7 hours ago
E5
బావ మరదలు ఇద్దరు చీకట్లో నడుచుకుంటూ వెళ్లి చెరువు దెగ్గర ఆగారు. అక్కడో పెద్ద చెట్టు ఉంది, కొమ్మ మీద ఎక్కి చెయ్యిస్తే పట్టుకుని పైకి ఎక్కింది. ఇద్దరు కూర్చున్నాక నిధి బావ మీదకి ఒరిగిపోయింది.
శివ : ఇక చెప్పు
నిధి : నువ్వే చెప్పాలి, తరువాత ఏం చేయబోతున్నావ్ ?
శివ : అవన్నీ నేను చూసుకుంటాలే, నీ గురించి చెప్పు
నిధి : నీకు అస్సలు కోపమే రాదా
శివ : కోపం తెచ్చుకోవడం, బాధ పడటం వల్ల
నిధి : మాటలు చెప్పకు, నువ్వెంటో నాకు బాగా తెలుసు.
శివ గుండె మీద తల పెట్టి కళ్ళు మూసుసుకుంది
శివ : నీ గురించి చెప్పు
నిధి : నాకు ఒక్కటే ఆలోచన, నిన్ను పెళ్లి చేసుకుని నీతొ పాటు ఉండాలని. పెద్దగా చదివేదాన్ని కాదు. ఇన్నేళ్లు వంట పని, ఇంటి పని నేర్చుకున్నా.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే సుబ్బరంగా కాపురం చేసుకుంటా
శివ : పెద్ద ప్లానింగే ఇది
"చలిగా ఉంది" అని ఇంకాస్త దెగ్గరికి వచ్చింది. వెన్నెల వెలుగులో ఇంకో చందమామలా కనిపించింది, చందమామని చూస్తే "ఎందుకు బ్రో ప్రతీ అమ్మాయిని నాతొ పోలుస్తారు" అని అడిగినట్టు అనిపిస్తే "అవునులే నీతో పోలికేంటి, నిన్ను నా నిధిని పక్కన పెడితే నీ పేరు తీసి నా నిధికి పెట్టేస్తారు" అని నవ్వుకున్నాడు. చంద్రుడు కోపంతో మబ్బులని రెండు చేతులతో పట్టుకుని లాగి తనని కప్పేసుకున్నాడు. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి, ఇక పెదాలే లేటు అన్నట్టుగా దెగ్గరికి తెచ్చి పెట్టింది నిధి, కళ్ళు మూసుకుంది. శివ కూడా కళ్ళు మూసుకున్నాడు. మొదలెట్టండి మహాప్రభో అని గుడ్లగూబ కూడా ఇంకా టెన్షన్ పెంచుతు శబ్దం చేసింది. క్గూ... అన్న శబ్దం వినగానే ఇద్దరు ఒక్కటైపోయారు. నిధి ఆగలేకపోయింది, ఆవేశంగా శివ ఎంగిలి జుర్రుతుంటే వీపు మీద చెయ్యేసి నెమ్మది చేసాడు.
నిధి కళ్ళు తెరిచి చూస్తే తననే చూస్తున్నాడు. "బాగుంది" అని నవ్వింది. సంకేతంగా మళ్ళీ కళ్ళు మూసుకుంటే మరదలిని తన కౌగిలిలో వెచ్చగా బంధిస్తూ చలిని తమ దెగ్గరికి రాకుండా ముద్దాటలో నిమగ్నమైపోయారు.
నిధి : ఏదో అయిపోతుంది
శివ : ఇప్పుడే వద్దులే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు
నిధి : వాటేసుకో
నడుముని చుట్టేసి దెగ్గరికి లాక్కుంటే శివ మొహం అంతా ముద్దులు పెట్టేసింది నిధి.
xxx + xxx
పది రోజులు గడిచిపోయాయి, వసుధ ఇంటికి తన అమ్మా నాన్న వస్తే టీ పెట్టింది. అస్సలు పేరుకే ఉండడం వేరే గానీ రామరాజు ఒక పూట భోజనం కూతురు దెగ్గరే అయిపోతుంది. ఆదివారం తలకాయ కూర తెచ్చినా ఇంకే నీసు తెచ్చినా అమ్మమ్మా తాతయ్య ఇంటికి వచ్చి భోజనం చెయ్యాల్సిందే లేకపోతే ఒప్పుకోడు శివ. అందుకే రామరాజుకి కొడుకు తరుపున మనవళ్ళ కన్నా కూతురి కొడుకు అంటే ఇష్టం, అభిమానం. ఎంత ఎదిగినా మనవడు విలువలు మర్చిపోడని తెలుసు రామరాజుకి.
