Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిన్ను కోరే వర్ణం
#5
నిన్ను కోరే వర్ణం
E2


ఊళ్ళో చీకటి పడింది, అందరూ వీధి చివర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చాలా మంది ఆడపిల్లలు కూడా ఉండటంతొ ఈ  పిల్లలు నలుగురు కూడా వెళ్లారు. ప్రియ, ప్రవీణ్, నితిన్ అందరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారా అని చూస్తుంటే నిధి కళ్ళు మాత్రం ఎవరినో వెతుకుతూనే ఉన్నాయి. ఊరిలో అడుగుపెట్టినప్పటి నుంచి అంతే,  ఓపికగా ఒక్క మాట మాట్లాడకుండా, ఎవ్వరిని అడగకుండా కళ్ళతో వెతుకుతూనే ఉంది. ఇంకా కనిపించలేదేమో కళ్ళలో ఆనందం లేదు.

ఈసారి వినాయకచవితి బాగా చెయ్యాలి బాబాయి, పోయినసారి కంటే ఇంకా బాగా చెయ్యాలి

మేము పక్కనే ఉండి చూసుకుంటాం, ఎప్పుడూ మీ చేతుల మీద గానే కదరా జరిగేది. అలానే కానివ్వండి. ఇంతకీ మన శివుడేడి అన్నాడు ఓ పెద్దాయన

ఏంట్రా అందరూ వచ్చేసారా, మొదలుపెట్టండి. ఎలా చేద్దాం ఎంతలో చేద్దాం ముందే ఒక మాట అనేసుకుంటే అయిపోతుంది కదా. ఇంతకీ మన శివుడేడి

"ఇంకా రాలేదు అంకుల్ అన్నయ్య కోసమే చూస్తున్నాం" అన్నారు ఆడపిల్లలు. "మీరెందుకు వచ్చార్రా ఇప్పుడు" అని అరిస్తే అంతా ఒకేసారి "మేము మీ కోసం రాలేదు శివ అన్నయ్య కోసం వచ్చాము" అన్నారు. అందులో శివ అన్నది గట్టిగా వినపడినా అన్నయ్య అనే పదం మాత్రం కొంతమంది నోటి నుంచే వినపడింది. పెద్ద వాళ్ళు కొంతమంది నవ్వుకున్నారు కూడా

ఈ సారి కూడా బొమ్మని వాడే కొనిస్తానంటే నేను ఒప్పుకోను, ఎప్పుడు వాడేనా అన్నాడు బుల్లిరాజు, ఈయన ఊళ్ళో బాగా ధనికుడు, వడ్డీలకి డబ్బు తిప్పుతుంటాడు.

అవును మాకు కూడా అవకాశం ఇవ్వాల్సిందే అన్నాడు ఇంకో పెద్దాయన దానికి ఇంకొంత మంది కూడా అవునని వంత పాడారు.

"ఏంటి బాబాయి నా గురించేనా" అన్న గొంతు వినగానే అందరూ తల తిప్పి చూసారు. కూర్చున్న పెద్దవాళ్ళు తల ఎత్తి చూసారు. నిధి ఉలిక్కిపడింది, తల ఎత్తి వెతికి ఆ గొంతు కోసం చూసింది. చీకట్లో సరిగ్గా కనిపించలేదు, ఇప్పటి వరకు దూరంగా కూర్చున్న వాళ్ళు అందరూ గుంపుగా చేరారు.

నిధి చెప్పకుండా ముందుకు వెళ్లిపోతుంటే ప్రియ అక్క చెయ్యి పట్టుకుని ఆపేసింది, చెయ్యి విధిలించి కొట్టి మరీ ముందుకు వెళ్ళిపోయింది నిధి.

రారా వచ్చావా, నీకోసమే చూస్తున్నాం. ముందే చెపుతున్నాం ఈ సారి బొమ్మని మేమే కొనిస్తాము. ఎనిమిదేళ్ళ నుంచి నువ్వే కొనిస్తున్నావ్ ఈ సారి ఆ అవకాశం మాకూ కావలి. కావాలంటే నువ్వు ఈసారికి మండపం కట్టించు అంటే శివ నవ్వుతూ అలాగేలే బాబాయి అన్నాడు.

అడిగిన వెంటనే శివ ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు, ముందు ఆశ్చర్యపోయినా వెంటనే ఒప్పుకున్నందుకు సంతోషించారు. పెద్దవాళ్ళు అందరూ శివతో మంచి చెడు మాట్లాడుతుంటే కుర్రోళ్ళు, ఆడపిల్లలు శివ వెనక నిలబడి వింటున్నారు.

ప్రియ వాళ్ళకి బోర్ కొట్టింది. వెళ్ళిపోదామని నిధిని పిలిస్తే పలకలేదు. ప్రియ వెంటనే తన చెయ్యి పట్టుకుని లాగింది. నిధి మిగతా ముగ్గురి వంక చూసి ఇంటికి నడిచింది. వెన్నక్కి తిరగలేదు కాని చేతులు చూసుకుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లిపోయారు.

సుభాష్ : ఎక్కడికి వెళ్ళార్రా

ప్రియ : వీధి చివర గణపతి ఉత్సవాల గురించి మాట్లాడుకుంటుంటే వెళ్ళాం పెద్దనాన్న. తాతయ్య కూడా అక్కడే ఉన్నారు.

ధీరజ్ లేచి పద అన్నయ్యా మనం కూడా వెళదాం. ఎప్పుడో వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు కుదిరింది అంటే సుభాష్ కూడా లేచాడు. అందరికంటే వెనక వచ్చిన నితిన్ అందరూ వెళ్లిపోతున్నారు కూడా, వాడెవడో శివ అట, వచ్చేవరకు ఒకటే గోల చేసారు. వాడు రాగానే మాట్లాడుకుని వెళ్లిపోతున్నారు అన్నాడు.

