Thread Rating:
  • 7 Vote(s) - 1.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అవునా! కాదా!
#10
ఈ కధలో విలన్ ఎవరో మీరే చెప్పండి.






సుష్మ (28 ఫిమేల్), వినోద్ (31 మేల్) తన భర్త, కూతురు భాను (2 ఫిమేల్) తో కలిసి చెన్నై లో ఉంటుంది.



1. మొదటి మీటింగ్ - సుష్మ విత్ ఫ్రెండ్

సుష్మ తన ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ లో కలిసింది, పెళ్లి అయి వచ్చాక జాబ్ వదిలేసి ఇంట్లోనే ఉంటుంది. భాను పుట్టిన తర్వాత అసలు బయటకు వెళ్ళడం కూడా మానేసింది. సడన్ తన గా కాలేజ్ ఫ్రెండ్ అదే సిటీలో ఉందని తెలిసి భానుని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి వచ్చి ఫ్రెండ్ తో కూర్చుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది.

ఫ్రెండ్ "ఎలా ఉన్నావే.."

సుష్మ "బావున్నాను" ఫార్మాలిటిగా చెప్పింది.

ఫ్రెండ్ "హ్మ్మ్, వినోద్ ఏం చేస్తున్నాడు"

సుష్మ "ఏం చేస్తాడు, జాబ్ చేస్తున్నాడు.. నేను ఇంటి దగ్గరకు ఖాళీగా ఉంటున్నాను.. పాప కొంచెం కాలేజ్ కి వెళ్తే నేను కూడా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను" అడిగిన దానికంటే ఎక్కువే చెప్పేసింది.

ఫ్రెండ్ మనసులో "సుష్మ ఎదో సీరియస్ విషయం చెప్పాలని అనుకుంటుంది" అని అర్ధం అయి సుష్మ చేతిలో చేయి వేసి తన కళ్ళలోకి చూస్తూ "హుమ్మ్" అంది.

సుష్మకి తన ఫ్రెండ్ చూపు గుచ్చుతున్నట్టు ఇబ్బందిగా అనిపించింది, ఇద్దరి మధ్య మౌనమే ఉన్నా, సుష్మ కళ్ళలో ఉన్న స్యాడ్ నెస్ తన ఫ్రెండ్ పట్టేసింది.

ఫ్రెండ్ "నీకో సీరియస్ విషయం చెప్పాలి"

సుష్మ "ఏంటది?"

ఫ్రెండ్ "వినోద్ నాకు.."

సుష్మ "నీకు.."

ఫ్రెండ్ మాట్లాడడం ఆపేసి సుష్మ కళ్ళలోకి హింట్ కోసం చూస్తూ ఉంది, ఆమెకు ఎదో అర్ధం అయి పోయింది.

సుష్మకి కూడా అర్ధం అయిపోయి ఓపిక పట్టలేక "ఏమయింది? ఎదో ఒకటి మాట్లాడు.." అంటూ కోపంగా అరిచింది.

ఫ్రెండ్ "ఏం లేదు.. వినోద్ ని ఈ మధ్య ఒకమ్మాయితో చూశాను"

సుష్మ బలవంతంగా నవ్వేసి "ఆ అమ్మాయి..  సుగుణా.... వినోద్ చుట్టమే.. జాబ్ సెర్చింగ్ కోసం వచ్చింది, ఈ మద్య మా ఇంటిలోనే ఉంటుంది.. జాబ్ వచ్హాక వెళ్లిపోతుంది" అంది.

ఫ్రెండ్ నిలువుగా తల ఊపింది, సుష్మ కూడా తల ఊపుతూనే ఉంది. ఇద్దరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.

సుష్మ క్యాబ్ లో కూర్చొని తన ఫ్రెండ్ తో జరిగిన సంభాషణ మొత్తం గుర్తు తెచ్చుకుంది, ఓపెన్ అవ్వాలా లేదా అని మనసులో అనిపిస్తూ ఉంటే, ఎదో తెలియని ఇబ్బంది అనిపిస్తూ ఉంది.

భానుని తీసుకొవాడానికి వెళ్లి వాళ్ళతో కొద్ది సేపు కూర్చొని మాట్లాడుతూ, యాంత్రికంగా బావున్నావా అంటే బావున్నాను, తిను అంటే లేదు అని చెప్పి... భానుని తీసుకొని  ఇంటికి బయలు దేరింది.

పొద్దున్న నుండి రాత్రి వరకు ఒక యంత్రంలో పనిచేస్తూ ఉంటే, తన ఫ్రెండ్ తో మాట్లాడిన ఆ అయిదు నిముషాల సంభాషణ అంతా మార్చేసింది. 

ఇంటికి వెళ్తూ దారిలో అందరిని నవ్వుతూ పలకరిస్తూ ఇంటి దగ్గరకు వెళ్ళింది. భానుని చూడగానే అందరూ పలకరిస్తున్నారు, మనసు కొంచెం ఉల్లాసంగా అనిపించింది.

ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే, ఇంట్లో నుండి నవ్వులు వినిపించాయి. గుండెలో ఎక్కడో కలుక్కు మంది. తన ఫీలింగ్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.

వినోద్ అఫైర్ పెట్టుకున్నాడా అంటే, లేదు.. 

సుగుణ మైండ్ లో అభిప్రాయం చెడ్డగా ఉందా, తెలియదు.. 

కానీ తనకు ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

తన భర్త వినోద్ తనతో కాకుండా మరో అమ్మాయితో నవ్వుతూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే.. ఎదో ఇబ్బందిగా  అనిపిస్తుంది. 


సుగుణ ఎదురొచ్చి "అక్కా, ఎంత సేపు అయింది వచ్చి..." అంటూ భానుని చేతుల్లోకి తీసుకొని ఆడిస్తుంది.

వినోద్ తన వైపు కాకుండా టీవీ చూస్తూ ఉన్నాడు.

సుష్మ, వినోద్ వైపు చూస్తూ చూస్తూ సైలెంట్ గా ఉండిపోయింది.



















All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 3 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
అవునా! కాదా! - by 3sivaram - 19-12-2024, 08:59 PM
RE: యస్.. నో.. యస్.. నో.. - by 3sivaram - 25-01-2025, 12:08 PM
RE: అవునా! కాదా! - by 3sivaram - 25-01-2025, 05:20 PM
RE: అవునా! కాదా! - by sri7869 - 25-01-2025, 09:36 PM
RE: అవునా! కాదా! - by krish1973 - 27-01-2025, 05:37 AM



Users browsing this thread: 1 Guest(s)