16-02-2025, 10:31 PM
Episode - 4
ఉదయం పదకొండు గంటలకి అక్కాచెల్లెళ్లు రెడీ అయిపోయి కూర్చున్నారు. కిట్టు వచ్చి కింద వెయిట్ చేస్తున్నాని కాల్ చేశాడు.
స్పందన: పైకి పిలవ్వా?
సమీర: అడిగాను. మళ్ళీ మనకి షాపింగ్ కి లేట్ అవుతుందేమో అని తానే వచేయమన్నాడు.
స్పందన కి ఇర్రిటేషన్ పెరిగిపోతోంది తన అక్క ధోరణికి. మీరేంటో మీ విధానాలేంటో అని రావు రమేష్ తరహాలో మనసులో అనుకుని బయల్దేరింది.
లిఫ్ట్ దిగి అలా నడుచుకుంటూ పార్కింగ్ దెగ్గరికి వెళ్లేసరికి కిట్టు కార్ దిగి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. స్పందన సమీరా కన్నా ఒక పది అడుగులు వెనకాల ఉంది.
సమీర కిట్టు ఎలా పలకరించుకుంటారా అని ఒక కన్నేసి చూస్తోంది.
సమీర తన దెగ్గరికి రాగానే కిట్టు ఒక అడుగు ముందుకి వేశాడు. హాగ్ చేసుకుంటాడేమో అని చూసింది. కానీ సమీర చెయ్యి చెప్పడంతో అడుగు వెనక్కి వేసి చెయ్యి చాపాడు. దాదాపుగా తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని హాగ్ చేసుకుంటూ పలకరించుకునే స్పందనకి సమీర వ్యవహారం వింతగా అనిపించింది.
కిట్టు పర్లేదు. ట్రై చేస్తున్నట్టున్నాడు. అక్కనే అతన్ని దూరం పెడుతోందా? ఎందుకు?
స్పందన బుర్రకి సమాధానం అందలేదు. తాను తన బాయ్ఫ్రెండ్ ప్రవీణ్ ని హాగ్ చేసుకుంటుంది కానీ వాడు స్మోక్ చేస్తాడు. అప్పుడు మాత్రం దూరం పెడుతుంది. కానీ కిట్టు స్మోక్ చేసేవాడిలాగా అనిపించలేదు. మరి ఏంటో చూద్దాము అనుకుంటూ వాళ్ళిద్దరి దెగ్గరికి వచ్చింది.
'హలో స్పందన,' అని రెండడుగులు ముందుకి వేసి మరి హ్యాండ్ షేక్ ఇచ్చాడు. స్పందన చెయ్యి అందించింది. తన ముక్కుపుటాలు చాలా షార్ప్. పెర్ఫ్యూమ్ వాసన వచ్చిందే తప్ప ఇంకా ఏమి దుర్వాసన రాలేదు. సమీర మొహం చూసింది. సమీర చిన్నగా నవ్వుతు నుంచుంది. ఏంటో మా ఇద్దరికీ హ్యాండ్ షేక్ ఇచ్చాడు. వింత జంట అనుకుంటూ కార్ వెనక డోర్ ఓపెన్ చేసి ఎక్కింది.
మంచి కార్ పెర్ఫ్యూమ్ వాసనకి మూడ్ ఒక్కసారిగా లిఫ్ట్ అయింది. కార్ చాలా నీట్ గా ఉంది. ఇక అందరు కారెక్కి ఇరవయి నిమిషాలలో రెస్టారెంట్ కి చేరుకున్నారు. ఒక మంచి టేబుల్ దెగ్గరికి వెళ్లి రోడ్ సైడ్ వ్యూ చూస్తూ ఆర్డర్ పెట్టేసి కూర్చున్నారు.
కిట్టు: షాపింగ్ ఎక్కడిదాకా వచ్చింది.
సమీర: నా షాపింగ్ దాదాపుగా అయిపోయింది. ఇంకా కొంచం మిగిలి ఉంది.
కిట్టు: గుడ్. మరి మీది స్పందన? ఎక్కడిదాకా వచ్చింది.
స్పందన: నాది చాలా పెండింగ్ ఉంది. వచ్చి రెండు వారాలే కదా అయింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి.
