Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - Completed
#55
ప్రేమగా పెట్టిన ముద్దు.. నేను కూడా తన తలని నా చేతులతో బంధిస్తూ.. తనకి ఊపిరులూదా..

నీ గుండె ఏంట్రా అంత గట్టిగా కొట్టుకుంటోంది.. డోస్ ఎక్కువైతే నిజంగా పోయేలా ఉన్నావ్.. సరే పోదాం పద అన్న..

ఇద్దరం ముందు సీట్స్ లో కూర్చోగానే కార్ సిటీ వైపు పరుగులు తీసింది..


మధ్యాహ్నం..

ఇద్దరం తెలిసిన ఫ్రెండ్ దగ్గర లాప్టాప్ తీసుకొని.. ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఇంకొంచెం స్టడీ చేసి.. సమ్మరైజ్ చెయ్యడం మొదలు పెట్టాం.. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, పికెల్స్, పౌడర్లు, మసాలాస్, స్నాక్స్, వాషింగ్ ప్రొడక్ట్స్, హౌస్ క్లీనింగ్ ప్రొడక్ట్స్, గ్రోసరీ, సోప్స్, రెడీ మిక్స్ టిఫిన్స్ ఇలా 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఫైనల్ చేసాం..

మళ్ళీ ఒక్కొక్కటి మెషినరీ అండ్ రా మెటీరియల్ , మాన్పవర్   వైస్ చూసుకుంటూ ROI చూసుకుంటూ ఫైనల్ చేసే సరికి 7 దాటిపోయింది..

ఓవరాల్ బడ్జెట్ విత్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సూపర్ మార్కెట్ చైన్ తో కలిపి చూసుకుంటే 5 క్రోర్స్ దాటిపోయింది..

లోన్ వచ్చిన కూడా ఎంత లేదన్న మనల్ని 30  టు 40 పెర్సెంట్ పెట్టమంటారు.. అంటే మినిమం 2 క్రోర్స్ మనం ఆరెంజ్ చేసుకోవాలి..

సరే ఫండ్ రైసింగ్ కూడా ఇప్పుడే చేసేద్దాం.. అని సాయి అంటే సరే అని.. మా డీటెయిల్స్ ఎంటర్ చేసి.. మా కాన్సెప్ట్ పెట్టి త్రీ మంత్స్ లో 2 క్రోర్స్ టార్గెట్ అడిగాం..

అనుకున్న పని మొదలు పెట్టినందుకు చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాం..

ఈలోపు అత్త కాల్ చేసింది.. నైట్ బుకింగ్ ఉందని..

సాయి కి చెప్పా వెళ్లాలని.. వాడి చూపుల్లో విసుగు కోపం చిరాకు అన్ని కనపడుతున్నాయి..

కానీ వాడికి అర్ధం కాదు కదా.. ఇదొక నెట్వర్క్.. ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరాలు.. అనుకున్నంత ఈజీ గా బయట పడలేం..

నా స్కూటీ మీదే.. ఇంటికి వచ్చాం.. రేపు మా వాళ్లతో మాట్లాడదాం.. ఎవరెవరు ఎం చేయగలరో.. ట్రైనింగ్స్ ఇప్పిద్దాం అన్నావ్ కదా..

క్రౌడ్ ఫండింగ్ కూడా రావడం స్టార్ట్ అయ్యాక లోన్స్ కి అప్లై చేద్దాం.. విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అన్న..

వాడేం మాట్లాడట్లేదు.. కనీసం బాయ్ కూడా చెప్పట్లేదు..

ఇక నేనే వాడిని దగ్గరకు తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసా..

.................
రెండు నెలల 25 రోజుల తర్వాత..

మేము రైజ్ చేసిన క్రౌడ్ ఫండింగ్ సక్సెస్ అని చెప్పలేం.. ఫెయిల్ అని చెప్పలేం.. 34 లక్షలు వచ్చాయి.. మా దగ్గర ఒక 27 లక్షలు.. మొత్తం 61 లక్షలు..

ఈలోపు మేము అనుకున్నట్టు ఫర్మ్ రిజిస్టర్ చెయ్యడం.. మావాళ్లను రకరకాల చోట్ల ఉద్యోగాల్లో చేర్పించడం చేసాం..

ఇది వరకే సాయి అనుకున్నట్టు సిటీ కి దగ్గర ఉన్న ఆ పల్లెటూల్లోనే వేర్హౌస్ రెంట్ కి తీసుకున్నాం..

