21-01-2025, 03:44 PM
(This post was last modified: 21-01-2025, 03:45 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
శిరీష - ఏమైందే వీడికి..
అప్పు - నాటకాలు..
శిరీష - నాకలా అనిపించట్లేదు..
అప్పు - మరి.. చిప్ దొబ్బింది అంటావా..
శిరీష - అసలు వాడు అరుణ్ అనే అబ్బాయేన.. లేక మీరిద్దరూ కలిపి నన్ను ఫూల్ చెయ్యడానికి ఏదైనా ప్లాన్ వేసారా..
అప్పు - అంటే?
శిరీష - అంటే అరుణ అరుణే.. అరుణ్ కాదు అంటున్న..
అప్పు - అంటే అరుణ్ అనేవాడే లేడు అంటున్నావా..
శిరీష- ఈ పిల్ల వాలకం చూస్తుంటే అలానే అనిపిస్తోంది..
అప్పు - అంత లేదు.. నేను వాడి పిక్స్ ID అన్నీ చూసా..
శిరీష - ముందు ఆ ఫోన్ ఎక్కడ పడేసిందో చూడు..
అని వెతగ్గా అరుణ విసిరేసిన అద్దం ముక్క దొరికింది..
అప్పు - డీటెయిల్స్ తర్వాత చూద్దువు.. ముందు వాడు ఎటు పోతున్నాడో చూడు..
శిరీష - ఎహె.. అది అదేనే అంటే కాదు అది వాడు అంటావ్..
అప్పు - ఆగు.. వాడితోనే చెప్పిస్తా.. అంటూ అరుణ వైపు పరిగెత్తింది..
అదిగో వీళ్ళు మళ్ళీ నా వైపు వస్తున్నారు.. ఇంక పరిగెత్తే ఓపిక లేదు కానీ వీళ్ళ సంగతి ఇక్కడే తేల్చేయాలి..
శిరీష - ఓయ్ అరుణ ఆగు..
నేను - ఈ పిల్లకి నా పేరు ఎలా తెలిసింది.. అసలు వీళ్ళు నాకెందుకు గుర్తు రావట్లేదు..
అప్పు - రేయ్ ఎక్కడికిరా దొరక్కుండా పారిపోతున్నావ్..
శిరీష - ఆగవే నే మాట్లాడతా..
సరే ఎం చెప్తారో చూద్దాం అన్నట్టు వాళ్ళకేసి చూస్తున్నా..
శిరీష - అరుణ.. అసలు నువ్వెందుకు పారిపోతున్నావ్..
నేను - అసలు మీరు నా వెంట ఎందుకు పడుతున్నారో అది చెప్పండి ముందు..
శిరీష - నిన్న మనమంతా కలిసే కదా బస్సు ఎక్కాం.. మీ ఊరు వెళ్ళడానికి..
నేను - అసలు మీరెవరో నాకు తెలీదు మిమల్ని మా వూరు ఎందుకు తీసుకు వెళ్తా..
అప్పు - ఆ..సురేష్ ని కలవడానికి..
నేను - వాడెవడు..
నేను ఆ మాట అనగానే నా పక్కన కూర్చున్న అమ్మాయి సురేష్ అన్న అమ్మాయి కాలర్ పట్టుకుని..
శిరీష - ఇద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా అంటూ రైజ్ అయిపొయింది..
నువ్వాగు.. అంటూ.. ఆ అమ్మాయి నా దగ్గరకి వచ్చి.. నీకేం గుర్తులేదా అని అడిగింది..
ఎం గుర్తుండాలి అని అడిగా.. నా ఆన్సర్ కి ఎక్కడో కాలినట్టుంది..
గబగబా ఇందాకటి అద్దం ముక్క తీసి ఏవేవో ఫోటో లు చూపెడుతోంది..
అంతా విచిత్రం గా ఉంది..మా పిన్నికి పెళ్ళై పిల్లలు పుట్టేసినట్టు.. ఆ పిల్లాడు పెరిగి పెద్దయి కొంచెం నాలాగే ఉన్నట్టు అనిపించింది..
అంతా అయిపోయాక ఇప్పుడేమైంది గుర్తొచ్చిందా అని అడిగింది మళ్ళీ..
అసలు నేనేం మర్చిపోయానో తెలిస్తే కదా గుర్తు రావడానికి అని మళ్ళీ నా సమాధానం నే చెప్పా..
