10 hours ago
మెటల్ ఫ్రేమ్ తో చేసిన కిటికీ , స్క్రూ లు వేసి గోడకు బిగించారు, అడ్డంగా , నిలువుగా ఇనుప ఉచలు బిగించారు. ఆ స్క్రూలు తీస్తే కిటికీ ఫ్రేమ్ ను గోడ నుంచి వేరు చేయచ్చు కానీ ఆ స్క్రూ లు తీయడానికి తన వద్ద ఎం పని ముట్టు లేదు అనుకొంటూ మృణాళిని వైపు చూసి " నీ తలలో ఉన్న పక్క పిన్ను" ఇవ్వు అంటూ అది తీసుకొని ఓ 50 నిమిషాలు కస్టపడి సౌండ్ రాకుండా అన్నీ స్క్రూ లు పీకాడు.
అక్కడ నుంచి కిందకు దిగాడు , కింద నుంచి ఫ్రేమ్ ను లాగాలి అంటే తప్పకుండా ఏదైనా ఎత్తుగా ఉండేది కావాలి, కానీ అక్కడ వాళ్లకు ఎం కనబడ లేదు. ఇద్దరు కలిసి మరో మారు ఫెన్సింగ్ బయటకు వెళ్లి తమ వెంట కొన్ని రాళ్లు తెచ్చి అక్కడ ఎత్తుగా పేర్చి శివా ఆ రాళ్ల మీదకు ఎక్కి మెల్లగా ఆ ఫ్రేమ్ ను కొద్దీ కొద్దీనా బైటకు లాగాడు. అప్పటికే దాదాపు రాత్రి 10.30 కావస్తు ఉంది , అందరు పడుకొన్నారు ముందు కాపలా ఉన్న ఇద్దరు తప్ప , మోనికా , వాళ్ళ అమ్మ అమ్మ కూడా నిద్రలో జారుకున్నారు.
మొత్తానికి ఫ్రేమ్ ని బైటకు లాగి కింద దింపాడు.
"ఎవరన్నా లోపలి వస్తే దొరికి పోతాము, తొందరగా ఏదన్నా చెయ్యి".
"ఏంటి చేసేది, లోపలి కి వెళ్లి వాళ్ళను తీసుకొని వస్తాను , నువ్వు ఇక్కడ దించుకో” అంటూ మరో మారు ఆ పేర్చిన రాళ్ల మీద నుంచి తన తీసిన కిటికీ గుండా లోపలి కి వెళ్ళాడు.
అంతా నిశబ్దంగా ఉంది బయట చిమ్మట శబ్దాలు తప్ప, లోపలి కి దిగిన తరువాత కొద్ది సేపు చూశాడు ఏమైనా శబ్దాలు వస్తున్నాయా అని కానీ ఏమీ లేదు లోపల పడు కొన్న వారి ఉపిరి తప్ప.
మెల్లగా మోనికా దగ్గరికి వెళ్లి తన నోటి మీద చేతిని ఉంచి మెల్లగా తన బుజం మీద తట్టాడు.
ఓ రెండు సార్లు తట్టే సరికి దిగ్గున పైకి లేచింది గట్టిగా కేక వేస్తూ, తన నోటి మీద ఉంచిన చేత్తో తన నోట్లోంచి వచ్చే కేకను బైటకు రాకుండా ఆపేస్తూ, తన చెవిలో చెప్పాడు “నేను శివను , అరవకు , బైట వాళ్ళు వస్తారు” అంటూ తనకు ఎదురుగా నిలబడ్డాడు తన నోటి మీద చేతిని అలాగే ఉంచి.
తను కొద్దిగా తేరుకొని తన చేత్తో తన నోటి మీద ఉన్న శివా చేతిని పట్టుకొని మెల్లగా తీస్తూ “నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి , నీకు ఎలా తెలుసు మేము ఇక్కడ ఉన్నాము అని” అంది మెల్లగా.
