Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ (ఇంటర్వెల్)
సెగ్మెంట్ 3 : సుహాస్

చాప్టర్ 3.9 : సైలెన్సుడ్












క్రిష్ ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు మాత్రం అలానే ఉండిపోయారు.

నూతన్ తల పైకెత్తి చుట్టూ అందరిని చూశాడు.

కాజల్ మరియు నిషా ఎందుకైనా బెటర్ అనుకోని ఒక గదిలోకి వెళ్లి దాక్కున్నారు.

సుహాస్ అతని మీదకు వెళ్తూ ఉంటే.... నూతన్ రెండూ చేతులు జాపి ముడవడంతో వైభవ్ మరియు కేశవ్ ఇద్దరూ ముందుకొచ్చి సుహాస్ ని పట్టేసుకున్నారు.

క్రిష్ "భయ్యా....  నూతన్ భయ్యా....  నూతన్ భయ్యా....  అతన్ని వదిలేయ్....  అసలు ఇదంతా వదిలేయ్....  నాతో వచ్చేయ్....  " అంటూ అరుస్తున్నాడు.

నూతన్ చిన్నగా నవ్వి "నేను ఇప్పటికే చాలా పాపాలు చేశాను క్రిష్...  కానీ నీతో అలా కాఫీ తాగుతూ నువ్వు చెప్పింది ఆలోచిస్తే అలా చేసి ఉండాల్సింది అని మాత్రం అనిపించింది"

సుహాస్ "నిన్ను వదలను.....  చంపేస్తాను....." అంటున్నాడు.

నూతన్ కోపంగా సుహాస్ ని చూసి, అతని భుజం పై సుహాస్ చేసిన గాయం చూసుకొని, వైభవ్ తో "వాడి చెయ్ విరిచేయ్" అని ఆర్డర్ వేశాడు.

వైభవ్ "అలాగే మాస్టర్" అంటూ సుహాస్ చేయిని అక్కడక్కడే విరిచేశాడు.

సుహాస్ పెద్దగా అరిచేసాడు. గదిలో ఉన్న కాజల్ మరియు నిషా ఇద్దరూ ఏడ్చేసారు.

క్రిష్ కూడా నూతన్ ని అలా చూసి పెద్దగా వద్దు అని అరిచాడు.

నూతన్ సుహాస్ ని చూస్తూ వెనక్కి తిరిగి క్రిష్ ని చూస్తూ మాట్లాడడం మొదలు పెట్టాడు.

నూతన్, సుహాస్ ని చూపించి క్రిష్ తో "ఇలా కాదు కానీ...  ఒక ఆఫర్ ఇస్తా..... ప్రభు గ్రూప్స్ నువ్వే మైంటైన్ చేసుకో నాకొద్దు....  పైగా నీకు మంచి మంచి బిజినెస్ హెల్ప్ కూడా ఇస్తా.... ఉమ్మ్" అన్నాడు

క్రిష్ కిందకు వంగి వంగి సుహాస్ ని చూస్తూ ఉన్నాడు.

నూతన్ "రేయ్...  రేయ్...  తమ్ముడు...  " అంటూ క్రిష్ ని కాలుతో తోశాడు.

క్రిష్ నూతన్ ని కోపంగా చూశాడు, అతని కళ్ళలో కనిపిస్తున్న కోపం చూసి "ఇన్ని ఇస్తా నాకు ఒక్కటి యివ్వు....."

క్రిష్ తనని కోపంగా చూస్తూ ఉన్నాడు.

నూతన్ "నీ ఫ్రీడం.....  నీ ఆస్తి నీ పెళ్ళాం అందరూ నా సొంతం కావాలి....  నువ్వు కేవలం అనుభవించోచ్చు అంతే" అన్నాడు.

క్రిష్ కోపంగా "రేయ్" అని అరుస్తూ నూతన్ మీదకు రాబోయాడు... నూతన్ ఆజ్ఞతో క్రిష్ ని పట్టుకొన్న వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుకున్నారు.

నూతన్ "బాగా ఆలోచించు..." అంటూ క్రిష్ ని చూస్తూ నవ్వుతున్నాడు.



వైభవ్ సడన్ గా నూతన్ కంట్రోల్ నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ తన మరియు కేశవ్ చేతిలో ఉన్న సుహాస్ ని చూస్తూ సుహాస్ ని పైకి లేపాడు.

సుహాస్ కి మాత్రం వైభవ్ నడుము వెనక దాచి పెట్టిన గన్ మీద తన కన్ను పడింది.

