21-02-2025, 04:33 PM
(This post was last modified: 21-02-2025, 05:06 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
27. షేర్ హోల్డర్స్
ప్రభు గ్రూప్స్ షేర్ హోల్డర్స్ మీటింగ్..
లావణ్య "నీకు ఏ ఇబ్బంది లేదు, నేను ప్రభు గారి పక్కనే చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను.. వీళ్లు అందరూ నాకు తెలుసు.. నేను చూసుకుంటాను"
క్రిష్ ఆమెను సూటిగా చూసి "నేను చెప్పిన పని చేశావా!"
లావణ్య "ఏం పని?"
క్రిష్ "నూతన్.."
లావణ్య మొహంలో రంగులు మారిపోయాయి.
క్రిష్ "చెప్పిన పని చూడు.."
లావణ్య తల ఊపి బయటకు వెళ్ళింది.
క్రిష్ ఇలా అయితే సరిపోదూ అనుకుంటూ మరో లోకల్ డిటెక్టివ్ కి కూడా నూతన్ సంగతి కనుక్కోమని డీటెయిల్స్ పంపించాడు.
బోర్డు మీటింగ్ స్టార్ట్ అయింది.
మైకెల్ "ఇలా అయితే ఎలా అండి?"
మిదున్ "ఏమయింది?"
మైకేల్ "మరీ బిటెక్ కంప్లీట్ అవ్వగానే, ఇలా తీసుకొచ్చి మన నెత్తిన పెట్టేస్తారా.. పైగా ఇతనేమి ప్రభుకి పుట్టిన వాడో, పెంచిన వాడో కాదు.."
మిదున్ "ఇతనికి, నూతన్ కి పడదు అంట.. అందుకని ఇతన్ని ఇక్కడ ఉంచితే నూతన్ ఎక్కడున్నా తిరిగి వస్తాడని.."
మైకేల్ "నూతన్ రాకపోతే బ్రతిమలాడుకుంటారు.. అంతే కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళను తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతారా.."
సురభి "మిస్టర్ క్రిష్ మొన్నటి వరకు ఫండ్ మేనేజర్ గా పని చేశారు"
మిదున్ "వాట్ నాన్సెన్స్.. అతనికి మొన్నే బిటెక్ కంప్లీట్ అయింది.."
సురభి "అతని వైఫ్ మరియు కొడుకుని పోషించుకోవడం కోసం నా దగ్గరే ఇంటర్న్ గా జాయిన్ అయ్యాడు"
మిదున్ "చూశారా మైకేల్.. అప్పుడే పెళ్లి.. పిల్లలు.. నిండా పాతికేళ్ళు కూడా లేవు.."
సురభి "విడిపోయారు కూడా.."
మైకేల్ "వాట్.."
సురభి "ఇప్పుడు నేను చెప్పేది వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది"
మైకేల్ "ఏమిటది?"
మిదున్ "ఏముంది? మళ్ళి పెళ్లి అయి ఉంటుంది"
సురభి నవ్వేసింది.
మైకేల్ అటూ మిదున్ ని ఇటూ సురభిని మార్చి మార్చి చూస్తూ కళ్ళు పెద్దవి చేసుకొని "నిజమా.." అంటూ ఆశ్చర్య పోయాడు.
సురభి "ఆ అమ్మాయి వీడి కంటే ఐదేళ్ళు పెద్దది అంట.. "
మైకేల్ "వద్దు.. వద్దు.. ఇంకేం చెప్పొద్దూ.. వింటే నాకు హార్ట్ ఎటాక్ వచ్చేస్తుందేమో.."
మిదున్ మరియు సురభి ఇద్దరూ నవ్వేశారు.
కొద్ది సేపటికి గదిలోకి ప్రభుతో పాటు మరికొందరు షేర్ హోల్డర్స్ లోపలకు వచ్చారు. ఒక వైపు క్రిష్ నిలబడి ఉండగా, మరో వైపు లావణ్య నిలబడి మీటింగ్ హాల్ లోకి నడుచుకుంటూ వచ్చారు.
సెంటర్ లో ఉన్న కుర్చీలో ప్రభు కుర్చోగా అతని రైట్ సైడ్ లో క్రిష్ మరో వైపు లావణ్య కూర్చున్నారు.
అందరూ తమ తమ పొజిషన్ లలో కూర్చొని ఉన్నారు.
ప్రభు అందరిని పలకరిస్తూ తన ముందు ఉన్న డాక్యుమెంట్స్ ని పైపైన చూస్తూ ఉన్నాడు.
మైకేల్ పైకి లేచి ఎదో చెప్పబోయేంతలో.. ప్రభు డాక్యుమెంట్స్ నుండి మైకేల్ వైపు చూడగానే.. అతను కూర్చుండి పోయాడు.
ప్రభు "ఇదేమన్నా.. కాలేజ్ అనుకున్నారా.. మిస్టర్ మైకేల్.. కూర్చొని మాట్లాడండి.." అని నవ్వుతూ అన్నాడు.
మైకేల్ నవ్వుతూ కూర్చున్నాడు.
ప్రభు రకరకాల విషయాలు మాట్లాడుతూ మధ్యలో క్రిష్ ని కొన్ని డిపార్టమెంట్ లకు వైస్ చైర్మన్ గా ప్రకటించాడు.
ఎవరూ ఏం మాట్లాడక పోవడంతో అంతా ఓకే అన్నట్టు గా అయి ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోబోతూ క్రిష్ ఇక నుండి ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు అని ఈవెనింగ్ పార్టీకి పిలిచి వెళ్ళిపోయాడు.
మైకేల్ & co కి, తమకు మాట్లాడే అవకాశం రానందుకు రాత్రి పార్టీలో క్రిష్ ని అందరి ముందు అవమానించాలని ఫిక్స్ అయ్యారు.
పార్టీకి క్రిష్ ఎంటర్ అవ్వగానే అందరూ అతన్నే చూస్తూ ఉన్నారు. ప్రభు కూడా అక్కడే ఉండడంతో అతన్ని డైరక్ట్ గా ఎదిరించలేక సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ప్రభు అందరి ముందు "నాకు వారసుడుగా ఇక నుండి క్రిష్ ఉంటాడు, ఒక వేళ నూతన్ తిరిగి వచ్చినా కూడా.." అని ప్రకటించాడు.
కొంత మంది మేజర్ క్లయింట్ లకు క్రిష్ కలుస్తూ తన పరిచయలాని పెంచుకుంటూ ఉన్నాడు.
మనుషులు అందరూ గ్రూప్ గ్రూప్ లుగా నిలబడి చేతిలో ఒక వైన్ గ్లాస్ పెట్టుకొని తాగకుండా, చెంపలు నొప్పి పుట్టేలా నవ్వుతూ, పరిచయాలు పెంచుకుంటూ సంతకాలు మాత్రమే మిగిలిపోయేలా రకరకాల బిజినెస్ డీల్స్ జరిగిపోతూ ఉన్నాయి.
క్రిష్ అక్కడ కనపడకపోవడంతో మైకేల్ "తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు.. ఖరీదైన వైన్ కదా కక్కుర్తి పడి ఉంటాడు.." అని తిట్టుకుంటూ ఉన్నాడు.
ఇంతలో క్రిష్ ఒక ప్రవేటు రూమ్ నుండి మరి కొంత మంది ఇంపార్టెంట్ క్లయింట్ లతో బయటకు వచ్చాడు, వాళ్ళ మొహాలను చూస్తూ ఉంటే ఎదో డీల్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది.
క్రిష్ తిరిగి అదే ప్రవేట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
మైకేల్ ఇక భరించలేక తన ముందు ఉన్న వైన్ గ్లాస్ మొత్తం తాగేసి "పదండి.. ఇవ్వాళ ఏది అయితే అది అవుతుంది.." అనుకుంటూ క్రిష్ దగ్గరకు కోపంగా వెళ్ళాడు.
దారిలోనే మిదున్ వచ్చి మైకేల్ ముందుకు వచ్చి ఆపేశాడు, మైకేల్ "ఆపకు.. ఇవ్వాళ నేనో వాడో తేలిపోవాలి.."
మిదున్ "వద్దూ.. తాగి ఉన్నావ్.. వద్దూ.." అంటూ ఆపుతున్నాడు.
మైకేల్ అందరూ చూస్తూ ఉండగా.. మిదున్ ని తోసేసి క్రిష్ ముందుకు వెళ్లి నిలబడ్డాడు.
క్రిష్ "చెప్పండి మిస్టర్ మైకేల్ మీరు నాతో ఏమయినా మాట్లాడాలని అనుకుంటున్నారా.." అని అడిగాడు.
మైకేల్, క్రిష్ ని కోపంగా చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి చిటికే వేశాడు.
కళ్ళు తెరవగానే అందరూ తన కంట్రోల్ లోకి వస్తారు అని ఎక్సపర్ట్ చేశాడు.
