Thread Rating:
  • 4 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా నువ్వు నీ నేను - Update on 7-Mar
#24
నేనెంతో కస్టపడి రాసుకున్న లవ్ లెటర్ ని విసుగ్గా లాక్కొని నాలుగు ముక్కలు చేసి నా మొహాన కొట్టి వెళ్ళిపోతోంది. తను కోపంలో కూడా నా కంటికి అందంగా కనపడుతోంది.

అసలు నేను నా హప్పినెస్స్ కోసం ఇంత చేసానంటే పదేళ్ల క్రితం ఇంకెంత హ్యాపీ గా ఉండే వాడినో మీకు చెప్పాలి. నా ఆనందమైన లవ్ స్టోరీ మీకు చెప్పాలి.



కరెక్ట్ గా 18 ఏళ్ళ క్రితం ఎంసెట్ ఎక్సమ్ రాసి రిజల్ట్స్ వచ్చేలోపు కాస్త ఎంజాయ్ చేద్దామని వైజాగ్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళా.

దీప్తి వాళ్ళు వాళ్ళ పక్కింట్లో ఉండేవాళ్ళు. మా మరదలు లక్ష్మి తను క్లాస్మేట్స్.

పొద్దున్న ఊళ్ళో దిగినప్పటి నుంచి సాయంత్రం వరకు నాతొ కబుర్లు చెప్పిన నా మరదలు సాయంత్రం కాగానే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అంటూ వెళ్ళిపోయింది.. నాలుగు గంటలు గడిచిన తర్వాత అత్త కేకలు వేస్తె తప్ప ఇల్లు కనపడలేదు దానికి.

బావ ఉండగా కూడా కొంపలు పట్టుకు తిరిగితే వాడికేం తోస్తుంది ఇక్కడ అని. నేను కూడా అవును అన్నట్టు దీనంగా మొహం పెట్టా.

సారీ బావ. మా ఫ్రెండ్ పుట్టినరోజని ఇంట్లో డెకరేట్ చేస్తుంటే హెల్ప్ చేస్తూ ఉండిపోయా..

ఈలోపు అత్త మరి తింటావా కేక్ లతోనే కడుపు నిండిపోయిందా అంది మధ్యలో.

లేదమ్మా నైట్ 12  కి కట్ చేస్తారు కేక్. తినేసి రమ్మంది నన్ను..

అర్ధ రాత్రుళ్ళు దాక ఊరి మీద తిరిగితే చంపుతా..

లేదమ్మా బావ కూడా ఉన్నాడుగా తోడుగా. నాకు సాయం ఉంటాడు. ఇలా వెళ్లి అలా వచ్చేస్తాం.. ఓకే నా బావ అంది..

తల అటూ ఇటూ తిప్పడం తప్ప నా ప్రమేయం ఎం లేదక్కడ. కానీ ఎవరో తెలీని వాళ్ళ ఇంటికి వెళ్లి తేరగా కేకులు తినేసి ఎం వస్తాం అనిపించింది.

మళ్ళీ దాని ఎంజాయ్మెంట్ ని నేను ఎందుకులే చెడగొట్టడం అనిపించి ఓకే చెప్పా..

టీవీ చూస్తూ పడుకున్న.. పావుతక్కువ పన్నెండుకి వచ్చి బావ రా వెళ్దాం అంటూ నిద్ర లేపింది..



వేసవి కాలం ఉక్కపోతని దాటుకుంటూ బయటకి రాగానే వైజాగ్ సముద్రపు గాలి నన్నే వెతుక్కుంటూ చల్లగా తాకింది.

మత్తులో మెల్లిగా నడుస్తున్నా.. రా బావా అంటూ పక్కింటి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళింది.. అప్పటికి కాలనీ పిల్లలే ఒక ఆరేడుగురు పోగయ్యారు..

ఆంటీ ఎదురవగానే మా బావ అంటూ పరిచయం చేసింది.. రా బాబూ అంటూ ఆవిడా నన్ను నవ్వుతూ పలకరించింది.. లక్ష్మి నన్ను అక్కడే వదిలేసి అదేదీ అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది..

