15-01-2025, 05:04 PM
Second Half :- అందము
శనివారం అంతా మా ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు. అమ్మ ఐతే మరీ ఎక్కువ. నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. తమ్ముడు మా కంపెనీ పనులు చూసుకోక తప్పదు, వాడి బిజిలో వాడు ఉన్నాడు.
ఆదివారం ప్రొద్దున్నే నా చెంపలు వెచ్చగా అనిపించాయి, అది మా ఇంటి తూర్పు దిక్కు కిటికీ నుంచి వచ్చే సూర్యరశ్మి.
లేచి బెల్లు నొక్కితే, “ కిరణ్ భయ్యా.... ” అని నా తలుపు తెరుచుకొని అన్నాడు ఇక్బాల్.
నేను: మంచి చొక్కా, ప్యాంటు తీసి పెట్టు స్నానం చేసి వస్తాను.
ఇక్బాల్: టీఖే భయ్య..
నేను పాదాలు నేల తాకించి, అడుగులు వేసి వెతుకుతూ గొడకి స్విచ్ బోర్డు రెండోది నొక్కాను, అది వేడినీళ్లు కాచే గీజర్ బటన్. తలుపు తీసి లోనికి పోయి, కుడి పక్కన నా భుజం ఎత్తులో ఉండే సెల్ఫులో బ్రష్, పేస్టు అందుకొని, పేస్టు కొంచెం నొక్కి, అది బ్రష్ కి అంటుకుందో లేదో నేను నోట్లో పెట్టుకుంటే గాని తెలీదు. పేస్టు పక్కన పెట్టి బ్రష్ నోట్లో పెట్టుకున్న. హా ఉంది. పళ్ళు తొమి, కిందకి వంగి ఎడమ దిక్కు నీళ్ల టాప్ తిప్పి నోట్లో పూకులించి ఉమ్మేశాను.
దానికి పైనే షవర్ ది ఉంటుంది.
నా t-shirt, ప్యాంటు విప్పి పక్కన వేసాను.
ఏంటో నేను పక్కన వేస్తాను, అవి ఎక్కడ పడతాయో తెలీదు. ఒకరోజు అమ్మ నన్ను తిట్టింది. డ్రెస్సు లెట్రిన్ కుండి మీద విసిరేసాను అని.
షవర్ తిప్పితే, కొంచెం కాగిన నీళ్ళు నా మీద వర్షంలో తడిచినట్టు అనిపించింది.
స్నానం చేసి, టవల్ చుట్టుకొని బయటకి అడుగేసి కుడికి ఐదు అడుగుల వేసి, బెడ్డు నా మోకాలి కింద తగిలింది. వొంగి వెతికితే డ్రెస్సు దొరికింది.
టవల్ ముడి విడిచేసాను. అది కింద పడిపోయింది.
ఎవరూ ఉండరు, ఇక్బాల్ ఎప్పుడూ అలా డ్రెస్సులు పెట్టి వెళ్ళిపోతాడు. నేను పిలిస్తేనే వస్తాడు.
నాకు తెలుసు, నా గదిలో ఒక అద్దం ఉంది. బెడ్డుకి ఆరగులుగా దూరంలో రెండో దక్షిణం దిక్కు కిటికీ పక్కన.
అటు అడుగేసి ముందుకి చెయ్యి చాచాను, నా మునివేళ్ళకు గాజుముక్క పలక తాగింది, అదే అద్దం.
అసలు నన్ను చూసుకుంటే ఎలా ఉంటాను? నేను కనీసం ఎలా ఉంటానో అని ఊహించుకోలేను కూడా.
అమ్మ నేను అందంగా ఉంటాను, నాన్న నేను ఆయనకంటే ఎత్తు అయ్యాను, తమ్ముడు నా కళ్ళు బాగుంటాయి అని చెప్పారేగాని, మిగతా ఎవ్వరూ నా గురించి చెప్పినవాళ్ళు లేరు.
నాగురించి నేను అనుకునేవి కొన్నే, కళ్ళ ముందు నల్లరంగు కన్నద్ధాలు, ఎడమ చేతికి ఒక గడియారం, జేబులో ఫోను, కుడి చేతికి కర్ర, కింద ఎత్తు భూట్లు, అమ్మ దువ్విన జుట్టు. అంతే.
