13-02-2025, 04:38 PM
Episode - 2
మరుసటి రోజున అనుకున్న టైం కి రెస్టారెంట్లో కూర్చున్నాడు కిట్టు. అటు ఇటు చూస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పన్నెండు కావడంతో జనాలు వస్తున్నారు అప్పుడప్పుడే. కాకపోతే పోష్ రెస్టారంట్ కావున అంతా నీట్ గా ఉంది. ఒక మూలన వాటర్ఫాల్ పడుతున్న గాజు గోడకి ఆనుకుని ఉన్న టేబుల్ బుక్ చేశాడు కిట్టు.
ఇంకా సమీర-స్పందనల జాడ లేదు. అలా కూర్చుని ఏదో టైంపాస్ చేద్దాము అని పక్కనే ఉన్న మ్యాగజిన్ అందుకున్నాడు. అలా పేజీలు తిరగేస్తుంటే వెయిటర్ వచ్చాడు. ఇంకా టైం పడుతుంది అని చెప్పి వాడ్ని పంపేశాడు. అయితే ముందురోజు వచ్చినప్పుడు వాడికి అయిదు వందలు టిప్ ఇచ్చాడు కాబట్టి వాడికి కిట్టు గుర్తున్నాడు. అదేదో చాలా ఏళ్ళు పరిచయం ఉన్నవాడిలాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు వాడు. మధ్య-మధ్య లో వచ్చి కిట్టుకి ఏమి కావాలో చూస్తున్నాడు.
ఒక పది నిమిషాల తరువాత అలా దూరంగా డోర్ తెరుచుకుని తెల్లటి కుర్తా టాప్ ఇంకా బ్లూ జీన్స్ వేసుకుని సమీర ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచే కిట్టుని చూసి నవ్వింది. కిట్టు తిరిగి నవ్వాడు. వెంటనే కుర్చీలోంచి లేచాడు.
సమీర నడుచుకుంటూ కిట్టు దెగ్గరికి వచ్చింది. ఎలా పలకరించాలో అర్థం కాలేదు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వాటేసుకుని పలకరించాలా? లేక ఇంకా కొత్త కాబట్టి అతి చనువు తీసుకోకూడదా? అర్థం కాకుండా అలా చెయ్యి చాపి హ్యాండ్ షేక్ ఇచ్చాడు. సమీర కూడా చెయ్యి ఊపింది.
మర్యాదగా ముందుకి వచ్చి కుర్చీ లాగి 'కూర్చోండి,' అన్నాడు.
సమీర కూర్చుంది.
'మీ చెల్లెలు రాలేదా?' అని అడిగాడు.
'వాష్రూమ్ కి అని ఇందాకే వచ్చింది. ఇక్కడికి రాలేదా?' అని అడిగింది.
ఇంతలో ఒక అమ్మాయి సైడ్ నుంచి వచ్చింది. 'హాయ్!' అని పలకరించింది.
'ఓసిని? ఎటెళ్ళావే? నాకంటే ముందే వచ్చావుగా?' అని అడిగింది సమీర.
ఆ అమ్మాయి ఒక చిన్న నవ్వు నవ్వింది. సమీర నవ్వింది. తన చెల్లి తనకన్నా ముందు వచ్చి కాబోయే బావని సీక్రెట్గా అబ్సర్వ్ చేస్తోంది అని అర్థం అయింది.
కిట్టు మాత్రం బిత్తర చూపులు చూశాడు.
కవర్ చేస్తూ, 'ఇది నా చెల్లి, స్పందన,' అని పరిచయం చేసింది.
'హాయ్ స్పందన, కూర్చోండి,' అని కుర్చీ లాగాడు.
స్పందన ఒక సెకను పాటు అలా కిట్టు మొహంలోకి చూసి కూర్చుని తన అక్క వైపు చూసింది.
కిట్టుకి అక్క చెల్లెళ్ళు ఎదో సైగ చేసుకుంటున్నారు అని అర్థం అయింది కానీ అది పాజిటివ్ గానా నెగటివ్ గానా అని తెలియలేదు.
వెయిటర్ వెల్కమ్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. 'మీరు comfortable అవ్వండి. నేను ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని లేచి వెళ్ళాడు. నిజానికి వాడు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి వెళ్ళాడు.
'అక్కా.. అక్కా.. అక్కా..' అని సమీర చెయ్యి పట్టుకుని ఊపేసింది స్పందన.
సమీర: ఏంటే? ఏంటి నీ హడావిడి?
స్పందన: అక్క.. బావ బావున్నాడు.
సమీర: నాకంటే ముందొచ్చి నువ్వు బావకి సైట్ కొడుతున్నావా?
స్పందన: ఛా.. నీకేమి అన్యాయం చెయ్యను లేవే. కానీ మనిషి బావున్నాడు.
సమీర: పర్వాలేదులే నువ్వేగా. నేనేమి అనుకోను (నవ్వుతూ). అయినా నువ్వోచింది తన అందం చూడటానికా లేక మంచోడా కాదా అని స్టడీ చెయ్యడానికా?
స్పందన: మంచోడా కాదా అనేది అప్పుడే తెలియదు. ఆ రిసల్ట్ రావడానికి సమయం పడుతుంది. కానీ ప్రస్తుతానికి ఇదొక్కటే కాంప్లిమెంట్.
సమీర నవ్వింది. ఇంతలో కిట్టు తిరిగి వచ్చాడు. ఏవో కబుర్లు చెప్పుకున్నారు. పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చాయి ఏంటి అనే అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. స్పందన మాత్రం కిట్టుని అదే పనిగా పరిశీలిస్తోంది. కిట్టు హావభావాలు, మాట్లాడే మాటలు, వాడి బాడీ లాంగ్వేజ్, వాడు ప్రవర్తన అన్ని క్షుణ్ణంగా చూస్తోంది.
'ఏమి తింటారు?' అని అడిగాడు స్పందన వైపు చూస్తూ.
'మీరే ఆర్డర్ చెయ్యండి,' అంది .
'మీరు చెప్పండి సమీరా,' అన్నాడు.
అక్కని మీరు అనే సంబోధిస్తున్నాడు. అంటే అది అతి వినయమా లేక నిజంగా గౌరవం ఇస్తున్నాడా? అని అనుకుంది మనసులో.
'మీరే ఆర్డర్ చేయండి,' అంది సమీర.
ముందు రోజు వచ్చి మెనూ చూసి టేస్ట్ చేశాడు కాబట్టి టక టక ఆర్డర్ చేసేశాడు. వెయిటర్ తీసుకొచ్చి చికెన్, ఫిష్ స్టార్టర్స్ ఇంకా సాఫ్టుడ్రింక్స్ తెచ్చాడు. సమీర స్పందన ఇద్దరు తినడం ప్రారంభించారు. అందులో వారు ఇంతక ముందు ఎప్పుడు రుచి చూడని డిషెస్ కూడా ఉన్నాయి. స్పందనకి అన్ని నచ్చాయి.
పర్లేదు వీడికి ఫుడ్ విషయంలో టేస్ట్ బానే ఉంది, అని మనసులో ఇంకొక బాక్స్ టిక్ వేసుకుంది.
'మీరు ఇక్కడికి రేగులర్గా వస్తారా?' అని అడిగింది సమీర.
'లేదు. ఎందుకండీ? భోజనం నచ్చలేదా?' అని అడిగాడు చిన్నగా ఖంగారు పడుతూ.
'లేదు లేదు. అన్ని బావున్నాయి. ఇవన్నీ ఇంతక ముందు ఎప్పుడు వినలేదు తినలేదు కానీ చాలా బావున్నాయి. అందుకే అడుగుతున్నాను మీకు ఎలా తెలుసా అని,' అంది.
అదేదో ఇంటరాగేషన్ లో ఖైదీని ప్రశ్న అడిగితే పక్కన ఉండే సెక్యూరిటీ ఆఫీసర్లు చూస్తున్నట్టు కిట్టు ఏమి చెప్తాడా అని చూస్తోంది స్పందన. చూపు వాడి వైపే ఉంది కానీ చెయ్యి నోరు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. గుటుకు గుటుకు మని తింటోంది అన్ని.
కిట్టు చిన్నగా నవ్వుకున్నాడు. హమ్మయ్య అన్ని నచినట్టున్నాయి అసలు ఆగకుండా తింటోంది స్పందన అనుకున్నాడు. మళ్ళీ తేరుకుని సమీరకి సమాధానం ఇచ్చాడు.
'అదా.. ఏమి లేదండి. ఈరోజు కలుద్దాము అనుకున్నాము. మీ చెల్లెలు కూడా వస్తున్నారు. అందరమూ కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నాము కదా. ఇది మెమొరబుల్ గా ఉండాలి అని నిన్ననే వచ్చి ఈ ప్లేస్ చూసి ఐటమ్స్ కొన్ని రుచి చూసి వెళ్ళాను. నాకు బాగా నచ్చినవి ఆర్డర్ చేశాను,' అన్నాడు.
