Thread Rating:
  • 23 Vote(s) - 3.39 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అన్ని మాట్లాడుకుందాము
పూర్తి క్రెడిట్స్ ఎండపల్లి భారతి గారికి చెందుతాయి:

కధ-1

పుట్టాటంలో లేనిది పెట్టాటంలో రాదు

మా ఊరు నాలుగు దిక్కుల్లోని నాలుగు మైదానాలు ఉండాయి. మా ఆవులకు నోటికి రుతువుగా మేత దొరికే తావులు అవి. వాటిల్లో దచ్చినంగ వుండే యాతాలంక ఏటింటి రెండు మూడు బార్లకు ఒగొగ్గ తావున చిన్నచిన్న నీల్లమడుగులు ఉంటాయి. ఆ మడుగుల్లో తేట తెల్లగా ఉండే నీల్లు. వాటిని మనుసులు తాగినా జీవాలు తాగినా టెంకాయ పాలేగతం తీయగా ఉంటాయి. ఆ ఏరంతా జీనవగడ్డి, సొంటి గడ్డి, ఈరుబాండ్లు గడ్డి, ఊసగడ్డి, దబ్బజొమ్ము, కాకెదురులాంటి కండ గెడ్లు ఉన్నాయి. ఇవి ఆవుల నోటికి రుతువుగా ఉండి మంచి పలారం తిన్నట్లే ఉంటుంది.

ఆ యాతాలంక ఏటి కల్లా ఆవుల్ని తోలకపోతే అవిటికి ఆనందం. అవిట్నిమేపే మాకు ఆనందమే. యాలంటే ఆ ఏరు నడన సదరమైన సలవ బండ ఉంది. దాని చుట్టూ పచ్చని గెడ్డి. ఆ గెడ్లో ముచ్చటగా ఉండే చిన్నచిన్న గెడ్డి పూలు. ఆ బండ ఆనుకొని ఒంటి కానగ కొమ్మ. కానగ చెట్టు అంటేనే కన్నతల్లికన్నా చల్లనైనది అంటారు. ఏప్రిల్ నెలలో కానగపూలు చెట్టంతా ఇరగ పూస్తాయి. ఆ బండ మీద గెడిసేపు గడిపినా మనసుకు చీకు చింత ఏమి

దేవ రహస్యాలు / 11
Like Reply


Messages In This Thread
RE: అన్ని మాట్లాడుకుందాము - by లింగం - 25-01-2025, 02:16 PM



Users browsing this thread: 75 Guest(s)