అందరూ బచ్చాగాళ్లు.. నాకేం తోచక అటు ఇటూ చూసుకుంటూ ఉంటె ఇక్కడ కూర్చో అంటూ వాళ్ళ నాన్న సీట్ చూపించారు..

మొహమాటంగా కూర్చుని 12 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్న.. డెకొరేషన్ బా చేసారు.. ఇల్లంతా బెలూన్స్.. ఈలోపు వాళ్ళ తమ్ముడు కేక్ తెచ్చి ఓపెన్ చేసాడు.

"హ్యాపీ బర్త్డే దీప్తి" అని కేక్ మీద పేరు చూడగానే అప్పుడే ఆ క్షణములోనే తన పేరుతో నే ప్రేమలో పడిపోయా.

టైం అవుతోంది రా అని వాళ్ళ అమ్మ పిలవగానే ఆ వస్తున్నా అంటూ మధురమైన స్వరం. మళ్ళీ వినాలని ఉంటే మాత్రం ఎలా అడగ్గలను. పేరుకి, స్వరానికి మ్యాచ్ అయ్యే మొహం కోసం ఎదురు చూస్తూ ఆ బెడ్ రూమ్ తలుపులని కళ్ళతో లాక్ చేశా.

పింక్ అండ్ గ్రీన్ హాఫ్ సారీ లో చెవులకి కమ్మలు వాటితో పాటు మాటీలు జడకి పూలు వాటితో పాటు జడగంటలు కాళ్ళకి గోరింటాకు వాటితో పాటు గజ్జెలు చేతులకి గాజులు వాటితో పాటు వేళ్ళకి నైల్ పోలిష్ బుగ్గలకి సొట్టలు వాటితో పాటు చిన్నగా మేకప్ నుదుటున బొట్టు దానితో పాటు కళ్ళకి కాటుక.

అమ్మాయ్ అంటే ఈ అమ్మాయే అనిపించేంత వయ్యారంగా సుకుమారంగా మనోహరంగా సొగసుగా ఇంకా నే చెప్పలేనన్ని పరి పరి విధాలుగా పదహారణాల పడుచు పిల్ల వచ్చి కేక్ ముందు నుంచుంది..

వాళ్ళ తమ్ముడు రెడీ 10, 9 అంటూ రివర్స్ లో అంకెలు లెక్కపెడుతుంటే నాకు కూడా టైం వెనక్కి తిప్పి మళ్ళీ మళ్ళీ తన ఎంట్రీ చూడాలని ఉంది. తన మొహం లో ఆనందం తన కళ్ళలో నవ్వు తన చెక్కిళ్ళలో సిగ్గు తన చూపుల్లో ఉత్సాహం మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది.

ప్రస్తుతానికి సెంటర్ అఫ్ అట్రాక్షన్ తనే కాబట్టి నన్నెవరూ పట్టించుకోవట్లేదు కానీ నన్ను కానీ చూస్తే వెంటనే దొరికిపోయేవాణ్ణి ఆ అమ్మాయ్ కి పడిపోయా అని.

ఇంతటి అందమైన ఫ్రెండ్ ని ఫ్రెండ్ గా చేసుకున్న మా మరదలి మీద కూడా అభిమానం పొంగుకొచ్చింది. మా పెళ్ళికి దానికి మంచి చీర గిఫ్ట్ గా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యా.

కేక్ కటింగ్ ఎప్పుడైందో బర్త్డే పాటలు ఎవరు పాడారో కూడా తెలీలేదు. దేవుడి ముందు అగర్బత్తి తిప్పినట్టు మొహం మీద కేక్ తిప్పుతుంటే ఎక్కడో సుదూరంలో చిక్కుకుపోయిన చూపుల్ని దృష్టిని కేక్ తిప్పుతున్న చేతుల మీదకి తెచ్చా.

