Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
ఓ  20  నిమిషాల తరువాత  శివా మెయిన్ రోడ్డు మీదకు చేరుకొంటు ఉండగా  మృణాళినీ స్కూటీ  తో   వస్తుంది , ఇద్దరు కలిసి   మోనికా  వాళ్ళను  వదిలిన  చోటుకు వస్తారు.
"వాళ్ళు ఎవరూ మీకు ఎదురు పడలేదుగా " అంది మోనికా
"వాళ్ళు ఇంకా నిద్రపోతు ఉన్నట్లు ఉన్నారు , అది మనకు మంచిది అయ్యింది"
"ఇప్పుడు మనం ఎక్కడికి వెళదాం?" మృణాళిని ప్రశ్నకు సమాధానంగా "మీతో పాటు మీ నాన్నను ఇక్కడికి తీసుకొని రాలేదా ? పొద్దున్న మీరు ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారుగా , మిమ్మల్ని ఒక్కరినే తీసుకొని వచ్చారు , మీ వారు ఎక్కడ" అన్నాడు శివా మోనికా అమ్మ వైపు చూస్తూ.
"ఆయన్ని కూడా మాతో పాటు తీసుకొని వచ్చారు , కానీ నన్ను మోనికా ఉన్న రూమ్ లో పెట్టి తనని బయటికి తీసుకొని వెళ్లారు , ఎక్కడికి తీసుకొని వెళ్లారో తెలీయడం లేదు"
"శివా ప్రస్తుతానికి ఇక్కడ నుంచి బయట పడే మార్గం చూడు ఈ దోమలతో ఇక్కడే చచ్చేట్లు ఉన్నాము" అంది మృణాళిని.
"రోడ్డు మీదకు వెళ్లి ఏదైనా వెహికల్ వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి"
"మరి ఈ స్కూటీ ని ఎం చేద్దాం"
"దాన్ని ఇక్కడే వదిలేద్దాం"
"అది సరే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళదాం, అది ఆలోచించు ముందు" అంది మోనికా.
"వాళ్ళు మీ అమ్మా నాన్నను ఎందుకు తెచ్చారు, అది ముందు తెలుసుకుంటే బాగుంటుంది"
"బయట వాళ్ళు మాట్లాడేది విన్నాను , నా వైపు నుంచి అస్తి అసలు వస్తుందో లేదో అని లాయర్ కి డౌట్ గా ఉంది , అందుకే మా నాన్న పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయమని వత్తిడి తీయడానికి నన్ను , వాళ్ళను ఇద్దరినీ తెచ్చాడు"
 
"మరి మీ నాన్న పేరు మీద ఆస్తి ఏమైనా ఉందా"
"అది నేను పుట్టాకా , మా అమ్మ పేరు మీద రాయించాడు మా నాన్న , ఇప్పుడు మా నాన్న పేరు మీద చిల్లి గవ్వ కూడా లేదు , వాడికి ఆ విషయం తెలియదో ఏమో మరి" అంది మృణాళిని.
"అయితే ఇప్పుడు వాడు చేసేది ఏమీ లేదు , నాకు తెలిసీ మీ నాన్న ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు , మనం ఎలాగైనా వాడిని మీ నాన్న తో పాటు పట్టుకుంటే , లోపలి కి తొయ్యచ్చు"
"వాడు క్రిమినల్ లాయర్ , ఎదో ప్లాన్ మీద ఉంటాడు, లేకుంటే అంత  ధైర్యంగా మమ్మల్ని తీసుకొని రాడుగా" అంది మోనికా అమ్మ.
"ముందు రోడ్డు మీదకు పదండి ఇక్కడ ఉంటె నాకు వంటి మీద పుండ్లు వచ్చేట్లు ఉన్నాయి గోకి గోకి" అంటూ స్కూటీని కొద్దిగా లోపలికి తీసుకొని వెళ్లి స్టాండ్ వేసి , కొన్ని కొమ్మలు తెంపి దానికి అడ్డుగా వేసి , రోడ్డు మీదకు బయలు దేరింది మృణాళిని.
తనతో పాటు మిగిలిన ముగ్గురు రోడ్డు మీదకు వస్తారు.
5 నిమిషాలు వేచి ఉండే సరికి ఎదురుగా లైట్స్ కనబడ్డాయి
"ఎదో వస్తుంది , దాన్ని ఆపుతాను , మీరు కొద్దిగా చాటుగా ఉండండి , లేడీస్ కనబడితే వేరుగా అనుకొనే ప్రమాదం ఉంది ఇలాంటి టైం లో" ఆంటు శివా వాళ్ళని కొద్దిగా చాటుగా ఉండేట్లు తోసి తనకు ఆ వెహికల్ ని ఆపడానికి చెయ్యి అడ్డం పెట్టాడు.
ఆ టైం లో నిర్మానుష్యమైన ప్రదేశం లో ఓ మనిషి ని చూసే సరికి సాధారణంగా ఎవ్వరు వెహికల్ ని ఆపారు , కానీ ఆ లారీ డ్రైవర్  మాత్రం స్లో చేసి బండిని ఆపాడు.
"ఎందప్పా , ఈ టైం లో రోడ్డు మీద ఒక్కనివే ఎం చేత్తున్నావు ,ఏడీకి పోవాలా ఏందీ" అన్నాడు ఎడం వైపు కిటిలీ ఉన్నా క్లినర్
"స్కూటీ లో పోతాంటే మధ్యలో ఆగిపోయింది, పక్క టౌన్ దాకా వస్తా కొద్దిగా దింపండి"
"సరే ఎక్కు"
"అన్నా , మా ఆడాళ్ళు కూడా ఉన్నారు"
"ఓరి నీ పాసు గల్లా ఈ టైం లో ఆడోళ్లను ఏసుకొని ఇక్కడ చానా డేంజర్ అప్పా తొందరగా రండి పోదాము" అంటూ డోర్ తీసాడు.
శివా సైగ చేయగానే ముగ్గురు లారీ దగ్గరకు వచ్చారు.
"ఒరే మళ్లీసు , నువ్వు ఎనక్కు వేళ్ళు ఆ ఆడబిడ్డలు కూచొని ముందు" అన్నాడు కొద్దిగా వయస్సు పడిన డ్రైవర్.
తెరిచిన డోర్ లొంచి ఓ కాలు పక్కనే ఉన్న లారీ వెనుక వేయిపు పెట్టి వెనక్కు చేరుకొన్నాడు. శివా కింద ఉండి ముగ్గురినీ లారీ క్యాబిన్ లోకి ఎక్కించి వారి తరువాత తాను కూడా ఎక్కి డోర్ వేసే సరికి , లారీ ముందుకు దూకింది.
“ఇంతకూ మిమ్మల్ని  ఎక్కడ దింపాలి  అబ్బాయి ”
“పక్క టౌన్ లో దింపు అన్నా , అక్కడ ఉండి, పొద్దున్నే  వెళతాము”
“వీళ్ళతో,  ఆ టౌన్ లో ఎక్కడ  ఉంటారు ,  అందులో మీకు సరియైన ప్లేస్ కుడా దొరకదు ఉండడానికి”
“మరి ఎక్కడ  అన్నా”
“ఓ  గంట ప్రయాణం  ,  ఈ టౌన్ పక్కన   ఇంకో టౌన్ ఉంది అక్కడ అయితే మీకు కొద్దిగా సౌకర్యంగా ఉంటుంది”
“సరే అన్నా  థాంక్స్”
ఆడవాళ్లు  అందరు   తూగుతూ  ఉండగా   మరో గంట  కు   టౌన్ వచ్చింది  , టౌన్  సెంటర్ లో  వాళ్ళను దింపి  లారి వెళ్ళిపోయింది.    వాళ్ళను దింపి నందుకు  డబ్బులు ఇవ్వబోగా  ఆ డ్రైవర్ డబ్బులు తీసుకోలేదు , జాగ్రత్తగా   తీసుకెళ్ళు వాళ్ళను అని చెప్పి వెళ్ళాడు.
 వాళ్ళు దిగిన  చోటకు దగ్గరలోనే , ఎదో లాడ్జీ పేరు కనబడగానే అక్కడికి వెళ్ళాడు ముగ్గురితో కలిసి, అక్కడ రిసెప్షన్ లో ఉండాల్సిన వ్యక్తి కుర్చీ లోనే నిద్రపోతున్నాడు. అతన్ని లేపి ఓ రెండు రూమ్స్ ఉంటె ఇమ్మని చెప్పి , అతడు ఇచ్చిన కీస్ తీసుకొని మొదట ఫ్లోర్ లోకి వెళ్ళాడు.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Koppula.fico, Rakeeallu, sree2022, 19 Guest(s)