Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
భరణీ  ఇచ్చిన పగ్గాలు తీసుకొని  వాటి  ముక్కుతాడుకి  పగ్గాలు  కట్టి  వాటిని బండి దగ్గరకు తీసుకొని వచ్చాడు.
 
రెండు గిత్తలు శివా  చేతులు  నాకుతూ అటు  ఒకటి ఇటు ఒకటి   బండి దగ్గరకు వచ్చి నిలబడ్డాయి.
"వీళ్ళు  నా మీద నమ్మకం  పెట్టుకొని ఈ పని అప్పగించారు , నేను మీ మీద భారం వేస్తున్నాను   వాళ్ళ  నమ్మకాన్ని    వమ్ము చేయకండి , బుద్దిగా చెప్పినట్లు   వినుకొండి"   అంటూ   వాటి  గంగ  డోలు  తీడి  
"నాకు బండి కట్టడం  వచ్చు మీరు కొద్దిగా తప్పుకోండి" అంటూ రామి రెడ్డిని పక్కకు  జరిపి  ఎద్దులను  బండి  కాడి  కిందకు తెచ్చి  నగలు పట్టుకొని  కొద్దిగా పైకి లేపాడు,  వాటి అంతట  అవ్వే    కాడి కిందకు వచ్చాయి  ,   కాడికి ఉన్న  తాళ్లు  వాటి మెడచుట్టు వేసి   బిగించి  నగలు కింద  నుంచి   కూచొని చోటుకు వచ్చాడు. 
 
"ఎవ్వరు  వస్తున్నారు   మాతో " అన్నాడు అక్కడ ఉన్న వారిని చూస్తూ
 
శివా అడగక  ముందే రామి రెడ్డి   బండి లోకి ఎక్కాడు,   అతని వెనుకే     కూతురు ,  మోనికా  ,  మృణాళిని  ఎక్కారు.  మీరు వెళ్ళండి , నాకు ఇంట్లో పని ఉంది  అంటూ  రామిరెడ్డి  భార్య  ఇంట్లోకి వెళ్ళింది.
 
వాటి వీపు మీద ఓ సారి  తట్టి   పదండి  అంటూ   అదిలించాడు.    ఊరు బయట నుంచి పందెం స్టార్ట్ అవుతుంది.     ఆ ఉరి పక్కన చిన్న గుట్ట ఉంది ఆ  గుట్ట చుట్టూ రౌండ్ వేసి రావాలి  రోడ్డు బాగానే ఉంది  కానీ   మట్టి రోడ్డు , అక్కడక్కడా  మెత్తటి మట్టి ఉంది  అంటే  వర్షం వస్తే   బండ్లు  దిగబడతాయి , జాగ్రత్తగా వెళ్ళాలి ఆ చోట ,  గుట్ట చివర  కొద్దిగా అడివి బాట ఉంది  అక్కడ రెండు మూడు అడ్డ దారులు కూడా ఉన్నాయి చుట్టూ  తిరిగి రావడానికి  కానీ  అవ్వి బండి బాటకు  అనుగుణంగా లేవు  వాటి మీద  బండి వేగంగా వేళ్ళ లేదు  ,ఏదైనా రాయి మీద  ఎక్కింది అంటే బండి తల  కిందుల  అవుతుంది.   రామి రెడ్డి  రన్నింగ్  కామెంట్రీ  లా చెపుతూనే  ఉన్నాడు ఆ రోడ్డు గురించి, 
  మొత్తం 10  కిమీ  దాకా  కావచ్చు  గుట్ట చుట్టూ తిరిగి రావడానికి  అడ్డ  దారిన వస్తే  ఓ  కిమీ  తగ్గవచ్చు  కానీ  అక్కడ  రాళ్ల మీద  బండి చక్రం ఎక్కింది అంటే  బండి   తలకిందులు కాక  తప్పదు  ఆ  సమస్య  ఉండనే ఉంది.
 
"గట్టిగా పట్టుకొండి బండి వేగం చూద్దురు గానీ" అంటూ    ఎద్దుల మూపురం మీద  చేతిని వేసి  కొద్దిగా తీడి   ఇంటి వరకు పరిగెత్తండి  అంటూ  వాటి మీద  చరిచాడు చేత్తో.
 
తాను చెప్పింది  వాటికి అర్తం అయినట్లు    పరిగెత్తడం స్టార్ట్ చేశాయి.   బండికి టైర్లు  కట్టి ఉన్నాయి చక్రాలుగా   ,  అదే కట్టే తో చేసిన చక్రాలు అయితే  ఆ స్పీడ్  కి  ఏ చిన్న రాయి మీద ఎక్కినా బండి తల  కిందుల అయ్యేది , కానీ ఇది    టైర్లు కాబట్టి   ఎటువంటి ఇబ్బంది లేకుండా  స్పీడ్ గా  వెళ్ళసాగింది రోడ్డు మీద. 
 
