12-01-2025, 10:57 PM
(12-01-2025, 03:45 PM)Chandu_Charms Wrote: Chala lag undi e story
నేను మిమ్మల్ని, నా కథని చదవమని చెప్పలేదు. ఎవరి మీద అయినా, ఏ కథని అయినా విమర్శించడం చాలా సులభం. అదే స్టోరీ రాయడం ఎంత కష్టమో రాస్తున్నప్పుడు అర్ధమవుతుంది.
ఇక్కడ చాలామంది సెక్స్ కథలని ఇష్టపడతారని తెలుసు. అందుకే నా కథ మొదట్లోనే అలాంటి సీన్స్ ఎక్కువ ఉండవని చెప్పా.
కథలో చూడాల్సింది - క్యారెక్టర్స్ ప్రవర్తించే తీరు, వాళ్ళ మనస్తత్వం, పరిణితి, రచయిత వాటిని ఎలా ముందుకు తీసుకెళుతున్నాడు అన్న తీరు - ఇలాంటివి.
రామాయణం కూడా లాగ్ అనుకోవచ్చు. కట్టే - కొట్టే - తెచ్చే అంటే సరిపోతుందిగా. వందల పేజీలు రచయిత ఎందుకు రాసాడు మరి ?
కథ కి ఒక మూలం ఉంటుంది. దాని చుట్టూ కథని అల్లుకుంటూ తీసుక పోవడమే రచయిత గొప్పదనం.
నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా రాయలేదు. అర్ధం చేసుకుంటారని వివరణ ఇచ్చా. అయినా మీకు సాగదీస్తున్నట్లు అనిపిస్తే - చదవడం మానేయండి. అది నాకు ఇంకా సంతోషకరమైన విషయమే.