20-02-2025, 12:20 AM
నిన్ను కోరే వర్ణం
E4
వసుధ : ఇలాంటి అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టాలి, మనం అదృష్టవంతులం. నిధిని నీకు అడిగే ధైర్యం నాకివ్వు శివుడు. ఎట్టి పరిస్థితుల్లొ అది నాకు కోడలిగా రావాలి
శివుడు : నేను బైటికి వెళ్ళొస్తా
వసుధ : పనా ?
శివుడు : గాలి తిరుగుళ్ళు తిరిగి చాలా రోజులైంది, ఊరు చుట్టి వస్తా
ఇంతలో "అమ్మాయి" అన్న కేక వినగానే ఇద్దరు నవ్వుతూ హాల్లోకి వచ్చారు.
వసుధ : రా నాన్నా, ఉండు టీ పెట్టుకొస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది
శివ : ఏంటి రామరాజు గారు మనవళ్లు, మనవరాళ్ళని వదిలి ఇటొచ్చారు
రామరాజు : మరి నువ్వెవడివే గోసిగా, తన్నులు పడతాయి గాడిద కొడకా నవ్వుతూనే పంచలో మంచం మీద కూర్చున్నాడు.
శివ : అమ్మోయి నిన్ను తాత గాడిద అంటున్నాడే
రామరాజు : ఏడిసావ్ లే.. ఎక్కడికి రెడీ అయ్యావ్
శివ : మన కొట్టుకే
రామరాజు : అయిపోయిందిగా వాళ్ళు చేసింది చాల్లేదా, మళ్ళీ దేనికి ?
శివ : నా మొహం కనిపించకపోతే సామాను ఎవడు కొంటాడే
రామరాజు : అది ఆ గాడిద కొడుకులకి త్వరలోనే తెలుస్తుందిలే, నువ్వేం వెళ్లనవసరం లేదు. మూసుకుని కూర్చో
వసుధ టీ ఇచ్చింది
శివ : అమ్మా.. మనం అందరం గాడిదలమే తాత దృష్టిలో, చివరికి ఆయన కూడా అదేనట
వసుధ : ఊరుకో.. ఏంటి వేళాకోళాలు, తాత తోనా.. ఏదో పనుంది అన్నావు వెళ్ళు
శివ : వెళుతున్నా.. తాత గారు పొయ్యి వస్తా
రామరాజు : నువ్వేమి వాళ్ళని ఉద్దరించాల్సిన అవసరం లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు.
శివ నవ్వుతూనే "అలాగే" అని అరుస్తూ బైటికి వెళ్ళిపోయాడు. వసుధ ఏంటి అని అడిగితే చెపుతున్నాడు రామరాజు. బైటికి వచ్చిన శివ ఫోన్ తీసి గ్రూప్ కాల్ చేసాడు.
శివ : ఎక్కడున్నార్రా ?
నవీన్ : కొట్టంలో రా
ప్రతీక్ : రోడ్డు మీద రా
చింటు : షో రూములో
కార్తిక్ : కాళీ రా
సాత్విక్ : నేను కాళీనే బా
ప్రణయ్ : నేను కూడా
శివ : సరే కాళీగా ఉన్నవాళ్లు కూల్ కొచ్చెయ్యండి క్రికెట్ ఆడదాం
అందరూ "అలాగే మావా" అని పెట్టేసారు. రోడ్డు మీద నడుస్తుంటే ప్రతీ ఒక్కళ్ళు శివని పలకరించేవాళ్ళే అందరిని పలకరిస్తూనే షాపు దెగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఉన్న షాపుని చూడగానే ఎనిమిదేళ్ళ క్రితం గతం గుర్తుకు వచ్చింది.