కేక్ తీసుకో అంటూ దీప్తి పిలుస్తుంటే తన కళ్ళనే చూస్తూ ఉండిపోయా. లక్ష్మి వచ్చి బావా కేక్ తీసుకో అంటూ భుజం గట్టిగా కదిపితే అప్పుడు మళ్ళీ మన లోకంలోకి వచ్చి కేక్ అందుకుంటూ థాంక్స్ అన్నా.

థాంక్స్ కాదు బావ హ్యాపీ బర్త్ డే చెప్పాలి అంది లక్ష్మి. అయ్యో సారీ హ్యాపీ బర్త్డే అంటూ చెయ్యి ముందుకు పోనిచ్చా. థాంక్స్ అంటూ నా చేతిని అందుకొని రెండు షేకులు ఇవ్వగానే వొళ్ళంతా కరెంటు పాస్సయ్యింది.

ప్రియురాలి మొదటి చేతి స్పర్శ. ఆ ఫీల్ ఏ వేరబ్బా. నాకు మళ్ళీ తనతో ఎప్పుడు మాట్లాడతానా అని ఉంటె లక్ష్మి వచ్చి ఇంక వెళ్దాం బావ అమ్మ తిడుతుంది అంటూ వచ్చింది.

దాని వల్లే దీప్తి ని చూసా అని ఆనందపడాలో ఆ ఆనందాన్ని ఆపేస్తున్నందుకు దాని మీద కోప్పడాలో తెలీని సందిగ్దము బాధ విరహం అన్ని వచ్చాయి ఆ ఒక్క క్షణం లోనే.

ఒక్కసారి తనని మనసారా మళ్ళీ చూసుకొని వెళ్దాం లే అని వెనక్కి తిరిగితే బాయ్ అంటూ నవ్వుతూ చెయ్యి ఊపుతోంది. నాకేనా..ఒకవేళ కాకపోయినా నాకే అనిపించింది.

ఒక్కటి మాత్రం నిజం. తన పేరు చాలు నాకు. తన నవ్వు చాలు నాకు. తన జ్ఞాపకాలు చాలు నాకు.

ఇంటికొచ్చి పడుకున్న అన్నా మాటే గాని నిద్ర పట్టదే.

ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు తనని మళ్ళీ చూస్తానా అంటూ పడుకున్న కానీ నిద్ర పట్టదే. అది మళ్ళీ లేస్తానో లేదో అన్నా భయమో ఒక వేళ ఇది కల ఐతే ఇంత మంచి కల చెదిరిపోతుందన్న అనుమానమో కానీ తనని మర్చిపోలేక తననే తలుచుకుంటూ నాలో నేనే నవ్వుకుంటూ ఏ రాత్రికో నా ప్రమేయం లేకుండానే నిద్రపోయా.



తెల్లవారు ఝామున అలారం మోగింది. అత్త ఇంటి పనులు చేసుకోడానికి పెట్టిందేమో. టైం 4 .30

నిద్ర ఎగిరిపోయింది. అత్త కళ్లపు చల్లి ముగ్గు పెడుతుంటే నేను ఆరుబయటే అది చూస్తూ కూర్చున్నా. ఎరా నిద్ర రావట్లేదా అంటే ఎంసెట్ ఎగ్జామ్స్ కోసం రెండేళ్ల నుంచి పొద్దున్నే లేవడం అలవాటు అత్త అని అప్పటికప్పుడు అల్లిన అబద్ధం చెప్పేశా.

అక్కడే కూర్చున్నా అన్న మాటే కానీ కళ్ళు సెకను కోసారి దీప్తి వాళ్ళ ఇంటి వైపు పోతున్నాయి. నాకోసం ఒక్కసారి బయటకొచ్చి మళ్ళీ వెళ్లి పడుకోవచ్చు కదా.

అత్త ముగ్గు వెయ్యడం అయిపొయింది కానీ నేను ముగ్గులోకి దించాలి అనుకున్న అమ్మాయ్ మాత్రం లేవలేదు

నిరాశగా ఇంట్లోకొచ్చి మళ్ళీ పడుకొన్న. మళ్ళీ లేచేసరికి 7. కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కోసం కూర్చుంటే పక్కింటి డాబా మీద నాకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఫోన్ మాట్లాడుతున్నట్టు అనిపించింది.

అత్త చూడకుండా డాబా మీదకి ఒకటే పరుగు.

వెచ్చటి నీరెండ మొహం మీద పడుతుంటే తన వంటి రంగుని సూర్యుడి నారింజ రంగుతో మిళితం చేస్తూ మొహం మెరిసిపోతోంది. కవులెవరూ ఈ యాంగిల్ చూడలేదేమో. అమ్మాయిల్ని ఎప్పుడూ చంద్రబింబాలతో పోలుస్తారు. నా దీప్తిని చూడాలి. సూర్య బింబంలా వెలిగిపోతోంది.

నేను తననే చూస్తున్న అని అనుకోకూడదని అప్పుడప్పుడు పక్కకి చూస్తూ మళ్ళీ మళ్ళీ తనకేసి చూస్తుంటే చిన్న చిరునవ్వుతో హాయ్ అంటూ నవ్వుతోనే పలకరించింది. ఫోన్ లో చుట్టాలనుకుంటా. హ్యాపీ బర్త్డే చెప్తున్నారనుకుంటా.

ఇంకో నాలుగు నిముషాలు మాట్లాడి లక్ష్మి లేవలేదా అంది.

ఇంకా లేదు అన్న.

ఈరోజు షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాం అంది.

నేను లేపుతాలే అన్న.

థాంక్స్ అంటూ కిందకి వెళ్ళిపోయింది. అంతేనా.. నా పేరు కానీ ఊరు కానీ నా గురించి కానీ ఏమి అక్కర్లేదా. మాట్లాడిందని ఆనందపడనా పట్టించుకోలేదని బాధ పడనా.

కిందకొచ్చి లక్ష్మి ని లేపి కాఫీ తాగి రెడీ అయ్యి కూర్చున్నా. అంతకంటే ఎం చెయ్యాలో నాకూ తెలీలేదు.



10 గంటలు కొట్టే సరికి మెల్లిగా లక్ష్మి అత్త దగ్గరకి వెళ్లి మెల్లిగా కులకడం స్టార్ట్ చేసింది.

ఏంటే అంటే.. అమ్మ అది అంటూ దీర్ఘం తీస్తూ.. దీప్తి షాపింగ్ కి వెళ్దాం రమ్మంది అంది. సరే వెళ్లి రా.. ఎండెక్కకుండా వచ్చెయ్యండి అంది మళ్ళీ జాగ్రత్త చెపుతూ.

అది ఎగురుకుంటూ హాల్ లోకి వచ్చి బావ నువ్వు కూడా వస్తావా అంది. అప్పటికే చకోర పక్షిలా ఎదురు చూస్తున్న నేను అర క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వస్తా అంటూ బైటకొచ్చి చెప్పులు వేసుకు నుంచున్నా.

తర్వాత అనిపించింది నా హడావిడి ఎవరూ గమనించకపోతే బావుండు అని.

లక్ష్మి వెళ్లి దీప్తిని వెంట పెట్టుకొని బయటకి వచ్చింది. అక్కడే ఉన్న నన్ను చూపిస్తూ మా బావ కూడా వస్తాడే అంది.

బావ.. నిన్న రాత్రి పరిచయం చెయ్యడం అవ్వలేదుగా నా బెస్ట్ ఫ్రెండ్ దీప్తి దీపు.. అంటూ తనని నాకు పరిచయం చేసింది

నేను చెయ్యి ముందుకు చాపుతూ హాయ్ అమ్మాయ్ నా పేరు నరేన్ అన్నా.

తను నవ్వుతూ నా చేతికి చెయ్యందిస్తూ, హాయ్ అబ్బాయ్.. వెల్కమ్ టు వైజాగ్ అంది.

ఇంకా వుంది..
Like Reply


Messages In This Thread
RE: అంతేలే అదంతేలే కథంతేలే - by nareN 2 - 07-03-2025, 12:18 AM



Users browsing this thread: 9 Guest(s)