Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Feb 28, 2025)
#79
12. పన్నాగం






గతం :

ఇషా, రమాదేవి మరియు ఆరాధ్య లు నిలబడి ఉండగా, వాళ్ళ వెనకే సెక్యూరిటీ తీసుకొని వచ్చిన గిఫ్ట్ లు ఒకదాని మీద ఒకటి చొప్పున చిన్న సైజ్ ఇల్లు లాగా పేర్చి ఉంచారు. అవి ఆల్మోస్ట్ వాళ్ళ ముగ్గురు ఎత్తు ఉన్నాయి.

ఆకాష్, ఇషాని చూడగానే భయం పట్టుకుంది, కచ్చితంగా తనని పెళ్లి అని తోలుకొని వెళ్లిపోతుంది అని భయపడిపోతున్నాడు.

చెరగని చిరునవ్వుతో ఇషా అక్కడే ఉన్న మెయిడ్ కీ సైగ చేయగానే ఆమె వచ్చి సాయం చేయగా ముఖ్యమైన గిఫ్ట్ లను తీసుకొని వచ్చి ఆకాష్ వాళ్ళ అమ్మ, నాన్న మరియు ఆకాష్, మరో వైపు నిలబడ్డ భార్గవిని పేరు పేరున పలకరిస్తూ గిఫ్ట్ లు యిచ్చింది.

మెయిడ్ వైపు తిరిగి, ఇషా "ఇదిగో గిఫ్ట్ బాక్స్ మీద పేర్లు రాశాను.. ఎవరివి వాళ్ళవి తీసుకోండి.. మన xxxx(కుక్క పేరు) కోసం xxxx కంట్రీ నుండి ఫుడ్ తెప్పించాను.." అంటూ గైడ్ చేస్తూ అవి ఇచ్చేసింది.

.  .  .  .  .

ఆకాష్ "అమ్మా.. అమ్మా.. వెళ్లిపొమ్మను.. "

ఆకాష్ వాళ్ళ అమ్మ "ఇషా.."

ఆకాష్ "అమ్మా.. ఎందుకు పిలిచావ్..."

ఆకాష్ వాళ్ళ అమ్మ "ఎంత సేపని వాళ్ళతో మాట్లాడుతావు.. అల్లరిపిల్ల.. రా.. వచ్చి భోజనం చేద్దాం.. అప్పుడు మాట్లాడుకుందాం.. ఏదైనా ఉంటే.."

ఇషా "వస్తున్నా ఆంటీ.."

.  .  .  .  .

వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ రమాదేవి "ఇంతకు ముందు చిన్న గిఫ్ట్ బాక్స్ తెచ్చిన మొహం అంతా నవ్వేసింది.. ఇప్పుడు లక్షలకు లక్షలు పెట్టి తీసుకొని వచ్చినా నవ్వు మొహం లేదు"

ఆరాధ్య "ఏమయింది?"

రమాదేవి "ఏమయింది? ఏంటి? మనం ఇప్పుడు ఇషా మేడం పెళ్లి మాటలు మాట్లాడడం కోసం వచ్చాం.."

ఆరాధ్య "అదేంటి?"

రమాదేవి "అదే కదా నేను కూడా భయపడేది.."

ఆరాధ్య "విష్ణు సర్ అంటే ఇష్టం ఉన్నప్పుడు, మేడం దైర్యంగా వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు కదా.. అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ?"

రమాదేవి "ప్చ్.. మనకు ఆకాష్ ఫ్యామిలీ తో బిజినెస్ డీల్స్ ఉన్నాయి"

ఆరాధ్య "ఉంటే.."

రమాదేవి "మనం మన బిజినెస్ కొనసాగించాలి అంటే... మనకు ఆకాష్ ఫ్యామిలీతో రిలేషన్ మంచిగా ఉండాలి.. "

ఆరాధ్య "నాకు అర్ధం కాలేదు"

రమాదేవి "అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలి? హుమ్మ్... మనకు 'రా' మేటిరియాల్ సప్లై చేసే వాళ్ళు ఈ ఆకాష్ ఫ్యామిలీ.. "

ఆరాధ్య "తొక్కలో మేటిరియాల్ కోసం.. పెళ్లి చేసుకుంటుందా.."

రమాదేవి "అదే కదా.." అంటూ తల కొట్టుకుంది.

ఆరాధ్య "వీళ్లని చూస్తూ ఉంటే చాలా కంత్రిలు లాగా ఉన్నారు.."

రమాదేవి "మర్డర్ ఎటెంప్ట్ చేసి చనిపోయిందా లేదా అని కూడా చూసుకోకుండా చనిపోయిందని 'దినం' ఏర్పాటు చేస్తే అక్కడకు వచ్చి, కలర్ ఫోటో పెట్టలేదు, నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టలేదు అని కంప్లయింట్ చేసే అమ్మాయి ఇషా.."

ఆరాధ్య "ఇప్పుడు ఏం చేద్దాం.."

వెనక నుండి ఇషా గొంతు వినపడింది "భోం చేద్దాం.. " అని వినపడింది.

రమాదేవి మరియు ఆరాధ్య ఇద్దరూ వెనక్కి తిరిగి నవ్వుతూ ఉన్న ఇషాని చూశారు.

రమాదేవికి కోపం వచ్చేసి "ఇదిగో.. ఇషా.. చూడు చెబుతున్నా.. నువ్వు కనక ఈ పెళ్లి చేసుకున్నావు అంటే.. నన్ను నేను పొడుచుకొని చచ్చిపోతాను.."

ఇషా నవ్వేసి రమాదేవిని చేయి పట్టుకుంది.

ఆరాధ్య "ఇషా.. రమాదేవిగారు నీ మీద ప్రేమతో.. నీ మంచి కోసమే చెబుతున్నారు.. తప్పుగా అనుకోకు.."

ఇషా "నేను కూడా మీ మంచి కోసమే చెబుతున్నాను.."

ఆరాధ్య మరియు రమాదేవి ఇద్దరూ ఇషా వైపు చూస్తూ ఉన్నారు.

ఇషా "ఆంటీ పచ్చిపులుసు బాగా పెడతారు.. బాగా తినండి.. వేడి తగ్గుతుంది.." అని డైనింగ్ టేబుల్ దగ్గరకు కదిలింది.

ఆవేశపడిపోతున్న రమాదేవిని ఆరాధ్య చేయి వేసి ఆపి ఓదార్చింది.

రమాదేవి "అది కాదు ఆరు.. అక్కడ చూశావా.. వాళ్ళు ఆ భార్గవిని రప్పించారు.."

ఆరాధ్య "భార్గవి.."

రమాదేవి "అవునూ.. తను పెద్ద కంచు.. ఇప్పుడు తనతో మాట్లాడిస్తారు.. అసలే మన ఇషా నోట్లో నాలుక లేని అమ్మాయి.." అంటూ ఏడుపు మొహం పెట్టేసింది.

ఆరాధ్య "ఊరుకోండి.. ఊరుకోండి.. అలాంటిది ఏమి జరగదు.. ఊరుకోండి.. " అంటూ డైనింగ్ టేబుల్ ఉన్న గదిలోకి తీసుకొని వచ్చింది.

.  .  .  .  .

ఆకాష్ "అమ్మా.. ముందే చెబుతున్నాను.. ఇషాతో పెళ్లి అంటే నన్ను నేను ఎదో ఒకటి చేసుకుంటాను.."

ఆకాష్ వాళ్ళ అమ్మ అతని చెంప మీద చిన్నగా చరిచి "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.." అంది.

ఆకాష్ "అది కాదు అమ్మా.. ఇషా ఒక రాక్షసి.. పెద్ద బ్రహ్మ రాక్షసి.. నేను సంజనని పెళ్లి చేసుకుంటాను"

ఆకాష్ వాళ్ళ అమ్మ "నాది ఏముంది? రా.. మీ నాన్నని అడుగు.. అసలు ఇవ్వాళ మీ అక్క వచ్చింది తను మాట్లాడుతుంది.."

భార్గవి "రేయ్.. ఏంటి రా నీ గోల.. ఇషాకి ఏం తక్కువ.. డబ్బుకి డబ్బు.. మంచి చదువు.. సమాజంలో మంచి పేరు.. ఇద్దరూ చక్కగా కలిసి బిజినెస్ పెంచుకొవచ్చు.. ఇంకేం కావాలి.. ఆ సంజనని చేసుకొని ఏం చేస్తావ్.. రోమాన్సా.. ఎన్ని రోజులు చేస్తావ్..? మూసుకొని ఇషాని చేసుకో.."

ఆకాష్ "అది కాదు అక్కా.. ఐ లవ్ సంజన.."

భార్గవి "పెళ్లికి ముందు నువ్వు ఎన్ని వేషాలు అయినా వేసుకోవచ్చు.. వేసుకున్నావ్.. ఇప్పుడు టైం మారిపోయింది.. పెళ్లి టైం.. ఇక నుండి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సవ్యంగా ఉండు.." అని వెళ్లి పోయింది.

ఆకాష్ "నాన్నా.." అంటూ జాలిగా వాళ్ళ నాన్న వైపు చూశాడు.

ఆకాష్ వాళ్ళ నాన్న "ఆ సంజనకి నువ్వంటే ఇష్టమా.."

ఆకాష్ "చాలా ఇష్టం నాన్న.. మేం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం.. "

ఆకాష్ వాళ్ళ నాన్న "తెర వెనక ఉంచు.."

ఆకాష్ "అంటే.."

ఆకాష్ వాళ్ళ నాన్న "తెర ముందు ఇషా.. తెర వెనక సంజన.." అంటూ నవ్వేసి కొడుకు భుజం చరిచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తూ ఇషాని నవ్వుతూ పలకరించాడు.

ఆకాష్ ఒక్క క్షణం వాళ్ళ నాన్న చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు.

.  .  .  .  .

అందరూ కూర్చొని నవ్వుతూ భోజనం చేస్తూ ఉన్నారు.

ఇషా ఎదో మాట్లాడబోతూ ఉంటే.. ఆకాష్, వాళ్ళ అమ్మ వైపు జాలిగా చూశాడు.

ఆకాష్ వాళ్ళ అమ్మ "ముందు తినండి తరవాత మాట్లాడుకుందాం.."

.  .  .  .  .

అందరూ హాల్ లో సోఫాలలో కూర్చొని ఉన్నారు.

తిండి గురించి మొదలు పెట్టి చిన్న చిన్న పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నారు.

ఇక మాట్లాడడం కోసం సిద్దపడగా..

ఇషా "మన మధ్య ఇప్పటికే ఉన్న రిలేషన్ ని ముందుకు తీసుకెళ్ళి పెళ్లి సంబంధంతో ముడి వేయాలని.."

ఆకాష్ వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకున్నాడు.

ఆకాష్ వాళ్ళ అమ్మ "చూడమ్మా.. పెళ్లి అనేది ఇలా సడన్ వచ్చి గిఫ్ట్ లు ఇచ్చేస్తే కాదు.. మీరు చిన్నపిల్లలు కాబట్టి చెబుతున్నాను.. పెద్ద వాళ్ళు కూర్చొని మాట్లాడాల్సిన విషయం.." అంటూ ఆకాష్ చేయి పట్టుకుంది.

ఇషా "గడిచే ప్రతి రోజు.. వయస్సు పెరగడమే కాని తరగదు కదా.. పద్దతులు.. అవీ ఇవీ అని కూర్చుంటే.. సరైన సమయం దాటి పోతుంది కదా.. మీరు చెప్పండి వదిన" అంటూ  భార్గవి వైపు చూసింది.

భార్గవి నవ్వేసి "పెళ్ళికి బాగా తొందర పడుతున్నావ్ మరదలు పిల్లా.. త్వరత్వరగా నాకు మేనల్లుడు కూడా వచ్చేస్తాడు అన్నమాట.." అంటూ ఆటపట్టించింది, అందరూ నవ్వేశారు.

