Thread Rating:
  • 4 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా నువ్వు నీ నేను - Update on 7-Mar
#2
నా నువ్వు నీ నేను


హాయ్ నా పేరు నరేన్.. ఇది జరిగిన కథ కాదు.. జరగబోయే కథ.. ఐ మీన్ ఇలా జరగాలని నేను కోరుకుంటున్న కథ..

అది 2027.. ఇల్లంతా ఒకటే హడావిడిగా ఉంది.. మా ఆవిడ కోపంగా.. మా పిల్లలు అయోమయంగా మా అమ్మ నాన్న చిరాకుగా మా అత్తా మావ దిగులుగా మా చెల్లెలు అసహ్యంగా మా ఆవిడ తమ్ముడు భయం భయంగా నాకేసి చూస్తున్నారు..

అందరిలోకి ధైర్యవంతురాలైన మా చెల్లి వచ్చి.. అన్నయ్య ఏంట్రా ఇది అంది..

ఇప్పుడేమైంది అన్నా కూల్ గా..

ఎవరు అరుస్తున్నారో ఎవరు ఏడుస్తున్నారో తెలియనంత గోల మొదలెట్టారు..

ఒక్క నిముషం అని అరిచా గట్టిగా.. లేకపోతె నా మాట నాకే వినపడేలా లేదు..

చూడండి.. నేను చాలా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను.. నేను దీప్తి సంతోషంగా  లేము.. అందుకే విడాకులకు అప్లై చేశాను..ఒక ఇంట్లో కలిసి ఉన్నా ఎవరి గదుల్లో వాళ్ళం విడివిడిగానే ఉంటున్నాం అనిపిస్తోంది నాకు.. మనసులు కలవనప్పుడు మమ్మల్ని కలిపి ఉంచాలనుకోవడం మూర్ఖత్వం..

కొంచెం దూరంగా చెమ్మగిల్లిన కళ్ళతో దీప్తి ఎటు వైపో చూస్తోంది.. కానీ ఎంతో అలోచించి తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదలచుకోలేదు నేను..

మా నాన్న.. రేయ్ తన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు..

హ ఉద్యోగం చేస్తోందిగా.. పిల్లల్ని మీ దగ్గర ఉంచి చదివించండి..

అసలు ఎం ఆలోచిస్తున్నావు రా.. విడాకులు ఇచ్చి ఎం చేద్దామని..

నాన్నా.. ఐ ఆమ్ ఇన్ లవ్.. చెప్పినా మీకు అర్ధం కాదు.. ప్లీజ్.. ఇది ఇలా జరిగితేనే అందరం హ్యాపీ గా ఉంటాం..

దీప్తి అప్పుడు చూసింది కోపంగా.. తన కోపం మీకు కొత్త గాని నాకు కాదుగా.. నేను స్థిరంగానే చూస్తున్నా తన కళ్ళలోకి..

మనం విడిపోదాం అన్నా తన కళల్లోకే చూస్తూ.. సైలెంట్ గా వచ్చి విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టేసింది..

అందరూ వద్దని చెప్పడానికి ట్రై చేసారు.. మా చెల్లైతే అవి చింపడానికి కూడా ట్రై చేసింది..

దీప్తి ఒక్కటే మాట అంది.. మీ అన్నయ్య నేను తనకి అక్కర్లేదు.. నేనంటే ప్రేమలేదు.. కలిసి ఉండలేను.. అని చెప్పిన తర్వాత కూడా తన కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతూ తన దగ్గరే పడి ఉండమంటావా..

మా వాళ్లంతా నన్ను నానా తిట్లు తిట్టి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు..

దీప్తిని వాళ్ళ అమ్మ నాన్న లగేజీ సర్దుకుని వచ్చేయ్ ఊరెళ్లిపోదాం అన్నారు..

లేదు నాకు జాబ్ ఉంది.. నా పిల్లల్ని నేను చదివించుకోవాలి.. ఇక్కడే హాస్టల్ లో ఉండి జాబ్ చేసుకుంటా.. అంది

నాకు నవ్వొచ్చింది.. ఎదో ఒకటి నాకెందుకులే అని.. ఆ పేపర్స్ లాయర్ కి ఇచ్చేసి.. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా..


కొన్ని రోజులకి డివోర్స్ వచ్చేశాయ్.. మా పంపకాలు పిల్లల పంపకాలు కూడా అయిపోయాయి..

ఎవరూ హ్యాపీ గా లేరు నీ వల్ల అంది మా చెల్లి.. అదేంటి 1st నేను హ్యాపీ గా ఉంటే కదా వాళ్ళని హ్యాపీ గా ఉంచగలిగేది.. ఆ విషయం ఎందుకు అర్ధం కావట్లేదు తనకి..

ఇంట్లో ఒక్కణ్ణే.. ఏ బాధ్యతలు లేకుండా.. ఒక్కణ్ణే.. ఎలా ఉందొ తెల్సా.. మళ్ళీ నా బాచిలర్ లైఫ్ నాకొచ్చేసినట్టనిపించింది.. ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే.. సినిమాలు.. షికార్లు..రైడ్ లు.. బార్లు.. సైట్ లు.. సిగరెట్లు.. టైం తో పని లేదు..అడిగేవాళ్ళు కానీ అడ్డు చెప్పేవాళ్ళు కానీ లేరు.. నా స్వతంత్రం నాకు వచ్చేసింది..

నౌ ఐ ఆమ్ ఏ ఫ్రీ బర్డ్...పంజరంలోంచి బయటపడ్డ చిలకలా ప్రశాంతంగా... వుంది

నా డార్లింగ్ గుర్తొచ్చింది.. నా పెళ్ళితోనే తనూ నాకు దూరమైంది.. ఇద్దరిలో ఎవరి తప్పు అంటే నేను చెప్పలేను..

మళ్ళీ తనని పొందగలిగే ఛాన్స్ వచ్చింది.. రేపు తనని చూడ్డానికి వెళ్ళాలి.. ఇన్నేళ్ల నా ఊసుల్ని తనకి పంచాలి... వింటుందా.. అసలు మాట్లాడుతుందా.. తనని చూడగానే నే చెప్పాలనుకున్నవి మర్చిపోతే.. లవ్ లెటర్.. ఎస్.. లవ్ లెటర్ రాస్తే..

అసలు ఈరోజుల్లో లవ్ లెటర్ ఎవడు రాస్తున్నాడు.. దాందేముంది.. మనం రాద్దాం..

"అమ్మాయ్..

నిను తలవని రోజులేదు..
నిను కలగనని రాత్రి లేదు..
నీ నవ్వులే నా ఆహరం..
నీ చెయ్యే నా ఆధారం..
నీ భుజమే నా తల దిండుగా..
నీ మొహమే నా ఎద నిండుగా.. క్యాన్సిల్.. క్యాన్సిల్.. నువ్వేం పీకావని నిన్ను ఇంత పొగడ్డానికి.. పేపర్లు వేస్ట్ చెయ్యడం నాకిష్టం లేదు.. అందుకే కిందే రాసేస్తున్న.. పైది మర్చిపో..

అమ్మాయ్..

సరిగ్గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమించట్లేదు.. నిన్ను చూసే నా కళ్ళని.. నీ మాటలు వినే నా చెవులని.. నిను తాకే నా స్పర్శని.. నీ గురించి ఆలోచించే నన్ను నేను ప్రేమించుకుంటున్నా..

ఎస్ ఐ లవ్ మై సెల్ఫ్..

నన్ను నేను ప్రేమించుకోవడానికి కారణమైన నీకు థాంక్స్ చెప్పడానికి ఈ లెటర్ రాస్తున్నా..

అంతే.. నీ నుంచి ఇంకేం ఆశించట్లేదు.. ఎందుకంటే..

నిను ప్రేమించడానికి నువ్వెందుకు నాకు.. నీ పేరు చాలు..

చివరగా ఐ లవ్ మీ.."

నేను రాసా కాబట్టి నాకు నచ్చింది.. పొద్దున్నే తనకి ఇవ్వాలి..

రాత్రంతా నిద్రే పట్టలేదు.. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా.. ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అని ఒకటే పులకరింతలు..

పొద్దున్నే లేచి అద్దంలో చూసుకుంటే.. అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు.. కొంచెం పొట్ట.. చర్మం పొడిబారి పోయింది..

నన్నిలా చూసి తను నన్ను ఆక్సిప్ట్ చేస్తుందా.. జిం లో జాయిన్ అవ్వాలి అనిపించింది..  సరే వీలైనంత సేపు పొట్ట లోపలి నొక్కి పెడదాం అని.. సెలూన్ కి వెళ్లి కొత్త పెళ్లికొడుకులా రెడీ అయ్యి వచ్చి.. లవ్ లెటర్ మళ్ళీ ఓసారి చదువుకొని.. నా ప్రేయసి మొహాన్ని తలుచుకుంటూ బయలుదేరా..

ఎక్కడ ఉంటోందో తెలుసు కాబట్టి నేరుగా వెళ్లి తను బయటకి వచ్చే దాకా వెయిట్ చేస్తున్న..

గుండె లయ తప్పుతోంది.. స్పీడ్ పెరుగుతోంది.. ఏమంటుందో.. తీసుకుంటుందా.. అసలు మాట్లాడుతుందా.. ఛీ కొడుతుందా.. ఒక్కో సెకను టెన్షన్ పెరిగిపోతోంది..

బ్లాక్ సారీ విత్ రెడ్ బ్లౌజ్ చీరకట్టి.. వాలుజడని వయ్యారంగా వెనకనుంచి ముందుకు తిప్పి గేట్ తీసుకొని బయట అడుగుపెట్టింది నా సుందరి..

తనని చూడగానే పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయా.. తను ఇబ్బందిగా ఫీల్ ఐతే ఎవరైనా చూసి ఏమంటారో అన్న భయం..

కళ్ళు రోడ్ కేసి చూస్తూ నడుస్తోంది తను.. నేనున్నా అని గమనించలేదు అసలు..

మెళ్ళో తాళిబొట్టు.. ఐన పర్లేదు.. తనని ప్రేమించడానికి తన పేరు చాలు నాకు..

తన ముందుకు వెళ్లి.. లెటర్ తన మొహం మీద పెట్టా..

మళ్ళీ నన్ను ఇక్కడ ఇలా చూస్తా అని అనుకోదుగా.. షాక్ లో ఉండిపోయింది..

ఏంటిది?

లవ్ లెటర్..

తనకి ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు.. పిచ్చోన్ని చూసినట్టు చూస్తోంది.. అవును నాకు పిచ్చే.. నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అదే చెయ్యాలనే పిచ్చి.. కిక్ లాగ అన్నమాట..

సీరియస్ గా నా చెయ్యి విదిల్చి కొట్టి స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది..

తనని ఆపాలి అనుకుంటూ... కొంచెం ఫాస్ట్ గా నడిచి మళ్ళీ తన ముందు లెటర్ చూపెడుతూ..

అమ్మాయ్ ఐ లవ్ యు అన్నా..

తన కళ్ళలో కన్నీరు.. కోపం.. బాధ.. కక్ష..కసి.. అన్ని కనపడుతున్నాయి..

అవును ఎవడైనా గోల గోల చేసి పెళ్ళానికి విడాకులు ఇచ్చి ఇలా వారం గ్యాప్ లో మళ్ళీ అదే పెళ్ళానికి ఇలా లవ్ లెటర్ ఇస్తే అలాగే ఉంటుంది.. ఎవరికైనా..

నా రీసన్స్ నాకున్నాయి.. ఐ ఆమ్ నాట్ హ్యాపీ విత్ మై వైఫ్.. బట్ నా దీప్తి నాకు కావాలి..

అదొక్కటే కాదు..జీవితంలో పెళ్ళాం నుంచి పొందలేనిదేదో వుంది.. అది కావాలి నాకు.. అందుకే దానికి అడ్డుగా ఉన్న పెళ్ళాన్ని వదిలించేసుకుని.. నా ప్రేయసిని చేరుకుంటా..

ఇంకా వుంది..
Like Reply


Messages In This Thread
RE: లవ్ ఎట్ సెకండ్ సైట్ - by nareN 2 - 04-03-2025, 11:18 PM



Users browsing this thread: 11 Guest(s)