Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
బయట  ఎదో   గొడవ  గొడవగా ఉంటె   ఉదయం ఆ  సౌండ్ కి మెలుకవ వచ్చింది శివాకి  , చుస్తే   రూమ్ లోకి  వెలుతురూ బాగా వస్తు ఉంది , అంటే  పొద్దు  పుట్టి చాలా సేపు అయినట్లు ఉంది ,  తాను మాత్రం  కుంభ కర్ణుడి మాదిరి  నిద్ర పోయాడు.  లేచి  మంచం పక్కన ఉన్న టవల్  వంటి మీద వేసుకొని బయటకు వచ్చాడు.
 
అక్కడ   నిన్న  ఎద్దులకు  గడ్డి వేస్తూ ఉన్న  పాలేరు మంచం మీద పడుకొని ఉన్నాడు  ,  పక్కనే   ఓ  డాక్టర్  ఎదో  చెక్ చేస్తున్నాడు.
"ఏమైంది తనకి , రాత్రి బానే ఉన్నాడుగా"
"పొద్దున్నే   గడ్డికోసుకొని రావడానికి   చేనులోకి వెళ్ళాడు, అక్కడ గడ్డిలో ఎదో పాము కరిచింది  అంట"  అంది మోనికా 
"నేను ఇంజక్షన్ చేసాను , కానీ టౌన్ కి తీసుకొని వెళితే బాగుంటుంది ,తొందరగా తీసుకొని వెళ్ళండి" అన్నాడు  డాక్టర్   భరిణీ నాన్న వైపు చూస్తూ.
"లేటు చేస్తే  ప్రాణానికే  ప్రమాదం  వెంటనే తీసుకొని వెళ్ళండి" అని చెప్పి అక్కడ నుంచి   డాక్టర్ వెళ్లి పోయాడు.
"నాయనా  ఏదైనా కారు మాట్లాడుకొని రండి ,  తొందర  అంటున్నాడుగా డాక్టర్" అంది భరణి
 
వాళ్ళ నాన్న   ఇంట్లోకి  వెళ్లి  ఎవరికో ఫోన్ చేసిన  10  నిమిషాలకు   కారు  వచ్చింది ,  ఆ కారుతో  పాటు    పాలేరు  తమ్ముడు  ఒకడు వచ్చాడు   తనతో పక్కనే ఉన్న టౌన్ కి వెళ్ళడానికి.    
ఓ  నోట్ల కట్ట    పాలేరు తమ్ముడి చేతులో పెడుతూ ,   "డబ్బులకు వెనకాడకు  వెంటనే  పెద్ద  హాస్పిటల్  లే చెరిపించి , నా పేరు చెప్పు"  అంటూ   వాళ్ళను పంపాడు.
 
"వీడికి  ఇలా అయ్యింది ఏంటి ,  రేపు ఏమో పోటీలు  అన్ని డబ్బులు పెట్టి  పోటీ కని  ఈ   గిత్తలు  కొంటిమి , ఇప్పుడు  ఈ గిత్తలు ఎవరు తోలతారు,  ఈ పోటీల్లో  ఎవరు పాల్గొంటారు  అన్ని డబ్బులు నీళ్ళల్లో పోసినట్లు అయ్యిందే" అను కొంటూ   ఇంట్లోకి వెళ్ళాడు,  కారు   పాలేరును తీసుకొని వెళ్ళగానే.
 
