10 hours ago
ఇంటి వెనుక వైపు ఉంది పశువుల కొట్టం , ఇందాకా టీ బంకు దగ్గర చెప్పిన గిత్తలు ఆ కొట్టం లో ప్రత్యేకంగా కట్టేసి మేపుతూ ఉన్నట్లు ఉన్నారు వాటిని చూడడానికి నియమించిన పాలేరు అక్కడే ఉన్నాడు.
"నువ్వేనా వాటిని తొలిది" అన్నాడు శివా అక్కడ వాటికి గడ్డి పెడుతూ ఉన్న పాలెరును చూస్తూ.
"అవునయ్యా, దగ్గరికి పోకండి చాలా జోరుమీద ఉన్నాయి పొడవడానికి వస్తాయి" అన్నాడు భయపెడుతూ ఉన్నట్లు.
"నేనేం టౌన్ లో పుట్టి పెరిగిన వాడిని కాదులే , నేను కూడా రైతునే , ఎద్దుల గురించి నాకు కూడా ఇంతో అంతో తెలుసు , చూద్దాం ఎలా పొడుస్తాయో" అంటూ వాడి వెనుక వైపుకి వెళ్ళాడు.
గడ్డి మేస్తున్నా రెండు గిత్తలు , వెనుక నుంచి వస్తున్న సౌండ్ విని వెనక్కు తిరిగాయి తింటున్న గడ్డిని ఆపి, ఓ సారి వాటి వైపు తీక్షణంగా చూసి వాటి మీద చేతులు వేసి మెల్లగా తీడాడు, తమకు బాగా తెలిసిన వ్యక్తి తన శరీరం మీద చేతిని వేసినట్లు ఫీల్ అవుతూ తల ఆడించ సాగాయి.
"అదేంటి అయ్యగారు , మీరు వీటికి ముందే తెలుసా ఏంటి , బాగా తెలిసిన వాళ్ళ లాగా మాలిమి అయ్యాయి మీకు"
“నా పేరు శివా , నన్ను శివా అని పిలు అయ్యగారు అని పిలవద్దు , వీటిని మొదటి సారి చూడ్డం" అంటూ వాటి ముందుకు వెళ్లి వాటి మెడ కింద తీడ సాగాడు
తింటున్న గడ్డిని ఆపేసి శివ వైపు చూస్తూ నాలుకతో శివా ను నాక సాగాయి.
"మీ దగ్గర ఎదో మాజిక్ ఉంది శివా , లేదంటే ఊర్లో ఏ ఒక్కరినీ దగ్గరికి రానివ్వని ఈ గిత్తలు, మిమ్మల్ని చూసి నాకడం ఏంటి, నాకు ఎం అర్తం కావడం లేదు"
"ఎద్దులంటే నాకు కూడా నీలాగా చాలా ప్రేమ లే అన్నా , నువ్వు దాన్ని పెద్దది చేయకు"
అన్నా అన్న మాటకు వాడు పీదా అయిపోయి , "సరేలే శివా , రేపు పోటీలకు మీరు కూడా దగ్గర ఉండండి , మనదే గెలుపు" అన్నాడు.
"తప్పకుండా ఉంటాలే , మనమే గెలవాలి" అంటూ లోపలి వెళుతూ ఉండగా చూసాడు పైన మెడ మీద నుంచి భరణీ , మోనికా తననే చూస్తూ ఉన్నారు , వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారో సరిగా తెలీదు తను గిత్తల దగ్గరికి వెళ్ళింది చూసారా లేదా అని ఆలోచిస్తూ ఉండగా , ఇద్దరు కిందకు వచ్చారు
"ఏమో అనుకొన్నా, మోనికా నీ గురించి చెపుతూ ఉంటె, అన్నీ డబ్బా కొడుతోంది ఏమో అనుకొన్నా, నిజంగా నీలో ఎదో ఉంది, చూద్దాం మా ఇంట్లో ఇంకో వారం ఉంటారుగా అది ఏందో తెలుస్తా" అంది భరిణి.
"తను మీకు ఎం చెప్పిందో, మీరు ఎం చూసారో నాకు తెలీదు, నాకేం తెలీదు"
"అదే ఎం తెలీదు అంటూనే ఇంత దూరం తెచ్చావా మోనికా ని"
"అందులో నా ప్రమేయం ఎం లేదు ఎదో తనే సహాయం అంటే, ముందుకు వచ్చాను అంత కంటే ఇంకేం లేదు".
"సరే లే ఎందుకు అంతగా కంగారు పడతావు, తను మన ఫ్రెండ్ లే" అంది మోనికా
"ఇంతకూ ఈ పోటీలు ఎప్పుడు జరిగేది"
"పోటీలు ఎల్లుండి , జాతర ఆదివారం, అప్పుడు పోటీలలో గెలిచినా వారికి బహుమతీ ప్రదానం ఉంటుంది దీనికి స్టేట్ నుంచి మినిస్టర్ ని పిలిపిస్తున్నారు, మీరు జాతర చూసి వెళ్ళండి"
"తప్పకుండా చూసే వెళతాం, శివా కూడా మనతోనే ఉంటాడులే అంతవరకూ " అంది మోనికా
"రండి భోజనానికి వెళదాం" అంటూ భరిణీ ముందు వెళుతూ ఉండగా వారి వెనుకే శివా కూడా వెళ్ళాడు.
"ఇంతకూ ఈ అబ్బాయి ఎవరో చెప్పలేదు" అంది భరణీ అమ్మాయిగారు
"మా బంధువుల అబ్బాయే లే బావ వరుస అవుతాడు, మాకు తోడుగా ఉంటాడు అని అమ్మ తీసుకొని వచ్చింది" అంది మోనికా వేరే వారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా.
"నిజమే లే ఈ కాలం లో మగ తోడు ఉంటె బాగుంటుంది, ఇంతకీ నీ peru ఏందబ్బీ"
"శివ అంటారండీ"
"అదే ఆంటీ శివ శంకర రెడ్డి , అందరు షార్ట్ గా శివా అని పిలుస్తారు తనకు అలా పిలిస్తే నే ఇష్టం అందుకే శివ అంటూ ఉంటాడు, కాలేజీ లో కూడా అంతే , శివా గానే చెలామణి అయ్యాడు. శివా రెడ్డిగా కాదు"
"శివా , బాగుంది పేరు , వీళ్ళతో పాటే ఉంది జాతర చూసి వేళ్ళు , మా ఊర్లో జాతర బాగా జరుగుతుంది మొన్నాడు ఎద్దుల పందాలు , మా ఇంటాయన కూడా ఎద్దులు ఆ పందెం కోసం మేపుతున్నాడు"
"అమ్మా ఆయబ్బి ఆ ఎద్దులు దగ్గరికీ కూడా వెళ్లి వచ్చాడు , ఎవరినీ రానీయవని ఊరు ఊరంతా అనుకొంటూ ఉన్నారా , అలాంటి వాటిని గంగడోలు తీడి వస్తున్నాడు , ఈయన గారిని చూడగానే వాటికీ ఈయనకు ఎదో పూర్వ జన్మ సంబంధం ఉన్నట్లు ఈయన్ని అదే పనిగా నాకుతూ ఉన్నాయి అవ్వి కూడా"
"ఏందీ , నువ్వు ఆ గిత్తల దగ్గరకు వెళ్ళినావా , నిన్ను ఎం అనలేదా , ఇదేదో కొత్తగా ఉందే , వాటిని తెచ్చి దరిదాపు 6 నెలలు అవుతూ ఉంది , ఇంతవరకు ఆ పాలేరును తప్ప , మా ఇంటాయనను కూడా దగ్గరకు రనీయ లేదు అలాంటివి నిన్ను చూసి నాకాయి అంటే చాలా వింతగా ఉంది"
"మేము చూసినామ్ గా మిద్ధి మీద నుంచి, ఆయబ్బిని ఎం అనలేదు అవ్వి"
"మీ నాయనకు చెపితే నమ్మడు , రేపు పొద్దున్నే ఓ సారి అయన ఉన్నప్పుడు వాటి దగ్గరకు వేళ్ళు అబ్బీ"
"సరే అలాగే నండీ" అంటూ శివా గబా గబా తినేసి తనకు ఇచ్చిన room కి వెళ్లి పడుకోండి పోయాడు. నిన్న రాత్రి సరిగా నిద్ర లేనందు వళ్ళ పడుకోగానే వెంటనే నిద్ర పట్టేసింది.