రామలక్ష్మి : షాపు కష్టంగా ఉందట నీ అన్నలకి, శివని కొన్ని రోజులు రమ్మంటే రానన్నాడట. కోపంతో ఊగిపోతున్నారు ఇద్దరు
రామరాజు : వాటా ఇమ్మన్నప్పుడు వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పారు, అదే పని వీడు చేస్తే కోపం వస్తుందా.. అస్సలు నేను మీకు ఏమి ఇవ్వను మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటే ఏం చేసేవాళ్ళు ?
రామలక్ష్మి : ఇది మరీ బాగుంది
రామరాజు : నోరుముయ్యి, నువ్వు నీ కొడుకుల వైపే మాట్లాడతావ్, వాడు కాబట్టి ఏ గొడవ లేకుండా ఉంది. అమ్మాయి, నేను బాధపడతామని వాడేం మాట్లాడట్లేదు. కనీసం న్యాయంగా పెద్దొడి కూతురిని శివకి ఇచ్చి చెయ్యమను
వసుధ : నాన్న నువ్వు ఏమి మాట్లాడకపోతేనే బాగుంటుంది
రామరాజు : క్షమించవే తల్లీ, మనసులో మాట బైటికి వచ్చేసింది
రామలక్ష్మి : నన్ను ఒకసారి కదిలించి చూడమంటావా వసు..
వసుధ : వద్దమ్మా ఇప్పుడు పరిస్థితులు బాలేవు ఆ విషయం నేను నా కొడుకే తేల్చుకుంటాం
రామరాజు : ఇంతకీ ఏం చేస్తున్నాడు వాడు
వసుధ : పొద్దున్నే లేచి తిని గ్రౌండుకి వెళ్లి సాయంత్రం వచ్చి తినేసి పడుకుంటున్నాడు, తినడం పడుకోడం ఇదే పని అయ్యగారు
రామరాజు : సెలవలు సరిపోలేదా వాడికింకా
వసుధ : అదిగో వస్తున్నాడు నువ్వే అడుగు
శివ : ఏంటో మీటింగు పెట్టారు
రామరాజు : ఏం చేద్దామనీ
శివ : చెప్పు నువ్వే..
రామరాజు : నీకు షాపు కావాలేంట్రా ఫోను మాట్లాడుతూ నడి రోడ్డు మీద నిలబెట్టి అమ్మే సత్తా ఉన్నోడివి
శివ : షాపులు కాదు ఇంకేదైనా పెద్దది
రామరాజు : ఏం చేస్తున్నావ్
శివ : చెప్తా ఓ ఐదు వందలు ఇవ్వు, అమ్మా నువ్వు కూడా అంటే ఇచ్చారు. ఇంకో వెయ్యి కావాలి అని లేచి బైటికి వెళ్ళాడు
రామలక్ష్మి అయోమయంగా "ఏందిది ?" అంటే వసుధ, రామరాజు ఇద్దరు గట్టిగా నవ్వారు.
సురేఖ : అల్లుడు రారా.. కూర్చో
గౌరీ : రాయ్యా
సురేఖ : మనసులో ఏం పెట్టుకోమాకయ్యా, మాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే, కాలం గడిచే కొద్ది వాళ్ళకే తెలుస్తాయి. అప్పటిదాకా ఓపిక పట్టడమే
శివ : ఊరికే వచ్చా అత్తా, ఎవ్వరు లేరా ?
గౌరీ : ఉన్నారు, రేయి అందరూ రండి అంటే పిల్లలు బైటికి వచ్చారు.
ప్రియ : ఏంటి మామ్
గౌరీ : ఇంటికి బావ వచ్చాడు, కనీసం పలకరించరా
ప్రియ : హాయ్ బావా.. ఇక వెళ్లొచ్చా
గౌరీ కోపంగా "నీ పొగరు.." అంటుంటే శివ మధ్యలో కల్పించుకుని "అత్తా.. నేను వాళ్ళ కోసం రాలేదు" అని నిధి వైపు చూసాడు. సురేఖ లేచి "ఉండయ్యా కాఫీ పెట్టుకొస్తాను" అని లోపలికి వెళ్ళింది. గౌరీ, నిధి, శివ మాత్రమే మిగిలారు.
