Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
ముందు ఏది అక్రమమో? ఏది సక్రమమో? నూటికి 99 శాతం మందికి తెలియదు. క్రమం కానిదేది అక్రమమే.. ఇది నాకున్న కనీస జ్ఞానం. నిజానికి మన దేశంలో వారి స్థాయిలో భోజనాలు పెట్టి.. సకల లాంఛనాలతో పెళ్లి చేసి, తర్వాత దగ్గరుండి శోభనం కూడా జరిపించి.. ఈరోజు నుంచి ఈవిడ నీ భర్త, ఈమె నీ భార్య అని వాళ్లని ఫిక్స్ చేసి, వీళ్లు ఇక నుంచి భార్యాభర్తలని లోకానికి కూడా చూపించి… లీగలైజ్ చేస్తున్న కాపురాలున్నాయి. ఇలా మనచుట్టూ కాపురాలు చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకు మన సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం, మర్యాదలుంటాయి. భార్యాభర్తల మనస్సుల్లో ఎంత లోటున్నా, ఇంట్లో ఎంత కొట్టుకు చస్తున్నా.. బయట మాత్రం వీళ్లకి ఓ ఇమేజ్ ఉంటుంది.

టూత్ ‌పేస్ట్‌లో ఉప్పు ఉందో లేదో మనకు తెలియదు కానీ.. ఆ కాపురాల్లో మాత్రం ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. గౌరవం ఉండదు. ఒకరి మీద మరొకరికి కనీసం సానుభూతి కూడా ఉండదు. ఇది మన దేశంలో చలామణిలో ఉన్న "సక్రమ సంబంధం". ఈ సక్రమ సంబంధాన్ని మనవాళ్లు నాగార్జున సిమెంట్ కంటే ఇంకా బలమైన సిమెంట్‌తో నిర్మిస్తారనుకుంటాను. అందుకే మనసారా కలిసుండ లేరు. విడిపోలేరు. వదల్లేరు.. వదులుకోలేరు. నచ్చినవాళ్లతో మాట్లాడుకోలేరు. మనస్సుతో జీవించ లేరు. ఇలా భార్యాభర్తల మధ్య ఎంత దూరమున్నా, ఏమి లేకపోయినా ఇవన్నీ సక్రమ సంబంధాలే మనకి. చక్కగా కాపురాలు చేసుకుంటున్న జంటలే మనకి.. పాపం వీళ్ల పరిస్థితి ఎంత దారుణం అంటే.. చాలా మందికి వాళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలియదు. తెలిసిన వాళ్లు పాపం "మా మధ్య ప్రేమ లేదు.. మా అభిప్రాయాలు కలవడం లేదు" మొత్తుకున్నా ఒక్కడూ వినిపించుకోడు.. ఇలాంటివి కోర్టు అసలే పట్టించుకోదు. పైగా పిల్లల కోసమో.. సొసైటీ కోసమే కలిసే ఉండండి అని సలహా పడేస్తారు. కలిసే ఉండాలని చెబుతారు. అంటే మీరేమన్నా కొట్టుకు చావండి.. కానీ కలసుండండి అని ట్యాగ్ వేసినట్టే..
అంటే కుటుంబ వ్యవస్థ కూలిపోతుందని, వివాహ వ్యవస్థ ఏమైపోతుందననే భయంతో కలిసే ఉండమంటారు. అందుకే భర్త వేరే ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే కనీసం విడాకులు తీసుకో అలాంటి వాడితో కాపురం వద్దు అని ఆ భార్యకి ధైర్యంగా చెప్పే పెద్ద మనుషులు మనకు మచ్చుకు కూడా కనిపించరు. "మగవాళ్లు అంతేనమ్మా.. నువ్వే సర్దుకుపోవాలనే" పెద్దవాళ్లే కనిపిస్తారు.
అదే సీన్ రివర్స్ అయితే.. ఆడవాళ్లు వేరే సంబంధాలు పెట్టుకుంటే.. అది బరితెగించేసింది.. అలాంటి దాన్ని కొట్టాలి, తన్నాలి, చంపాలి అని చెబుతారు. "పాపం ఆ భర్త" అంటూ తెగ సానుభూతి చూపించేస్తారు. ఇవి మన సమాజంలో వేరే లెవల్ "డబుల్ స్టాండెర్డ్స్ విలువలు".
ఇక మన సక్రమ భార్యాభర్తల దగ్గరకి వద్దాం.. భర్తకి వేరే ఎవరితోనైనా సంబంధం ఉందంటే చాలు.. భార్యా రచ్చ రచ్చ చేసేస్తాది.. పోని విడాకులు ఇస్తాదంటే ఇవ్వదు.. అక్కడ మళ్లీ "నా మొగుడు నాకే సొంతం" అనే నినాదం ముందుకొచ్చేస్తాది. అవతలి అమ్మాయే వలలో వేసుకుందనే మాటలు వస్తాయి. ఇదేం థియరో ఈ జన్మకి నాకర్థం కాదు.
ఇక భర్త దగ్గరకి వద్దాం.. నచ్చని భార్యకి విడాకులు ఇచ్చి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని ఒక్కడూ అనుకోడు. ఎందుకంటే సొసైటీలో ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. భార్యను ఒప్పించ లేరు.. పెద్దవాళ్లు తిడతారు.. విడాకులు రావు.. వివాదాలు వస్తాయి. కొంతమంది దూరమవుతారు. పిల్లలు ఏమనుకుంటారో.? చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటికి భయపడే వాళ్లు కొంతమంది ఉన్నారు. మరోరకం మగవాళ్లు ఉంటారు.. వాళ్లకి ఇంట్లో భార్య అలానే ఉండాలి.. బయట తిరగడానికి , ఎంజాయ్ చేయడానికి వేరే అమ్మాయిలు కావాలి. అలా తిరిగేసి భార్యతో చక్కగా కాపురం చేసే మర్యాదస్తులు కోకోల్లలు. అలాంటి వాళ్లు భార్యతో విడిపోనంత కాలం వాళ్లది సక్రమ సంబంధమమే.
బాబోయ్ ఈ సక్రమ సంబంధాల గురించి ఇంకా చెప్పుకోవాలి.. "ఒకరి మీద ఇంకొకరు ఆధారపడడమే" ఈ సక్రమ సంబంధాల పునాది. భర్త సంపాదించి తెచ్చి భార్యని పోషించాలి.. భార్య వంట చేసి భర్తకి పెట్టాలి. పిల్లలని కని.. వాళ్ల ఆలనా, పాలనా చూసుకోవాలి. అంతేకాని ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవాలి, ఇద్దరూ ఇంట్లో పనులు చేసుకోవాలని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఆ సంస్కృతి మనది కాదు.
ఒకవేళ భార్య బయట పనికి వెళ్లినా.. భర్త మాత్రం ఇంట్లో పని చేయడు. ఆ పని మళ్లీ ఆమెదే.. పిల్లల పని, వారి చదువులన్ని ఆమేవే. అది మన కల్చర్ మరీ.
ఈ సక్రమ సంబంధంలో ఒకరు అవసరాలు ఇంకొకరు తీర్చుకోవడంతోనే తెల్లారిపోతుంది. బాబోయ్ ఈ సక్రమ సంబంధాల గురించి.. ఎంత రాస్తున్నా తరగడం లేదు. అన్నం కూరలు రుచిగా ఉండాలి, ఇళ్లు శుభ్రంగా ఉండాలనుకునే మనుషులు.. పెళ్లి, కాపురాలు కూడా క్వాలిటీగా ఉండాలనుకోరు.
అసనమానతలతో కుట్టి, అవసరాలకు ముడిపెట్టిన ఈ "సక్రమ సంబంధాలు" ను పోేస్ట్‌మార్టం చేసి రిపోర్ట్ ఇవ్వగలిగితే… బాగుండును..
[Image: un7lmvyvngle1.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 04-03-2025, 02:53 PM



Users browsing this thread: 3 Guest(s)