Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిన్ను కోరే వర్ణం
#6
నిన్ను కోరే వర్ణం
E3

శివ పొద్దున్నే లేచి స్నానం చేసి, దేవుడికి దణ్ణం పెట్టుకుని రెడీ అయ్యి తీరిగ్గా మంచం మీద కూర్చున్నాడు. వసుధ చూసింది కానీ ఏం అడగలేదు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎవరో వస్తున్న మాటలు వినిపించి తల తిప్పి చూసారు. ఆడబిడ్డలు సురేఖ, గౌరి లోపలికి వస్తుంటే చూసి లేచి నిలబడ్డారు. ఇద్దరు మంచం మీద కూర్చుంటే శివ లోపలికి వెళ్లి కుర్చీలు తెచ్చాడు.

సురేఖ పలకరిస్తూ "ఎలా ఉన్నావ్ వదినా ?" అని శివ వంక కూడా చూసి, "మేము ప్రయత్నించాం కానీ నీకు న్యాయం చెయ్యలేకపోయామురా శివా" అనేసింది బాధగా

వసుధకి వీటి గురించి మాట్లాడటం ఇష్టంలేదు అందుకే వెంటనే "అవన్నీ మగవాళ్ళు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే సురేఖ. మనం మధ్యలో దూరి వాటిని పెద్దది చెయ్యకపోవడమే మంచిది. మీరు చెప్పండి ఏం గౌరి పిల్లల్ని తీసుకురావాల్సింది అంటే గౌరి అటు ఇటు చూసి అవును ఇదేది అని నిధి.." అని పిలిస్తే గోడ చాటు నుంచి బైటికి వచ్చింది నిధి.

"ఏం చేస్తున్నావే అక్కడా ?" అంటే దెగ్గరికి వచ్చింది. వసుధ వెంటనే లేచి నిధి పక్కకి వెళ్లి "ఏమే నిధి, చిన్నప్పుడు నా కొంగు వదిలేదానివి కాదు. ఇప్పుడు కనీసం దెగ్గరికి కూడా రావట్లేదు. మమ్మల్ని మర్చిపోయావా ?" అని అడుగుతుంటే నిధి అవేమి పట్టించుకోకుండా "మీరు బట్టలు కూడా కూడతారా ?" అని అడిగింది.

నిధి మీరు అనగానే వసుధకి అదోలా అనిపించింది. చిన్నప్పుడు తను చూసిన నిధి కాదని అర్ధమయ్యి భుజం మీద నుంచి చెయ్యి తీసేసి, పైకి మాత్రం నవ్వుతూ "అవునమ్మా జాకెట్లు, లంగా ఓణిలు కుడుతుంటాను" అని సురేఖ వైపు తిరిగి "వాడికి నచ్చదు కానీ నాకేం తోచదు, ఒక్కదాన్నే ఎంతసేపని కూర్చొను అందుకే ఓ కాలక్షేపంలా.."  అని నవ్వేసింది.

వసుధ శివ వైపు చూసింది. శివ కనీసం నిధి వంక చూడనైనా చూడలేదు. "కూర్చో నిధి, నేను టీ పెట్టుకొస్తాను" అని లోపలికి వెళ్ళింది.

నిధి పైకి కుర్చీలో కూర్చున్నా లోపల కొంచెం బెరుకుగానే ఉంది. ఎప్పటిలానే చేతులు చూసుకుంటే వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. చూసి చూడనట్టు శివ వంక చూసింది, శివ తన వైపు చూడలేదు.

సురేఖ తన వదిన ఇంట్లోకి వెళ్లగానే శివ వైపు చూసి, "ఏరా శివా నీకు వాళ్ళ మీద కోపం రావట్లేదా. ఎందుకు నువ్వేమి అడగలేదు వాళ్ళని, ఎందుకు అన్నిటికి మౌనంగా తల ఊపుతున్నావ్ అంటే గౌరి కూడా అవును శివా నీకు రావాల్సింది నువ్వు గొడవ చేసి తీసుకో" అంది. శివ మామూలుగానే ఉన్నాడు, నిధి కూడా శివ ఏం అంటాడా అని చూసింది.

"నాకెంత రావాలో చెప్పండి అడుగుతాను" అన్నాడు నవ్వుతూ. సురేఖ ఏదో అనబోతుంటే ఆపేసాడు. "ఇన్ని రోజులు నేను పని చేశాను, వాటిని పైకి తీసుకొచ్చాను, అంత మాత్రాన అవన్నీ నాకు ఇచ్చేయాలంటే ఎలా. అయినా ఇప్పుడు నాకు ఒరిగేది ఏమి లేదు. నేను అందులో పని చేసినన్ని రోజులు నా జీతం నేను బాగానే తీసుకున్నాను. కావాల్సినన్ని పరిచయాలు ఉన్నాయి, కావాల్సినంతమంది స్నేహితులు ఉన్నారు. సాయం కావాలంటే ఒక్క పిలుపు చాలు వచ్చేస్తారు."

గౌరి : మరి అలాంటప్పుడు నేను ఇక పని చెయ్యను అని ఎందుకు చెప్పావు ?

శివ : నా చేతికి మావయ్య వాళ్ళు ఆ షాపులు అప్పగించినప్పుడు అవి బడ్డీ కోట్లు. నేనూ తాతయ్య కలిసి వాటిని ఎలా పైకి తీసుకొచ్చమో, వాటి కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అలాంటిది మావయ్యవాళ్ళు తాతయ్యని లెక్కచేయ్యట్లేదు, ఇది మొదటి కారణం అయితే రెండవది దాని కోసం అంత చేశాను కాబట్టి న్యాయంగా వచ్చే లాభాల్లో నాకూ వాటా కావాలన్నాను దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే బైటికి వచ్చేసాను.

మాట్లాడుతుంటే వసుధ లోపలి నుంచి టీ తెచ్చి అందరికి ఇస్తూ శివ చేతిలో ఫోను పెట్టి దీని సంగతి చూడు ఆపకుండా మొగుతూనే ఉంది అంటే ఎత్తాడు.

శివ : ఇంట్లోనే బాబాయి, ఒక రెండు రోజులు షాపులు తీయ్యట్లేదు బాబాయి. ఆ.. నిజమే.. లెక్కలు చూసుకున్నాక అప్పుడు తెరుస్తారేమో. నేను సాయంత్రం మాట్లాడతాలే అని ఫోన్ పెట్టేసి అందరి వైపు చుసాడు.

వసుధ : ఎవరు ?

శివ : సామాను కోసంలే

వసుధ : లెక్కలు చూస్తున్నారా అక్కడా, నువ్వు వెళ్ళవా మరి

శివ : అన్ని సరిగ్గానే ఉన్నాయి, అక్కడ గిరి, ప్రసాదులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అన్ని

వసుధ : వాళ్ళ సంగతి ఏంటి ? ఆ గిరి, ప్రసాదు ఎప్పుడు నీ వెనకే తిరుగుతారుగా

"ఇప్పుడు నాకే ఏం లేదు, వాళ్ళని తిప్పుకుని నేనేం చేసేది" అంటుంటే అది వింటున్న సురేఖకి, గౌరికి ఇబ్బందిగా అనిపించింది. సురేఖ లేచి "సరే వదినా మేము వెళతాం" అంటే గౌరి కూడా లేచేసరికి అందరూ లేచారు. వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మా కొడుకు ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. వసుధ కొడుకుని చూసి "నిధి బాగుంది కదరా" అంది. శివ నవ్వు అప్పుకుంటూ "ఏమో నేనా అమ్మాయి మొహం కూడా చూడలేదు. నీకు నచ్చిందా ?"

వసుధ : నాకు నచ్చిందా అంటే ?

శివ : అదే నీకు నచ్చిందంటే చెప్పు పెళ్లి చేసుకుంటా అని అమ్మకి కనిపించకుండా నవ్వాడు.

వసుధ : దొంగవిరా నువ్వు, అస్సలు దొరకవు. నేను కవితా వాళ్లకి బట్టలు ఇచ్చోస్తాను, నువ్వు ఇంట్లోనే ఉంటావా అని అడిగితె ఉంటానన్నాడు శివ.

ఒక్కడే మంచం మీద పడుకుని ఫోన్ చూస్తుంటే అడుగుల చప్పుడు వినిపించి చూసాడు. నిధి వచ్చింది. లేచి నిలబడితే దెగ్గరికి వచ్చింది. "అత్తయ్య లేదా" అని అడిగితే లేదని తల ఊపాడు తప్పితే నోరు తెరిచి సమాధానం చెప్పలేదు.

నిధి "జాకెట్ కుట్టాలి" అంటే ఆది తెచ్చావా అని అడిగాడు. లేదంది. "కొలతలు తీసుకుంటా రా" అని ఇంట్లోకి నడిస్తే నవ్వుకుంటూ వెనకే ఇంట్లోకి వెళ్ళింది.

