05-02-2025, 06:54 PM
(05-02-2025, 05:41 PM)3sivaram Wrote:అనగనగా ఒక ప్రేమ లేఖ...
ప్రియా...., ఇదిగో ఇది నీ కోసం రాసిన నేను రాసిన ప్రేమ లేఖ నీకు గుర్తు ఉందా, నేను నీ కోసం ఎదురుచూస్తున్నా అని తెలిసి, మీ అమ్మవాళ్ళు నీతో పాటు నీ స్నేహితులను తోడూ యిచ్చి పంపించినా నా కోసం నువ్వు చూసిన ఒకే ఒక్క చూపు, ఆ తర్వాత అటు ఏటో చూసి నువ్వు నవ్విన నవ్వు. నాలో ఉన్న కవిని నిద్ర లేపి కవితలు రాయించింది, నిద్ర పట్టనివ్వక నా కళ్ళను ఎర్రగా మార్చేసింది, అమ్మ ఏమో పీక్కుపోయిన నా మొహాన్ని చూస్తూ కంగారు పడుతుంది కానీ, తన పనిలో తోడు వచ్చే బంగారం లాంటి కోడలిని... నిన్ను తేబోతున్నా... అని మాత్రం ఊహించలేదు.
ప్రియా...., ఇదిగో అప్పట్లో నీ కోసం నేను రాసిన ప్రేమ లేఖ నీకు గుర్తు ఉందా, నాకు అబద్దం చెప్పి నా వెనక నా స్నేహితుడుతో చాటింగ్ చేసినపుడు ఒక వాక్యం తీసేశాను. నేను అమ్మానాన్నలను రాచి రంపాన పెట్టి నీకు తెచ్చి ఇచ్చిన డబ్బుతో నువ్వు మెక్ అప్ కిట్ కొనుక్కొని నీ బాయ్ బెస్టీ తో కలిసి సినిమాకి వెళ్ళినపుడు మరో వాక్యం తీసేశాను. డిస్ట్రబ్ చేస్తున్నా అంటూ నా మీద కావాలని అరిచినపుడు, ఎవరి మీదనో కోపం నా మీద చూపించినపుడు, నీ స్నేహితుల ముందు నన్ను తక్కువ చేసి చూసినపుడు, నా ఎదురుగానే ఆఫీస్ ఫ్రెండ్ బైక్ మీద అటో కాలు ఇటో కాలు వేసి నువ్వు వెళ్ళినపుడు, ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు పబ్బుకి వెళ్ళినపుడు, మొట్టమొదట సారి నువ్వు డ్రింక్ చేసినపుడు, డ్రింక్ చేసిన మత్తులో నా దగ్గరకు వచ్చి వాడు ఎవడో నీతో బ్రేక్ అప్ చెప్పాడని ఎడ్చినపుడు.. ఇంకెప్పుడు ఇలా చేయను సారీ అని చెబుతున్నా కూడా నమ్మకుండానే నేను మన ప్రేమ లేఖలో ఒక్కొక్క వాక్యం తీసేస్తూ వచ్చాను.
నేటితో నీ కోసం ఆ ప్రేమ లేఖ తెల్లగా ఉంది. నా వల్ల నీకు ఏ అనుభవం వచ్చిందో నాకు అయితే తెలియదు కాని నీ వల్ల నాకు జీవితానికి సరిపోయేంత అనుభవం మిగిల్చావు.
మొట్ట మొదట నిన్ను చూసినపుడు దేవుడు నిన్ను నా కోసం పంపాడు అనుకున్నాను. ఇన్నాళ్ళకు నాకు అర్ధం అయింది, ఏ జన్మలోనో నేను చేసిన పాపాలకు శిక్షగా నిన్ను నా దగ్గరకు పంపాడు అని...
నేటితో నా శిక్ష ముగిసింది... నీకు పెళ్లి అయింది...
ఫోటో కోసం నవ్వుతున్న పెళ్లి కొడుకుని చూస్తూ... పగలబడి నవ్వుకుంటున్న నేను....
ఇట్లు....నీ ఎక్స్.
ఫిదా బ్రో..
ఏమన్నా రాశవా అసల..ప్రేమ లేఖ తెల్ల కాగితం అయిపోవడం..
దేవుడు అందుకు పంపాడు అన్నమాట..