వెంటనే తన ఎడమ చేత్తో ఆ గన్ లాక్కొని నూతన్ కి గురి పెట్టి కాల్చాడు. అది తన కుడి చేయి కాకపోవడంతో అతనికి గురి కుదరడం లేదు.

నూతన్ ఒక్క సారిగా గన్ సౌండ్ కి భయపడి సుహాస్ ని చూస్తూ "రేయ్...  రేయ్...  అది గన్...  " అంటూ ఉండగానే... సుహాస్ కోపంగా పిచ్చిగ కాలుస్తూ ఉన్నాడు. తన కళ్ళకి
చనిపోయిన తన వైఫ్ మాత్రమే కనిపిస్తుంది.

నూతన్ సుహాస్ నుండి తప్పించుకోవడం కోసం చుట్టూ చూసి కిటికీ నుండి దూకేశాడు.

నూతన్ కంట్రోల్ నుండి అందరూ బయటకు వెళ్ళిపోవడంతో క్రిష్ అందరి నుండి విడిపించుకొని తను కూడా కిటికీ నుండి బయటకు దూకి పక్కనే ఉన్న చెట్టు పట్టుకున్నాడు. అప్పటికే చెట్టు సగం దిగేసిన నూతన్, క్రిష్ కూడా చెట్టు మీదే ఉన్నాడని గుర్తించి ఇంకా వేగంగా దిగుతున్నాడు.

సుహాస్ పడుతూ లేస్తూ కిటికీ దగ్గరకొచ్చి గన్ పెట్టగా అది చీకటి కావడంతో ఏమి కనిపించడం లేదు.

కేశవ్ "క్రిష్" అంటూ సుహాస్ ని తప్పించుకొని కిటికీ నుండి తను కూడా చెట్టు మీదకు దూకేశాడు.

వైభవ్ కూడా కేశవ్ లాగానే తను కూడా కిటికీ నుండి చెట్టు మీదకు దూకేశాడు.

సుహాస్ ఆ గన్ చేత్తో పట్టుకొని వెనక్కి వెళ్తూ ఉండగా కాజల్ మరియు నిషా కనపడ్డారు.

వాళ్ళను మరియు కిటికీ ని మార్చి మర్చి చూస్తూ "నో థాంక్స్" అంటూ సరాసరి లిఫ్ట్ ఎక్కేశాడు.

వైభవ్ మనుషులు, హాస్పిటల్ విల్లా స్టాఫ్ అందరూ మెట్ల మీద నుండి కిందకు పరిగెడుతూ వెళ్తూ ఉంటే, బిల్డింగ్ పక్కనే ఉన్న చెట్టు నుండి నూతన్ అతని వెనకే క్రిష్, క్రిష్ కి తోడుగా కేశవ్ మరియు వైభవ్ లు కూడా చెట్టు ద్వారానే దిగుతున్నారు.

లిఫ్ట్ లో సుహాస్ దిగుతున్నాడు. అతని కుడి చేయి కదులుతుంది కాని ఎముక విరిగినట్టు అర్ధం అవుతుంది. ఆ చేతిని కదిలించకుండా కిందకు వచ్చి అటూ ఇటూ చూడగా వైభవ్ మనుషులు మెట్ల మీద నుండి వస్తూ కనిపించారు.

సుహాస్ "మీలో ఎవరిని బండి ఉంది" అని అడిగాడు.

అందులో ఒకడు చేయి ఎత్తాడు.

అతని డ్రైవింగ్ లో సుహాస్ అతని వెనక కూర్చొని గన్ పట్టుకొని ఉన్నాడు.


నల్లటి హైవే మీద నూతన్ ముందు పరిగెడుతూ ఉంటే, అతని వెంట క్రిష్ పరిగెడుతూ ఉన్నాడు.

క్రిష్ అమాంతం డైవ్ చేసి నూతన్ ని పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగినా క్రిష్ తేలికగా.... నూతన్ ని పడకొట్టి నూతన్ మెడ బిగిన్చేసాడు.

అప్పుడే అక్కడకు వచ్చిన కేశవ్ ని నూతన్ తన కంట్రోల్ లోకి తీసుకొని క్రిష్ ని కొట్టించబోయాడు. కాని వైభవ్ వచ్చి కేశవ్ ని తోసేస్తాడు.

నూతన్ కి ఎంత ప్రయత్నించినా తను క్రిష్ నుండి....  కేశవ్, వైభవ్ నుండి వదిలించుకోలేకపోతారు.

