Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ (ఇంటర్వెల్)
సెగ్మెంట్ 3 : సుహాస్

చాప్టర్ 3.14 : హౌ ఆర్ యు?












సమంత "హైదరాబాద్ లో ఉన్న మన వాళ్లకు ఫోన్ చేసి సైలెంట్ గా సుహాస్ ని ఫినిష్ చేయమని చెప్పూ.."

అసిస్టెంట్ "అలాగే మేడం.."

ఫోన్ రింగ్ అవుతుంది..

అసిస్టెంట్ "హలో.."

"చెప్పండి మేడం.."

అసిస్టెంట్ "సుహాస్ మీ దగ్గరే ఉన్నాడా.."

"అవును, ఇక్కడే ఉన్నాడు మేడం.. అందరం కలిసి భోజనం చేస్తున్నాం.."

అసిస్టెంట్ "గుడ్.. పక్కకు రా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.."

"హుమ్మ్"

ఫోన్ లో హడావిడి సౌండ్ తగ్గి సైలెంట్ గా ఉన్న ప్లేస్ లోకి వచ్చాడు అని అర్ధం అయింది.

"చెప్పండి మేడం.."

అసిస్టెంట్ "చిన్నగా మాట్లాడు.."

"చెప్పండి మేడం.."

అసిస్టెంట్ "సుహాస్ ని సైలెంట్ గా ఎక్కడకు అయినా తీసుకొని వెళ్లి చంపేసేయండి.."

"మేడం.. మళ్ళి చెప్పండి.. సారిగా వినిపించడం లేదు.."

అసిస్టెంట్ "సుహాస్ ని సైలెంట్ గా ఎక్కడకు అయినా తీసుకొని వెళ్లి చంపేసేయండి.."

"ఇక్కడ సిగ్నల్ లేదు మేడం.. ఉండండి.. బయటకు వస్తున్నా.."

ఫోన్ లో వేరే ప్లేస్ కి వెళ్లినట్టు సౌండ్ వినపడుతుంది.

అసిస్టెంట్ "సుహాస్ ని ఎక్కడకు అయినా తీసుకొని వెళ్లి చంపేసేయండి.. చంపేసేయండి.. "

"ఏంటి? మేడం, సుహాస్ గారిని ఎక్కడకు అయినా తీసుకొని వెళ్లి తినిపించాలా.."

అసిస్టెంట్ "తినిపించడం కాదు రా.. చంపేయండి.." అని సీరియస్ అయింది.

సమంత "ష్" అని సిగ్నల్ చూపించింది.

అసిస్టెంట్ "మెసేజ్ పంపిస్తాను చదివిచావ్.. వెంటనే డిలీట్ కూడా చెయ్.." అని చెప్పి ఫోన్ కట్టేసింది.

సమంత "సుహాస్ ఫోన్ ట్రాక్ చెయ్ వీళ్ళతోనే ఉన్నాడా.."

"వీళ్ళతోనే ఉన్నాడు మేడం.."






అతను పరిగెత్తుకుంటూ వెళ్లి మిగిలిన వాళ్ళతో కూర్చొని "సుహాస్ ని వెతకాలి.."

"ఏమయింది రా?"

"ఏంటి? ఏమయింది? అంటున్నావ్...  సుహాస్ ని చంపేయమని చెప్పారు"

"అదేంటి?"

"నాకు ఏం తెలుసు?"

"సుహాస్ కి ముందే తెలిసే పారిపోయాడా.."

"ఏమయింది?"

"సుహాస్ అన్న వెళ్ళే ముందు ఈ ఫోన్ యిచ్చి వెళ్ళాడు.. ఇది రింగ్ అవుతుంది.."







సమంత "సుహాస్.. ఎక్కడున్నావ్.."

"మేడం.."

సమంత "ఎవరూ..?"

"మేడం.. సుహాస్ గారు ఫోన్ యిచ్చి బయటకు వెళ్ళారు మేడం.."

సమంత "అవునా.. ఎంత సేపు అయింది.."

"అదీ.. అదీ.. "

సమంత "ఏమయింది?"

"సార్ వెళ్లి మూడు రోజులు అవుతుంది మేడం.."

సమంత "వాట్.."







