Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను నా స్వప్న
Update 14
(Swapna home visit and Dubai journey)

స్వప్న కాల్ చేసి వచ్చే సండే వల్ల ఇంటికి రమ్మంది లంచ్ కి దుబాయ్ కి వెళ్లే ముందు.. వల్ల అమ్మ ని పరిచయం చేస్తా అన్నది…

సండే రోజు ఆఫ్టేర్నూన్ లంచ్ టైం వరకి వాళ్ళ ఇంటికి  వెళ్లాను ..

వాళ్ళ అమ్మ బాగున్నావా బాబు అని పలకరించారు..

నేను బాగున్నాను ఆంటీ అని అన్నాను..

స్వప్న వచ్చి వాళ్ళ ఇల్లు మొత్తం చూపించింది.. స్వప్న రూమ్ లో కి వెళ్లాను .. తన రూమ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది…తన ఫొటోస్ , కొన్ని నేచర్ ఫొటోస్ , చిన్న అక్వేరియం చాలా పీస్ ఫుల్ గా ఉంది.. 

తరువాత హాల్ లోకి వచ్చి కూర్చున్న.. ఆహ్ హాల్ లో అప్పుడు చూసా ఏసు ప్రభువు ఫోటో అండ్ క్రాస్ సింబల్.. నాకు అసలు అర్థం కాలేదు…అడుగుదామా వద్ద అని అనుకుంటూ ఉన్నాను..

లంచ్ తినేటప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది.. స్వప్న పుట్టాక ఆమె కి హార్ట్ కి ప్రాబ్లెమ్ వచ్చింది అంట.. అది నయం అవ్వడానికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్న తగ్గలేదు అంట.. అప్పుడు స్వప్న వల్ల మమ్మీ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యారు అంట ..వాళ్లు బేసిక్ గా పద్మశాలీలు అంట.. ఇలా మొత్తం వాళ్ళ స్టోరీ అంతా చేపింది.

నా మైండ్ అంత బ్లాక్ అయింది..అవునా అని మొత్తం చెప్పింది విన్నాను..

స్వప్న అని పేరు ఉన్న అమ్మాయి క్రిస్టియన్ ఆహ్ అని నా కళ్ళు బైర్లు కమ్మినాయు.. నాకు ఒక 15 నిమిషాలు మైండ్ పనిచేయలేదు.. అస్సలు కూడా ఊహించని షాక్…

లంచ్ తరువాత స్వప్న తో 

రాజు: స్వప్న నువ్ మరి నాకు ఎందుకు చెప్పలేదు క్రిస్టియన్ అని 
స్వప్న: అరేయ్ మన మధ్య అసలు ఈ టాపిక్ ఎప్పడు రాలేదు గా 
రాజు: కరెక్ట్ అహే ప్రతి సండే చర్చ్ కి వెళ్తావు కదా అప్పుడు అయినా చెప్పలేదు ఏంటి?
స్వప్న: రే నువ్వే కదా రా క్యాబ్ లో ఏ కాస్ట్ అమ్మాయి అయినా, ఏ రిలీజియన్ అమ్మాయి అయినా సరే లవ్ చేస్తా.. పెళ్లి కూడా చేసుకుంటా అన్నావ్ కదా రా 
రాజు: అవునే అన్నాను బట్ 
స్వప్న: కొంచెం సీరియస్ గా హా బట్ ?
రాజు: నువ్వు అంటే నాకు ఇస్టమే.. ఇప్పుడు నువ్ క్రిస్టియన్ అయితే అది పోతుందా పోదు కదా 
స్వప్న: నాకు తెల్సు రా.. నువ్ ఏది పట్టించుకోవు కాబట్టే నీతో ఉన్నా.
రాజు: ని ఇష్టాలని కూడా రెస్పెక్ట్ చేయాలి .. ఐ లవ్ యు స్వప్న.. నేను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను అహే 
స్వప్న: తన కళ్ళలో కొంచెం నీళ్లు వచ్చాయ్ ఆనందం తో, వెంటనే నన్ను గట్టిగా పట్టుకొని 
ఐ లవ్ యు రాజు మై సోల్ మేట్ అని చెప్పింది..


ఫస్ట్ టైం స్వప్న నాకు ఏడుస్తూ అండ్ ఆనందంతో మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెపింది ..ఇంక చాలా సేపు వాళ్ళ ఇంట్లో నే ఉండి.. స్వప్న చిన్నప్పటి ఫొటోస్ చూసాను.. చాలా క్యూట్ ఉంది..
వాళ్ళ మమ్మీ కూడా కిడ్స్ కోసం ఎంత కష్టపడింది, స్వప్న ఎందుకు అంత మొండిగా తయారు అయింది అని అన్ని చెప్పింది..

ఈవెనింగ్ స్వప్న కి అండ్ వాళ్ళ మమ్మీ కి బాయ్ చెప్పి మా ఇంటికి వచ్చేసా…

మా ఫ్రెండ్ శేఖర్ గాడికి కాల్ చేసి మా ఇంటికి రమ్మనా, వాడు వచ్చాకా ఇద్దరం బేర్స్ తగుతున్నాం.

రాజు: రే శేఖర్ ఇవ్వాళ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్లాను ..
శేఖర్: సూపర్ రా 
రాజు: పోయినాక తెల్సింది రా , స్వప్న క్రిస్టియన్ అని 
శేఖర్: ఒరేయ్ నిజమా 
రాజు: హా అవును రా, నేను ఇంక ఆహ్ షాక్ లో ని ఉన్న 
శేఖర్: మరి ఏం చేదాం అనుకుంటున్నావు 
రాజు: ఏముంది రా అమ్మ ని ఏలాగా అయినా ఒప్పించాలి. నాకు ఒప్పుకుంటుంది అని నమ్మకం ఉంది 
శేఖర్: పెళ్లి చేసుకుంటావా 
రాజు: హా చేసుకుంటా రా అమ్మ ని ఒప్పించి, ఎందుకంటే స్వప్న ని విడిచి ఉండలేను రా ..
శేఖర్: సరే రా జాగ్రత్త అన్నాడు.


