30-01-2025, 12:15 AM
(This post was last modified: 30-01-2025, 12:16 AM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆహారం, దప్పిక, నిద్ర లేకుండా వున్న స్మిత, మంచం మీద కట్టబడి వుండి అర్థంలేని ప్రేలాపనలతో కూడిన మానసిక అవ్యవస్థ లోకి వెళ్లే అంచుల్లో వుంది.
ఆమెకి మధ్యాహ్నం ఎప్పుడు వెళ్లిపోయిందో తెలియలేదు. ఆమె మనసులో, గడిచిన కొన్ని బాధాకరమైన గంటలు కూడా ఎలా వెళ్లిపోయాయో తెలియలేదు.
తన గది అద్దం వెలుపల కాంతి లేకపోవడంతో అది మళ్ళీ ఇంకో రాత్రి అయినట్లు ఆమెకి తెలిసింది. ఆమె మంచం ప్రక్కన వున్న టేబుల్ మీద పెట్టిన గడియారంలో 8.30 చూపించడంతో, ఆ దెయ్యం రాజ్యంలో అప్పుడు రాత్రి 8.30 అయినట్లు అర్ధమైంది.
తనకి జ్వరం వచ్చినట్లు అనిపించసాగింది. అది నిజమో కాదో తెలియదు.
ఆమె మనసు కొంత ఆశకు ఆసరాగా నిలిచే ఆలోచనలను ఊహిస్తూ, చివరకు ఒక దానితో స్థిరపడింది. ఆమె మనసు, వెయ్యోసారి అదృశ్యం అయిన వ్యక్తుల గురించి ఆలోచించింది. ఆమె లాంటి ప్రసిద్ధ మహిళ, ఆ స్థాయిలో పేరొందిన వ్యక్తి, సింపుల్గా అదృశ్యమై, ఎవరూ వెతకకుండా ఉండరని ఆమె ఊహించుకోలేకపోయింది. అసాధ్యం. అయితే, ముందుగా, ఆమె తన భద్రత నుండి ఇంత సులభంగా బయటకు లాగబడి, ఇంత సులభంగా బంధించబడి, ఇంత సులభంగా అవమానించబడి, ఆమె గురించి బాగా తెలిసిన, ఆరాధించిన ఎవరైనా ఒకరు తనకు రక్షణ అందించకపోవడం గురించి ఆలోచిస్తూ, ఆమెకి వున్న ప్రాముఖ్యత ఇంకా కీర్తిపై సందేహాలు పెట్టుకుంది. ఆమె తన సందేహాలను పరిశీలించింది. తన అశక్తత వల్ల ఆమె ఆత్మాభిమానంలో ఏర్పడిన లోటును గుర్తించింది. ప్రపంచం మొత్తం దృష్టిలో తన ప్రాతినిధ్యం ఏమిటో గుర్తించేందుకు ఆమె తన ఆత్మ బలాన్ని ఉపయోగించుకుంది.
ఇప్పుడు, ఎందుకు ఆమె కోసం ఎవ్వరూ వెతకడంలేదు ? ఎందుకు ఆమె స్నేహితుల గుంపు, సెక్యూరిటీ అధికారి లు, అభిమానులలో ఎవరో ఒకరు ఆమెను రక్షించేందుకు ఏదైనా ఎందుకు చేయడంలేదు ?
తాను అదృశ్యం అవడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ఆ అంశం మీదే వున్నాయి. బ్రహ్మం, సునీత తప్పక సెక్యూరిటీ అధికారి ల దగ్గరికి వెళ్ళివుండాలి. ఇప్పటికే తాను మాయం అయిన సంగతి వాళ్లకి పక్కాగా తెలిసిపోయి ఉంటుంది. ఇక సెక్యూరిటీ అధికారి విషయానికి వస్తే, వాళ్ళు తెలివికల వాళ్ళు, శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన పరికరాలు ఉండడం వల్ల తాను కిడ్నాప్ అయినట్లు, కిడ్నాప్ చేసిన వ్యక్తుల గురించి, తాను ఎక్కడ వున్న సంగతీ కనుక్కుని వుంటారా ? తన గురించి వాళ్ళు ఏమేం చేయగలిగే అవకాశాలు ఉన్నాయో ఊహించడానికి ప్రయత్నించింది. సెక్యూరిటీ అధికారి బలగాలు ఈ నిమిషంలో తన ఆచూకీ తెలుసుకుని, ఇక్కడికి వచ్చి, తనని బంధించిన వ్యక్తుల్ని బంధించి తనని రక్షించినట్లు వూహించుకుంటుంది.
