26-01-2025, 05:38 PM
(26-01-2025, 05:25 PM)Sahith1995 Wrote: మొదటిగా ధన్యవాదాలు Haran000. నేను ఇక ఎక్కువ మాట్లాడడం సబాబు కాదు. ఒకటే మాట point 4 గురించి. మీ రీడర్స్ కి మోటివేషన్ కామెంట్స్ తో వస్తుంది అని అంటున్నారు కదా. ఆ రీడర్స్ కి మీరు లేటెస్ట్ గా ఒక ఎపిసోడ్ ప్రివ్యూ చూపించి కుదిరితే ఈరోజు రాత్రి లేకపోతే పరీక్ష తర్వాత అప్డేట్ అన్నారు.
ఒక చిన్న analogy: మీకు ఇష్టమైన పదార్థం కేవలం గోరంత రుచి చూపించి కుదిరితే ఈరోజు చేసి పెడతాను లేదా నెల తర్వాత అని అంటే మీరు ఒకటే కోరుకుంటారు. "ఆ పదార్థం ఎత్తి పరిస్థితుల్లోనూ ఈరోజే ఆస్వాదించాలి" అని. కానీ అలా అవ్వకపోతే అప్పటిదాక నోరు ఊరిపోతు లొట్టలు వేసుకుంటూ ఉన్న మీరు బాధ పడడం కాక అందులో నుండి ఒక చిరాకు, frustration వచ్చి వండుతాను అని చెప్పిన వారిని చూసి "ఈ ఆశ, ఈ బాధ, ఈ కోపం అంత ఈ మనిషి వలనే కదా. సైలెంట్ గా ఉన్న వాడికి రుచి చూపించి వదిలేశాడు" అని అదంతా ఆ మనిషి వైపే చూపిస్తాము. ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిది?
నేను ఏదైనా హద్దు దాటి మాట్లాడితే క్షమించండి. కానీ కథను మీకు నచ్చినట్టు, మీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా రాయండి. రీడర్స్ కి మధ్య మధ్యలో పలకరించి ఊరిస్తే ఆక్టివ్ ఉంటారు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది.
బాగా చెప్పారు sahith గారు
Anumay గారి వీరాభిమాని
Self respect అస్సల్ లేదు