25-02-2025, 12:43 PM
నరేన్ గారు,
మీరు వాడిన మొదటి వాక్యంలోని చివరి పదం నాకు చాలా నచ్చింది. "చర్చించుకున్నాం"
ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ఒకరిమీద ఇంకొకరు పడిపోవడమే. ఒకరి మీద ఇంకొకరు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తమ దగ్గర సరైన సమాధానం లేనప్పుడు బూతులతో విరుచుక పడుతున్నారు. ఎక్కడో నిరాశ, నిస్పృహల్ని వేరే ఇంకెవరిపైనో చూపిస్తారు.
నేను రాసినవే రెండు కథలండి. మొదటిది 'అభిమాన సంఘం' రెండవది 'అందమైన ఓ కథ'.
అసలు రాద్దామా వద్దా అని రెండు మూడు రోజులు ఆలోచించాను. దానికీ కారణాలు వున్నాయి. మొదటిది - అసలు జనాలకి నచ్చుతుందా లేదా అన్నది మొదటి ఆలోచన. భిన్నంగా రాస్తే ఎలా తీసుకుంటారు అన్న ఆలోచన దగ్గర రెండు రోజులు ఆగిపోయాను. చివరికి ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనిపించింది. రెండవది - ఒక అమ్మాయి రాస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అన్న భయం. దీనికి ముఖ్య కారణం ఇంతకు ముందు చెప్పినట్లు ఇక్కడ చర్చలు, గుడ్ క్రిటిసిజం ఉంటుందా అన్న ఆలోచన. చివరికి ఒక ప్రయత్నం చేసి చూద్దామని మూడవ రోజు నిర్ణయించుకున్నాను. ఒక్కసారి నిర్ణయించుకున్నాక ఎలాంటి కామెంట్స్ వచ్చినా పట్టించుకోకూడదని డిసైడ్ అయిపోయాను. నేను రాసేది నా ఆనందం కోసం, ఎదుటివాడి ఆనందం కోసం కాదు. ఎక్కువ వ్యూస్ రాకపోతే ఇక్కడితో ఆపేద్దామని అనుకున్నాను. అనుకున్న దానికన్నా ఎక్కువ మందే చదివారు. ప్రోత్సహ పరిచారు. అందరికి కృతఙ్ఞతలు.
మీ స్థాయి వ్యక్తులు అని ఎందుకు అన్నానంటే మీరు రచనలలో నా కన్నా సీనియర్. ఇప్పటికే కొన్ని కథలని రాశారు. నేను జస్ట్ మొదలు పెట్టాను. గౌరవం ఇవ్వాలి అన్నది నా సభ్యత. ఒకేఒక్క కథ గొప్పగా రాసిన వ్యక్తికీ అదే గౌరవం ఇస్తాను.
కథలు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలా మంది వున్నారు. మన సంగతి (అంటే పాఠకులు) వదిలేయండి. రాసిన వ్యక్తికి సంతృప్తి ఉంటుందా ? ఒక విత్తనాన్ని నాటి జాగ్రత్త్తగా నీళ్లు పోస్తూ, రక్షణ చేస్తున్న వ్యక్తి, అది తీరా ఇంకొకరి సహాయం లేకుండా బ్రతికే స్థితి వస్తున్న సమయంలో, వదిలివేసి, నిర్దాక్షిణ్యంగా వదిలేసి, ఎండిపోయేట్లు చేయడం, ఆ వ్యక్తికి తృప్తిని కలిగిస్తుందా ? ఏమో తెలియదు.
నా కథలపై మీ విమర్శల కోసం ఎదురు చూస్తుంటాను. మీతో కొన్ని అభిప్రాయాల్ని పంచుకోవడం సంతోషంగా వుంది.
అనామిక