ఇలాంటి ఊహలో ఉండగా - ఒక్కసారిగా ఆమెకి వచ్చిన ఒక ఆలోచన - ఆ ఆశల్ని తుత్తునియలు చేసింది. ఆమెకి తాను కిడ్నాప్ చేయబడడానికి ముందు రోజు రాత్రి, సునీత తో ఏమి మాట్లాడిందో గుర్తుకొచ్చింది. ఆరోజు తాను నిద్ర పోయేముందు జరిపిన సంభాషణ.
తాను అందరినీ వదిలేసి దూరంగా ఎక్కడికైనా వెళ్లాలని చెప్పడం, తనని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశానికి వెళ్లి, ఒక సాధారణ మనిషిలా బ్రతకాలని అనుకోవడం, అంతా గుర్తుకొచ్చింది.
దేవుడా, దేవుడా అలా అప్పుడు ఎందుకు అన్నా ? అయ్యో.. అనవసరంగా వాగాను. ఇప్పుడు తనకి తాను మాయం అయ్యాక ఏమి జరిగి ఉంటుందో ఊహించింది.
"ఆమె మాయం అవడానికి ముందు రాత్రి నీతో అలా అన్నదా ?" బ్రహ్మం అడిగాడు.
"సరిగ్గా ఆ మాటలే చెప్పింది. ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్లిపోవాలని, ఎవరికీ దొరకకూడదని చెప్పింది" సునీత చెప్పింది.
"అయితే అదే జరిగి ఉంటుంది. మనకి చెప్పకుండా అందుకే వెళ్ళిపోయింది. ఎక్కడో తెలియని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండి ఉంటుంది" బ్రహ్మం చెప్పాడు.
"మనలో ఎవరో ఒకరికైనా చెప్పి వుండాల్సింది కదా" సునీత అంది.
"ఇంతకుముందు ఇలా ఒకసారి చేసింది కదా సునీతా" బ్రహ్మం అన్నాడు.
"అయినా ఒక్కసారి ....." సునీత చెప్పబోయింది.
"చెప్పకు. అదే జరిగివుంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ అధికారి ల దగ్గరికి వెళ్లి లాభం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె తిరిగి వస్తే మనం వెధవలమి అవుతాము. బహుశా ఇక మనం ఆమె తనంత తానుగా తిరిగి వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. మనం ఆందోళన పడి ఉపయోగం లేదు సునీతా. ఆమె నీకు వివరంగా చెప్పింది కదా. ఇప్పుడు అదే చేసింది. ఇక తన కోసం మనం ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు" బ్రహ్మం అన్నాడు.
అయ్యో .... దేవుడా ... ఎంత పని చేశా. ఆరోజు పిచ్చిగా, అమాయకంగా, అర్ధంపర్ధం లేని మాటలు నేను సునీతతో ఎందుకు అన్నాను. ఇప్పుడు వాళ్ళు తప్పకుండా పొరబడి వుంటారు. ఆ మాటల వల్ల ఇప్పుడు తనకోసం వాళ్ళు వెతికే అవకాశం పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయినట్లే.
తనే తన చేతులారా వున్న ఒక్క ఆశనీ పోగొట్టుకుంది.
ఒక సముద్రం మధ్యలో, విరిగి వున్న ఒక చెక్కముక్కని పట్టుకుని వేలాడుతుంది తను. ఇది వాస్తవం. ఇది తాను ఒప్పుకోవాల్సిన వాస్తవం.
ఇప్పుడు తాను ఈ శాడిస్టిక్ షార్క్ ల దయ మీద ఆధారపడి వుంది.