మేము గుర్తు వచ్చామా అంటూ గట్టిగా అరిచింది..
లేదని మెల్లిగా చెప్పా..
ఇద్దరూ ఇప్పుడేం చెయ్యాలని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు..
అప్పటికి తెలిసింది ఒకదాని పేరు అప్పు ఇంకో దాని పేరు సిరి..
సిరి - సరే మీ వూరు వెళ్దాం పద..
నేను - మీరెందుకు..
అప్పు - సిరి ఆగు.. ముందు తనకి ఎంత వరకు గుర్తుందో తెలుసుకోనీ..
నేను - అసలు మీరెవరు నేను మీకెందుకు ఇదంతా చెప్పాలని గట్టిగ అరిచా..
అప్పుడే అప్పు అనబడే ఆ పిల్ల..
"ఎందుకా.. ఎందుకంటే ఇది 2025 కాబట్టి.. నువ్వు మీ పిన్ని బాబాయ్ కొడుకువి కాబట్టి.. మధ్యలో సురేష్"
సిరి - అప్పు ఆగవే.. అంటూ మధ్యలో ఆపేసి పక్కకు తీసుకెళ్లింది..
అసలు ఈ సురేష్ ఎవడో.. వీళ్ళిద్దరూ ఎవరో.. ఆ అద్దం ముక్క ఏంటో.. మా అమ్మ నాన్న ఎక్కడో..
సిరి - అప్పు వాడు నిజం గా అరుణ్ ఏనా..
అప్పు - ఒసేయ్ వారం నుంచి వాడితో విల్లుపురం తిరిగా.. సురేష్ తో మాట్లాడ్డం చూసావ్.. వన్ మొంత్ నుంచి వాడితో ట్రావెల్ చేస్తున్నా.. నీకు అర్ధం అవ్వట్లేదా..
సిరి - మరిప్పుడు వాడేం గుర్తు లేదంటున్నాడు.. ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కూతురు పోయిందని.. పిన్ని బాబాయ్ కొడుకు పుట్టాడని.. సురేష్.. అరుణ లేదని ఫిక్స్ అయిపోయారు.. పోనీ వాడికి ఏమైనా గుర్తున్న ఇంటికి తీసుకు వెళ్ళేవాళ్ళం.. ఇలాంటప్పుడు తీసుకెళ్తే అందరూ పిచోళ్లు అయిపోతారే..
అప్పు - అందుకే కదా వాడికి గుర్తు చేద్దాం అని ట్రై చేస్తున్నా..
సిరి - నువ్వు చెప్పిందంతా నిజం ఐతే మనం వాడికి గుర్తు చెయ్యలేం.. వాడంతటా వాడే మారాలి..
అప్పు - ఐతే ఇప్పుడేం చేద్దాం..
సిరి - హైదరాబాద్ తీసుకు వెళ్ళిపోదాం..
అప్పు - వాడు రావట్లేదు కదా..
సిరి - ఎదో ఒకటి చెపుదాం..వాళ్ళ అమ్మ నాన్న హాస్టల్ లో పెట్టి ఫారిన్ వెళ్లరానో పోయారనో..
అప్పు - ఒసేయ్..
సిరి - పోనీ నీకేమైనా మంచి ఐడియా లు ఉంటె చెప్పు..
అప్పు - మరి సురేష్ కి ఎం చెప్తాం..
సిరి - వీడి ఫోటో తీసి వాట్సాప్ చేసి హైదరాబాద్ రమ్మందాం.. తర్వాత సంగతి తర్వాత..
ఇద్దరూ తలలు ఊపుకుంటూ మళ్ళీ నా దగ్గరకి వచ్చారు..
నేను - హ ఇప్పుడు చెప్పండి.. అమ్మ నాన్న.. పిన్ని బాబాయ్ అంటున్నారు ఎదో..
సిరి - అరుణ మెం చెప్పేది నువ్వు నమ్మాలి.. ఇది ఎలా జరిగిందో మాకు తెలీదు కానీ నువ్వు గతం మర్చిపోయావ్.. మెం నీ రూంమేట్స్..
నేను - మళ్ళీ మొదలు పెట్టారా.. నేను మా వూరికి వెళ్ళాలి.. తరవాతే మిగిలిన విషయాలు..
అప్పు - రేయ్.. అర్ధం చేసుకోరా..
నేను - మళ్ళీ రేయ్ అంటావేంటి..