స్పందనకి మనసులో కోపం చిరాకు ఉన్నా కిట్టు చాలా పొలిట్ గా మాట్లాడుతుండేసరికి తాను కూడా నార్మల్గా మాట్లాడుతోంది. ఫార్మాలిటీకి పిలిచాడో లేదో తెలీదు కానీ గతవారం కంటే ఎక్కువ ఫ్రీగా మాట్లాడుతున్నాడు. బాగా ట్రీట్ చేస్తున్నాడు అని కూడా అనిపించింది.
కిట్టు: I can understand.
సమీర ఏదో పరధ్యానంలో ఉంది. అది కిట్టు ఇంక స్పందన ఇద్దరు గమనించారు. కిట్టు ఏ మాత్రం ఆక్వర్డ్ గా కాకుండా సిట్యుయేషన్ హేండిల్ చేస్తున్నాడు. కడుపు నిండా భోజనం పడేసరికి స్పందన మూడ్ బాగుపడి మళ్ళి కిట్టుని ఒబ్సెర్వె చెయ్యడం మొదలెట్టింది. 'పర్లేదు బాబు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా హేండిల్ చేస్తున్నాడు,' అనుకుంది.
స్పందన: మీ షాపింగ్ ఎక్కడిదాకా వచ్చింది?
కిట్టు: నేను ఇంకా మొదలు పెట్టలేదండి. ముందు మా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన షాపింగ్ అంతా చేసేశాను. ఇంకా నాది చెయ్యాలి. వచ్చే వారంలో వెళ్తాను.
స్పందన: వచ్చే వారం అంటే బాగా లేట్ అవ్వదా?
కిట్టు: లేట్ ఏముందండి. తెలిసిన టైలర్ ఉన్నాడు. కుట్టించాల్సినవి అన్నీ ఆయన దెగ్గరే. ఇంకా మిగతావి కొన్ని రెడీమేడ్. ఏవో కొంచం ఆల్టరేషన్ చేయిస్తే చాలు. మొత్తం కలిపి వారం పడుతుంది అంతే.
స్పందన: ఆహా! ఎంత అదృష్టం. మాకు కూడా అలా ఎవరన్నా ఉంటే ఎంత బావుండేదో! కదాక్క?
స్పందన జెన్యూన్ గా సమాధానం చెప్తూ అదే పనిలో అక్కతో మాట్లాడించే ప్రయత్నం చేసింది.
సమీర: అవును. కానీ మనకి అంత త్వరగా ఇచ్చే టైలర్స్ లేరుగా. అమ్మాయిల బట్టలు టైం పడతాయి ఎలాగూ.
స్పందన: అయినా నీవి అన్ని అయిపొయినాయి. నావే ఇంకా కొనాలి స్టీట్చింగ్ కి ఇవ్వాలి.
కిట్టుకి సడన్ గా ఏదో గుర్తొచ్చింది.
కిట్టు: నా టైలర్ దెగ్గర లేడీస్ టైలర్స్ కూడా ఉంటారండీ. నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ చాలా సార్లు చూసాను. చాలా మంది ఆడవారు వచ్చి డిసైనర్ వేర్ కుట్టించుకుంటూ ఉంటారు.
అది వినగానే స్పందన మొహం వెలిగిపోయింది. వెంటనే సమీర వైపు చూసింది. సమీరకి తన చెల్లి మనసులో ఏమి అనుకుంటోందో అర్థం అయింది.
సమీర: నువ్వు ట్రై చేస్తావా?
స్పందన సమీర వైపు కిట్టు వైపు మార్చి మార్చి చూసింది. తన బుర్రలో ఏవో ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి.
సమీర: కానీ ఎంత టైం తీసుకుంటారో ఎమన్నా ఐడియా ఉందా కిట్టు? సాధారణంగా అంత బిజీ ఉన్నవాళ్లు నెలలు తీసుకుంటారు. అందులో డిసైనర్ బ్లౌజ్ లు కుట్టాలి అన్నా సారీ మీద వర్క్ చెయ్యాలి అన్నా హాండీవర్క్ కాబట్టి టైం పడుతుంది.
కిట్టు: అమ్మాయిలవి నాకు ఐడియా లేదండి. కానీ కనుక్కోమంటే ఒక సారి కనుక్కుంటాను.
వెంటనే స్పందన సమీర వైపు చూసింది ఏదో సలహా కోసం అన్నట్టు. చాలా సేపటి తరువాత అక్క మళ్ళీ మాములుగా మాట్లాడుతూ ఉండటంతో స్పందన మనసు కాస్త కుదుట పడింది.