"వాడికి  ఎం కాదులే నాన్నా  రేపటి కల్లా వచ్చేస్తాడు. రాకపోతే  అప్పుడు చుద్దాం లే "
 
"ఏందీ చూసేది  , మెత  వేయడానికి కూడా ఎవ్వరినీ కిందకి కూడా  రానీయవు అటువంటి వాటితో  పందెం లో పాల్గొనేది ఎవ్వరు"  అంది   భరణీ  అమ్మ
 
శివా  లోనకు వెళ్లి ఫ్రెష్ అయ్యి  వచ్చాడు, తన కోసమే చూస్తూ ఉన్నట్లు మోనికా వచ్చింది.
అందురు కలిసి   టిఫిన్ చేస్తూ ఉండగా    ఫోన్  వచ్చింది ,    టౌన్ కి   వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి. ప్రాణానికి ప్రమాదం ఎం లేదు కానీ     పాము కరిచిన  కాలు  చచ్చు బడి పోయింది.   అది కోలుకోవడానికి    ఓ  వారం రోజులు పడుతుంది,  పాలేరు  ఇంకా రెండు రోజులు  అక్కడే  ఆసుపత్రి లో  నే ఉండాలి ,  ఆ తరువాత  డిశ్చార్జ్  చేస్తారు  అనేది ఆ ఫోన్ సారాంశం.
 
"మనకు ఎదో   శని  దాపురించింది  , ఎప్పుడు ఆ ఉరు  వాళ్ళే  గెలుస్తూ ఉన్నారు  ఈ పోటీల్లో ,  ఎదో  ఈ సారన్నా మన  ఉరి   పేరు నిలబెడదాము  అని   అనుకోని   ఈ గిత్తలు తెస్తే  ఇప్పుడు ఇలా అయ్యింది , ఇప్పుడు ఎం చెయ్యడం"       అన్నాడు రామి రెడ్డి  ఆ  ఫోన్  సారాశం  విని.
"నాయనా ,  ఆ ఎద్దులు  శివాని  దగ్గరికి రానిచ్చినాయి ,  శివా ను ట్రై చేయ మంటావా   ఓ  సారి"
" దగ్గరికి  రానిచ్చినంత మాత్రాన   ఆ పోటీల్లో  పా నే దానికి ఆయతాదా  ఏంది ,  ఆయబ్బికి  బండి తోలేది  వచ్చా ముందు"
 
"అంకుల్   శివా   మీ లాగే పల్లె నుంచి వచ్చి నాడు తనకి   అన్నీ  వచ్చు  ఓ సారి మీరు  దగ్గర ఉండి  ట్రై చేయండి  ఆ తరువాత  జరిగేది మీరే చూడండి"
 
"మీకు  ఎద్దుల  బండి పందాలు అంటే  అదేదో  సినిమా  చూసినంత  సులభం అనుకొంటూ ఉన్నారు,  ఏదైనా జరగ కూడనిది  జరిగితే  వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఎం సమాదానం చెపుతాము"
 
"శివా ,  నువ్వు చూస్తూ ఉన్నావుగా ,  ఇక్కడ జరిగేది  ,  వేరే ఎవరినైనా అవ్వి  దగ్గరకు రానిచ్చి ఉంటె   నీకు   వచ్చేది కాదు ఇది, కానీ ఇప్పుడు నువ్వు తప్ప వేరే దారి లేదు , అంకుల్ కి చెప్పు నువ్వు  ఓకే   అని" అంది మోనికా 
 
"ఓ  సారి మీరు దగ్గర ఉండండి  అంకుల్   , నేను ట్రై చేస్తాను ,    ఓ  రౌండ్  వెళ్లి  వద్దాము , నాకు మీరు  తోవ చూపండి అందులో తప్పు  లేదుగా , గెలుపు   తరువాత మొదట అందులో   పాల్గొందాము  , పదండి  చూద్దాం"  అంటూ   తినేసి    గిత్తలు కట్టేసిన  దగ్గరికి వెళ్ళారు అందరు.
 
"వాటిని విప్పి  ఈ బండి  దగ్గరకు  తీసుకొని రా , నేను హెల్ప్ చేస్తాను  బండి  కట్టడానికి"  రామి రెడ్డి  బండి దగ్గరకు వెళ్లి.
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Cap053, chigopalakrishna, ramukjar, sree2022, Vardhini, 22 Guest(s)