సమీర appreciate చేస్తున్నట్టు నవ్వింది.
స్పందన కూడా చాలా ఇంప్రెస్స్ అయింది. పైకి అనకపోయినా మనసులో అనుకుంది. అబ్బో వీడికి స్పెషల్ అకేషన్స్ ని ఎలా ప్లాన్ చెయ్యాలో బాగా తెలుసు అనుకుంట. అబ్బాయిలలో చాలా మందికి ఆ ఆలోచన రాదు. ఫుడ్ కూడా ముందే టేస్ట్ చేసి ప్రిపేర్ అయ్యాడు అంటే వీడికి ప్లానింగ్ ఎక్కువ. గుడ్. ఇంకో బాక్స్ టిక్ చేయచ్చు, అనుకుంది.
ఇంకాసేపు గడిచింది. 'ఇంక లేట్ అవుతోంది, షాపింగ్ పని ఉంది. మేము బయల్దేరుతాము,' అంది సమీర.
'షూర్ అండి. I can understand,' అన్నాడు.
సమీర వాష్రూమ్ కి వెళ్ళింది. స్పందన అక్కడే కూర్చుంది కానీ ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్ పట్టుకుని ఎదో ఇంపార్టెంట్ మెసేజెస్ చదువుతున్నట్టు నటించింది.
బిల్ చెప్పడానికి 'రావు గారు బిల్ తెచ్చేయండి,' అని వెయిటర్ ని పిలిచాడు. ఆ వెయిటర్ ఎంతో వినయంగా తెచ్చి బిల్ ఇచ్చాడు. నాలుగు వేలు దాటింది. క్రెడిట్ కార్డు తీసి ఇచ్చాడు. వాడు పేమెంట్ చేసేసి తీసుకొచ్చి కార్డు ఇచ్చాడు. 'అన్ని బావున్నాయా సర్, ' అని అడిగాడు.
కిట్టు ఒక అయిదు వందలు చేతిలో పెట్టి, 'చాలా బావున్నాయి సర్. మీ సర్వీస్ కూడా చాలా బావున్నది. థాంక్యూ,' అని వెయిటర్ తో చెయ్యి కలిపాడు. వాడు ఎంతో ఆనంద పడ్డాడు.
స్పందన అన్ని గమనిస్తోంది అని కిట్టుకి తెలియదు.
స్పందన అప్పటి వరకు ఏమి మాట్లాడలేదు. అక్క లేని సమయమే కరెక్ట్ అనుకుందో ఏమో, 'మీకు వెయిటర్ బాగా తెలుసా? అతన్ని సర్ అని ఎందుకు పిలుస్తున్నారు?' అని అడిగింది.
అర్థంలేని ప్రశ్నలుగా అనిపించినా సమాధానం చెప్పాడు. 'లేదండి. నిన్న రాత్రి వచ్చినప్పుడు కలిసాను. అతను తన పని పట్ల ఎంతో శ్రద్ధతో చేస్తున్నాడు. అలా చేసేవారంటే నాకు బాగా గౌరవం. అందుకే అలా సర్ అని పిలిచాను,' అన్నాడు.
'మరి శ్రద్ధతో పని చెయ్యకపోతే ఎలా పిలుస్తారు?' అని అడిగింది.
ఏంటి రా బాబు ఈ ప్రశ్నలు అనుకున్నాడు. 'అప్పుడు కేవలం పేరు పెట్టి పిలుస్తాను. కానీ అలంటి వారితో ఎంతవరకు పని ఉందో అంత వరకే మాట్లాడుతాను. వీళ్ళే కాదు క్యాబ్ డ్రైవర్ అయినా, షాప్ లో పని చేసేవారు అయినా, డెలివరీ బాయ్ అయినా, చెత్త తీసుకెళ్లే వారు అయినా, వారిని నేను గవరవిస్తాను. ఎందుకంటే వారు వారి పని చెయ్యకపోతే మనము మన పని చేయలేము కదా. అందుకే, అందరు ఇంపార్టెంట్ అందరికి గౌరవం ఇవ్వాలి,' అన్నాడు క్యాజువల్ గా.
పర్లేదు. వీడికి డిగ్నిటీ అఫ్ లేబర్ ఎలా చూపించాలో తెలుసు. వెరీ నైస్. ఇంకో రెండు మూడు బాక్స్ లు టిక్ పెట్టుకోవచ్చు, అని అనుకుంది మనసుతో.