సమంత "ఎక్కడకు వెళ్ళాడో కనుక్కోండి.. వాళ్ళ.. వాళ్ళ.. అత్తగారి ఇంటికి వెళ్లి చూడండి.. వాడి కొడుకు ఉంటాడు.. వాళ్ళ ఫ్యామిలీని పట్టుకోండి.."

"వెళ్తున్నాం మేడం.."

సమంత "చంపిన వాడికి 1xxxx00/- ఇస్తాను.. సుహాస్ ఎక్కడ ఉన్నాడో వెతకండి.. దొరకాలి.. దొరికి తీరాలి.."

"వెళ్తున్నాం మేడం.. దారిలోనే ఉన్నాం.."




అసిస్టెంట్ "ఏం చేస్తున్నారు.."

"ఇంటి ముందు ఉన్నాం మేడం.."

అసిస్టెంట్ "ఇంటి ముందు కూర్చొని ముగ్గు వేస్తున్నారా... వెళ్లి అందరిని చంపండి... వెళ్ళండి.." అని అరిచింది.

"ఇంటికి తాళం వేసి ఉంది మేడం.."

అసిస్టెంట్ "ఓనర్ వచ్చే దాకా వెయిట్ చేస్తారా.."

"అంతే కదా మేడం.."

అసిస్టెంట్ "రేయ్ వాడు.. మనం ఎదో ఒకటి చేస్తాం అని ఫోన్ యిచ్చి పారిపోయాడు.. వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎప్పుడో తప్పించి ఉంటాడు.. లోపలకు వెళ్లి క్లూ వెతకండి.."

"అవునూ మేడం రెండు రోజుల ముందే ఎక్కడకో వెళ్లి పోయారు అంట, పక్కింటి వాళ్ళు చెప్పారు.."

అసిస్టెంట్ "ఒరేయ్.. వెళ్లి తలుపులు ఓపెన్ చేసి లోపల చూడండి రా.."

"రేయ్.. తాళం కోసే వాడిని తెప్పించి తలుపులు ఓపెన్ చేయండి.."

అసిస్టెంట్ "పిచ్చి వేషాలు వేసారంటే చంపి పారేస్తాను.. తలుపులు పగల కొట్టండి.."

"మేడం, అది.."

అసిస్టెంట్ "ఏంటి?"

"మేడం, సరే మేడం చేస్తున్నాం.. తలుపులు పగలకోట్టండి.."

ధబ్.. ధబ్.. ధబ్.. మని సౌండ్స్ వస్తూ ఉంటే, అసిస్టెంట్ మరియు సమంత ఇద్దరూ ఫోన్ లో వింటూ ఉన్నారు.

కిర్ర్ మంటూ తలుపు ఓపెన్ అయింది.

మనుషులు అందరూ లోపలకు వెళ్ళారు.

అక్కడ నుండి సైలెన్స్...

అసిస్టెంట్ "హలో.. హలో.. హలో.. "

. .
. .
. .


అవతల వైపు అంతా సైలెన్స్ గా ఉంది.

రెండు నిముషాలు గడిచినా ఎవరూ కదలడం లేదు.

అసిస్టెంట్ "ఎవరో ఒకరు మాట్లాడండి.. హలో.. హలో.. హలో.. " అని అరుస్తూనే ఉంది.

సమంత పెదాల మీద నవ్వు వచ్చి చేరింది.

అసిస్టెంట్ "హలో.. హలో.. హ్హలో..." అని అరుస్తూనే ఉంది.

సమంత ఫోన్ అందుకొని "హాయ్ సుహాస్... హౌ ఆర్ యు.."

అసిస్టెంట్ ఫోన్ ని ఎదో దయ్యాన్ని చూసినట్టు చూసి భయపడింది.

సమంత మాట్లాడిన తర్వాత గమనిస్తే.. ఫోన్ నుండి సుహాస్ ఊపిరి స్పష్టంగా వినపడుతుంది.

సుహాస్ ఎదురుగా అయిదుగురు అలానే నిలబడి ఉన్నారు.

సుహాస్ ఫోన్ అందుకొని సమంత విషయం గుర్తు పట్టింది అని నవ్వుకున్నాడు.

సమంత కూడా నవ్వేసింది.

సుహాస్ ఫోన్ కట్టేశాడు.





















[+] 6 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ - by 3sivaram - 11-02-2025, 01:13 PM



Users browsing this thread: 24 Guest(s)