క్రిష్ తననే చూస్తూ ఉండడం చూసి మైకేల్ కి నూతన్ గుర్తొచ్చాడు. అతని మాటలు గుర్తొచ్చాయి.
"క్రిష్ జోలికి ఎవరూ వెళ్లొద్దు.. అతన్ని మనం ఎవరం కంట్రోల్ చేయలేం.."
మైకేల్ అతన్ని చూస్తూ చిన్నగా అక్కడ నుండి బయటకు వెళ్లిపోయాడు.
క్రిష్ అసలు ఏమి పట్టించుకోకుండా తన పనిలోకి తానూ వెళ్లిపోయాడు.
నూతన్ "క్రిష్ జోలికి ఎవరూ వెళ్లొద్దు.."
మైకేల్ "ఆ క్రిష్.. చాలా ఎక్కువ చేస్తున్నాడు.. కొత్త కొత్త ప్రాజెక్టులు.. అదీ ఇదీ.."
నూతన్ "షట్ అప్.."
మైకేల్ ".."
నూతన్ "క్రిష్ కి బిజినెస్ మైండ్ ఉంది.. అతను ప్రభు గ్రూప్స్ కి సరైన వ్యక్తీ.."
మైకేల్ "కానీ.."
నూతన్ "కానీ.. గీనీ ఏమి లేదు.. క్రిష్ ని నేను కంట్రోల్ లోకి తెచ్చుకుంటే, కంపనీ కూడా నా కంట్రోల్ లో ఉన్నట్టే.." అని కట్టేశాడు.
మిదున్ "ఇప్పుడు ఏం చేద్దాం.."
మైకేల్ "విన్నావు కదా.."
సురభి "ఆల్మోస్ట్ అందరం కూడా నూతన్ మనుషులమే.. ఇప్పుడు క్రిష్ ఎంత ఎదిగినా.. మనం అతన్ని ఓడించే రోజు వస్తుంది.." అంది.
మైకేల్ "సరే.. ప్రస్తుతం అదే ఫాలో అవుదాం.." అనుకున్నారు.
మరుసటి రోజు.. మైకేల్ ఫ్లవర్ బోకే తీసుకొని క్రిష్ ని నవ్వుతూ వెళ్లి కలిసి వచ్చారు.
క్రిష్ "మనం ఎదగాలి.." అంటూ స్పీచ్ ఇచ్చాడు. అందరితో పాటు నూతన్ మనుషులు నూతన్ ఆర్డర్ ప్రకారం కూడా ఫుల్ సపోర్ట్ చేశారు.
నూతన్ మాల్ సిసి వీడియోని చూస్తూ "ఒకే సారి ఇంత మందిని కంట్రోల్ చేసిందా.."
విజయ్ "ఆ ఇద్దరూ.."
నూతన్ "ఆ ఇద్దరి సంగతి పక్కన పెట్టు.. తను ఎందుకు అలా బిహేవ్ చేసింది.. "
విజయ్ "ఏదైనా మత్తు మందు యిచ్చి ఉంటారు.."
నూతన్ "మేఘ నిజానికి ఒకే సారి ఇద్దరినీ మాత్రమే కంట్రోల్ చేయగలదు.. అలాంటిది ఈ మత్తు మందు తీసుకున్నప్పుడు.. తను అన్ లిమిటెడ్ గా మారిపోయింది"
విజయ్ "హుమ్మ్.."
నూతన్ "నువ్వు ఆ మత్తు మందు ఏంటో తెలుసుకో.. గోవా నుండి ఒకమ్మాయిని పంపిస్తున్నాను.. తన మీద ప్రయోగాలు చేయించు.."
విజయ్ "అలాగే.."
నూతన్ "ఆ ఇద్దరి డీటెయిల్స్ నాకు పంపించు.."
విజయ్ "ఇదిగో పంపించాను.. వాళ్ళ పేర్లు సుహాస్... కేశవ్..."
నూతన్ "వాళ్లకు ఎలా తెలిసింది.."
విజయ్ "సైకియాట్రిక్ డాక్టర్ త్రిషా..."
నూతన్ పెదవుల మీద నవ్వు వచ్చి చేరింది.
నూతన్ "పేరు బాగుంది.... సుహాస్..."
నూతన్
![[Image: HD-wallpaper-gojo-satoru-anime-gojou-jap...-fight.jpg]](https://i.ibb.co/HJZRFFD/HD-wallpaper-gojo-satoru-anime-gojou-japan-jjk-jujutsu-kaisen-manga-sorcery-fight.jpg)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them