్. నీ ఆఫీస్ కూడా నా ఆఫీస్ పక్కనే. ఇంటి నుంచి దెగ్గర కూడా.

నీలు: అవును. మప్స్ లో చూశాను.

మను అన్ని వివరాలు చెప్పింది. నీలు అన్ని విని వీడియో కాల్ లో ఇల్లు కూడా చూసింది. ఇద్దరు ఫైనాన్సియల్ వివరాలలో అన్ని కూడా ఒక ఒప్పందానికి వచ్చారు.

మను: సరేనే. నువ్వు డైరెక్ట్ గా వచ్చేయి. రూమ్ అంత రెడీ. సమన్లు నీ ఇష్టం. పరుపు కావాలంటే పరుపు. మంచం అంటే మంచము. అన్ని నీ ఇష్టం. 

నీలు: ఓకే. ఈ వీకెండ్ దిగుతాను. బై మను.

ఫోన్ పెట్టేశాక మను వెళ్లి ఒక రూమ్ అంత చూసింది. అన్ని బాగున్నాయి. ఒకసారి నీలు వచ్చే ముందురోజు పని అమ్మాయితో క్లీన్ చేయించాలి అనుకుంది. ఖర్చులు కాస్త తగ్గుతాయి అని సంతోషించింది. ఇంకో రూమ్ మెట్ కూడా త్వరగా దొరికేస్తే ఖర్చులు ఇంకా తగ్గుతాయి. అప్పుడు ఇంకో రెండేళ్లలో ఇంటికి కావాల్సిన డౌన్ పేమెంట్ రెడీ అయిపోతుంది అనుకుని వేడి వేడి కాఫీ తీసుకుని వెళ్లి ఒక బాల్కనీలో కూర్చుని ఎక్ష్ప్రెస్స్ వే మీద వెళ్లే ట్రాఫిక్ ని చూస్తూ చీకట్లో చల్ల గాలి ఆస్వాదిస్తూ కూర్చుంది. 

ఇంకా ఉంది   
Like Reply


Messages In This Thread
RE: ఓ చిన్ని ముద్దు - by JustRandom - 07-03-2025, 07:45 PM



Users browsing this thread: 1 Guest(s)