ఇషా కూడా నవ్వేసి "మీరు పొరపాటు పడుతున్నారు.."

అందరూ నవ్వు ఆపి ఇషాని చూస్తూ ఉండగా.. ఇషా "పెళ్లి నాకు కాదు.. నా చెల్లి సంజన మరియు ఆకాష్ లది.."

గదిలో ఆకాష్ తప్పించి అందరూ షాక్ గా ఇషాని చూస్తూ ఉన్నారు.

ఇషా "ఏంటి అందరూ అలా చూస్తున్నారు.. సంజన మరియు ఆకాష్ లు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకున్నారు కదా.. వాళ్ళకు పెళ్లి చేద్దాం అని సంజనకి అక్కగా అడగడం కోసం వచ్చాను" అంది.

భార్గవి "షేర్.."

ఇషా "మ్మ్"

భార్గవి "షేర్, ఎంత రాస్తున్నావ్.. మీ చెల్లికి మీ కంపనీలో.."

ఇషా "ఇషా చిన్నప్పటి నుండి అమ్మ నాన్నల దగ్గర గారాబంగా పెరిగింది.. తనకు కంపనీ వ్యవహారాలు పెద్దగా తెలియదు.. అందుకే తనకు ఏమి ఇవ్వలేదు.."

భార్గవి "అయితే.. కట్నం.. ఎంత ఇస్తున్నావ్?"

ఇషా "నాన్న, చిన్నప్పుడు సంపాదించిన ఆస్తి అంతా కూడా పూర్తిగా ఒక్క రూపాయి కూడా అట్టిపెట్టుకోకుండా మొత్తం ఇచ్చేస్తాడు"

ఆకాష్ ఊహల్లో సంతోషంగా ఊగిపోతూ ఉన్నాడు.

ఆకాష్ వాళ్ళ నాన్న, ఆకాష్ ని పిచ్చోడిలా చూస్తూ "రాత్రి మందు కొట్టావ్ చూశావా.."

ఆకాష్ "హుమ్మ్"

ఆకాష్ వాళ్ళ నాన్న "అది కూడా రాదు.."

ఆకాష్ "అదేంటి?"

ఆకాష్ వాళ్ళ నాన్న అటూ చూడు.. అనడంతో ఇషా వైపు చూశాడు.

ఇషా "నా తరుపు నుండి ముప్పై కోట్లు ఇస్తాను.. దానికి బదులుగా మీరు ఎనిమిది పర్సెంట్ మీ కంపనీ షేర్ నాకు రాసి ఇవ్వాల్సి ఉంటుంది"

ఇషా మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న అందరికి షాక్ కి గురి చేశాయి.

భార్గవి సూటిగా చూడగా.. ఇషా సోఫాలో యువరాణిలా కూర్చుంది అని అర్దం అయి తను కూడా పొజిషన్ సరిగా కూర్చొని ఆమె వైపు సూటిగా చూడడం మొదలు పెట్టింది.

ఇద్దరి మొహాల్లో నవ్వు ఉన్నా.. అది యుద్ద రంగానికి ఏ మాత్రం తగ్గనట్టు ఉంది.






ప్రస్తుతం :

భార్గవి "చాలా సంవత్సరాలు అయింది నిన్ను చూసి.." అంటూ దగ్గుతుంది, వయస్సు తాలుకా చాయలు ఆమెలో కనిపిస్తున్నాయి.

ఇషా ఆమెను చేయి పట్టుకొని సోఫాలో కుర్చోబెడుతూ ఉంటే, భార్గవి విదిలించుకుంటూ "నేను మరీ అంత ముసలి దాన్ని కాలేదు.." అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ మోకాళ్లను రుద్దుకుంటూ "ఈ మోకాళ్ళ నొప్పి చంపేస్తుంది.." అంది.

ఇషా వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ "నీ మోకాళ్ళ నొప్పి తగ్గడం కోసం స్పెషల్ మెడిసెన్ తెప్పించాను.. ఇదిగో.." అంటూ గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది.

భార్గవి ఇషాని నవ్వుతూ చూసి ఆ గిఫ్ట్ బాక్స్ అందుకొని పక్కన పెట్టేసి "ఏం కావాలి?" అంది.

ఇషా "భోజనం చేశావా.."

ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేశారు. ఒకప్పటిలా తన ప్లేట్ లో అన్ని రకాల ఆహార పదార్దాలు కాకుండా కొన్ని మాత్రమే అది కూడా ఉప్పు, పంచదార లేకుండా పెట్టుకొని తింటుంది. భోజనానికి ముందు ఒక టాబ్లెట్ ఆకలి అవ్వడం కోసం.. తిన్నాక అరగడం కోసం వేసుకుంది.

ఇషా ఆమెనే చూస్తూ గమనిస్తూ ఉంది.

భార్గవి "వయస్సులో ఉన్నప్పుడు అందరిని చెడుగుడు ఆడించాను.. పుట్టింటి వాళ్ళు.. మెట్టినింటి వాళ్ళు అందరూ నా మాట వినే వాళ్ళు.. బెదిరించి మరీ నా మొగుణ్ణి కంట్రోల్ లో పెట్టుకున్నాను"

ఇషా ఆమెనే చూస్తూ ఉంది.

భార్గవి "నేనంటే భయం ఉండడం వల్ల, తన శారీరక అవసరాల కోసం.. మరో అమ్మాయిని చూసుకున్నాడు.. అది విని నా ఆరోగ్యం పాడయింది.. నా కొడుకు ఏమో నా ఆరోగ్యం పాడవ్వడంతో వాడి ఇష్టారాజ్యం అయిపోయి.. ఏదేదో చేసేశాడు.. అటు తిప్పి ఇటుతిప్పి చివరికి ఎవరిని అయితే జీవితాంతం ద్వేషించానో.. నా సవితి.. దాని కొడుకు సంపాదన పరుడు అయ్యాడు.. బోర్డ్ మెంబర్స్ అందరూ వాడికే సపోర్ట్ చేసి వాడిని ఎన్నుకున్నారు.. వీడేమో ఓడిపోతా అని తెలిసి.. ఇంట్రస్ట్ లేదు అంటూ వెళ్లిపోయాడు.."

ఇషా తల ఊపింది.

భార్గవి "ఓడిపోతాం అని తెలిసినా దున్ను దున్నుగా ఫైట్ చేయాలని ఇవ్వాళ మనుషులకు లేదు.. అందరూ సడన్ గా సక్సెస్ అయిపోవాలనుకుంటున్నారు.. దాని కోసం ఒక పద్దతి విధానం ఉండాలని కూడా లేదు.." అంటూ తల ఊపింది.

ఇషా ముందుకు వంగి భార్గవి చేతులు పట్టుకుంది.

భార్గవి "ఒకప్పుడు మనిద్దరం బిజినెస్ ఫీల్డ్ లో శత్రువులం.. కాని ఇపుడు నా చేతుల్లో ఆ బిజినెస్ లేదు.. కాబట్టి నేను నీ శత్రువు కాదు అనే విషయం గుర్తు పెట్టుకో.."

ఇషా "అలాగే.. అయినా నువ్వేమీ నా శత్రువు కాదు.. అపోనేంట్ వి అంతే.."

భార్గవి "అప్పుడపుడు వచ్చి కలుస్తూ ఉండు.."

ఇషా తల ఊపింది.

భార్గవి "నీ మొగుడు విష్ణు కిడ్నాప్ అయ్యాడా.." అంటూ నవ్వింది.

ఇషా "నాకు తెలుసు.. నువ్వు ముసలి మాంత్రికురాలివి అని.."

భార్గవి నవ్వేసి "ఏం చేయమంటావ్? ఇన్ని రోజులు చేసిన పని అదే కదా.. కనీసం ప్రపంచం కూడా తెలియకుండా ఇలానే ఉండిపోతే.. ఎలా.." అంటూ నవ్వింది.