ఎద్దులు గుర్రాల్లా   పరుగెడుతున్నాయి , దాదాపు  ఓ  20 నిమిషాలు  అయ్యే సరికి   ఊరు దగ్గర పడింది ,  చేతిలోని పగ్గాలు కొద్దిగా లాగి , "ఇంక  చాలా  మాములుగా నడవండి ఊర్లో" అంటూ మరో మారు  వాటి వీపు మీద తట్టాడు  మెల్లగా  స్లో  అయ్యి మాములుగా  నడవ సాగాయి.
 
"నువ్వు  టైం కి  మా కోసమే  వచ్చినట్లు ఉన్నాయి  అబ్బాయి , నాకు  ఇంక ఎం  భయం లేదు ,  ఈ గిత్తలు  పాలేరు కంటే బాగా నువ్వు చెప్పినట్లే  వింటున్నాయి ,  నువ్వు చానా మంచోడివి అన్నా  అయ్యుండాలి  లేదా నీకు జంతువుల బాషా అయినా వచ్చి ఉండాలి,  లేకుంటే నువ్వు ఎం చెపితే ఆ మాటలు వాటికి బాగా అర్తం అయినట్లు  ఎలా వింటున్నాయో చూడు, రేపు  పందెం లో గెలవక పోయినా  పరవా లేదు కానీ   అవ్వి  పోటీగా  పరిగెత్తడం చాలు  నాకు"  అన్నాడు రామి  రెడ్డి సంతోషం తో.
 
"పందెం లో మనమే  గెలుస్తాము  అంకుల్  , శివా ఒక్క  మాట చెప్పాడు అంటే  అవి   ఇంకా స్పీడ్  గా  వెళతాయి చూసారుగా ఇప్పుడే  ఎలా వెళతాయో  , మీరు   కప్పు  ఎత్తుకోవడానికి రెడీగా ఉండండి" అంది మోనికా
 
"శివా , మా  ఊరు  గెలవాలి ఈ సారి  ఎలాగైనా  మన బండే  గెలిచేట్లు  చెయ్యి  " అంది భరిణీ
"కప్పు మనదే లే  అక్కా" అంది   మృణాళిని  
 
వాళ్ళు మాట్లాడుతూ ఉండగా   బండి ఇంటికి వచ్చింది ,   వాటిని   బండి నుంచి  విప్పి  గాటికి  కట్టేసి   "మీరు  కోపం తగ్గిచ్చు కొండి మనకు తిండి పెట్టె ఇంటాయన్ని  దగ్గరికి  రానీయక పొతే  ఎలా, మీకు  ఈ ఇంట్లో వాళ్ళ  వల్ల  ఎటువంటి అపాయం రాదు , వాళ్ళను  ఎం అనకండి" అంటూ   గడ్డి  పరకలు  వాటికి అందించాడు  
 
"మీరు కూడా రండి అంకుల్  ఇప్పుడు  ఎం  అనవు  లెండి మిమ్మల్ని కూడా"  అంటూ  రామి రెడ్డి వాటి దగ్గరకు  వచ్చి  తన చేత్తో  కొన్ని గడ్డి పరకలు  వాటి నోటికి అందించాడు.
 
"నేను కూడా రానా" అంది భరణీ   వాటి దగ్గరకు వస్తూ
"ఎం కాదు నువ్వు కూడా వచ్చి  గడ్డి తినిపించు" అన్నాడు కొద్దిగా పక్కకు జరిగి 
భరణీ  వచ్చి శివా పక్కన నిలబడి తన చేత్తో  కొన్ని గడ్డిపరకలు తినిపించింది.  ఎం అనకుండా
"ఎప్పుడైనా రావచ్చా" 
"ఎప్పుడైనా రావచ్చు  ,  కాకా పొతే వాటికి నువ్వు కనపడేట్లు  రా , వెనుక నుంచి వస్తే  వేరే వాళ్ళు అనుకొనే ప్రమాదం ఉంది"
"కొద్దిసేపు అయ్యాక   వాటికి   కడిగి రెడీ చేద్దాం  మా నాన్న  వాటి వంటి మీదకు  బట్టలు కూడా తెచ్చాడు  గంగి రెద్దు కు వేస్తారు చూడు అలాగా   అన్నమాట అలాగే బండి కూడా రెడీ చెయ్యాలి  , నువ్వు కూడా ఓ సారి చెక్ చేయ్యి  నాన్నా బండిని"  అంది
" కాఫీ తాగుదురు రండి" అంటూ భరణీ అమ్మ పిలిచే సరికి అంతా లోపలి కి వెళతారు.
"రేపు ఎన్ని గంటలకు, పోటీ  ప్రారంభం అయ్యేది"
"11  గంటలకు  పక్క ఉరి వాళ్ళు కూడా రావాలిగా  అందుకె  11 పెట్టారు"
"మనం అక్కడికి 10.30 వెళితే చాలు"
"కాపీ  తాగి    మిగిలిన పని చూడండి, వీలు అయితే  సాయంత్రం  టౌన్ కి వెళ్లి  అక్కడ  పాలేరు ఎలా ఉన్నాడో చూసి వద్దాము" అంది రామిరెడ్డి భార్య
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Cap053, nizam123, ramukjar, sree2022, Vardhini, 25 Guest(s)