ఆమె .... ఇతరులందరినీ కాదని, ఈ భయానక స్వప్నంలో ఎలా చిక్కుకుంది? ఆమె మనస్సు ఒక తార్కిక వివరణ కోసం తపించింది. నిన్న..... నిన్న మధ్యాహ్నం జరిగిన అసాధారణ క్షణాలను గుర్తించింది. ఆ సమయంలో 'కలల రాజు' ఆమె చెప్పిన ఆమె మోసపూరిత మీడియా ఇంటర్వ్యూలు, ఆమెను ఒక నింఫోమానియాక్గా చూపించడానికి రూపొందించిన ప్రకటనలను చూపించాడు. అదే ఆమె తాజా చిత్రంలో ఆమె పోషించిన పాత్ర. ఈ మొత్తం మోసపూరితత్వం, తనని ఉన్నతంగా చూపించాలని చేసిన ప్రయత్నం, ఆమె కృత్రిమ ప్రతిమని నిర్మించడం, ఆమెను ఈ మంచం మీద బందీగా మార్చేసింది.
తాను నిర్మించిన తన తల్లిదండ్రుల చరిత్రనే వీళ్ళు నిజమని భావించారు. కానీ తండ్రి తాగుబోతు, తిరుగుబోతు, రోజు కూలీగా పని చేసేవాడని ఎవరికీ తెలియదు. తనకి ఏడు ఏళ్ళ వయసు వున్నప్పుడే కాన్సర్ తో చనిపోయాడు. తన తల్లి తర్వాత తనతో చాలా దారుణంగా పని చేయించేది. డబ్బుకోసం వేశ్యగా మారింది తన తల్లి. రెండు సార్లు తిరిగి పెళ్లిళ్లు చేసుకుంది. రెండో సారి చేసుకున్న మారు తండ్రికి ఆడ పిచ్చి ఎక్కువ. తనకి 16 ఏళ్ళు వచ్చాక, ఒక రాత్రి తన దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపించి, మెలకువ వచ్చింది. తన మారు తండ్రి ఒక చేత్తో తన స్థనాలపై చేయి వేసి, రెండో చేతిని తన కాళ్ళ మధ్య పెట్టాడు. ఆ మరుసటి రోజే తాను తన ఇల్లు వదిలి పట్టణానికి వచ్చేసింది.
చదువుకుంటూ, తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటూ, నటన మీదున్న శ్రద్ద వల్ల అక్కడ చేరి నటనను నేర్చుకుంటూ వచ్చింది. హోటల్ లో వెయిట్రెస్ గా చేసింది. సూపర్ మార్కెట్ లో పని చేసింది. బట్టలు కుట్టే ఫ్యాక్టరీ లో supervisor గా పనిచేసింది. ఒక ఫోటోగ్రాఫర్ తన జీవితంలోకి వచ్చాక తన దశ తిరిగింది. ఎక్కువగా మోడల్ లా పని చేసింది. అందులో తనకి ఎక్కువగా వచ్చినవి బ్రా ఇంకా అండర్వేర్ ప్రకటనలే. అది చుసిన ఒక సినిమా ఫోటోగ్రాఫర్, తన ద్వారా మెల్లిగా అవకాశాలు ఇప్పించసాగాడు. తను కూడా చాలా కష్టపడింది. అలా క్రమంగా ఎదిగి, ఒక మంచి సినిమా అవకాశంతో స్టార్ అయింది. జనాలు తనని ఆదరించారు.
ఇదంతా ఆమె తన మనసు నుండి తుడిచివేసి ఒక గౌరవ ప్రదమైన కథని తన తల్లిదండ్రులకి పెట్టింది. ఇప్పుడు కూడా తనకి అది గుర్తుకి వచ్చేది కాదు అయితే తన ప్రస్తుత పరిస్థితి వల్ల అదంతా గుర్తుకొచ్చింది.
'కలల రాజు' తన మిగిలిన సహచరులని ఎంతగా వాళ్ల మనసుల్ని మార్చాడంటే, ఇప్పుడు వాళ్లకి నిజం తెలిసినా అది నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ అదే నిజం.
సినిమా లలోకి రావాలని ప్రయత్నించే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు, ఎంతో మంది పక్కలకే పరిమితమవుతాయో తాను చూసింది. చివరికి వేశ్యాల్లా మారిన వారు ఎందరో. తన అదృష్టం బావుండి తనకి ఆ పరిస్థితులు ఎదురు కాలేదు. అది తన అదృష్టం అనే చెప్పుకోవాలి.
తన గత జీవితానికి సంబంధించింది ఒక సంగతి ఆమెని గందరగోళంలో పడేసింది.
గత జీవితం ప్రకారం - మగాళ్లు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆమెని వాడుకోవాలని చూసారు. ప్రస్తుత జీవితం ప్రకారం - మగాళ్లని తాను, తన సినిమా అవసరాల కోసం, తాను చెప్పినట్లు మెలిగేలా చేసుకుంది.
