06-03-2025, 12:27 PM
ఎపిలాగ్
సుహాస్ "ఎవరు నువ్వు?"
"నిన్నటి వరకు మందు కొట్టి రోడ్ మీద తిరుగుతూ ఉన్నావ్.. సడన్ గా మారిపోయి నూతన్ గురించి వెతుకుతున్నావ్.."
సుహాస్ "నువ్వు ఎవరూ..?"
"ముందు నువ్వు ఏం చేస్తున్నావో చెప్పూ.."
సుహాస్ తల మీద ఉన్న జుట్టు నిమురుకుంటూ "నీ మనిషితోనే మాట్లాడిస్తావా.. బయటకు రావా.."
"ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్.."
అక్కడే ఉన్న చెట్టు వెనక ఉన్న మనిషి మొహం మీద నవ్వు చేరింది.
సమంత "నీకు ఎలా తెలుసు.. నేను బాస్ అని.."
సుహాస్ "నీ దైర్యం.. నీ ఆరా.. ఇక్కడ దాకా కనిపిస్తుంది"
సమంత షాక్ అయి "నిజంగానా.." అని అడిగింది.
సుహాస్ "కాదు.." అని వెనక్కి తిరిగాడు.
సమంత "నూతన్ ని ఎందుకు చంపాలని అనుకుంటున్నావ్.."
సుహాస్ వినిపించుకోకుండా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు.
సమంత అతని వెనకే వెళ్తూ "ఎందుకు?" అని అడిగింది.
సుహాస్ "తెలియని వాళ్లకు నా గురించి చెప్పను.."
సమంత "నేను తెలియని దాన్ని కాదు.. నీ ఫ్రెండ్ ని.."
సుహాస్ వెనక్కి తిరిగి సమంతని ఆశ్చర్యంగా చూశాడు.
సమంత "నూతన్ ని నాశనం చేద్దాం.."
సుహాస్ "ముందు నన్ను మాస్టర్ ని చెయ్.."
సమంత "అది ఎలా.."
సుహాస్ "నువ్వు మాస్టర్ అని నాకు తెలుసు.."
సమంత "నీకు ఎలా తెలుసు.."
సుహాస్ చిన్నగా నవ్వాడు.
సమంత "గెస్ చేశావా.."
సుహాస్ ఏమి మాట్లాడలేదు.
సమంత "సరే.. ఎలా అయినా నా ఫ్రెండ్ వే కదా.."
సుహాస్ "ఫ్రెండ్.."
సమంత "శత్రువుకి శత్రువు ఫ్రెండ్ అనే మాట ఎప్పుడూ వినలేదా.." అంటూ చేయి జాపింది.
సుహాస్ కొద్ది సేపు ఆమెనే చూసి ఫైనల్ గా ఆమెకు షేక్ హ్యాండ్ యిచ్చాడు.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)