ఇక అత్త కూడా ఒకేసారి కాకుండా ఒక్కొక్కళ్ళని బిజినెస్ మనిపిస్తూ వాళ్ళని అక్కడే సెటిల్ అవ్వమని పంపడం మొదలు పెట్టింది.. ఒకప్పుడు 28 మంది దాకా ఉన్న మేము ఇప్పుడు 12 మంది అయ్యాము..

వచ్చే బుకింగ్స్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం అలా మా మీద ప్రెషర్ రాకుండా మేము బయట పడేలా చేసింది అత్త..

ఇక ఒక్కొక్కళ్ళను తీసుకొని బ్యాంక్స్ చుట్టూ తిరగాలి లోన్స్ కోసం..

మళ్ళీ మా అదృష్టమో.. దురదృష్టమో.. 6 ప్రాజెక్ట్స్ అప్ప్రోవ్ అయ్యాయి.. మిగిలిన వాటికీ ఇంకా టైం పడుతోంది..

మా దగ్గర ఉన్న డబ్బులతో స్టార్ట్ చేద్దాం అంటే నెక్స్ట్ సూపర్ మార్కెట్స్ పెట్టడం కష్టం..

ఈలోపు గత మూడు నెలలుగా మాతో ట్రావెల్ చేస్తున్న మా క్లాస్మేట్స్ కూడా ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం ని కాలేజీ లో కూడా కండక్ట్ చేసి దగ్గర దగ్గర 8 లక్షలు  కలెక్ట్ చేసి ఇచ్చారు..

ఏదైతే అదయ్యిందని మళ్ళీ అదే రేణుక ఎల్లమ్మ గుళ్లో పూజ చేసి మా బిజినెస్ స్టార్ట్ చేసాం.. అదే "లోకల్" బ్రాండ్..

ఒక మంచి పనికి జనాలు ముందుకు వస్తుంటే అప్పుడు సాయి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.. అడిగి చూడొచ్చు కదా అన్న మాట..

మళ్ళీ అత్త కి చెప్పా.. అత్త పెద్ద పార్టీలు ఉంటె చెప్పు ఒక్క నెల మాత్రం అని.. అత్త జాలి పడిందో బాధ పడిందో తెలీదు కానీ.. మళ్ళీ పెద్ద పెద్ద బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి..

కానీ ఈసారి వాళ్ళకి సుఖమే కాదు.. నా అవసరం కూడా అడిగా.. కొంత మంది అర్ధం చేసుకున్నారు.. కొంత మంది అబద్ధం అనాన్రు.. ఏమైతేనేం ఇంకో 12 లక్షలు వచ్చాయి..

ఆ డబ్బుతో మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసాం… మాక్సిమం మా దగ్గర పనిచేసేవాళ్లంతా ట్రాన్సజెండెర్ / హిజ్రా లే..

ట్రాన్స్పోర్టింగ్ అండ్ సేల్స్, మార్కెట్ మైన్టైనన్స్ మా వాళ్ళకి అప్ప చెప్పాము.. చదువుకున్న వాళ్ళు అకౌంట్స్ సెక్షన్..

సిటీ లో బా క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో త్రీ సూపర్ మర్కెట్స్ ఓపెన్ చేసి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టాం.. అక్కడ దొరికే ప్రతీ వస్తువు మేము తయారు చేసేదే లేదా నాన్ బ్రాండెడ్ ఐటమ్స్.. లోకల్ ఫార్మర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్లు ని ఎంకరేజ్ చేసేలా..

మా ఫ్రెండ్స్ ద్వారా మా బిజినెస్ ప్రమోషన్ ఇంకా ఫాస్ట్ గా జనాల్లోకి వెళ్ళింది.. ఎన్నో డెలివరీ అప్స్ వాళ్ళంతట వాళ్లే మా ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి చేర్చడానికి మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు...

అత్త సాయి నేను మావాళ్లు అందరూ హ్యాపీ..

...........

కరెక్ట్ గా మా సూపర్ మార్కెట్ చైన్ ఓపెన్ చేసి 1 ఇయర్ అయ్యింది.. ఈ 1 ఇయర్ లో మా జీవితాల్లో మారనిది ఏదైనా ఉంది అంటే అది సాయి నుదిటిన నేనిచ్చే ముద్దు ఒక్కటే.. ప్రతీ రోజు సాయంత్రం మేము విడిపోయే ముందు.. ఒక్క ముద్దు..