సమీరకి చెల్లి మనసు అర్థం అయింది.
సమీర: కిట్టు, మీరు కనుక్కోండి.
కిట్టు వెంటనే ఫోన్ తీసి డయల్ చేశాడు.
కిట్టు (ఫోన్ లో): హలో పటేల్ గారు. ఎలా ఉన్నారు. నేను చాల బాగున్నాను... ఏదో ఈ మధ్య కాలంలో కొత్తవి ఏమి కుట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. మీరు కుడితే పదేళ్లు చెక్కు చెదరదు కదా... హ హ హ. అయినా పాత బాకీలు అన్ని తీర్చేసుకునేందుకు మీ దగ్గరికి వచ్చే వారంలో వస్తాను. అవును. నాకు పెళ్లి కుదిరింది.. ఓహ్ థాంక్యూ థాంక్యూ.. పార్టీ నా... మీరు చెప్పండి... ఎప్పుడంటే.. అప్పుడే.... మీకన్నా ఎక్కువా... పటేల్ జి... హ హ.. ఏమి లేదు... నాకు ఒక చిన్న హెల్ప్ కావలి... అనుకోకుండా పెళ్లి కుదరడంతో మా వాళ్ళకి పెళ్ళికి కావాల్సిన చీరలు, డిసైనర్ బ్లౌజ్ లు అవి త్వరగా కుట్టే టైలర్స్ కోసం చూస్తున్నారు... అంతే అంటారా? తెచ్చెయ్యమంటారా? హ హ హ మీరు సూపర్ సర్. సరే.. నేను కనుక్కుని చెప్తాను... ముందు శాంపిల్ తెమ్మంటారా? సరే సరే.. అడిగి ఫోన్ చేస్తాను. ఉంటాను సర్... బై..
స్పందన సమీరాలు ఆతృతగా చూస్తున్నారు.
కిట్టు: వాళ్ళ దెగ్గర లేడీస్ టైలర్ తో మాట్లాడుతాను అన్నాడు. మనని ఏదన్నా శాంపిల్ కి ఒకటి ఇమ్మన్నాడు. అది నచ్చితే అన్ని కొట్టడానికి ఇమ్మన్నాడు.
సమీరా స్పందనలు ఏదో లంకె బిందెలు దొరికినవారి మల్లె మొహాలు విప్పారి చూస్తున్నారు.
స్పందన: సరే అయితే. నేను రేపు ఎల్లుండి కావాల్సినవి అన్ని కొనేసుకుంటాను. ఈరోజు శాంపిల్ కి ఒక రెండు బ్లౌసులు ఇస్తాను. ఎక్కడికి పంపించాలి? రాపిడో చేస్తాను.
కిట్టు: రాపిడోలో వద్దు. అక్కడ ఆయన వర్కర్స్ రిసీవ్ చేసుకుని పక్కకి పెట్టేస్తారు. నేనే వెళ్తాను.
స్పందన వెంటనే కళ్ళు పెద్దవి చేసి చూసింది.
స్పందన: అయ్యో మీకెందుకండి శ్రమ. మీరు ఫోన్లో చెప్పారు కదా.. నేనే వెళ్లి ఇస్తాను లెండి.
కిట్టు: శ్రమ ఏమి లేదు. అసలే మీరు షాపింగ్ చెయ్యాలి. ఇండియా వచ్చి రెండు వారాలు అయింది. మీకెన్ని పనులు ఉంటాయో నేను ఊహించగలను. అసలు మొహమాటం లేకుండా ఏమన్నా పనులు ఉంటే నాకు చెప్పేయండి. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారు అని ఆలోచించకండి. ఎవ్వరికి చెప్పక్కర్లేదు.
ఆ క్షణంలో స్పందనకి కిట్టు పట్ల గౌరవం లక్షింతలు పెరిగింది. అలా మాట్లాడే వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు చూడలేదు.
సమీర: పర్లేదు స్పందన. ఇవ్వు. థాంక్యూ సో మచ్ కిట్టు.
ఇంతలో వెయిటర్ మెయిన్ కోర్స్ తెచ్చాడు. బిర్యానీ తినడంలో నిమఘ్నమైపోయారు.
ఇంకా ఉంది