నిధి : నీకు జాకెట్ కుట్టడం కూడా వచ్చా

"నాకింకా చాలా వచ్చు" అని టేప్ చేతుల్లోకి తీసుకున్నాడు. శివ దెగ్గరికి వస్తున్నకొద్ది నిధి ఒంట్లో ఊపిరి కష్టమైపోతుంది. "చేతులు పైకి ఎత్తు" అని టేప్ నడుము చుట్టూ వేసి దెగ్గరికి లాగాడు. బొమ్మలా శివకి అతుక్కుపోయింది నిధి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నిధి ఎడమ కంట్లో కన్నీటి చుక్క కనిపించగానే బొటన వేలు పెట్టి తుడిచేసాడు.

నిధి : నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను

శివ : ఏడవకు, నీకు మా అమ్మకి ఆనందం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి.

శివ కళ్ళు తుడుస్తుంటే, ముక్కులో చేరిన తడి పైకి పీల్చి శివ నడుము మీద చేతులు వేసి ఇంకా దెగ్గరికి లాక్కుంది. తలని శివ గుండె మీద పెట్టుకుని ఇంకా గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. శివ చెయ్యి నిధి మెడ మీద పడగానే కళ్ళు తెరిచింది. "బావా చిన్నప్పటి నుంచి ఎన్నో అడిగాను, అన్నీ ఇచ్చావ్. ఇన్నేళ్ల తరువాత ఒకటే కోరిక, తీరుస్తావా ?"

శివ : చెప్పు

"నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నిన్ను వాడుకుని వదిలేసిన వాళ్ళు నీ కాళ్ళ మీద పడాలి, నన్ను పెళ్లిచేసుకోమని నిన్ను బతిమిలాడుకోవాలి. అది నేను చూడాలి బావా. నా కోరిక తీరుస్తావా ?" అని తల ఎత్తి శివ కళ్ళలోకి చూసింది. నీకు గుర్తుందో లేదో "నువ్వే నా శివుడివి" అని నిధి అంటుంటే శివ మధ్యలో కల్పించుకుంటూ "నువ్వే నా పార్వతివి" అన్నాడు.

ఇప్పటి నుంచి చూస్తుందో కానీ వసుధ గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడ్డారు ఇద్దరు. "అమ్మ నంగనాచి దానా" అన్న గొంతు వినపడగానే ఇద్దరు విడిపడి చూసారు. వసుధ లోపలికి వచ్చి నిధి ఎదురుగా నిలుచుంటే వెంటనే కౌగిలించుకుని "ఎలా ఉన్నావ్ అత్తా" అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. "అంటే ఇందాక నటించావా ? నేను ఎంత బాధ పడ్డానో తెలుసా" అని ప్రేమగా గడ్డం కింద చెయ్యి వేసింది.

ఇంకా వెచ్చగా అనిపించి నిధి కూడా గట్టిగా పట్టుకుంది తన అత్తని, "నిన్నెలా మర్చిపోతాను అత్తా, అది జరిగే పనేనా. కానీ అత్తా నాకు నేనుగా నీ దెగ్గరికి వచ్చేవరకు నువ్వు నాకు దూరంగానే ఉండాలి"

వసుధ : ఎందుకే

నిధి "అది అంతే మాటివ్వు" అంటే వసుధ ప్రేమగా ముద్దు పెట్టి "సరే మీరేది చేసినా మీకోసమే, నేను ఉన్నది మీకోసమే. నువ్వు చెప్పినట్టే వింటాను. మమ్మల్ని అస్సలు మర్చిపోలేదే నువ్వు అందుకు గర్వంగా ఉంది నిన్ను చూస్తూంటే"

నిధి : నిన్నే కాదు నువ్వు చేసే సగ్గుబియ్యం పాయసం రుచి కూడా నాకింకా గుర్తుంది. నేనొచ్చి చాలా సేపయ్యింది. వెళతాను అని శివ వంక చూస్తే కొడుకుని కోడలి మీదకి నెట్టింది వసుధ. నిధి సిగ్గుపడుతూ వెళ్లిపోతుంటే కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఆనందపడింది వసుధ.

నచ్చితే Rate & Like
Comment కూడా..
Like Reply


Messages In This Thread
RE: నిన్ను కోరే వర్ణం - by Pallaki - 19-02-2025, 07:54 PM



Users browsing this thread: 11 Guest(s)