నేను దుబాయ్ కి వెళ్లే ఒక రోజు ముందు తను మా ఇంటి దగ్గరకి వచ్చి కాల్ చేసింది , నేను కిందకి వెళ్లాను.. తను ఒక కాఫీ కప్ మీద మా ఇద్దరి ఫొటోస్ ని ప్రింట్ చేసి తీసుకొని వచ్చింది..
స్వప్న: రే రాజు ఈ కప్ చూసిన ప్రతి సారీ నేనే గుర్తు రావాలి 
రాజు: ఒసేయ్ పిచ్చి దానా.. ఫోన్ వాల్ పేపర్ అహే మన ఇద్దరి ఫోటో ఉంటది, 

స్వప్న: హ్మ్ , నన్ను అక్కడికి వెళ్ళాక మర్చిపోవు కదా 
రాజు: నిన్ను మర్చిపోవడం అసంభవమే..
స్వప్న: కొంచెం భయం గా ఉంది రా 
రాజు: మనకి కావాల్సిన మనిషి ఒకరు దూరంగా వెళ్తే ఇలానే ఉంటది.. నాకు కూడా అంతే ఉంది 
స్వప్న: హ్మ్ 
రాజు: 6 నెలలు లో నీకు ఒక జాబ్ చూస్తా కదా నే, నువ్ వచ్చేయ్ అక్కడ ఇద్దరం కలిసి ఉందాం 
స్వప్న: సరే రా 
రాజు: మనం ఇద్దరం అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాక ఒక 6 నెలలు తరువాత ఇండియా వచ్చి మన ఇంట్లో చెప్పి పెళ్ళి చేసుకుందాం 
స్వప్న: నాకు జాబ్ వస్తదా..
రాజు: వస్తదే, నేను ఉన్న కదా చూసుకుంటా 
స్వప్న: మన గురించి మీ అమ్మ కి చెప్పవా?
రాజు: హా అమ్మ కి చెప్పిన, కానీ మొత్తం తెల్వదు బట్ ఒప్పుకుంటది
స్వప్న: ఏమో రా ఇవి అన్ని జరుగుతాయి ఆహ్?
రాజు: జరుగుతాయి, మనం అనుకుంటే ఏది అయినా జరుగుతుంది 
స్వప్న:హ్మ్ 
రాజు:మరి మీ అమ్మ కి చెప్పినవా 
స్వప్న: హా అందుకే కదా నిన్ను మా ఇంటికి రమ్మన్నది 
రాజు: నీ సైడ్ ఒకే అన్నమాట 
స్వప్న: హా తమ్ముడు కి చెప్పాలి, వాడిది ఏముంది లే 
రాజు: సరే , నా సైడ్ కూడా ఏముండది ప్రాబ్లెమ్ 
స్వప్న : హ్మ్ 
రాజు: నేను వెళ్ళాక 6 నెలల లోపు నువ్వు రావాలి, వస్తా అని మైండ్ లో ఫిక్స్ అవ్వు 
స్వప్న: హమ్మ్ 
రాజు:  ఐ లవ్ యు స్వప్న 


స్వప్న: నన్ను గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కొని నా పెదాల మీద ఒక ముద్దు ఇచ్చింది.. గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యు అండ్ ఐ మిస్ యు రా అంటూ నా చెంపలు పట్టుకొని నా కళ్ళలోకి చూస్తూ నా నుదిటి మీద ప్రేమతో ఒక కిస్ ఇచ్చింది..

రాజు: థాంక్స్ అహే 
స్వప్న: హ్మ్ 
రాజు: రేపు ఎయిర్పోర్ట్ కి వస్తావా 
స్వప్న: హా వస్తా 
రాజు: అక్కడ మా అమ్మ ని పరిచయం చేపిస్తా 
స్వప్న: సరే రా బాయ్ అని ఇంటికి వెళ్ళింది.

నేను ఎయిర్పోర్ట్ కి వెళ్లాను మా అమ్మతో, అప్పుడే క్యాబ్ లో స్వప్న కూడా వచ్చింది . మా అమ్మకి చెప్పా తనే స్వప్న అని ..

అమ్మ: బాగున్నావా అమ్మ 
స్వప్న: హా బాగున్నా ఆంటీ 
అమ్మ: అందం గా ఉన్నావ్ 
స్వప్న: థాంక్స్ ఆంటీ 
అమ్మ: మీరు ఎన్ని రోజులుగా ఫ్రెండ్స్ 
స్వప్న: 2 ఇయర్స్ అయితుంది ఆంటీ 
అమ్మ: సరే కలిసి మెలిసి ఉండండి, కొట్లాడకండి 
స్వప్న: సరే ఆంటీ 
రాజు: నాకు టైం అయితుంది అని చెప్పి వాళ్ళ ఇద్దరికీ బాయ్ చెప్పి నేను లోపలికి వెళ్లాను …


నెక్స్ట్ పార్ట్ ఇన్ దుబాయ్ ..
Like Reply


Messages In This Thread
RE: నా స్వప్న - by sri7869 - 21-01-2025, 04:58 PM
RE: నా స్వప్న - by Rajkumar1529 - 23-01-2025, 04:09 PM
RE: నేను నా స్వప్న - by Rajkumar1529 - 04-02-2025, 10:08 AM
నా స్వప్న - by Rajkumar1529 - 21-01-2025, 12:55 AM



Users browsing this thread: 2 Guest(s)