ఇంకొద్ది సేపట్లో నూతన్ స్పృహ తప్పుతాడు అనగా.... అటుగా వచ్చిన ఒక వాచ్ మెన్.....  పరిగేట్టుకోచ్చి తన చేతిలో ఉన్న కర్రతో క్రిష్ ని కొట్టాడు.

క్రిష్ పట్టు విడుదల అవ్వగానే.... నూతన్ ఆ వాచ్ మెన్ ని కంట్రోల్ లోకి తీసుకొని క్రిష్ ని వాచ్ మెన్ చేత అతని లాటీతో కొట్టాడు.

నూతన్ చిన్నగా క్రిష్ గ్రిప్ నుండి తప్పించుకొని దూరం పరిగెత్తేస్తాడు.

కాని ఆ వెనకే వచ్చిన సుహాస్ మాత్రం తన ఎడమ చేత్తో గురి పెట్టి నూతన్ ని కాలుస్తాడు, కాని అది కూడా గురి తప్పి అతని భుజానికి తాకుతుంది.

నూతన్ ఇంకా వేగంగా ప్రాణభయంతో పరిగేడతాడు.... సుహాస్ ఇంకా ఇంకా కాలుస్తూ ఉన్నా బైక్ మీద నుండి కాల్చడం కావడంతో గురి తప్పుతూ ఉంటాయి... సుహాస్ గన్ లో బుల్లెట్స్ అయిపోతాయి.... సుహాస్ పిచ్చి వాడిలా "ఆహ్..." అని అరుస్తూ ఉంటాడు.

కాని అతని కదలికలకు బైక్ అదుపు తప్పి ఆ రోడ్ మీద యాక్సిడెంట్ అయి పడిపోతారు.

రక్తపు మడుగులో సుహాస్ స్పృహ తప్పుతాడు.

సుహాస్ కళ్ళు మూసే ముందు క్రిష్ తన దగ్గరకొచ్చి అతన్ని పైకి లేపుతూ ఉంటే... "నూతన్...  నూతన్...  నూతన్ ని ఆపాలి...  నూతన్ ని ఆపాలి...  " అని మూలుగుతూ ఉంటాడు.

క్రిష్ కి సుహాస్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నూతన్ తన తప్పులను సరిచేసుకునే స్టేజ్ ఎప్పుడో దాటి పోయాడని... ఇది అతను చేసిన తప్పులకు శిక్ష అనుభవించే సమయం అని అర్ధం అవుతుంది.

సుహాస్ ఇబ్బందిగా హాస్పిటల్ స్ట్రెచర్ మీద కూడా కదులుతూ "నూతన్...  నూతన్...  నూతన్ ని ఆపాలి...  నూతన్ ని ఆపాలి...  " అని మూలుగుతూ ఉంటాడు.

క్రిష్, సుహాస్ చేతిని పట్టుకొని "వాడిని కచ్చితంగా ఆపుదాం... నువ్వు ముందు ట్రీట్ మెంట్ తీసుకో" అని మాట ఇస్తాడు, సుహాస్ దైర్యంగా నవ్వి మెల్లగా కళ్ళు మూసుకుంటాడు.



కొద్ది సేపటికి సుహాస్ కళ్ళు తెరిచి చూసేసరికి, రెండూ రోజులు గడిచిపోయి ఉంటాయి....

పైకి లేచి చుట్టూ చూడగా వేరే బెడ్ ల మీద క్రిష్, కేశవ్ మరియు వైభవ్ లు కనిపించారు. అలాగే ఆ రోజు ఇబ్బంది పడ్డ మిగిలిన వ్యక్తులు కూడా అక్కడే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉన్నారు.

కాజల్ వచ్చి సుహాస్ చేతిని పట్టుకొని "అన్నయ్యా..." అని పిలిచింది.

సుహాస్ ఆమె చేతిని తోసేసి సరాసరి క్రిష్ దగ్గరకు వెళ్లి "నూతన్... ఆపుదాం... ఆపుదామన్నావ్... నాకు మాట ఇచ్చావ్...." అని అరుస్తాడు.

అంతలో ఒక నర్సు తనకు సేడేటివ్ ఇవ్వడంతో మళ్ళి స్పృహ తప్పుతాడు. 
















[+] 9 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ - by 3sivaram - 04-02-2025, 09:59 PM



Users browsing this thread: 24 Guest(s)