ఇషా "నీ దగ్గర ఉన్న కార్డ్స్ ఏంటో చూపించు.. ఆ తర్వాత నీ డిమాండ్స్ ఏంటో చెప్పూ.."







గతం :

ఆకాష్ వాళ్ళ నాన్న "నీ చెల్లెలు, నా ఇంటి కోడలా.. అసలేముంది అని తనను నా ఇంటి కోడలుగా చేసుకోవాలి."

ఆకాష్ వాళ్ళ అమ్మ "అయినా పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకుంది.. ఛీ.. ఛీ.. " అంటూ తల ఊపింది.

ఆకాష్ "అమ్మా.." అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉన్నాడు.

భార్గవి "నీ దగ్గర ఉన్న కార్డ్స్ ఏంటో చూపించు... ఆ తర్వాత నీ డిమాండ్స్ ఏంటో చెప్పూ.."

ఇషా నవ్వుతూ "మొన్న జరిగిన దాని గురించి జనాలు అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు.. టోటల్ గా ఒక న్యూస్ వదిలేస్తే... పరువు పోతుంది.."

భార్గవి, ఇషానే చూస్తూ ఉంది.

ఆకాష్ వాళ్ళ అమ్మ "డబ్బు పడేస్తే.. అదే న్యూస్ చానల్ ఆ న్యూస్ ఆపేస్తారు.."

ఇషా తల ఊపుతూ "నా చెల్లెలు ఇప్పుడు నా మాట వింటుంది.. తన చేత రేప్ కేస్ వేయిస్తాను.."

ఆకాష్ వాళ్ళ నాన్న "అది అవ్వదమ్మా.."

భార్గవి నవ్వేస్తూ "ఇంకా.." అంటూ ముందుకు ఒరిగింది.

ఇషా "కొన్ని రోజుల క్రితం.. నా మీద మర్డర్ ఎటెంప్ట్ జరిగింది.. కార్ బాంబ్.. దాని గురించి కంప్లీట్ ఎంక్వయిరీ చేయించాను.." అంటూ ఆకాష్ వైపు చూసింది.

భార్గవి "ఏం తెలిసింది?"

ఇషా "డీల్ మాట్లాడిన చోట సిసి కెమెరా రికార్డింగ్.. వాయిస్ రికార్డింగ్.. చాటింగ్.. అలాగే బ్యాంక్ ట్రాంజాక్షన్స్.."

భార్గవి "నేను నమ్మను.."

ఆకాష్ చేతులు రుద్దుకుంటూ "ఆ రోజు.. సెక్యూరిటీ ఆఫీసర్లకు డబ్బు ఇచ్చాను.. పేపర్ లో కూడా యాక్సిడెంట్ అనే రాశారు"

ఇషా, ఆకాష్ ని పిచ్చోడు అన్నట్టు చూస్తూ "నేనొక VIPని ఆకాష్.. నా మీద కార్ బాంబ్ వాడారు.. సెక్యూరిటీ ఆఫీసర్లు అందుకే సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు"

భార్గవి "దొరికాడా..."

ఇషా "లేదు.."

రమాదేవి అప్పటి వరకు దిగులుగా ఉన్నా.. ఇషా అలా అందరిని భయపెడుతూ ఉండడం చూసి ఉత్సాహం పెరిగిపోయి "ఎందుకంటే మాకు దొరికాడు కాబట్టి.." అని చాలా కచ్చగా చెప్పింది.

ఇషా కళ్ళు పెద్దవి చేసుకొని చూడడంతో రమాదేవి సైలెంట్ అయ్యి తల దించుకుంది.

ఇషా నవ్వుతూ భార్గవి వైపు చూసింది.

భార్గవి "మా ఫ్యామిలీ అంతా ఉండి ఆలోచించుకోవాలి.."

ఇషా "పది పర్సెంట్.. నెక్స్ట్ మీటింగ్ అప్పుడు.. పది పర్సెంట్.. గురించి మాట్లాడుకుందాం"

భార్గవి కోపంగా చూసింది.

ఇషా "మాకు మీ కంపనీ నుండి వచ్చే ప్రోడక్ట్ కావాలి.. కాబట్టి నాకు షేర్ ఇచ్చినంత మాత్రానా ఎదో నష్టం జరుగుతుంది అనుకోవద్దు.. అలాగే మీకే సపోర్ట్ చేస్తాను కాబట్టి.. మీకు ఆ భయం కూడా లేదు.. ఎందుకంటే నా ప్రియమైన చెల్లెలు మీతోనే ఉంటుంది కదా.." అంది.

ఆకాష్ వాళ్ళ నాన్న "ఒప్పుకోకపోతే.."

ఇషా "నా దగ్గర ఇవే కాదు ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయి.. ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బ కొడుతూ పోతే.. ఆఖరికి అవే ముప్పై కోట్లకి మొత్తం కంపనీని సొంతం చేసుకోగలను.." అంది.

భార్గవికి వాళ్ళ నాన్న చేసే డార్క్ డీల్స్, వాళ్ళ అమ్మ దాస్తున్న బ్లాక్ మనీ మొత్తం గుర్తు వచ్చింది.

ఇషా "హుమ్మ్ అవే.."

ఆకాష్ "నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను.. సరేనా.."

ఇషా మరియు భార్గవి ఇద్దరూ ఆకాష్ ని అమాయకంగా చూశారు.

ఆకాష్ "కానీ నాకు సంజన కూడా కావాలి.." అన్నాడు.

ఇషా "ఆకాష్ జోకులు బాగా వేస్తాడు.." అంది.

ఆకాష్ "అంటే పెళ్ళికి ఒప్పుకున్నట్టేగా.."

ఇషా "మీతో బిజినెస్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.." అంటూ చేయి జాపింది.

ఆకాష్ "ముందుగానే చెబుతున్నాను.. నాకు సంజన కూడా కావాలి.."

భార్గవి "నువ్వు కొంచెం నోరు మూస్తావా.." అని కోపంగా చూడడంతో ఆకాష్ వెనక్కి తగ్గాడు.

భార్గవి తల దించుకొని నవ్వుతూ "ఇప్పట్లో నన్ను కొట్టే వాడే లేడు అనుకుంటూ ఉండే దాన్ని.. చూస్తూ ఉంటే.. మన బిజినెస్ సిట్టింగ్స్ ఇవాళ్టి నుండే మొదలు అవుతాయి అనుకుంటున్నాను.."

ఇషా కూడా నవ్వేసింది.

.  .  .  .  .

ఇషా "త్వరలో మనం పెళ్లి విషయాలు మాట్లాడుకుందాం.." అంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది.



కారులో వెళ్తూ ఉంటే, రమాదేవి ఎక్సైటింగ్ గా ఆరాధ్యని హాగ్ చేసుకుంది.

ఆరాధ్య "మీకు చాలా హ్యాపీగా ఉందే.."

రమాదేవి "మాములుగానా.. ఒక్కొక్క మాటకు వాళ్ళ మొహాలు చూడాలి.." అంటూ తనలో తానే నవ్వుకుంటుంది.

ఇషా తల అడ్డంగా ఊపుకుంటూ.. "నీ ఫీలింగ్స్ కొంచెం కంట్రోల్ లో పెట్టుకో.." అంది.

రమాదేవి "నా వల్ల కాదు.."

.  .  .  .  .

హాస్పిటల్ దగ్గరకు వెళ్లి సంజనతో పెళ్లి డీల్ గురించి చెప్పగానే సంజన అసలు నమ్మలేక పోయింది. తన అక్క తన కోసం త్యాగం చేస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఎప్పటినుండో వింటున్న వాళ్ళ అమ్మ మాటలను కూడా తోసిబుచ్చుతూ అమాంతం ఇషాని హాగ్ చేసుకొని క్షమాపణలు చెప్పుకుంది.

ఇక నుండి తన అక్కతో నిజాయితీగా ఉంటా అని, ఒక చెల్లిలాగా ఉంటా అంటూ మాట కూడా ఇచ్చింది.

