17-01-2025, 10:39 PM
(17-01-2025, 09:31 PM)Haran000 Wrote: యుద్ధాల గడ్డమీద రక్తాలు ఏరు పారే.
కన్నీరు ముంగిల్లలో అడియాశలు ఆవిరాయే.
కష్టాల కాలములో కులబంధువులు దూరమాయే.
రాజ్యాంగం నీతులలో హక్కుబొక్కలు గోతులాయే.
ప్రజల మధ్యన పరిపాలన వోటునోటుకు బానిసాయే. - Haran000
.
ఇప్పుడే గేమ్ చేంజెర్ మూవీ చూసా బ్రో.. బావుంది..
లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది.. పేదవారందరికి ఉచితంగా ఇల్లు కట్టిస్తా అని..
నేను పేదవాణ్ణే.. చచ్చి చదివి సంపాదించి ఇల్లు కట్టుకున్న.. మందు సిగరెట్ నాన్ వెజ్ అలవాటు లేదు..
నిన్న సంక్రాతికి ఊరు వెళ్లి వచ్చా.. ఈ సారి మద్యం కొనుగోళ్లు లాస్ట్ ఇయర్ కంటే రెట్టింపు అంట..
జనాలు పని చెయ్యరు.. సంపాదించింది తాగి తందనాలాడి తగలేస్తారు.. వాళ్ళకి గవర్నమెంట్ అన్ని కాళ్ళ దగ్గరకి తెచ్చి పడేస్తోంది..
ఇంకో ఆలోచన.. ఓసారి పూణే నుంచి భీమశంకర్ వెళ్తుంటే..కొండ ప్రాంతాల్లో ఆడవాళ్లు బిందెలు పట్టుకొని నీళ్లకోసం చాల దూరం వెళ్తుంటే అనిపించింది..
ప్రజలు వలస జీవులు కదా.. వాళ్ళని అక్కడే ఉండమని ఎవరు బలవంత పెట్టలేదు.. వాళ్ళు ఎప్పుడో అంటే వందల ఏళ్ళ క్రితం వేరే వూరు వచ్చి సెటిల్ అయ్యి ఉండవచ్చు..
కానీ వాళ్ళు అక్కడే ఉండడానికి ఎందుకు నిర్ణయించుకున్నారు..
నీ కవితలోవి భావాలు ఎవరివి బ్రో.. నీవా.. పక్క వాళ్ళవా..