ఈరోజు మా కంపెనీ ఆనివెర్సరీ.. ఈ 1  ఇయర్ లో మా లోకల్ బ్రాండ్ పేరు మీద ఇంకో పది రకాల ప్రొడక్ట్స్ లాంచ్ చేసాం. 20 సూపర్ మార్కెట్ బ్రాంచెస్ పెట్టాం..  దగ్గర దగ్గర 630 మందికి పని దొరికింది.. ఈ ప్రాజెక్ట్ వల్ల.. సాయి వల్ల..

సాయంతం..

ఈరోజు ఆనివెర్సరీ కి మావయ్య వాళ్ళని చెల్లిని అందరాని పిలిచా.. వాళ్ళు కూడా హ్యాపీ చిన్న వయసులోనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంత బిజినెస్ చేస్తున్నందుకు..

వాళ్ళకి వర్ష ని చూపించా.. రాణి ని చూపిస్తే గతం మాట్లాడుకోవాల్సి వస్తుందేమో అని..

మా క్లోజ్నెస్ చూసి వాళ్ళకి ఎదో అర్ధం అయ్యింది అనుకుంటూనే.. నైట్ బస్సు ఎక్కడానికి బయలుదేరారు..

వాళ్ళని దింపి మళ్ళీ పార్టీ కి వచ్చా..

వర్ష కి ఈరోజు ప్రొపోజ్ చెయ్యాలి అని 1 ఇయర్ ముందే అనుకున్నా..

కొంచెం సందడి తగ్గాక.. అచ్చు తనలాగే ఉన్న ఒక రోజ్.. అదే రోజ్ కలర్ లో ఇంకో బాక్స్ తీసుకొని తన దగ్గరకి వెళ్ళా..

ఇన్ని చూసిన తర్వాత ఏముంది.. నవ్వుతూ ఏంట్రా ప్రొపోజ్ చేస్తున్నావా అంది..

అవునంటూ మోకాళ్ళ మీద కూర్చొని రోజ్ ఇచ్చి.. ఎడమచేతిలో బాక్స్ ని కుడి చేత్తో ఓపెన్ చేస్తూ..ఒక కీ తన చేతికి ఇచ్ఛా..

వర్ష - ఏంట్రా ఇది.

నేను - అప్పుడు చెప్పా కదా.. ఆ వూళ్ళో చెరువు పక్కన మనకోసం ఒక ఇల్లు కొన్న.. 1000 గజాలు.. మనకోసం..

వర్ష - మన కోసం కాదు.. సెల్ఫిష్ వి రా నువ్వు. నీకోసం కొన్నావ్..

నేను - అదేంటి..

వర్ష - మరి మన కోసం ఐతే ముందు నాకు చూపించవా.. నువ్వు సర్ప్రైస్ ఇవ్వాలి.. నేను అవ్వాలి.. అప్పుడు నువ్వు హ్యాపీ.. అంటే నీ హ్యాపీనెస్ కోసం చేసినట్టే కదా..

నేను - సర్లే పనికి మాలిన లోజిక్స్ తక్కువేం లేదు.. నైట్ వెళ్దామా..

వర్ష - హే.. ఎప్పుడు పడితే అప్పుడేనా.. మంచిరోజు చూసి గృహప్రవేశం చేసుకుందాం..

అందరూ మమ్మల్నే చూస్తున్నారన్న సంగతి అప్పటికి గాని గమనించలేదు మేము..

రత్తమ్మ అత్తకి మిగిలిన వాళ్ళకి వెళ్లొస్తాం అని చెప్పి తనని దింపడానికి వెళ్ళా..

వెళ్తూ వెళ్తూ సంవత్సరం నుంచి మాకు అలవాటైన నుదిటి ముద్దు కాకుండా పెదాల మీద ముద్దిచ్చి సిగ్గు పడుతూ వెళ్ళిపోయింది వర్ష...

ఇంటికొచ్చి పడుకుంటే నిద్దర రాదే... ఇల్లు.. పెళ్లి.. పిల్లలు.. కలలు.. నిజాలు..

పొద్దున్న...

వరసపెట్టి కాల్స్ వస్తున్నాయ్..ఇంత పొద్దున్నే ఎవరా అని చూస్తే ఏడుస్తూ రత్తమ్మ అత్త..

వర్ష సూసైడ్ అట్టెంప్ట్ చేసిందని.. అర్జెంటు గా హాస్పిటల్ కి రమ్మని...

To be Continued.
Like Reply


Messages In This Thread
RE: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - by nareN 2 - 13-02-2025, 02:12 PM



Users browsing this thread: 1 Guest(s)