20-01-2025, 06:54 AM
(No sex)
ఇప్పటి వరుకు జరిగింది :
శంకరయ్య ఒక మారుమూల గ్రామంలో తక్కువ కులంలో పుట్టాడు, తక్కువ కులం కావడంతో ఆ ఊరు పెద్దమనుషులు వీళ్ల కులం వారిని తక్కువుగా చూసేవారు.. శంకరయ్య చదువులో చురుకుగా ఉండేవాడు.. తన తెలివిని చూసి ఓ మాస్టారు "ఈ సమాజంలో నువ్వు బ్రతకాలంటే డబ్బు ఏనా ఉండాలి లేదా హోదా ఐనా ఉండాలి.. డబ్బు ఎలాగైనా వస్తుంది హోదా మాత్రం కేవలం చదువు ద్వారానే వస్తుంది" అని చెప్పాడు..
ఈ మాట శంకరయ్య గుండెల్లో బాగా నాటుకుపోయింది.. కస్టపడి చదివి కానిస్టేబుల్ అయిపోయాడు..
ఊరిలో తనకంటూ ఒక గుర్తింపు వచ్చింధి.. ఆ తర్వాత శంకరయ్యకి వాలా అమ్మ నాన్న వాళ్ళకి దూరపు చుట్టం కుటుంబంలో అమ్మాయి
పార్వతమ్మకి ఇచ్చి పెళ్లి చేసారు... ( వాళ్ళ కులమే )
ఉద్యోగం రీత్యా శంకరయ్యకి రాజమండ్రి పోస్టింగ్ వచ్చింది.. తన మకాని కుటుంబం తో సహ రాజమండ్రి మార్చేశాడు
( వాలా అమ్మ, నాన్న రాలేము అన్నారు )
స్వతహాగా మంచివాడు, పనితనం తెలిసినవాడు, ఉద్యోగం పట్ల నిజాయితీ, చెడు అలవాట్లు లేనివాడు, పైగా డబ్బు విలువ తెలిసినవాడు కావడంతో సంపాదించే డబ్బులో కాస్త బ్యాంకు లో, కాస్త పోస్ట్ ఆఫీస్ లో, పొదుపు చేసుకుంటూ వచ్చేవాడు..
డ్యూటీ లో sincere గా ఉండడం వల్ల అనతికాలం లోనే si అయిపోయాడు..సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నారు..
ఆ తర్వాత.. ….కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా... కాలం మారింది, శంకరయ్య
పై అధికారులు మారారు, తన తోటి ఉద్యగులు శంకరయ్య కన్నా పై పోసిషన్ కి వెళ్లారు. కానీ తను మాత్రం si పోస్ట్ దగ్గరే ఆగిపోయాడు..
దానికి కారణం డిపార్ట్మెంట్ లో పైకి రావాలంటే ఒకటి చెయ్యి తడపాలి
( లంచం ఇవ్వాలి )లేదా చెయ్యి కడుకోవాలి
( లంచం తీసుకోవాలి )..
ఇవి శంకరాయ్య్ చేయడు అందుకే అక్కడే ఉండిపోయాడు...కాకపోతే డిపార్ట్మెంట్ లో అందరు తనని గౌరవిస్తారు..
శంకరయ్యకి, పార్వతమ్మ కి ఒక కొడుకు ఉన్నాడు వాడే మన కథలో మెయిన్
హీరో/విలన్...
వాడి పేరు దయా... దయకి ఒక ఏడాది ఉన్నప్పుడు పార్వతమ్మ రెండో సారి నీలుపొసుకుంది (ప్రెగ్నెంట్ ). అయితే ఏదో ప్రమాదం వల్ల అబోరషన్ అయ్యి ఇంక పిల్లలు పూట్టే భాగ్యని పోగొట్టుకుంది... దాంతో ఉన్న ఒక్కగానోక్కా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచారు...
ప్రస్తుతం :
దయా 10th క్లాస్ కి వచ్చాడు.. చిన్నపటి నుంచి తండ్రి శంకరయ్య ప్రొచాహంతో బాగా చదువుకుంటూ వచ్చాడు. చూడడానికి కాస్త రంగు తక్కువైనా, చూడగానే ఆకట్టుకునే మొకం దయా సొంతం.. కాస్త మేతక...
చదువులోనే కాదు ఆటలోనూ మనవాడు ముందే.. చదువులో తనకు పోటీ అంటే కిరణ్ ఒక్కడే... 6th, 7th లో కిరణ్ క్లాస్ ఫస్ట్ వస్తే, దయా సెకండ్ వచ్చాడు..
8th, 9th దయా ఫస్ట్ వస్తే, కిరణ్ సెకండ్ వచ్చాడు.. మరి 10th ఎవరొస్తారా అని కాలేజ్ మొత్తం ఎదురుచూస్తుంది..
అయితే కథ ఇక్కడే అడ్డం తిరిగింది.. ఎప్పుడు ఏ అమ్మాయికి పడని మన దయా ఒక అమ్మాయికి పడిపోయాడు అది ఆ వయసులో వచ్చే infatuation/attraction అని తనకి తెలియదు..
తన పేరు నీవేత థామస్
![[Image: IMG-20250120-024853.jpg]](https://i.ibb.co/DVn8kkp/IMG-20250120-024853.jpg)
నీవేత కాస్త బొద్దుగా, ముద్దుగా, సొట్ట బుగ్గలతో బలే ఉంటుంది.. రోజు తనకి చాక్లెట్ ఇవ్వడం, తనతో మాట్లాడం, ఇలా చేస్తూ చదువు తగ్గిపోయింది..
10th అవ్వగానే ఒక ఉద్యోగం, నీవేత తో పెళ్లి అని ఏవేవో కలలు కనేస్తున్నాడు..ఇంకో పక్క ఇప్పటి వరుకు జరిగిన యూనిట్స్ పరీక్షలలో కిరణ్ ఫస్ట్ వచ్చాడు..
దయాలోని ఈ మార్పుని తన స్నేహితులు ఇద్దరు ముగ్గురు గమనించారు.. పైగా నీవేత అంత మంచి అమ్మాయి కాదని దయకి చెప్పడానికి చాలా ట్రై చేసారు. కానీ తను వినే స్థితిలో లేడు..
ఇకపోతే దయా ఇంటి విషయానికి వస్తే... శంకరయ్య స్థలం కొన్నప్పుడు అది ఒక అడవిలా ఉండేది,... ఆ స్థలంలో ఇల్లు కట్టే టైం కి అక్కడ అడవి పోయి స్థలాలు వచ్చాయి..ఆ తర్వాత జనాభా పెరగడంతో చుట్టూ ఇల్లులు లెగిసాయి..
ప్రస్తుతం వీరు ఉంటున్న వీధిలో ఒక పది ఇల్లులు ఉంటాయి...వీరి వీదికి ఒక వైపు entrance ఉంటే మరో వైపూ దారి మూసేసి ఉంటుంది అంటే పెద్ద గోడ కట్టేసి ఉంటుంది..
వీధిలోకి రాగానే దయా ఇల్లు 9వ ప్లేస్ లో ఉంటుంది, వీధి చివర గోడకి అనుకోని ఉన్న ఇల్లు స్నేహ వాళ్లది..అంటే 10వ ఇల్లు స్నేహ వాళ్లది..
![[Image: images-58.jpg]](https://i.ibb.co/HFw38MS/images-58.jpg)
ఇక 8వ ఇల్లు పూర్ణది..
![[Image: images-59.jpg]](https://i.ibb.co/sjmmTN6/images-59.jpg)
దయా ఇంటి కుడివైవు స్నేహ ఇల్లు, ఎడమవైవు పూర్ణ ఇల్లు... ఇక పూర్ణ ఇంటి పక్కన అంటే 7వ ఇల్లు మాళవిక మోహనన్ ది..
![[Image: images-2025-01-20-T064045-355.jpg]](https://i.ibb.co/cXZVVPB/images-2025-01-20-T064045-355.jpg)
చూస్తుండగానే అలా 10th క్లాస్ చివరికి వచ్చేసాం.. మార్చ్ లో పరీక్షలు అని ప్రభుత్వం G.O పాస్ చేసింది..revision స్టార్ట్ అయ్యింది.. కానీ దయా మాత్రం అవేమి పట్టించుకోకుండా నీవేత మాయలో ఉన్నాడు..
ఇంతలో న్యూ ఇయర్ వచ్చింది...
సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది..