29-01-2025, 11:35 AM
(This post was last modified: 29-01-2025, 02:13 PM by 3sivaram. Edited 3 times in total. Edited 3 times in total.)
సెగ్మెంట్ 3 : సుహాస్
చాప్టర్ 3.1 : ట్రైనింగ్
సమంత "వాళ్ళను కంట్రోల్ లోకి తెచ్చుకో... "
సుహాస్ ఎదురుగా సుమారుగా అయిదుగురు నిలబడి ఉన్నారు.
అందరూ బలంగా బాడీ బిల్డర్స్ లా ఉన్నారు, వాళ్ళ చేతుల్లో గన్స్ మరియు కత్తులు ఉన్నాయి.
వాళ్ళలో ఒకడు నవ్వడం చూసి సుహాస్ "అబ్బా... ఎనిమిది పళ్ళు కనిపిస్తున్నాయ్ రా... " అన్నాడు.
వాళ్ళు కోపంగా చూసి సుహాస్ మీదకు పరిగెత్తుకొచ్చారు.
సుహాస్ చిన్నగా నవ్వి చిటికే వేశాడు.
వాళ్ళు అందరూ సుహాస్ ముందుకు వచ్చి మాస్టర్ అన్నారు.
సమంత "ఇప్పుడు అసలు టెస్ట్ స్టార్ట్ అయింది" అంది.
గదిలోకి మరో అయిదుగురు వచ్చారు.
సుహాస్ తన కంట్రోల్ లో ఉన్న ఐదుగురుతో గదిలోకి కొత్తగా వచ్చిన అయిదుగురుని కరక్ట్ గా గైడ్ చేస్తూ కొడుతున్నాడు.
సమంత "రౌండ్ 2..... అనగానే గదిలోకి పది మంది వచ్చారు..... "
సుహాస్ వాళ్ళను చూసి షాక్ అయి ఆ అయిదుగురుతోనే ఆ పదిహేను మందితో అటాక్ చేశాడు కాని ఆ ఐదుగుర్ని దాటి ఒకడు వచ్చి సుహాస్ ని కొట్టగానే.... అప్పటి వరకు తన కంట్రోల్ లో ఉన్న అయిదుగురు కూడా కంట్రోల్ తప్పి పోయారు, దాంతో అందరూ సుహాస్ ని కొట్టడం మొదలు పెట్టారు.
ఒకడు సుహాస్ తల మీద కాలు పెట్టి నొక్కి పెట్టి, అతని చేతి మీద మరొకడు చేయి పెట్టి నొక్కి పెట్టాడు.
సుహాస్ భయం భయంగా వాళ్ళను చూస్తూ ఉన్నారు. అందులో ఒకడు ఒక గొడ్డలి తీసుకొని సుహాస్ చేతిని నరకబోయాడు.
సమంత "స్టాప్ ఇట్" అనగానే అందరూ ఆగిపోయారు, సమంత నడుచుకుంటూ అక్కడకు వచ్చింది.
సుహాస్ రొప్పుతూ తనను కాపాడిన సమంతని చూస్తూ ఉన్నాడు. ఆమె అక్కడకు వచ్చి సుహాస్ కి చేయి యిచ్చింది, సుహాస్ పైకి లేచాడు.
సుహాస్ వంటి మీద ఉన్న చొక్కా చిరిగిపోయి, ప్యాంట్ మొత్తం మట్టి కొట్టుకుపోయి, బట్టల మీద చెప్పుల గుర్తులు ఉన్నాయి.
అతడిని అలానే ఒక యాట్చ్ లోకి ఎక్కి గోవా సముద్రంలోకి వెళ్ళారు.
సుహాస్ ఇంకా ఆ భయంలోనే ఉన్నాడు, గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం తనకు లేదు, చేతులు చిన్నగా వణుకుతున్నాయి.
సమంత నడుచుకుంటూ వచ్చి సుహాస్ భుజం మీద చేయి వేసి అతనికి వైన్ గ్లాస్ ఇచ్చింది.
