Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
తను వెళ్లిన ఓ 10 నిమిషాలకు తను వచ్చింది స్కూటీ మీద
"ఇంట్లో మీ తమ్ముడు ఒక్కడే ఉంటాడా ?,"
"ఉంటాడు లే , పని అమ్మాయి ఉందిగా ?"
"మీ అమ్మా నాన్న విషయాలు ఎం తెలియవా?"
"ఏమో ఇంకా ఎం తెలీలేదు , వస్తే రాత్రికి వస్తారు , చెప్పకుండా ఇంత వరకు ఎక్కడికీ వేళ్ళ లేదు. అడ్రస్ తో పాటు తనతో మాట్లాడుతూ వాళ్ళ నాన్నను గురించి అడిగాను , రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని చెప్పింది, అంటే తానే ఏమైనా చేసాడు అనే దానికి ఇది ఇంకా బలపరుస్తుంది"
"ఏమో చూద్దాం , మనం అక్కడికి వెళితే గానీ తెలీదుగా , ఇంతకూ ఆ ప్లేస్ దగ్గరేనా?"
"ఏమో నాకు కూడా పెద్దగా తెలీదు ఇక్కడ , అది ఎదో చెప్పింది ఇక్కడికి 30 కి మీ దూరం అని చెప్పింది" అంటూ ఓ చిన్న పేపర్ మీద తను రాసుకున్న అడ్రస్ ఇచ్చింది.
ఆ పేపర్ తీసుకొని ఆ అడ్రస్ చదివి , "ఇది ఎక్కడ ఉందొ ఎలా తెలుస్తుంది, నాకు కూడా ఈ టౌన్ కొత్త "
"ఇదిగో ఇందులో GPS సెట్ చేసుకొని వెళ్లొచ్చు , నాకు తెలుసు ఎలా వెళ్ళాలో నువ్వు స్కూటీ తోలు , నేను చెప్తాను అడ్రస్ " ఆంటు రెడీ అయ్యింది.
"ఇదిగో , ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో , మనకు అవసరం రావచ్చు అని నా పాకెట్ మనీ తీసుకొని వచ్చాను." అంటూ ఓ నోట్ల పొత్తికను శివా చేతిలో పెట్టింది.
అప్పటికే టైం రాత్రి 7 అవుతుంది , "ఏదైనా తిని వెళదాం, అందులోనా మనం వెళ్ళేది ఉరి బయటకు ఓ చిన్న లైట్ తీసుకొని వెళదాం" అంది మృణాళిని .
 
"ఇక్కడ ఎక్కడ తినాలో నాకు తెలీదు , నువ్వే చెప్పు నీకు తెలిసిన ప్లేస్ ఏదైనా ఉంటె"
"సరే పద" అంటూ శివా బండి మీద కూచొగా తనకు వెనుక కూచొని తనకు దారి చూపే సాగింది.
ఓ పది నిమిషాలు ప్రయాణించిన తరువాత ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఆపమని చెప్పి , ఇద్దరు వెళ్లి బొంచేసుకొని , ఆ హోటల్ కి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ లో ఓ అగ్గి పెట్టె , ఓ చిన్న టార్చి లైట్ కొనుక్కొని బయలు దేరారు.
 
ఓ పెద్ద ఓవర్ కోట్ వేసుకొని వచ్చింది మృణాళిని రాత్రిళ్ళు చలి నుంచి కాపాడు కోవడానికి , శివా మాత్రం తన దగ్గర నున్న జీన్స్ ప్యాంట్ దాని మీద ఓ టీ షర్ట్ వేసుకొని వచ్చాడు.
 
వెనుక నుంచి తనకు దారి చెపుతూ ఉండాగా తనకు స్కూటీ ని టౌన్ లొంచి బయటకు తీసుకొని వచ్చాడు.
 
"మనం ఇద్దరం వెళుతున్నాము , ఒక వేల ఆ లాయరే అక్కను తీసుకొని వెళ్లి ఉంటె , మనం ఇద్దరం ఎలా రక్షిస్తాము ?'
 
"ఏమో నా దగ్గర ఎటువంటి ఐడియా లేదు ఇప్పడు , మొదట మీ అక్క అక్కడ ఉందా లేదా తెసులుసుకోవాలి , ఆ తరువాత అక్కడ పరిస్థితిని బట్టి అప్పటికి అప్పుడు ఆలోచించి , దానికి తగ్గట్లు పని చేయాలి.
"అక్క చెప్పింది మొన్న నువ్వు ఒక్కడివే వాళ్ళను బాగా తన్నావు అని"
"అప్పుడు ఎదో వాళ్ళ దురదృష్టం బాలేదు అందుకే దెబ్బలు తిన్నారు"
"ఇప్పుడు ఇక్కడ ఎంత మంది ఉంటారో , వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉంటాయో వాటిని ఎలా ఎదుర్కోవడం , ఇవన్నీ ఆలోచిస్తే నీకు భయం వేయలేదా"
"భయం ఎందుకు , ఏది అయితే అది అవుతుంది అని దిగాముగా , ఇంకా వెనక్కు తిరిగేది లేదు"
"నువ్వు నిజంగా మా అక్కను లవ్ చేస్తున్నావా"
"నీకు ఎం అనిపిస్తుంది?"
"ఏమో , కానీ అక్కకు నువ్వు ఆంటే  చాలా ఇష్టం , నువ్వే తన మొగుడు అని డిసైడ్ అయిపొయింది , ఇప్పుడు కాదు ఎప్పుడో చిన్నప్పుడు తనను సేవ్ చేసినప్పుడు , అప్పటి నుంచి మచ్చ ఉన్నా అబ్బాయిల కోసం చూస్తూనే ఉంది, నాక్కూడా నువ్వనే ఇష్టం, నువ్వు మా అక్కను చేసుకో బావా " అంది వెనుక నుంచి శివా నడుం చుట్టూ చెయ్యి వేసి శివా దగ్గరకు జరిగి తన బుజం మీద తలా ఆనిస్తూ
 
"ఏయ్ , ఉండు ఈ గొడవ ఏందో తేలనీ ఆ తరువాత మిగిలిన విషయాలు గురించి ఆలోచిద్దాం అయినా ,మీరు ఎక్కడ , నేను ఎక్కడ , మన ఊర్లో నా పరిస్థితి నీకు తెలుసుగా"
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Miipl, Rakeeallu, Ravi_sri, Speedy21, 20 Guest(s)