ఇంతలో తాను కూడా వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అందరు కలిసి పార్కింగ్ దెగ్గరికి వెళ్లారు. సమీర కార్ డ్రైవర్ సీట్ దెగ్గరికి వెళ్ళింది, కిట్టు స్పందన కోసం డ్రైవర్ పక్కన సీట్ డోర్ కూడా తీసాడు. స్పందనకి ఆడవారి పట్ల వాడు చూపే మర్యాద నచ్చింది. దాదాపు మూడు గంటలు అన్ని విషయాలలో తనకి కిట్టు పద్ధతి నచ్చింది. కాకపోతే తండ్రిలేని పిల్లలు కావడంతో స్వతహాగా జాగ్రత్త ఎక్కువ. అందులోను స్పందన ఎవ్వరిని తొందరగా నమ్మదు.
కాకపోతే తమ మొదటి మీటింగ్ గుర్తుండిపోయేలాగా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకుని, తమకి మంచి ఎక్స్పీరియన్స్ పంచిన కిట్టుకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది.
'మెమొరబుల్ గా ఉండాలి మొదటి మీటింగ్ అని చెప్పారు ఫోటోగ్రాఫర్ ని ఆరెంజ్ చెయ్యలేదా?' అని అడిగింది స్పందన.
అయితే తాను అడిగిన తీరులో కొంచం వ్యంగ్యత గమనించిన సమీర కళ్ళు పెద్దవి చేసి నోరు ముయ్యి అని సైగ చేసింది.
కానీ అందులో ఆటపట్టించేలా ఉండటం గమనించిన కిట్టు, 'DSLR సరిపోతుందా లేక డ్రోన్ కెమెరా కావాలా?' అని అడిగాడు.
ఒక క్షణం సైలెంట్ అయిపోయింది స్పందన. కానీ జోక్ అర్థం అయిన సమీర మాత్రం ఫక్కున నవ్వింది. జోక్ అర్థం అయ్యి స్పందన కూడా నవ్వింది.
సెన్స్ అఫ్ హ్యూమర్ కి ఇంకో టిక్, అనుకుంది మనసులో.
మొత్తానికి మళ్ళీ దిగి ముగ్గురు సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగేప్పుడు బాగా దెగ్గరిగా వచ్చారు ముగ్గురు.
మొదటి సారి సమీర భుజానికి తన భుజం తగిలేసరికి మెత్తగా ఒక చిన్న హాయి కలిగింది కిట్టు మనసులో. సమీర మాత్రం మామూలుగానే ఉంది. అయితే సెల్ఫీ తీస్తున్న స్పందన కిట్టు మోహంలో చిన్న చేంజ్ గమనించింది. అది తన అక్క శరీరం తగలడం వల్ల అని అర్థం అయింది. చిన్నగా నవ్వుకుంది.
పర్లేదు, అక్క కి అట్ట్రాక్ట్ అవుతున్నాడు, అనుకుంది మనసులో. ఇంకో బాక్స్ టిక్ పెట్టచ్చా లేదా అని ఆలోచించింది. ఇందులో టిక్ పెట్టడానికి ఏముంది? అక్క చెల్లి ఇద్దరు అందంగానే ఉంటా[b]ము. అందులోను అక్కా చాలా బావుంటుంది. ఏ మగాడైనా అట్ట్రాక్ట్ అవ్వాల్సిందే. టిక్ కాన్సల్ అనుకుంది. [/b]
ఇంతలో గుప్పుమని ఒక మంచి వాసన తన ముక్కుకి తగలింది. అది కిట్టుగాడి పెర్ఫ్యూమ్. స్పందనకి చాలా నచ్చింది. వీడికి బాడీ స్మెల్ రాకుండా మైంటైన్ చేయడం తెలుసు. గుడ్. ఇంకో టిక్ వేయచ్చు అనుకుంది.
'సరే కిట్టు, మేము బయల్దేరుతాము,' అని సమీర కదలడంతో కిట్టు కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. స్పందన ఎక్కింది. డోర్ నెమ్మదిగా వేసాడు.
'ఎంజాయ్ యువర్ షాపింగ్,' అని చెయ్యి ఊపాడు. సమీరా స్పందన ఇద్దరు బయల్దేరారు. ఇంకా తన కార్ తీసుకుని కిట్టు ఇంటికి బయల్దేరాడు.
ఇంకా ఉంది

బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)