సుహాస్ ఆ గ్లాస్ ని చాలా గట్టిగా పట్టుకున్నాడు, సమంత అతని భయాన్ని చూసి చిన్నగా నవ్వుకుంది.
ఇద్దరూ పక్కపక్కనే నిలబడి సూర్యుడు అస్తమించడం చూస్తూ ఉన్నారు.
సమంత "అరేబియా మహాసముద్రం... సూర్యుడు ప్రతి రోజు ఈ సముద్రంలో అస్తమిస్తాడు" అంది.
సుహాస్ కూడా సూర్యుడు అస్తమించడం చూస్తూ ఉన్నాడు కాని అతని చేతులు ఇంకా ఆ భయంతోనే చిన్నగా వణుకుతున్నాయి.
ఇద్దరిలో సమంత మాత్రమే ఎంజాయ్ చేస్తుంది, ఇంతలోనే చాలా సమయం గడిచిపోయి రాత్రి అయిపొయింది.
చీకట్లు కమ్మేయడంతో బీచ్ లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి, వాళ్ళు ఉన్న యాట్చ్ లో కూడా లైట్లు వేశారు.
ఒక వైపు చిక్కటి చీకటి సముద్రం మరో వైపు లైట్లతో వెలిగిపోతున్న బీచ్.... చంద్రుని కాంతిలో అందంగా మెరుస్తున్న సమంతని చూస్తూ ఉన్న సుహాస్ కి చాలా అందంగా కనిపించింది.
సమంత అతడిని చూస్తూ ఆ చల్లని గాలికి ఎగురుతూ మొహం మీద పడుతున్న వెంట్రుకలను తన చేతులతో పక్కకు నెట్టుకుంటూ ఉంది.
సుహాస్ ఆమె అందాన్ని అలానే చూస్తూ ఉండి పోయాడు.
సమంత చిన్నగా నవ్వడం చూసి అతను కూల్ గా మారిపోయాడు, అతని గుండె దడ కూడా తగ్గిపోయింది. ఆమె తన వైపు చూడడంతో వెంటనే మొహం తిప్పుకొని చేతిలో ఉన్న వైన్ ని నోటికి అందించుకొని కొంచెం తాగాడు. అలా కంగారులో తాగడంతో వెంటనే దగ్గు వచ్చింది. సమంత వెంటనే నవ్వేసి "చిన్నగా.. చిన్నగా.." అంది.
ఇంతలో ప్రియాంక వచ్చి "మందు తాగుతున్నవా.. మళ్ళి.. హా!!" అంటూ వచ్చి తన తల పై కొట్టింది. సుహాస్ ముందుకు పడి మళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె కనిపించలేదు, ఇదంతా కల అని అర్ధం అయింది.
సుహాస్ అలా ఆలోచనలు వేరే వైపు ఉండడం చూసి సమంత అతని చేతి మీద చేయి వేసింది, సుహాస్ తన వైపు చూడగానే అతని చేతికి చికెన్ లెగ్ పీస్ ఇచ్చింది, సుహాస్ దాన్ని తీసుకొని తినడం మొదలు పెట్టాడు.
సమంత చిన్నగా నవ్వి "నా గురించి చెప్పేదా.... " అంది.
సుహాస్ తల నిలువుగా ఊపాడు.
సమంత "నన్ను కొంత మంది కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి ఒక గదిలో పడేశారు... అందులో ఒక నాతో పాటు ఒక కుక్క ఉంది... కొట్టడం, తిట్టడం, రేప్ చేయడమే కాక... ప్రతి రోజు... మాకు మేం ఉన్న గదిలోకి ఒకే ఒక్క బ్రెడ్ విసిరేసేవాళ్ళు... దాన్ని ఆ కుక్క నా దగ్గర నుండి ఎక్కువ భాగం లాక్కొని తినేసేది... ఆ రోజు మొత్తం దాంతోనే ఉండేదాన్ని... మరుసటి రోజు ఆ కుక్క కంటే ముందు నేను బ్రెడ్ వైపు చూస్తూ పట్టుకునే దాన్ని... ఏం చేసినా ఎలా చేసినా ఆ కుక్క నా దగ్గర నుండి లాక్కునేది... ప్రతి రోజు ఆ కుక్క నా దగ్గర నుండి ఎక్కువ బాగం లాక్కునేది... భరించలేక పోయాను, ఒక రోజు నేను ఆ బ్రెడ్ ని కాదు... ఆ కుక్క మెడను చూశాను... ఈ సారి అది బ్రెడ్ ని కొరికితే నేను దాని మెడ కొరికాను... అది గింగిరాలు తిరిగింది, అదీ.. ఇదీ.. చేసింది, ఏం చేసినా.. ఏం చేసినా.. వదిలి పెట్టలేదు.. "
సుహాస్ షాక్ గా చూస్తూ ఉన్నాడు.