ఒకప్పుడు ఇది చిన్న గుడిసె కొట్టు, పదిహేను వేల రూపాయలతొ మొదలయిన షాపు, నాన్న పోయాక ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు తాతయ్య తన ఇద్దరి కొడుకుల దెగ్గర అప్పుగా పదిహేను వేలు ఇప్పించి పెట్టించాడు. గుంజలు పాతడం నుంచి తాటాకుల కప్పు వరకు మొత్తం శివ వేసిందే. ఇప్పుడు ఇంత పెద్ద షాపు అయ్యింది. ఆ రోజు ఒక్కడే ఈ రోజు ముగ్గురు మేనేజర్లు, ముప్పై మంది పనోళ్లు.
చుట్టు పక్కన ముప్పై ఊళ్లలో దొరకని ఏ సామాను అయినా ఇక్కడ దొరుకుతుంది. ఈ ఊరు పేరు అందరికీ వినపడడానికి కారణమే ఈ షాపు, ఇక్కడ బస్సు స్టాపు, అడ్డా, చుట్టు పక్కన కిరాణా, కేంద్రాలు, ఆఫీసులు అన్నిటికి కారణం ఈ షాపు. సోమవారం పొద్దున ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు జాతరలా అనిపించే జనం. ఇల్లు కట్టాలా ఇదే షాపు, ఆటోమొబైల్స్ ఇదే షాపు, సైకిల్ నుంచి లారీ వరకు, నట్ నుంచి బోల్ట్ వరకు దొరకనిదంటూ లేదు.
"ఏరా అక్కడే నిలుచున్నావ్, లోపలికిరా" అన్న పెద్ద మావయ్య సుభాష్ మాట విని తల దించి లోపలికి చూసాడు. ఒక కుర్చీ స్థానంలో రెండు కుర్చీలు, తాతయ్య కొడుకులు ఇద్దరు కూర్చున్నారు. లోపలికి నడుస్తుంటే అందరూ నమస్తే శివా అంటుంటే చెయ్యి ఎత్తాను. ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు.
సుభాష్ : ఇంకా చెప్పరా, రేయి పిల్లల్ని పిలుపు. అస్సలు ఇంటికి రాలేదేంట్రా. మా మీద కోపం ఏమైనా పెంచుకున్నావా ?
ధీరజ్ : వస్తున్నారు, అని శివని చూసి మన షాపు చూస్తానంటే రమ్మన్నాను.
నలుగురు ప్రియ, నిధి, ప్రవీణ్, నితిన్ వస్తున్నారు.
శివ : అదేమి లేదు మావయ్యా, నిజం చెప్పాలంటే నన్ను ఆదుకున్నది మీరే. మీరే గనక ఆ పదిహేను వేలు ఇవ్వకపోతే నా బతుకు ఇంకోలా ఉండేదేమో
సుభాష్ : ఊరుకోరా మా చెల్లి కొడుకు కోసం ఆ మాత్రం చెయ్యమా కానీ తాతయ్య మేమేదో నిన్ను మోసం చేసినట్టు మాట్లాడాడు. పదిహేను వేలు నీకు అప్పు ఇచ్చిన మాట వాస్తవమే, నువ్వు తిరిగిచ్చేటప్పుడు ఆ రోజు నీ ఇబ్బంది చూసి వద్దులేరా మాకు లాభాలు ఇవ్వు చాలు అన్నాను. దానికి నువ్వు ఒప్పుకున్నావ్
శివ మొహం ప్రశాంతంగా ఉంది. (అబద్ధం.. అప్పు తీరుస్తుంటే షాపు ఎదగడం చూసి బలవంతంగా ఒప్పించారు, ఆ రోజు బతిమిలాడిన మనుషులు ఈ రోజు సంజాయిషీ ఇస్తున్నారు) మొహంలో నవ్వు చెక్కు చెదరలేదు.