శివ : అత్తా.. వ్యాపారం మొదలు పెడుతున్నాను, నీ చేత్తో ఒక ఐదు వందలు ఇవ్వు అంటే గౌరీ ఆనందంగా లోపలికి వెళ్ళింది. నువ్వు కూడా అన్నాడు. నిధి వెంటనే తన ఫోన్ పౌచ్ తీసి ఐదు వందల నోట్ తీసి ఇచ్చింది.
నిధి : ఆల్ ద బెస్ట్ అని గొంతు తగ్గించి చెప్పింది
శివ : కొబ్బరికాయ కొట్టాల్సింది నువ్వే
నిధి : ఎలా
శివ : తాతయ్య చూసుకుంటాడులే
నిధి సరే అని నవ్వింది. గౌరీ ఐదు వందలు తెచ్చిస్తే తీసుకున్నాడు. రెండు వేలల్లో చిన్న వినాయకుడి బొమ్మ ఒకటి తెచ్చి అందులోనే పూజ సామాగ్రి కూడా తీసుకున్నాడు. తెల్లారి పూజ పెట్టుకుంటే సాయంత్రం వసుధ వెళ్లి అందరిని పిలిచింది.
పూజ రోజు
నిధి : నేను రాను మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు.
సురేఖ : అలా అనకూడదే.. మనోడి కోసం మనం వెళ్లకపోతే రేపు మనకంటూ ఎవరు మిగులుతారు చెప్పు
నిధి : అయితే నాకు చీర కట్టు
సురేఖ : టైం లేదు పదా
నిధి : ప్రిన్సెస్ ఇక్కడ, నేను వచ్చేవరకు అది మొదలవ్వదు కానీ చీర కట్టు
సురేఖ : ఏం పిల్లలు పుట్టారే అస్సలు మాట వినరు, నా ఖర్మ.. రా కడతాను
ఊరంతా వచ్చింది పూజకి, అందరికీ తెలుసు ఏం జరిగిందో అయినా ఎవ్వరు మాట్లాడలేదు. దెబ్బతిన్న శివే మౌనంగా ఉండేసరికి మిగతా ఎవ్వరు ఆ ఊసు కూడా ఎత్తలేదు. టైం అవుతుందనగా నిధి చీర కట్టుకుని తన వాళ్ళతొ వస్తుంటే వసుధ ఎదురు వెళ్ళింది. "రండి వదినా, ప్రియా.. నిధి అక్క చూడు ఎంత బాగుందో నువ్వు కూడా చీర కట్టుకోవాల్సింది కదా" అంది నవ్వుతూ
ప్రియ : రావడమే ఎక్కువ, ఏదో బతిమిలాడితే వచ్చాం.. అంటుంటే గౌరీ ప్రియ మూతి మీద కొట్టింది. అందరి ముందు కొట్టేసరికి ప్రియ అహం దెబ్బతిని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది.
రామరాజు : త్వరగా రండి టైం అవుతుంది, అమ్మా నిధి.. ఆ కొబ్బరికాయ తీసుకుని ఇలారా
నిధి సురేఖ వంక చూస్తే "ఈ ఒక్క పూట, మా అమ్మగా" అని బతిమాలితే సరే అంది నిధి. వసుధ, శివ, రామరాజు ముగ్గురు చెప్పట్లు ఒక్కటే కొట్టలేదు నిధి పెర్ఫార్మన్స్ కి.. అంతలా జీవిస్తుంది.
మొత్తానికి నిధి కొబ్బరికాయ కొట్టేసింది, హారతి ముందుగా శివకి తరువాత అందరికీ ఇస్తుంటే తన మావయ్య రామరాజు సంతోషం చూసి సురేఖకి ఏదో చిన్న అనుమానం వచ్చినా అక్కడ సందడిలో పట్టించుకోలేదు.
ఇంతవరకు శివ ఏం చెయ్యబోతున్నాడో ఏ వ్యాపారం పెడుతున్నాడో ఎవ్వరికి తెలీలేదు.
నచ్చితే Like & Rate
Comment కూడా..

xxx xxx