“అవన్నీ తరువాత , మీ అమ్మను లేపు శబ్దం లేకుండా, వాళ్ళు చూసే లోపు ఇక్కడ నుంచి వేల్లిపోదాము”
శివా తన నోటి మీద చెయ్యి వేసినట్లే తన అమ్మ నోటి మీద చేతిని వేసి లేపింది , తను మోనికా లాగా కేక వెయ్యలేదు కానీ , “ ఏమయ్యింది” అంటూ లేచింది
ఎదురుగా , శివాని చూసి “వీడు ఎవడు ఇంత దగ్గరగా వచ్చాడు, దూరంగా నిలబడు” అని గట్టిగా అనింది కానీ మోనికా చెయ్యి తన నోటి మీద ఉండడం వాళ్ళ తన నోట్లోంచి గాలి సౌండ్ మాత్రం వచ్చింది
“ఈ అబ్బాయి మనల్ని విడిపించడానికి వచ్చాడు”
“నీకు ఎట్లా తెలుసు ఈ అబ్బాయి”
“ముందు ఇక్కడ నుంచి బయటకు పోదాం పదా , ఆ తరువాత అన్నీ చెప్తాను”
“బయట మీ చెల్లెలు ఉంది , త్వరగా పదండి” అంటూ ఇద్దరినీ కిటికీ దగ్గరకు నడిపించు కొని వచ్చి, ఒక్కొక్కరినీ కిటికీ లోంచి బయటకు దింపాడు , అటువైపు నుంచి మృణాళినీ ఇద్దరినీ దింపుకొని శివా వాళ్లతో చేరగానే , అందరు కలసి ఫెన్చింగ్ లోంచి బయటకు వచ్చి , వాళ్ళు వచ్చిన దారినే స్చూటీ పార్క్ చేసిన దగ్గరికి వచ్చారు.
“ఇంత మంది ఎలా వెళ్ళేది ఇప్పుడు ఇదేమో ఇద్దరినీ మోస్తే సరిపోతుంది” అంది మృణాళినీ.
టైం దాదాపు రెండు గంటలు కావస్తు ఉంది.
“వాళ్ళు లేచారు అంటే లోపల మీరు లేనట్లు తెలుస్తుంది వెంటనే బయలు దేరుతారు , వెతుకుతూ మనం రోడ్డు మీద ఉంటె దొరికి పోతాము ఎలా” అన్నాడు శివా
“వాళ్ళ దగ్గర ఓ జీపు , ఓ కారు కుడా ఉంది ఇంకా వాళ్ళ దగ్గర తుపాకి కుడా ఉంది” అంది మోనికా
“ఇప్పుడు మనం సిటీ వైపు వెళ్ళాము అంటే వాళ్ళకు తప్పకుండా దొరికి పోతాము , సిటీ వైపు కి కాకుండా సిటీ కి ఎదురు రోడ్డు మీద వెళదాం, వాళ్ళు ఇటు వైపు వెళుతున్నాము అని ఉహించరు , మనం మెయిన్ రోడ్డు మీదకు వెళదాం, నువ్వు మీ అక్కనీ అమ్మను ఎక్కించుకొని మెయిన్ రోడ్డు మీద నుంచి ఎడం వైపుకి కాకుండా కుడి వైపుకు వెళ్ళు , అక్కడ ఏదైనా ఓ చోటు వాళ్ళ ఇద్దరినీ వదిలి నా కోసం రా , నేను ఎదురుగా నడుచుకొంటూ వస్తు ఉంటా , రోడ్డు మీద కాకుండా రోడ్డుకి కొద్దిగా దూరంగా ఉండండి రోడ్డు మీద అయితే ఈ టైం లో అమ్మాయిలూ కనబడ్డారు అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది” అని వాళ్ళ ముగ్గరినీ స్చూటీ ఎక్కించి వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళ వెనుక తను వాళ్లు వెళ్ళిన వైపు వెళతాడు.