సుభాష్ ఇంకేదో చెపుతుంటే "అయిపోయినవి ఇప్పుడెందుకులే మావయ్యా, వీళ్లేనా మీ పిల్లలు" అన్నాడు నలుగురిని చూసి. తన నాన్న మాటలు విన్న నిధి మొహం మాత్రం కోపంతొ ఎర్రబడటం చూసిన శివకి నవ్వొచ్చింది.
ధీరజ్ : అవునురా అదిగో వాడు ప్రవీణ్, ఇది ప్రియ నా పిల్లలు. ఇక వాళ్ళు నితిన్, నిధి పెద్ద మావయ్య పిల్లలు. నిధి నీకు తెలుసుగా చిన్నప్పుడు తెగ ఆడుకునేవాళ్ళు
శివ హాయ్ అని చెయ్యి ఊపితే హాయ్ అన్నారు. గ్రౌండుకి వెళుతున్నా క్రికెట్ ఆడదాం వస్తారా
నితిన్ : వాట్ క్రికెట్, నొ నొ ఐ డోంట్ లైక్ క్రికెట్. ఐ ప్లే బేస్ బాల్
శివ : ఏంటి మావయ్య నీ కొడుక్కి తెలుగు రాదా
సుభాష్ : వచ్చురా అక్కడ అలవాటు అయ్యి
లోపల నుంచి మేనేజర్ బిల్ తెచ్చాడు. సుభాష్, ధీరజ్ ఇద్దరు ఫైల్ చూస్తూ బిల్ వేస్తుంటే. మేనేజర్ శివ వైపు చూసి అన్నా అని సైగ చేసాడు. ఇదంతా నిధి చూస్తుంది. ఆగమన్నాడు శివ, మేనేజర్ ఇంకో పది నిమిషాలకి మళ్ళీ శివ వైపు చూసి అన్నా టైం అని చెయ్యికి ఉన్న వాచీ చూపించాడు. దణ్ణం పెడుతూ చేతులు ఎత్తితే
శివ : సరే నేను వెళ్ళాలి, మావయ్య బిల్ నేనేసిస్తా ఇవ్వండి
ధీరజ్ : పర్లేదు లేరా మాకూ అలవాటు కావాలి కదా, మేము చూస్తాంలే
శివ లేచి "నేను వెళతా అయితే" అన్నాడు. నిధి వంక చూసి చూడనట్టు చూసి బైటికి నడుస్తుంటే. సుభాష్ గొంతు వినపడింది, "ఏరా ఏదో పెడుతున్నావని విన్నాను, పెట్టుబడికి సాయం ఏమైనా కావాలా ?"
వెనక్కి తిరిగి చూస్తే నిధి పళ్ళు కొరుకుతూ తన నాన్నని చూసిన చూపుకి, శివ గట్టిగా నవ్వాడు.
శివ : పెట్టుబడి ఉందిలే మావయ్యా అని బైటికి నడిచాడు. "బానే వెనకేశావ్ అయితే" అన్న ధీరజ్ మాటలు వినినట్టే బైటికి నడిచాడు.
క్రికెట్ గ్రౌండ్ కి వెళ్లి చూస్తే అక్కడో ఇరవై మంది పోగై ఉన్నారు. అందరూ ఈ ఊరి వాళ్ళే, అందరూ స్నేహితులే
శివ : మీరెంట్రా ఇక్కడా
చాలా రోజులు అయిపోయింది కద మావా, దా ఓ ఆట ఆడదాం.
శివ : ఈ పొట్టతొ ఆడదామనే అంటే నవ్వారు
టీమ్స్ ఏర్పాటు చేసాక, టాస్ పడ్డాక శివ బాటింగ్ తీసుకున్నాడు. ఫోను మోగింది. షాపు మేనేజర్ నుంచి.
శివ : హలో
సుభాష్ : శివా నేను మావయ్యని, ఇందాక బిల్ దెగ్గర కస్టమర్ మాట వినట్లేదు.
శివ : ఏం ఏం తీసుకున్నారు ?