ఆమె తన మనస్సులో దీనిని సవరించుకునే ప్రయత్నం చేసింది. పురుషులు తనను ఉపయోగించుకున్నారని ఆమె ఎప్పుడూ నమ్మింది అందులో ఏమాత్రం సందేహం లేదు..... అలాగే, వారు ఉపయోగించుకున్నారు, నిజంగా ఉపయోగించుకున్నారు కూడా ...... కానీ, ఆమె కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం వారిని నిరంతరం, నిర్దాక్షిణ్యంగా ఉపయోగించిందనేది వాస్తవం. తన కవ్వింపుగా ఉండే లైంగిక ప్రలోభంతో వారిని ఆకర్షించి, తనకు కావలసినదాన్ని సాధించేందుకు చురుకుగా వారిని నడిపించింది. ఆమె పురుషుల ఆకలిని, బలహీనతలను, అవసరాలను ఆసరాగా తీసుకుని, వారిని తన కను సైగలలో ఉంచుకుని, ఒకరిని మరొకరిపై పోటీగా ఉంచింది. డిమాండ్ చేసి, అంగీకరించి, ఎప్పుడూ వ్యాపారం, ఒప్పందం పద్ధతిలో, వారిలో ప్రతి ఒక్కరిని తన గమ్యానికి దారితీసే మెట్లలా ఉపయోగించుకుంది.
కఠినంగా, గట్టి మనసుతో, కొద్దికాలంలోనే, ఆత్మాభిమానాలను, కెరీర్లను నాశనం చేసి, వివాహాలను ఛిన్నాభిన్నం చేసి, పర్వత శిఖరానికి చేరడానికి పురుషులను వేదికలుగా మార్చింది.
ఆమె ఇంకా దీనిని న్యాయవంతంగా భావిస్తుంది.
తనను పురుషుల ప్రపంచంలో కోల్పోయిన చిన్న పాపగా అనుకుంది.
తాను పురుషుల ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు, కుటుంబ భద్రత లేకుండా, విద్య లేకుండా, డబ్బు లేకుండా, సహజ ప్రతిభ లేకుండా, ఒక అనాగరిక వ్యక్తిలా అడ్డంకులు ఎదుర్కొంది.
ఆమెకు ఉన్న ఆత్రం, అభిలాష డబ్బు కోసం కాదు, కీర్తి కోసం కూడా కాదు, కానీ అవి అందించిన దాని కోసం ....... భద్రత, స్వేచ్ఛ, స్వతంత్రత, స్వీయగుర్తింపు కోసం ఆమె నిజంగా ఎంతగా కోరుకుందో మరియు వాటిని పొందటానికి ఎంత కట్టుబడి ఉన్నదో ఆమె మనసుకి తెలుసు.
ఆమె తన కోరికలను తీర్చుకుంది, ఎందుకంటే అదృష్టవశాత్తూ, ఆమెకు ఒకే ఒక్క అదృష్టం - పురుషులు అత్యంత ఆకాంక్షించే సామ్రాజ్యానికి చెందిన ఒక నాణెం - అందం కలిగి ఉంది. అయితే, ఆమె తన ముఖం మరియు శరీరాన్ని పూర్తిగా తన విజయానికి కారణంగా తేల్చలేదు.
తన ప్రయాణంలో, అద్భుతమైన ముఖకవళికలు మరియు ఆకర్షణీయమైన శరీరాకృతులు కలిగిన బాలికలను వందలాది, వేలాది అందమైన యువతులను దాటింది. వారు విజయాన్ని సాధించలేదు, కానీ తాను సాధించింది.
తాను విజయం సాధించిన కారణం కేవలం తన లక్ష్య సాధనకు ఉన్న ఏకాగ్రత మాత్రమే కాదు, తన రూపానికి మించిన దాన్ని వెతికే ప్రయత్నం కూడా.
తాను తన రూపాన్ని ఉపయోగించుకునే విధానాన్ని అధ్యయనం చేసి, నేర్చుకుంది. తాను వారికే సేవ చేస్తుందని నటిస్తూ పురుషులను ఆకర్షించి, ప్రలోభపెట్టి, వారిని తన సేవకులుగా మార్చుకుంది.
ముఖ్యమైన తేడా అదే.
ఆమె ఇకపై తాను ఎంతమంది పురుషులతో పడుకుందో, ప్రేమ చూపించిందో, లేదా మంచం పంచుకున్నదో గుర్తు చేసుకోలేకపోయింది, ఎందుకంటే ఆ దుర్మార్గమైన ఎదుగుదలలో అది గుర్తుంచుకోవాల్సిన విషయం కాదు.
ఆ పురుషులు ముఖరహితులు, శరీరరహితులు, ఎందుకంటే వారు కేవలం తన అభివృద్ధికి అడుగుపథాలు మాత్రమే.
మంచంలోనైనా, బయటనైనా, ఆమె ఎప్పుడూ వారిని చూడలేదు, వారిపై దృష్టి పెట్టలేదు, కానీ వారిని దాటి, దూరంగా ఉన్న శిఖర స్థానం వైపు ద్రుష్టి నిలిపింది.
లైంగికత ఆమెకు ఎప్పుడూ ఏమీ ప్రాధాన్యత కలిగించలేదు. ఆ చర్య ఎప్పుడూ మానవ అంకితభావానికి సూచిక కాలేదు.
అది కేవలం ఒక కరచాలనం, పరిచయ పత్రం, టెలిఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక ఒప్పందం, మరేదో మాత్రమే.
సెక్స్ ఆమెకు ఎప్పుడూ ప్రత్యేకమైన విషయం కాలేదు, అది కేవలం మరో ఆటోమేటిక్ శారీరక ప్రక్రియగా, చేయాల్సింది చేయడం, ఉపయోగించుకోవడం, ఎప్పుడో కొన్నిసార్లు ఆనందం పొందడం, కానీ పెద్ద విషయం కాదు, కావచ్చు, లేకపోవచ్చు, అంతే.
అయితే, ఇటీవలి కాలంలో, ఆమె తన పాత ఆలోచనను తిరిగి నేర్చుకుంది. లైంగికతను ప్రేమ యొక్క అవిభాజ్య భాగంగా చూడడం మొదలుపెట్టింది.
ఇదిగో, ఆమె ఇక్కడ ఉంది, ఈ కొత్త మంచానికి బంధింపబడింది, తన భవిష్యత్తును తిరిగి మదింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
తన ప్రస్తుత పరిస్థితిని గతంతో అనుసంధానించే ప్రయత్నంలో, ఇది మొదట్లో అనిపించినంత భయంకరంగా అనిపించలేదు.
ఏదేమైనా, వీరు కేవలం మరికొంత మంది పురుషులే, మరియు వారు ఇప్పటికే ఆమెను అవమానించి, ఆమె శరీరాన్ని హింసించి ఉండగా, వారు మరింత అదే చేస్తే పెద్దగా తేడా ఉండదని ఆమె భావించింది.
ఈ విధమైన దృష్టికోణం నుండి చూసినప్పుడు, తాను సహించవలసి ఉన్నదానికి బదులుగా ఏదైనా ఆశించకపోవడం అర్థరహితంగా అనిపించింది.
అవసరమైతే వారు కోరిన కోరికకు లొంగితే వచ్చే నష్టం ఏముంటుంది ?
ఆహారం, విశ్రాంతి, తన చేతులను మంచానికి కట్టివేసి వున్న బాధ నుండి విముక్తి కోసం సహకరించకుండా ఉండడం ఎందుకు ?
ఎప్పటికైనా ఆమెను క్షేమంగా విడుదల చేస్తామని ఒక ఒప్పందం కోసం ఎందుకు చర్చించకుండా ఉండడం ?
ఆమె వారిని పిలిచే ఆలోచన చేసింది. వారిని ఆహ్వానించి, నిర్దిష్టమైన పరిగణనలతో ప్రతిస్పందించేందుకు, ఆమె ప్రతిఘటనను ఆపడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాలని అనుకుంది.
చివరిగా నిర్ణయం తీసుకోవడానికి ముందు, ఆమె ఒక్కసారిగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించింది.
ఆ పొడవైన వ్యక్తి, అతని క్రూరమైన ముఖంతో, ఘోరమైన మాటలతో భయపెట్టే మనిషి, గదిలోకి ప్రవేశించాడు. పడక గది ద్వారానికి తాళం వేసుకుంటూ ఆమె వైపు తిరిగాడు.