చొక్కా ప్యాంటు వేసుకున్నాను. టవల్ తీసుకొని తల తుడుచుకున్నాను.
ఇక చాలు ఇంకేమి వద్దు.
గది నుంచి బయటకి వచ్చాను.
ఇక్బాల్: ఎక్కడికి?
నేను: బయటకి?
ఇక్బాల్: ఆగండి కార్ తెస్తాను.
నేను: అవసరం లేదు.
ఇక్బాల్: భయ్య స్టిక్కు?
నేను: ఏం అవసరం లేదు. అమ్మ ఎక్కడ?
ఇక్బాల్: మేడం పూజలో ఉన్నారు.
నేను: నేను కీఫ్ కి పోయ్ వస్తాను, అమ్మకి చెప్పు.
ఇక్బాల్: ఉండండి చెప్పి వస్తాను.
నేను: నేను ఒక్కడినే పోతున్న.
ఇక్బాల్: భయ్యా... లేదు నేను వస్తాను.
నేను: చెప్పింది చెయ్యి అంతే.
నా కుడి చేతి మోచేతి పట్టుకున్నారు.
ఇక్బాల్: నేను లేకుండా నువు బయటకి పోవు భయ్య.... పంపిస్తే అమ్మగారు తిడతారు. పదా నేను వస్తాను.
సర్లే అనుకున్న.
నా మోచేతికి ఇక్బాల్ చెయ్యి పట్టుకున్నాడు. నడుస్తూ ఇంటి బయటకి పోయాము.
ట్రాఫిక్ శబ్దం, చల్లని గాలి, నా నుదుట కాలుతున్న ఎండ, దూరంగా ఎవరో భార్య భర్తల గొడవ.
నడుస్తూ నా చెయ్యిని గట్టిగా పట్టుకొని నన్ను కుడికి తిప్పాడు.
ఇక్బాల్: భయ్య రోడ్డు దాటాలి.
కొన్ని క్షణాల నిల్చొని ఉన్నగా నా చెయ్యి లాగాడు. అలా ముందుకి నడిచి, “ మెట్టు ఎక్కు ” అన్నాడు, నేను కాలెత్తి పైకి ఎక్కాను.
అక్కడ కొందరి గుసగుసలు వినిపిస్తున్నాయి, ఇంకోసారి కిలకిలలు వినిపిస్తున్నాయి.
దాటుకొని పోయి, తలుపు చప్పుడు. లోపల అడుగు పెట్టాల ac చల్లదనం. నా భుజాలు పట్టుకొని తిప్పి, కుర్చీ లాగుతున్న చప్పుడు, “ బైటో భయ్యా” అన్నాడు. నేను కూర్చున్న. చేతులు ఆడిస్తూ ముందు టేబుల్ ఉందా అని వెతికాను, చల్లని గాజు తగిలింది. ఉంది అని టేబుల్ మీద మోచేతులు పెట్టాను.
నేను: ఇక్బాల్ బయట శంకర్ దగ్గర ఛాయి, ఉస్మాని బిస్కట్లు తేపో, నీకూ నాకూ.
ఇక్బాల్: హహ.... ఇంత కేఫ్ కి వచ్చి, బయట టీ స్టాల్ ఛాయి తాగేవాడివి నువ్వే. ఉండు లేకే ఆతాఊ
ఇక్బాల్ పోయాడు.
చుట్టూ మనుషుల మాటలు, కాఫీ మెషీన్ శబ్దం, ఏవో ప్లెట్స్ కదులుతున్న శబ్దం.
చిన్నగా ఎడమ దిక్కునుంచి, “ మౌనమేళనోయి ఇది మరపు రాని రేయి... ” అని గాణం వినిపిస్తుంది.
గట్టిగా ఊపిరి తీసుకుంటూ మౌనంగా ఆలోచనలో పడ్డాను.
తమ్ముడు మరో కంపనీ అంటున్నాడు, రెండు కంపెనీలు చూసుకోలేడు. అందుకే నాన్న దానికి నన్ను ఉండమని అంటున్నాడు. నాకేదో కనిపించదు, చదవాలంటే లిపిలో చదవాలి, మరి కంపనీ కాగితాలు అలా ఉండవు, ప్రింటెడ్ ఉంటాయి. నా పేరు నాకే రాసుకోవడం రాదు. తమ్ముడు నాతో కూర్చొని నా చెయ్యి పట్టి దిద్ధించీ దిద్ధించీ నా సంతకం ఎలా ఉంటుందో నేను ఊహిణుకోలేను గాని ఒక సంతకం ఐతే అలవాటు అయ్యింది.
అది కూడా చెయ్యి కదలడానికి నిమిషం పడుతుంది. ఒకవేళ ఎవరో ఒకరు నాచేత దొంగ కాగితాల మీద సంతకం పెట్టించుకుంటే, నా కళ్ళు కప్పి, అదే ఎలాగో ఏమీ కనిపించదు కదా, ఏదైనా చేసేస్తే? కిషన్ మూర్తి గారు నాన్నకి నమ్మకస్తుడిగా ఉన్నారు కానీ నా వరకు ఆయన నన్ను అంగీకారం కూడా తీసుకుంటారో లేదో తెలీదు.
“ ఏ మిస్టర్... ఏంటి ముందు కూర్చొని తెగ చూస్తున్నవ్. నేను చూస్తున్నాను అని తెలిసి కూడా అలాగే చూస్తున్నావు. సిగ్గులేదా అలా చూస్తే ఆడపిల్లకి ఇబ్బందిగా ఉంటుందని ఇంగిత జ్ఞానం లేదా? ” అని ఒక అమ్మాయి గట్టిగా గొంతెత్తి మాట్లాడుతుంది.
మా తమ్ముడు అంటుంటాడు, ఈ అమ్మాయిలని చూస్తే ఒక సమస్య, చూడకుంటే ఒక సమస్య అని, నేను బతికిపోయాను చూపు లేదు కదా.
నాలో నేను నవ్వుకొని మెడ పక్కకి తిప్పాను.
“ ఏయ్... నిన్నే మిస్టర్... ఇక్కడ అడుగుతుంటే అటు చూస్తున్నావు, గుడ్డి వాడివా? ”
ఏదో తేడా కొడుతుంది.
నేను: నన్నేనా అండి?
“ హ నిన్నే? ”
ఏంటి నా కళ్ళు అలా అనిపిస్తున్నాయా అమ్మాయికి?
నేను: సారి అండి నాకు కనిపించదు.
“ వాహ్... అబ్బ ఛా... ఇప్పటి దాకా చూసి ఇప్పుడే కళ్ళు కనిపించవు అంటావా? సిగ్గుండాలి తప్పించుకోడానికి అలా చెప్పుకోడానికి. ”
“ ఓహ్ మేడం మేడం... అయ్యో ఏంటి ”, ఇక్బాల్ గొంతు.
నాకు ముందు కప్పు టేబుల్ మీద పెట్టినట్టు వినిపించింది. టేబుల్ మీద చేతిని రుద్దుతూ కప్పు వెతికి పట్టుకున్న.
“ ఇద్దరూ ప్లానింగ్ తో ఉన్నారా కప్పు పెట్టడం, ఇతను యాక్టింగ్ స్టార్ట్ చేసాడు. ”
ఇక్బాల్: హెల్లో మేడం జి.... ఏంటి యాక్టింగ్, మా భయ్యా by birth blind.
“ నువ్వేంటి సపోర్ట్ ఆ. Blind ఐతే కళ్ళకు నల్ల కళ్ళద్దాలు, చేతిలో కర్రా, కనురెప్పలు కిందకి ఉంటాయి. నాకు తెలీదా? ”
నేను: అవును నీకు తెలీదు.
“ యూ.... నీకు అంటావా, నేనేమైనా మీకు ఫ్రెండ్ అనుకుంటున్నావా.”
ఇక్బాల్: అరె మేడం, మా భయ్యాకి సోకెక్కువ. అందుకే అవన్నీ ఉండవూ, మీరే తప్పుగా అనుకున్నారు.
“ లేదు ఇతన్ని చూస్తే అలా అనిపించట్లేదు, మీరు యాక్టింగ్ చేస్తున్నట్టే ఉంది. ఈ మధ్య ఇలాంటి వాళ్లు ఎక్కువౌతున్నారు. ”
నేను: అంటే నేను నా డిసెబిలిటీ సర్టిఫికేట్ జేబులో పెట్టుకొని తిరగాలా?
“ అసలుందా? ”
“ హెలొ మిస్.... ఏంటి problem? ” అని కేఫ్ మేనేజర్ మాట.
“ ఇతనే ప్రాబ్లం ” అంది.
ఇక్బాల్: కిరణ్ భయ్యాకి చూపులేదంటే నమ్మట్లేదు విక్రమ్ సాప్ ఈవిడ.
విక్రమ్: అవును మేడం, కిరణ్ సార్ ఎప్పటినుంచో ఇక్కడికే వస్తారు, ఆయనకు చూపు లేదు.
అమ్మాయి కాసేపేమి మాట్లాడలేదు.
విక్రమ్: మీరు అపార్థం చేసుకున్నారు.
“ సారి... సారి...”
నేను నవ్వాను.
ఇక్బాల్: తొందరపడి ఏదో ఏదో అనుకుంటే ఎలా మేడం.
“ సారి అండి... ”
నాలుగు క్షణాలకి అక్కడ రోజా పూల సువాసన దూరం అయ్యింది.
నేను: ఇక్బాల్ వెళ్ళిపోయిందా ఆమె?
ఇక్బాల్: హ... లేడీస్ కి మరీ ధైర్యం ఎక్కువైపోయింది భయ్యా... అయినా నిన్ను చూసి అలా ఎందుకు అనుకుంది.
నేను: నాకేం తెలుసురా
ఇక్బాల్: హహహ... ఏదైనా టెన్షన్ లో ఉందేమో భయ్య.
నేను: సర్లే కూర్చో.
ఆ అమ్మాయి ఏంటో, అలా ఎందుకు అనుకుందో, ఏమి తెలీదు.
తరువాత రోజు కూడా నేను ఆ కేఫ్ కి పోయాను. ఆ అమ్మాయి రాలేదేమో అనిపించింది.
మూడో రోజు పోయాను. బహుశా తను నాలాగా రోజూ వచ్చేది కాదేమో అనుకున్న.
నాలుగో రోజు పోయాను. అక్కడ నన్ను కూర్చో పెట్టి, “ భయ్యా మొన్న అమ్మాయి ఇవాళ కూడా ఉంది, సేమ్ టేబుల్ ” అని నన్ను వదిలేసి నాకోసం ఛాయికి పోయాడు.
నేను నా మొహం నిటారుగా పెట్టి కూర్చున్న.
క్షణాలు నిమిషాల్లా అనిపించాయి.
“ మీరు కొంచెం మెడ కుడికి తిప్పి కూర్చోండి మిస్టర్. ఏదో నన్నే సూటిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది ” అని అదే తీయని స్వరం మళ్ళీ వినిపించింది కాస్త వణుకుతో.
నాకు నవ్వొచ్చింది.
నేను: అది మీ సమస్య నా సమస్య కాదు.
తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వలేదు.
తరువాత నాకు కుర్చీ శబ్దం వినిపించింది. అదే గులాబి పరిమళం నా ముక్కుకి తెలుస్తుంది. ఆ అమ్మాయి నాకు దగ్గరగా వచ్చిందా?
“ సారి మొన్న నేను అనుకోకుండా అపార్ధం చేసుకున్నాను. ”
నాతో మాట్లాడుతుంది.
నేను: పర్లేదు. పొరపాట్లు మామూలే కదా అండి.
“ హ్మ్... మీరు నాకు అలా అనిపించలేదు. అంటే మామూలుగా చూపు లేకుంటే కళ్లద్దాలు పెట్టుకోవడం, లేదా కనురెప్పలు కిందకి ఉండడం చూసి... ”
నేను: నాకర్థమైంది. నేను అలాగే ఉండేవాడిని ఈ మధ్యే వదిలేసాను.
“ ఎందుకు అలా? ”
నేను: చూడ్డానికి నార్మల్ పర్సన్ లా కనిపించడానికి.
“ అవును, నేను ఫస్టు అలాగే అనుకున్నాను. అస్సలు నమ్మలేకపోయాను. మీ కళ్ళు నార్మల్ గా, అట్రాక్టీవ్ గా ఉన్నాయండీ. ”
నేను: హ్మ్.... థాంక్స్ అండి
“ ఓహ్... నా పేరు చెప్పలేదు. ఐ ఆమ్ హేశ్విత”
నేను: నేను కిరణ్... అంటూ చేతు ముందుకు చాచాను.
అప్పుడు సున్నితమైనా ముని వేళ్ళు నా చేతి రేఖలను తాగుతూ ఆమె మృదువైన చేతు నా చెయ్యికి కలపగానే ఏదో వణుకు వచ్చేసింది నాకు.
మీకో సలహా చెప్పాలా? ఎదుటి వారి దగ్గర ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయ్యాలి అంటే వాళ్ళ పేరు మీద దృష్టి పెట్టాలి. పేరు చాలా ముఖ్యం.
నేను: మీ పేరుకి అర్థం ఏంటండీ, కొత్తగా ఉంది?
హేశ్విత: అదీ.... Person with knowledge అని అర్థం.
నేను: ఇలాంటి పేరు ఎప్పుడూ వినలేదు, చాలా కొత్తగా ఉంది. ఎవరు పెట్టారు మికీపేరు?
హేశ్విత: మా నాన్న.
నేను: హేశ్విత బాగుందండీ.
హేశ్విత: థాంక్స్ అండీ. మీ పేరు మీనింగ్ కిరణ్ అంటే లైట్ రేస్ అని.
నేను: అవును. నా పేరులో ఉన్న లైట్ నా జీవితంలో లేదు.
హేశ్విక: సారి మీరు అలా అనుకుంటారు అని చెప్పలేదు.
నేను: its ok హేశ్విత, నేను ఉన్న నిజం చెప్తున్న అంతే.
హేశ్విత: మీకు మీ మీద జాలి చూపిస్తే నచ్చదేమో కదా?
నేను: ఎలా తెలుసు?
హేశ్విత: మొన్న నేను మిమ్మల్ని అలా యాక్టింగ్ అంటుంటే నవ్వారు కానీ దిగులు పడలేదు కదా.
నేను: హహహ.... నిజమే.
ఇక్బాల్: అదేంటి మొన్న గుస్సా అయ్యిర్రు ఇవాళ నవ్వుతున్నారు.
ఇక్బాల్ వచ్చి టీ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు.
హేశ్విత: ఏంటి టీ తెచ్చారా మీరు?
ఇక్బాల్: అవును, కూర్చోడానికి మాత్రమే ఈ కేఫ్, మేము తాగేది మాత్రం పక్కన టీ స్టాల్ ది.
మరో కుర్చీ జరిపిన శబ్దం, ఇక్బాల్ నా పక్కన కూర్చున్నట్టున్నాడు.
హేశ్విత: ఇదేంటి, ఇందులో కూడా ఉంటుంది కదా టీ?
నేను: ఇక్కడ శంకర్ చిచ్చా ఉండడు కదా?
హేశ్విత: ఈ శంకర్ ఎవరు?
ఇక్బాల్: ఆ టీ స్టాల్ బాబాయ్.
హేశ్విత: ఓ అర్థమైంది. అక్కడ మీకు కూర్చోడానికి ప్లేస్ లేదు. అందుకే ఇక్కడికి తెచ్చుకొని తాగుతారు. అవునూ ఇంతకీ మీరేం చేస్తుంటారు?
నేను: వీడికి పనులు చెప్తూ ఉంటాను.
ఇక్బాల్: నేను భయ్యా చెప్పిన పనులు చేస్తూ ఉంటాను.
హేశ్విత: అలా కాదు, మీరేం చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ గా.
ఇక్బాల్ తనకి నేనెవరో చెప్పబోతాడు అనుకొని నా కప్పి టేబుల్ మీద పెట్టి మెచేతుని కదిలించాను. అనుకున్నట్టే నా మోచేతికి వాడి చెయ్యి తగిలింది.
నేను: ఏమీ చేయను హేశ్విత, ఇలా ఉంటాను అంతే. మీరేం చేస్తారు?