రమాదేవి "చూస్తూ ఉంటే.. ఇక నుండి మీ ఫ్యామిలీ మీకు దగ్గరయింది అనిపిస్తుంది" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

ఆరాధ్య "అంత సీన్ లేదు.. వాళ్ళ ఇంట్లో కోడలుగా చలామణి అవ్వాలన్నా.. రెస్పెక్ట్ కావాలన్నా.. ఇషా సపోర్ట్ కావాలి.. అందుకే ఇదంతా.."

రమాదేవి "అవునా.." అంటూ ఇషా వైపు చూసింది.

ఇషా కూడా "అవునూ" అన్నట్టు తల ఊపుతూ "ఆరాధ్య ఇక నుండి నువ్వు నా పర్సనల్ సెక్రటరీవి.."

రమాదేవి "మరి నేను.."

ఇషా "నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ వి.."

రమాదేవి "ఓకే.."

ఆరాధ్య "వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మధ్యలో ఉంచి ట్రాప్ చేయాలని అనుకున్నారు.. కానీ మీరే వాళ్ళ అందరికి ట్రాప్ వేశారు.." అంది.

హాస్పిటల్ నుండి బయటకు రాగానే...

ఇషా "కార్ కీస్.." అంటూ కార్ కీస్ తీసుకొని నవ్వుకుంటూ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఇంటి ముందు ఆపింది.

చెప్పులు కూడా లేకుండా కారు దిగిపరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి చుట్టూ చూస్తూ తనకు కావలసిన మనిషి కోసం చూసింది.

విష్ణు అప్పుడే స్టడీ రూమ్ నుండి బయటకు రాగానే.. కంగారుగా చూస్తున్న ఇషాని చూశాడు.

ఎదో చెప్పబోయెంతలో ఇషా అతన్ని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అయిపోయి "మీ టూ.. ఐ లవ్ యు టూ.." అని సమాధానమిచ్చింది.

విష్ణు కూడా ఇషాని తిరిగి హత్తుకున్నాడు.






ప్రస్తుతం :

భార్గవితో మాట్లాడి సరాసరి సంజన దగ్గరకు వెళ్ళింది.

సంజన "అక్కా.. అక్కా.. ఎన్నాళ్ళు అయింది అక్కా నిన్ను చూసి.. ఇలా అయిపోయావ్.. రా.. భోజనం చేద్దాం.."

ఇషా "లేదు నేను తినే వచ్చాను.."

సంజన "ఉండు.. నేను ఏదైనా తీసుకొని వస్తాను.."

ఇషా "లేదు సంజన.. నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాను.. విష్ణు గురించి మాట్లాడాలి"

సంజన "లేదు నేను ఏమి వినను.. ఏదైనా.. నువ్వు తిన్న తర్వాతే.."

ఇషా ప్లేట్ పక్కన పెట్టి మాట్లాడబోతూ ఉంటే.. సంజన తినాల్సిందే అంటూ పట్టుబట్టింది.

ఇషా ఆ ప్లేట్ తినగానే మత్తుగా అనిపించి కళ్ళు మూసుకుంది.

సంజన "ఆకాష్ కి నాకు పెళ్లి చేసి మా ఇద్దరినీ నీ గ్రిప్ లో పెట్టుకున్నావ్.. తిరిగి ఇన్నాళ్ళు పట్టింది తిరిగి నువ్వు మా గ్రిప్ లోకి రావడానికి..." అంటూ విలన్ లా నవ్వడం మొదలు పెట్టింది.



భార్గవి కూడా తన ఇంట్లోనే ఉండి తను కూడా "చిక్కావ్.. చిక్కావ్.. " అనుకుంటూ నవ్వుకుంది.



ఇషా కళ్ళు మూసుకొని "విష్ణు.. విష్ణు.. " అంటూ తలుచుకుంటూ "మీ టూ.. ఐ లవ్ యు టూ.. విష్ణు.." అంటూ కలవరిస్తుంది.




























[+] 6 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM
RE: బెస్ట్ కపుల్ (Nov 20) - by 3sivaram - 28-02-2025, 10:22 PM



Users browsing this thread: 3 Guest(s)