07-01-2025, 01:21 PM
(07-01-2025, 12:51 PM)Uday Wrote: వ్యూస్ చూడండి, చాలా మందికి కావలసింది ఇందులో దొరకలేదు కాబోలు లేదా కథే ఎక్కలేదేమో...కళాపోషణ బొత్తిగా లేదండి జనాలకు.
తెలుసు. కాని వ్యూస్ ఇదేంటి అని క్లిక్ చెయ్యడం వల్ల కూడా వస్తాయి కదా. లైక్స్ ఓకే. ఇక రిప్లైస్ అంటే చదివారు, ఏదో నచ్చింది అని.
నా గోల ఒకటే. దాదాపు తప్పులు లేకుండా నిజంగా కష్టపడి తెలుగులో రాస్తే స్పందన రాకపోతే ఎలా అని. నేను పడే తెలుగు టైపింగ్ కష్టానికయినా స్పందన రావాలి అని.
ఎన్నో పెద్ద కథలు ఉన్నాయి, ఎంతో మంది తెలుగులో రాస్తూనే ఉండుంటారు, వాళ్లకి ఇది మామూలేమో. నాకైతే దుంప తెగుతుంది, అందుకే నా గోల టైపింగ్ గోల.
అలానే, పాత రోజుల్లో కథలు చదివేవాళ్ళు ఫలానా అని చెప్పగలిగేలా ఉండేది. ఇప్పుడలా కాదు. వ్యూస్ పరంగా చెప్పలేం. అమెరికాలో సైంటిస్ట్ దగ్గర నించి అమలాపురంలో శనక్కాయల వ్యాపారి వరకూ ఎవరైనా చూడగలరు. అనుకున్న స్పందన రాకపోవడానికి ఇదొక కారణం.
ఎంత ప్రాప్తమో అంతే అనుకుని సరిపెట్టుకుంటే, ఇంకో కథ రాసే ఉత్సాహం ఎలా వస్తుంది. నాకు ఇది కావాలి, ఆర్ట్స్ దగ్గర ఇది ఉంటుంది. కొన్ని సార్లు ఉధృతి ఉంటుంది.. కొన్ని సార్లు స్తబ్దత ఉంటుంది.
యథా స్పందనా... తథా రచయిత.
అట్టి స్పందనని మాకొసుగుతున్న నీ వంటి పాఠకుల కోసమే రాసేది. నీ వంటి పాఠకులు లెక్కకు మిక్కిలి ఉన్న ఎడల మా నించి వచ్చు కథాప్రవాహమునకు అడ్డుకట్ట వేయిట ఎవరి తరమూ కాదు.