హేశ్విత: నేను యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్టింగ్ చేస్తాను.
నేను: ఓ మంచిదే.
హేశ్విత: ఇంకోటి చెప్పాలా, అది కూడా మా ఇంట్లో తెలీకుండా.
ఇక్బాల్: అదేంటి?
హేశ్విత: మా నాన్నకి ఇష్టం లేదు కాబట్టి. ప్రెసెంట్ మొన్నే ఒక ఇండస్ట్రీలో డ్రెస్సెస్ డిజైనర్ గా జాబ్ వచ్చింది. సో అది అలాగే ఉండగా పార్టైం లో ఇది కూడా.
నేను: హ్మ్... మంచిదే.
అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిదో అనుకున్నాను, సంగీతం ఆగింది.
హేశ్విత: హా వైష్ణవి చెప్పు?
నేను మౌనంగా ఉన్నాను.
హేశ్విత: అవునా.... మరి ఎలా?
హేశ్విత: నాకేం తెలుసే, ఏం వేతుకుతాను, ఎవరు తెలుసు. ఇప్పటికిప్పుడు డబ్ చెప్పాలంటే అలా మంచి వాయిస్ ఎవరికైనా ఉండాలి కదా
హేశ్విత: సరే నేను సాయంత్రం చెప్తాను ఉండు.
బ్యాగ్ జిప్పు తీసి మూసిన శబ్దం వినిపించింది.
హేశ్విత: ఒకే నేను వెళ్తాను.
నేను: హా ఒకే.
తను దూరం నడుస్తున్నట్టు అడుగులు విపిస్తుంటే, గులాబి పూల వాసన సన్నగిల్లుతూ ఉంది.
రెండు క్షణాలకి మళ్ళీ పెరుగుతుంది.
నేను: ఇక్బాల్ ఆమె వెనక్కి వస్తుందా?
ఇక్బాల్: అవును భయ్యా...
నా గ్లాసులో ఛాయి ఒడిసింది అనుకుంటాను, పెదవికి అందట్లేదు.
హేశ్విత: మీ వాయిస్ బాగుంది కిరణ్.
నేను: హ్మ్... థాంక్స్.
హేశ్విత: డబ్బింగ్ చెప్తారా విలన్ కి.
డబ్బింగ్ ఆ నేనా? అదేంటి ఇలా అడిగింది.
నేను: బాగుంది అంటున్నారు, విలన్ అంటున్నారు.
హేశ్విత: హా... చెప్పండి మీరు చెప్తారా డబ్బింగ్. దానికి మీకు చూపు ఉండాల్సిన అవసరం లేదు.
నేను: నాకేం వస్తుంది అండి. ఇలాంటివి నాకొద్దు.
హేశ్విత: అది కాదండీ...
నా కుడి చేతుకి ఆ కొమలైన స్పర్శ మళ్ళీ కలిగింది.
హేశ్విత: ఇప్పటికిప్పుడు ఇంకొకరు దొరకరు.
నా చేయి వణుకుతూ ఉంది ఇక్బాల్ చూసాడేమో.
ఇక్బాల్: మేడం మీరు ఇబ్బంది పేస్తున్నారు?
హేశ్విత: సారీ... కానీ ఆలోచించండి మీరు ఒకే అంటే సాయంత్రం కలుద్దాము. నా ఫోన్ నెంబర్ ఇస్తాను.
ఏం చెప్పాలి? డబ్బింగ్ అవుతుందా? అయినా నాకెందుకు? ఏంటి అమ్మాయి అడిగింది చేయాలి అనిపిస్తుంది.
నేను: సర్లేండి చూద్దాం.
హేశ్విత: నా నెంబర్, 9866****00
ఇక్బాల్: ఒకే.
ఇక్బాల్ చేత తనకు ఫోన్ కలిపించాను.
హేశ్విత: హెలొ ఎవరూ?
నేను: నాకు ఆడియో కాల్ అంటేనే ఇష్టం, దీనిలో చూపు అవసరం లేదు కదా.
హేశ్విత: హహహ... అవును అవును. ఆరు తరువాత ఆ కేఫ్ దగ్గరకే రండి, అక్కడి నుంచి స్టూడియోకి పొదాము.
నేను: సరే