సుభాష్ : మన శివ గాడేనా, పిలవాల్సింది కదా

ప్రియ : ఆ శివ ఎవరో మాకేం తెలుసు పెద్దనాన్న

ధీరజ్ : ఏమే నిధి, నీకు వాడు తెలుసుగా

నిధి : ఏమో బాబాయి, నాకు వాడి పేరే గుర్తులేదు ఇక మొహం ఏమి గుర్తుంటుంది. అయినా ఫోన్ చేస్తే వస్తాడు కదా అని లోపలికి వెళ్ళిపోయింది.

లోపలికి వెళ్లి మంచం మీద పడుకుంది, చెయ్యి మొహం మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది.

"నేనే శివుడిని, నువ్వే పార్వతివి" - శివ

"బావా ఎలా ఉన్నాను, ఈ గాజులు నీకు నచ్చాయా" - నిధి

"నన్ను మర్చిపోకుండా నీ చేతికి కడుతున్నాను, నా గుర్తుగా భద్రంగా దాచుకో" అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు శివ.

నిక్కరులొ పొడుగ్గా శివ కర్రపుల్ల బాడీ గుర్తుకురాగానే మొహంలొకి నవ్వొచ్చేసింది. తీసుకునే ఊపిరి ఇంత వెచ్చగా, ఇంత భారంగా ఎప్పుడు అనిపించలేదు అలానే నిద్రలోకి జారుకుంది.

వీధి చివర సమావేశాలు అయిపోయాయి. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. శివ ఇంటి గేటు తీసుకుని లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు. లోపల వసుధ మొహం వాచిపోయినట్టు కనిపించింది. కొడుకుని చూడగానే ఏడుపు ఆపుకోలేక లేచి నిలబడింది.

శివ : ఎందుకు ఏడుస్తున్నావ్. నిన్ను వాళ్ల దెగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకున్నావా అంటే లేదంది. నువ్వేం మాట్లాడకు, నేను చూసుకుంటా కదా. ఎప్పుడు నువ్వేం సంపాదించావ్ ఎప్పుడు వాళ్లకి సంపాదించిపెట్టడమే కదా అని గోల చేసేదానివి కదా, నేనేం సంపాదించానో ఇక నీకు కనిపిస్తుందిలే అని నవ్వాడు.

వసుధ : నీకు వాళ్ళ మీద కోపంగా లేదా

శివ : నాకెందుకే కోపం, అది మన ఆస్తి కాదుగా. నాది ఏదైనా లాక్కుంటే నాకు కోపం వస్తుంది, నాదేం లేదుగా అన్నాడు.

వసుధ : అయినా కూడా.. గొడ్డు చాకిరీ చేసావ్, చివరికి నీకేం మిగిలింది, కళ్ళు తుడుచుకుంది

శివ : నేనేం సంపాదించుకున్నానో నువ్వు చూస్తావులే, అయినా ఇదేంటే కొత్తగా ఏడుస్తున్నావ్. మనకి కష్టం రాలేదు, ఒకరు మనల్ని మోసం చేసారనో ఇంకొకరి చేతిలో మనం మోసపోయామనో ఏడుస్తామా, నేను నిన్ను సాకలేనని ఏడుస్తున్నావా ?

వసుధ : ఛీ కాదు

శివ : మరి.. నీ చెయ్యి ఎప్పుడు ఒకరి కడుపు నింపడానికి, దీవించడానికే వాడాలి తప్పితే ఇలా నీ కళ్ళు తుడుచుకోవడానికి కాదు. మనం ఒకరి మీద పడి ఏడ్చేవాళ్ళం కాదు.. కదా ?

వసుధ : అవును

శివ : ఇంక చాలు

వసుధ : నాన్న ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా

శివ : ఇప్పుడు మనకేం తక్కువయిందని, ఇప్పుడు బాగుంది, నాన్న ఉంటే ఇంకా బాగుండేది.

వసుధ "పోరా" అంటే మంచం మీద కూర్చోపెట్టాడు. "ఎలా ఉన్నారు మీ అన్నలు, మీ ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు" అంటే "వాళ్లకేం బానే ఉన్నారులే" అంది.

"ఇంకా చెప్పు ఎలా ఉన్నారు అంతా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట కద నాకు అడక్కపోయావా" అంటే కోపంగా చూసింది వసుధ. "ఆమ్మో వద్దులే ఊరికే అన్నా అన్నాడు."

కొడుకు చెప్పినదంతా ఆలోచించాక వాడి ఆలోచనలకి గర్వపడింది. కోపం అంతా తీసేసి లేచి వెళ్లిపోతుంటే "భవతీ భిక్షాందేహి" అని కడుపు పట్టుకున్న కొడుకుని చూసి నవ్వుతూ అన్నం వడ్డించడానికి కిచెన్లోకి వెళ్ళింది.

అమ్మతొ కలిసి భోజనం చేసాక, ఆరు బైట మంచం వేసి కూర్చుంటే వసుధ కూడా వచ్చి కూర్చుంది. కాసేపు రాబోయే వినాయక చవితి గురించి, కాసేపు చిన్నప్పుడే చనిపోయిన నాన్న గురించి, ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు.

నచ్చితే Rate & Like
Comment కూడా...
Like Reply


Messages In This Thread
RE: నిన్ను కోరే వర్ణం - by Pallaki - 19-02-2025, 07:07 PM



Users browsing this thread: 13 Guest(s)