సుభాష్ : పెద్ద లిస్టే ఉంది
శివ : ఒకసారి మేనేజర్ కివ్వు
మేనేజర్ : శివా..
శివ : ఎవరు అన్నా
మేనేజర్ : మద్దిపాలెం నుంచి మహేష్
శివ : వాడా ఏం తీసుకున్నాడు ?
మేనేజర్ చెపుతుంటే వేళ్ళ మీద బిల్ వేసి డెబ్భై ఐదు వేలు చేసాడు. ఫోన్ వెంటనే సుభాష్ చేతికి వెళ్ళింది.
సుభాష్ : మేము బిల్ చేస్తే లక్షా ఇరవై ఐదు వేలు వచ్చింది, నువ్వు డెబ్భై ఐదు చేసావ్
శివ : అక్కడున్న ఫైల్ రేట్లు ఊళ్లలో నడవవు మావయ్యా.. అవన్నీ మీకు మేనేజర్ తరువాత చెప్తాడులే, బిల్ డెబ్భై ఐదు అయింది, డిస్కౌంట్ కింద మీరో ఐదు తీయండి, బేరం కింద వాడో ఐదు తీస్తాడు. అరవై ఫైనల్ చెయ్యండి. లిమిటెడ్ లాభం. వాడి పేరు మీద పది మంది వస్తారు, ఎక్కువ లాభం చూడకూడదు. ఉంటాను.
"ఒరేయి బాబు, ఆపరా నీ పత్తాపారం"
శివ : అయిపోయింది అయిపోయింది. ఫోను జేబులో దూర్చాడు.
ఆట మొదలయింది.
xxx xxx xxx
అర్ధరాత్రి సుభాష్ ఇంటి గేటు నుంచి ఒక శాల్తీ బైటికి దూకింది. అప్పుడే ఉచ్చోసుకుందామని బైటికి వచ్చిన రామరాజుకి అది కనిపించి మెల్లగా చెట్టు చాటున నీడలో వెళ్ళాడు. సమయం చూసుకుని ఒక్క ఉదుటున పులిలా మీదకి దూకి ఒడిసి పట్టుకున్నాడు.
"దొంగా దొంగా" అని కేకలు వేస్తుంటే రామరాజు తొడ మీద గట్టిగా గిచ్చారు. "అమ్మా అమ్మా " అని నొప్పికి అరుస్తుంటే వెంటనే చేత్తో నోటిని మూసి "తాతయ్యా ఎందుకు అరుస్తున్నావ్" అని కోపంగా అరిచింది.
రామరాజు : నిధి !
నిధి : ఆ నేనే
రామరాజు : ఈ యేళప్పుడు ఎందమ్మా ఇదీ
నిధి : నిద్ర రాక బైటికి వచ్చాను
రామరాజు : గేటు తీసుకుని రావచ్చు కదా
నిధి : నా కర్మ అని తల కొట్టుకుంది.
"ఓయి ముసలోడా, నిద్ర పోకుండా ఎందుకు నీకయన్ని" అన్న గొంతు వినగానే ఆశ్చర్యపోతు చెట్టు చాటున నీడలో ఉన్న మనవడు శివని చూసి నిధి వంక చూసాడు.
రామరాజు : ఆ పోతన్నా.. నాకేం తెలీదు, నేనేం చూడలేదు. నాకేం తెలీదు, నేనేం చూడలేదు అనుకుంటూ వెళ్లిపోతుంటే ఇద్దరు వచ్చి వాటేసుకున్నారు. బావా మరదలు బుగ్గల మీద ఇద్దరికీ చెరో ముద్దు ఇచ్చి చల్లగా ఉండండి, చలిలో తిరగకండి అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు.
నిధి గట్టిగా ఊపిరి పీల్చుకుని నడుము మీద చేతులు పెట్టి శివని చూస్తే శివ నవ్వాడు.
నచ్చితే Like, Rate
Comment కూడా..