Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#78
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 14
 
సాయంత్రం.. సీతాపతి వైజాగ్ వెళ్ళిపోయాడు. ప్రజాపతి చెన్నైలో తన ప్రియురాలు- విడో నర్స్ నాగమణి గృహంలో, ఆమె యిచ్చే ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ, ఆనందంగా వున్నాడు. పదిరోజులకు ఒకసారి గత ఐదు సంవత్సరాలుగా ప్రజాపతి నర్స్ నాగమణి గృహాన్ని పావనం చేస్తున్నాడు. ముఫ్పై అయిదేళ్ళ ప్రాయంలో వున్న నాగమణి మంచి చూపరి. చక్కటి శరీర సౌష్టవం, ముఖంలో మంచి ఆకర్షణ వున్న నాగమణి.. కనుబొమల మధ్య చిన్న స్టిక్కర్ బొట్టు పెట్టుకొని చూపరులకు సుమంగళిగానే గోచరిస్తుంది. వారిరువురి పరిచయం ఐదేళ్ళ క్రిందట చెన్నైవైపు వెళ్ళే హౌరా ఎక్స్ ప్రెస్లో కలిగింది. పరిచయం.. ప్రణయంగా మారిపోయింది. ప్రజాపతి.. చెన్నైలో తన మిత్రుడు పరంజ్యోతిని కలిశాడు. అతని కుమారుడు డాక్టర్ దివాకర్ను కూడా చూచి ప్రీతిగా పలకరించి మాట్లాడాడు.



రెండు వారాల తర్వాత మంచిరోజును ఎన్నుకొని.. గూడూరుకు పిల్లను చూచేదానికి వస్తామని పరంజ్యోతి ప్రజాపతికి చెప్పాడు. వారు ఆనందంగా మిత్రుని కౌగలించుకొన్నారు. మరుదినం మధ్యాహ్నం భోజన సమయానికి ప్రజాపతి గూడూరు చేరాడు. భార్య ప్రణవిని పిలిచి.. పరంజ్యోతి చెప్పిన మాటలను ఆనందంగా చెప్పాడు.



పరంజ్యోతి గురించి తెలిసి వున్న ప్రణవి ప్రజాపతి చెప్పిన మాటలను మౌనంగా విన్నది. అతనితో వాదన వలన ప్రయోజనం వుండదని ఆమెకు బాగా తెలుసు. కనుక.. ఎత్తుకుపై ఎత్తు వేసి పరంజ్యోతి.. భార్య.. కొడుకు వచ్చేనాటికి ఏదో సాకును కల్పించి వారు రాకుండా చేయాలని నిర్ణయించుకొంది.



"ప్రణవీ!.. అమ్మాయి ఢిల్లీ ప్రయాణం ఎప్పుడు?" అడిగాడూ ప్రజాపతి.



"ఎల్లుండి!.." ముక్తసరిగా చెప్పింది ప్రణవి.



"దీప్తి ఎక్కడ?.."



"తన గదిలో వుంది."



"ఓసారి ఇలా రమ్మను."



ప్రణవి దీప్తి గదిలో ప్రవేశించి..
"దీపూ!.. మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు" చెప్పింది.



ల్యాప్టాప్లో ఢిల్లీలోని తన స్నేహితురాలికి మెసేజ్ పంపి దీప్తి ప్రజాపతిని సమీపించింది. 
ఆమెను చూచి..
"రా దీపూ కూర్చో!" అన్నాడు ప్రజాపతి.



ప్రజాపతి ఎదురుగా హాల్లో వున్న సోఫాలో కూర్చుంది దీప్తి. 
"ఎల్లుండేనా నీ ఢిల్లీ ప్రయాణం!"



"అవును.."



"తిరిగి వచ్చేది ఎప్పుడు?"



"ఒక వారం రోజుల తర్వాత.." నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది దీప్తి.



"వారం రోజుల్లో తప్పకుండా తిరిగి రావాలి. పిల్ల వుండిపొమ్మన్నదని అక్కడ వుండిపోకూడదు."



"పెండ్లికి వెళుతున్నాను. పెండ్లి ముగిసిన రెండోరోజు బయలుదేరి వచ్చేస్తాను. అక్కడ నాకేం పని?"



"దీపూ!.. నేను నీ తండ్రిని. నేను నీ విషయంలో ఏది చేసినా అది నీ మంచికే. నా కూతురు మహారాణిలా బ్రతకాలి."



"నాకు అలాంటి ఆశ లేదు నాన్నా!.. మామూలు మనిషిగా బ్రతికి పదిమంది చేత.. మంచి పిల్లననిపించుకోవాలి. అంతే"



"అలాగా!.. సరే.. ఇక నీవు వెళ్ళవచ్చు!"



దీప్తి ఒకసారి తండ్రి ముఖంలోకి పరీక్షగా చూచి.. తన గదిలోకి వెళ్ళిపోయింది.
అంతవరకూ వారి సంభాషణను వింటూ నిలబడి వున్న ప్రణవి మౌనంగా వెనుతిరిగింది. ఆమెను చూచిన ప్రజాపతి..
"ప్రణవీ!.. నేను నీకు చెప్పిన విషయాన్ని దీపుకు చెప్పు!" అన్నాడు.



"అలాగే.." క్లుప్తంగా జవాబు చెప్పి ప్రణవి దీప్తి గదిలోనికి వెళ్ళిపోయింది.



దీప్తి ప్రక్కన మంచంపై కుర్చుంది. దివాకర్ విషయంలో ప్రజాపతి తనకు చెప్పిన విషయాన్ని విపులంగా వివరించింది. చివరగా "దీపూ!.. నీ ఉద్దేశ్యమేమిటో నాకు తెలుసు. ఈశ్వర్ నీకు అన్ని విధాలా తగినవాడు. అతనితోనే నీ వివాహం జరగాలి. నేను.. పరిస్థితులననుసరించి ఏం చెప్పినా విని.. నా నిర్ణయానుసారంగా నీవు నడుచుకోవాలి. ధైర్యంగా మీ నాన్నను ఎదిరించాలి. అర్థం అయిందా!.."



దీప్తి కొన్నిక్షణాలు తల్లి ముఖంలోకి పరీక్షగా చూచింది.
"ఏమిటే!.. అలా చూస్తున్నావ్!" అడిగింది ప్రణవి.



"అమ్మా!.. బావ!.." ఆగిపోయింది దీప్తి.



"నిన్ను ఏమన్నా అన్నాడా!.."



"లేదు.."



"మరేంటి?"
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 13 - by k3vv3 - 24-02-2025, 11:23 AM



Users browsing this thread: 1 Guest(s)