అప్పు - సారీ.. అరుణ అర్ధం చేసుకో.. ఇది 2025 .. నువ్వు నీ లైఫ్ లో 26 ఇయర్స్ మర్చిపోయావ్.. ఈ టైం లో అన్నీ చేంజ్ అయిపోయాయి…
నేను - ఎహె ఆపు.. నా ఏజ్ ఏ 20 ఇయర్స్.. 26 ఇయర్స్ మర్చిపోవడమేంటి..
సిరి - అరుణ ప్లీజ్..ఈ ఒక్కసారికి మమ్మల్ని నమ్ము.. మేము నీ ఫ్రెండ్స్..
నాకూ అంతా కొత్తగా ఉంది.. ఈ బట్టలు కానీ రోడ్స్ కానీ.. అదేదో సెల్ ఫోన్ ట.. అది కానీ ఏదీ గుర్తు లేదు.. కానీ నా చుట్టూ జరుగుతూ ఉన్నవి నిజమే అనేలా ఆకలి వేస్తోంది..
అదే చెప్పా.. ముందు తింటే తప్ప ఏమి ఆలోచించలేనని..
దగ్గర్లో ఉన్న హోటల్ కి ఆటోలో వెళ్ళాం.. టిఫిన్స్ ఏమున్నాయో చూద్దును కదా 2 ఇడ్లీలు 60 రూపాయలట.. మా వూళ్ళో రెండు రూపాయలకి 4 వస్తాయ్..
నేనది చెపుదాం అనుకునేలోపు అప్పు సిరి నా వైపు సైలెంట్ గా ఉండు అంటూ టోకెన్స్ తీసుకుని వచ్చి నన్నో టేబుల్ దగ్గర బలవంతంగా కూర్చోపెట్టారు..
వాళ్ళు ఇందాక చెప్పిందంతా నిజం చేస్తూ కొత్త కొత్త సినిమా పాటలు వస్తున్నాయ్.. అందులో చిరంజీవి కొడుకు డాన్స్ చేస్తున్నాడు..
ఛానల్ మారిస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ట.. ఇవన్నీ ఎప్పుడు జరిగిపోయాయి .. మరి అమ్మ నాన్న.. నేనిక్కడ ఎందుకు ఉన్న..
ఈలోపు నా ఆలోచనల్ని అందుకుంటూ..
అప్పు - ఎక్కువ ఆలోచించకు.. అన్ని చెప్తాం.. ముందు టిఫిన్ చెయ్..
ఈలోపు ఫోన్ రింగ్ ఐతే.. ఇద్దరూ నీదే అంటూ నా వైపు చూసారు..
సురేష్ కాలింగ్ అంటూ వెలుగుతోంది.. వెంటనే అప్పు నా చేతిలోంచి ఫోన్ లాక్కొని.. ఎదో మెసేజ్ పెడతా అంది..
కాసేపు అలోచించి.. నన్ను సరిగ్గా కూర్చోమని చెప్పి.. నా ఫోటో తీసి ఆ సురేష్ కి మెసేజ్ చేసింది..
సిరి - చూసాడా..
అప్పు - ఇంకా లేదు..
సిరి - ఐతే ఓ సరి కాల్ చేసి మాట్లాడు..
సరే అంటూ.. సురేష్ కి కాల్ చేసి..తను కాల్ ఎత్తాక.. అరుణ ని చూసారా అని అడిగింది..
సురేష్ - వాట్... హౌ ఇస్ఇట్ పోసిబుల్..
అప్పు - అది చెప్దామనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం.. బట్..
సురేష్ - బట్.. ఏమైంది ప్లీజ్..చెప్పండి..
అప్పు - మీరు హైదరాబాద్ రాగలరా..
సురేష్ - వెంటనే వస్తా..
అప్పు - బట్ మేము హైదరాబాద్ లో లేము.. మీ వూరికి 100 కిలో మీటర్ల దూరం లో ఉన్నాం..
సురేష్ - మరి ఇక్కడే కలుద్దాం..
అప్పు - లేదు.. మేము ఆలా కలిసే సిట్యుయేషన్ లో లేము.. రేపు హైదరాబాద్ లో కలుద్దాం.. అంటూ కాల్ కట్ చేసింది..
సిరి - ఎం చేద్దాం ఐతే..
అప్పు - హైదరాబాద్ వెళ్ళాక మాట్లాడదాం అంటూ.. నెక్స్ట్ బస్సు కి టికెట్స్ బుక్ చేసింది..