సమంత "ఆ రోజు నుండి నాకు ఫుల్ బ్రెడ్ దొరికేది..." అంటూ నవ్వింది.
సుహాస్ కి ఒక నిముషం ముందు వరకు ఆమె అందమైన అమ్మాయిలా కనిపించి ఒక్క క్షణం తను అండర్ వరల్డ్ కి సంబందించింది అన్న విషయం మర్చిపోయాడు.
సమంత చెప్పడంతో యాట్చ్ ఒడ్డుకు వెళ్తుంది.
సుహాస్ అందంగా నవ్వుతున్న సమంతనే చూస్తూ ఉన్నా... ఈ సారి అందమైన అమ్మాయిలా కనిపించడం లేదు.
సమంత "కుక్క గురించి చెప్పేసరికి ఇబ్బందిగా ఉందా...." అని అడిగింది.
సుహాస్ "ఉమ్మ్" అన్నాడు కానీ తల అడ్డంగా ఊపాడు.
సమంత అతని కళ్ళలో ఉన్న భయాన్ని ఎంజాయ్ చేస్తూనే "భయపడొద్దు" అని చెప్పింది.
సుహాస్ చిన్నగా నవ్వుతున్నట్టు నటించాడు.
సమంత "అది కుక్క కాదు... కుక్క అని తిట్టాను... అంతే... " అని ముందుకు వెళ్ళిపోయింది.
సుహాస్ కి మొదట అర్ధం కాకపోయినా తర్వాత అర్ధం అయి షాక్ అయి అక్కడే నిలబడిపోయాడు.
సమంత "నిన్ను వాళ్ళు మనిషిలా భావించలేదు, అందుకే నిన్ను కొట్టేడపుడు చేయి నరికేటపుడు, చంపాలని అనుకునేటపుడు నిన్ను అస్సలు మనిషి అని అనుకోలేదు, నువ్వు మాత్రమే ఎందుకు వాళ్ళను మనిషిలా చూడాలి"
సుహాస్ ఆలోచనలో పడిపోయాడు. సమంత మళ్ళి మాట్లాడడం మొదలు పెట్టింది.
సమంత "లైఫ్ అలాగే ఉంటుంది, ఒక్క సారి పడిపోతే, అందరూ వచ్చి కొడతారు..... అదే ఒక్క సారి తిరగబడితే అందరూ నిన్ను చూసి తప్పుకుంటారు.. ఈ సిటీ లో కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ కూడా ప్రతి ఇండస్ట్రీ కూడా భయం భయంగానే ఉంటారు.. ఒక్క తప్పటడుగు.. ఒక్క దెబ్బ వాళ్ళను తిరిగి లేవకుండా చేయొచ్చు.." అంది.
రంగురంగుల లైట్లలో వెలుగుతున్న ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు, వాళ్ళందరూ ఇప్పుడు ఇంతకు ముందులా అంత గొప్పగా అనిపించడం లేదు.
సుహాస్ ఎదో నిర్ణయం తీసుకున్న వాడిలా తల ఊపాడు. ఇప్పుడు అతని కళ్ళలో ఇంతకు ముందులా భయం కనిపించలేదు. భయపెట్టేలా ఉన్నాడు...
![[Image: Y7ZNwM.jpg]](https://i.ibb.co/7JMB4k0S/Y7ZNwM.jpg)