Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - Completed
#1
లవ్ ఎట్ ఫస్ట్ సైట్..


 
పొద్దున్న..
 
నా పేరు సాయికృష్ణ.. ఈరోజే సిటీ కి వచ్చా.. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు.. ఇంత కాలం వూళ్ళో మా మేనమామ ఇంట్లో ఉండి చదువుకున్నాం నేను మా చెల్లి...
 
కొంచెం పెద్దవాణ్ణి అయ్యా కదా ఎదో పని చేసుకుంటూ చదువుకుందాం అని ఇందాకే బస్సు దిగి.. డిగ్రీ కాలేజీ లో అడ్మిషన్ కోసం వచ్చా.. మొదటి రోజు.. ఇంకా ఎక్కువ మంది రాలేదు..  క్లాస్ కి వెళ్లి ఎక్కడ కూర్చోవాలో చూసుకుని కాసెపుండి వచ్చేసా..
 
కాలేజీ పూర్తయ్యాక దగ్గర్లో ఒక హాస్టల్ చూసుకొని పని కోసం రోడ్డున పడ్డా..
 
ఇంత కాలం మావయ్య సాయం చేసాడు.. మరీ ప్రైవేట్ కాలేజ్స్ లో ఫీజులు కట్టకపోయిన తిండి బట్ట ఇచ్చాడుగా.. ఎంత కాలం అని ఆయన్ని ఇబ్బంది పెట్టడం.. చెల్లి కి కూడా పెళ్లి చెయ్యాలి..  ఇప్పటినుంచే దాచాలి..
 
వెతగ్గా ఆలోచించగా క్యాబ్ డ్రైవింగ్ ఐతే నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు, రాత్రి పూట పని చేసుకోవచ్చు, దొబ్బడానికి పైన ఎవడు ఉండడు కాబట్టి.. అదే మనకు సూట్ అయ్యే పని అని డిసైడ్ అయ్యి..
 
ఆప్ ఇన్స్టాల్ చేసి క్యాబ్ డ్రైవర్ పోస్ట్లు  వెతగ్గా.. ఒక అన్న ఈరోజే పనిలో జాయిన్ అవ్వమన్నాడు.. క్యాబ్ అతనిది.. డ్రైవింగ్ మనది.. ఖర్చులు పోను షేర్ చేసుకుందాం అన్నాడు..
 
ఓ కొబ్బరికాయ కొనుక్కొని లొకేషన్ కి  వెళ్లి తాళాలు తీసుకొని చిన్న పూజ చేసుకొని లాగిన్ చేశా...


 
సాయంత్రం..

 
ఇప్పటికి రెండు ట్రిప్ లు కొట్టా.. అయ్యబాబోయ్ హైదరాబాద్ ట్రాఫిక్ మామూలుగా లేదు.. కాసేపు ఏదోటి తినేసి మళ్ళీ లాగిన్ అవుదాం అనుకుంటూ ఉండగా బుకింగ్ వచ్చింది..
 
మొదటి రోజే కదా క్యాన్సిల్ కొట్టబుద్ధి కాలేదు.. ఎక్కడో మూడు కిలో మీటర్లు లోపల లోపల సందులు తిరిగితే 20 నిముషాలకి లొకేషన్ కి వెళ్ళా..
 
నెమలిపింఛం రంగు చీర..గులాబీ రంగు జాకెట్టు..జడలో మల్లెపూల రంగు మల్లెపూలు... నుదుటిన కుంకుమ బొట్టుతో.. కళ్ళతోనే మాట్లాడుతూ నవ్వితే బుగ్గలు కందిపోతాయేమో అన్నట్టు చిరు మందహాసం చేస్తూ ఉందొ వయ్యారి భామ..
 
తనని చూసి మైమరచిపోతూ అక్కడే పక్కకి ఆగి తననే చూస్తూ ఉండిపోయా కస్టమర్ కి కాల్ చెయ్యకుండా..
 
ఈలోపు ఇదిగో ఇక్కడ ఉన్నా అన్నట్టు చెయ్యెత్తి పిలుస్తోంది.. నన్నేనా.. ఓహ్ క్యాబ్ నెంబర్ చూసి గుర్తు పట్టినట్టు ఉంది.. తనేనా క్యాబ్ బుక్ చేసింది..వాహ్..
 
ముందు కూర్చుంటే బావుండు.. ఎంతో ఆశ పడ్డా..
 
ప్రంపంచంలో ఉండే మగాళ్లతో తనకి పని లేనట్టు వెనక డోర్ తీసుకొని లొకేషన్ ఉందిగా.. చెప్పాలా అంది..
 
ఓటీపీ అడిగి ఎంటర్ చేసాక లొకేషన్ కంఫర్మ్ చేసుకున్నా.. హా అక్కడికే అంది..
 
కార్ రివర్స్ చేసి, ముందుకు పోతూ తనని ఓసారి అద్దంలో చూసా.. అప్పటికే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటల్లో మునిగిపోయింది..
 
మళ్ళీ చూస్తే ఇదివరకు తనని చాల సార్లు చూసా అన్న ఫీలింగ్.. అప్పుడే తన మొహం అంత అలవాటు అయిపోయిందా అనిపించింది..
 
పరుగు మూవీలో అల్లు అర్జున్ చెప్పినట్టు.. తనకి తెలీకుండానే తను నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.. ఇదేనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే..
 
ఆకలి ఏటో పోయింది.. ట్రాఫిక్ ఇంకా ఉంటె బావుండు అనిపించింది.. తనని ఇంకా ఎక్కువ సేపు చూడొచ్చు కదా..
 
కార్లు తిరగలేని ఇరుకు సందుల్లోంచి కార్ రేస్లు  చేసుకునే వాళ్ళు ఉండే ఏరియా లోకి వచ్చేసాం.. ఒక్కో విల్లా ఒక్కో ఇంద్ర భవనం లా ఉంది..
 
ఇంతలో.. తనకి కాల్ వస్తే పక్కనే ఉన్నా 2 మినిట్స్ అని చెప్పింది.. మళ్ళీ ఆకలి మొదలైంది.. తలలో గుండెల్లో కడుపులో ఎదో వెలితి.. ఎంప్టీ అయిపోయిన ఫీలింగ్..
 
తను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి..  ఒక 2  హౌర్స్ వెయిట్ చేస్తావా.. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి.. నైట్ ఈ ఏరియా లో క్యాబ్స్ దొరకడం కష్టం అంది..
 
అంత కంటే అదృష్టమా అని మనసులో అనుకోని.. ఏదైనా తినేసి వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తా అని చెప్పా.. తను అలా గేట్ తీసుకొని వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది..
 
బిల్డింగ్ పైనంతా హడావిడి మ్యూజిక్ బా సందడిగా ఉంది.. ఎదో బర్త్డే పార్టీ లా ఉంది.. ఎంతైనా డబ్బున్న వాళ్ళ ఖర్చులే వేరు..
 
మళ్ళీ తనని ఇంకో రెండు గంటల్లో చూడొచ్చనే ఆనందంలో.. ఎం తిన్నానో ఎంత తిన్నానో కూడా చూసుకోకుండా మళ్ళీ తనని దింపిన ప్లేస్ కి వచ్చి వెయిట్ చేశా..
 
రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదేమో ఫోన్ చూస్తుండగానే నిద్ర పట్టేసింది..
 
గట్టిగా డోర్ కొట్టిన సౌండ్ తో మెలకువ వచ్చింది.. కలా.. నిద్ర మత్తులో ఉన్నానా.. తనని చూడగానే షాక్ అవ్వాలా ఇంకేమనాలో కూడా అర్ధం కాలేదు..
 
మల్లెపూలు రాలిపోయి.. పెదవులు కందిపోయి.. చీర నలిగిపోయి.. సైలెంట్ గా ఎక్కి వెళ్దాం పద అంది..
 
ఏమని అడగాలో మైండ్ ప్రిపేర్ అవుతుండగా చూసింది చాలు వెళ్దాం పద అంది..
 
కార్ స్టార్ట్ చేసి ఏమైనా మాట్లాడడం అనుకుంటూ ఉండగానే తను ఎవరికో ఫోన్ చేసి..
 
హా అత్తా.. బయలుదేరా.. రేపు కూడా రమ్మంటున్నారు.. నైట్ అంతా ఉండాలిట.. నీతో మాట్లాడమని చెప్పా..
 
అవతల నుంచి వెళ్తావా అని అడిగినట్టుంది.. నీ ఇష్టం అత్తా.. ముగ్గురు ఉన్నారు చూసి మాట్లాడు అని ఫోన్ పెట్టేసి కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి పడుకుంది..
 
విషయం అర్ధం ఐంది కానీ సరిగ్గా విన్నానో లేదో అని నా మీద నాకే డౌట్ వచ్చింది..
 
ఇప్పుడు తనని చూస్తుంటే చెదిరిన ముంగురులు చాటున ఇందాక చూసిన అదే అమాయకపు ముఖం వెనకాల ఇలాంటి ఒక భయంకరమైన నిజం ఉంటుందని ఎక్సపెక్ట్ చెయ్యలేదు..
 
చేతులు కాళ్ళు వాటి పని అవి చేసుకు పోతున్నాయి.. లొకేషన్ రీచ్ అయ్యా.. తనని లేపబుద్ధి కాలేదు.. కార్ పక్కకి పెట్టి.. అద్దంలో తన మొహాన్ని చూస్తూ అలాగే నిద్రపోయా..
 
కాసేపటికి భుజం మీద చిన్న కుదుపు.. సడన్ గా లేచి చూస్తే.. వచ్చాక చెప్పవా అంటూ.. కార్ దిగి ఎంతైంది అంది..
 
ఇందాకటి అంతే అన్నా.. రౌండ్ ఫిగర్ చేసి ఇస్తూ నైట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారులే.. ఉంచుకో అంటూ.. రాత్రి మూడైన ఇంకా లైట్స్ వెలుగుతున్న మూడంతస్తుల బిల్డింగ్ లోకి గేట్ తీసుకొని వెళ్ళిపోయింది..
 
తనని మళ్ళీ చూడాలని పించింది.. చేతిలో తను ఇచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయ్.. గంటకి ఎంతో..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - Completed - by nareN 2 - 10-02-2025, 08:47 PM



Users browsing this thread: